ఉన్నత పాఠశాల విద్య
ఉన్నత పాఠశాల విద్య (High School Education) లో 6 నుండి 10 తరగతులలో, 11 నుండి 16 సంవత్సరాల వయస్సు గల బాలబాలికలు ఉన్నత పాఠశాల (High School) లో విద్య నభ్యసిస్తారు. ఇది జిల్లా పరిషత్ అజమాయిషీలో, ఉన్నత పాఠశాలల విద్యాశాఖ పర్యవేక్షణ చేస్తుంది. [1]
ఆంధ్రప్రదేశ్ లో ఉన్నతవిద్య
[మార్చు]2007-08 లెక్కల ప్రకారం నిర్వహణ పద్ధతి ప్రాతిపదికన గణాంకాలు ఈ విధంగా ఉన్నాయి..
- పాఠశాలల సంఖ్య
నిర్వహణ |
సంఖ్య |
---|---|
కేంద్ర ప్రభుత్వ | 30 |
రాష్ట్ర ప్రభుత్వ | 1605 |
మండల ప్రజా పరిషత్ | 8155 |
పురపాలకసంస్థ | 302 |
ఆర్థిక సహాయముగల ప్రైవేట్ | 856 |
ఆర్థిక సహాయము లేని ప్రైవేట్ | 5989 |
మొత్తము | 16937 |
- పిల్లల నమోదు ప్రకారం
నిర్వహణ |
బాలురు | బాలికలు | మొత్తం |
---|---|---|---|
కేంద్ర ప్రభుత్వ | 6974 | 7232 | 14206 |
రాష్ట్ర ప్రభుత్వ | 255982 | 295345 | 551327 |
మండల ప్రజా పరిషత్ | 1206829 | 1206045 | 2412874 |
పురపాలకసంస్థ | 59611 | 70526 | 130137 |
ఆర్థిక సహాయముగల ప్రైవేట్ | 147944 | 167882 | 315826 |
ఆర్థిక సహాయము లేని ప్రైవేట్ | 968772 | 721300 | 1690072 |
మొత్తము | 2646112 | 2468330 | 5114442 |
- ఉపాధ్యాయుల ప్రాతిపదికన
నిర్వహణ |
పురుషులు | స్త్రీలు | మొత్తము |
---|---|---|---|
కేంద్ర ప్రభుత్వ | 275 | 296 | 571 |
రాష్ట్ర ప్రభుత్వ | 9758 | 7472 | 17230 |
మండల ప్రజా పరిషత్ | 42529 | 20382 | 62911 |
పురపాలకసంస్థ | 1770 | 1564 | 3334 |
ఆర్థిక సహాయముగల ప్రైవేట్ | 4179 | 4642 | 8821 |
ఆర్థిక సహాయము లేని ప్రైవేట్ | 34989 | 29031 | 64020 |
మొత్తము | 93500 | 63387 | 156887 |
ఈ రంగంలో గణనీయమైన మార్పులకోసం కేంద్రప్రభుత్వం సర్వ శిక్షా అభియాన్ అనే పథకం రాష్ట్రప్రభుత్వ సహకారంతో అమలుచేస్తున్నది.
భోధనభాష
[మార్చు]2008-09 సంవత్సరంలో ఆరవ తరగతి నుండి, ప్రభుత్వ పాఠశాలలలో, రెండు విభాగాలున్నచోట, ఒక విభాగంలో ఇంగ్లీషు మాధ్యమంగా విద్యాబోధన ప్రారంభమైంది. దీనికోసమై, ఉన్నత పాఠశాలలో ఇంగ్లీషు మాధ్యమ విభాగం వుంటే, దగ్గరలోని ప్రాథమికోన్నత పాఠశాలల పిల్లలను, ఉపాధ్యాయులను మూసివేసి, వారిని ఉన్నత పాఠశాలకు మార్చారు. సిబియస్‌ఇ సిలబస్ ని ఇంగ్లీషు మాధ్యమానికి అమలుచేశారు.
ఎస్సెస్సీ ఫలితాలు
[మార్చు]2012
[మార్చు]2012 మే 24న విడుదలైన ఎస్సెస్సీ ఫలితాలలో మొత్తం87.84 శాతం ఉత్తీర్ణులయ్యారు . క్రిందటిసంవత్సరము కంటే 4.7 శాతం అధికం. అమ్మాయిలలో 88.76 శాతం, అబ్బాయిలలో 86.98 శాతం మంది పాసయ్యారు. ఫలితాల్లో కరీంనగర్ జిల్లా 93.38 శాతంతో మొదటి స్థానంలో నిలువగా హైదరాబాదు 76.94 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని 17 పాఠశాలలు జీరో ఉత్తీర్ణతను నమోదుచేశాయి. ఈ పరీక్షా ఫలితాలను 'సంపూర్ణ గ్రేడింగ్ పద్ధతి'లో గ్రేడ్లు మాత్రమే ఇస్తారు.[2]
2011
[మార్చు]ఎస్ఎస్సి బోర్డు [3] నిర్వహించిన పదవ తరగతి ఫలితాల్లో [4] మొత్తంగా 83.10 శాతం విద్యార్థులు (గతేడాది కన్నా 1.47% ఆధిక్యం) ఉత్తీర్ణత సాధించారు. అబ్బాయిలు 82.71 శాతం, అమ్మాయిలు 83.51 శాతం ఉత్తీర్ణులయ్యారు. పరీక్షలు రాసిన 10, 49, 695 మంది రెగ్యులర్ విద్యార్థుల్లో 8, 72, 339 మంది ఉత్తీర్ణులయ్యారు. అబ్బాయిల్లో 82.71%, అమ్మాయిల్లో 83.51% మంది ఉత్తీర్ణులయ్యారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12, 87, 211 మంది పదోతరగతి పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 10, 49, 695 మంది రెగ్యులర్, 2, 37, 516 మంది ప్రైవేటు విద్యార్థులున్నారు. పరీక్షలు రాసిన 2, 37, 516 మంది ప్రైవేటు విద్యార్థుల్లో 95, 083 మంది (40.03%) పాసయ్యారు. బాలికల్లో 47.17%, బాలురలో 36.98% ఉత్తీర్ణులయ్యారు.
మార్కుల మెమోలో విద్యార్థి తల్లి పేరు కూడా ముద్రించే సౌకర్యం, ఫెయిలైన వారికి కూడా మార్కుల మెమోలో పుట్టినతేదీ ముద్రించి ఇచ్చే సౌకర్యం, ఈ సంవత్సరం నుండి ప్రవేశపెట్టారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 2, 562 పాఠశాలలు 100% ఉత్తీర్ణత సాధించగా, 10 పాఠశాలలు సున్నా శాతం ఫలితాలు పొందాయి. రాష్ట్రంలో 91.57% ఉత్తీర్ణతతో కరీంనగర్ జిల్లా అగ్రస్థానంలో నిలవగా, హైదరాబాదు 72.76% ఉత్తీర్ణతతో అట్టడుగున ఉంది.
2010
[మార్చు]పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో 81.63% మంది రెగ్యులర్ విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. పరీక్షలు రాసిన మొత్తం 10, 62, 812 మందిలో 8, 67, 594 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయి అయ్యింది. అబ్బాయిల్లో 81.27%, అమ్మాయిల్లో 82.01% మంది ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 13, 48, 726 మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 10, 62, 812 మంది రెగ్యులర్, 2, 85, 914 మంది ప్రైవేటు విద్యార్థులున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత 1.8% పెరిగింది. పరీక్షలు రాసిన 2, 85, 914 మంది ప్రైవేటు విద్యార్థుల్లో 1, 21, 639 మంది (42.54%) పాసయ్యారు. బాలికల్లో 48.46%, బాలురలో 39.58% ఉత్తీర్ణులయ్యారు. సీబీఎస్ఇ లాగే ఫలితాలను తొమ్మిది గ్రేడులుగా (ఎ-1 నుండి ఇ వరకు) విడుదల చేశారు. 'ఇ' గ్రేడ్ పరీక్షలో తప్పినట్లు. అందరికి పుట్టిన తేదీతో మార్కుల సర్టిఫికేట్లు ఇస్తారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 2, 433 పాఠశాలలు నూరుశాతం ఉత్తీర్ణత సాధించగా, 12 పాఠశాలలు సున్నా శాతం ఫలితాలు పొందాయి. రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా 92.65% ఉత్తీర్ణతతో అగ్రస్థానంలో నిలవగా, హైదరాబాదు అన్ని జిల్లాల కంటే తక్కువగా కేవలం 71.79% ఉత్తీర్ణత సాధించింది.
- జిల్లాల వారీగా ఉత్తీర్ణత
జిల్లాల వారీగా గుంటూరులో 8 7.31, కృష్ణాలో 84.16, పశ్చిమ గోదావరిలో 87.39, మహబూబ్ నగర్ లో 77.93, కరీంనగర్ లో 90.30, కడపలో 87.94, మెదక్ లో 85.22, ఖమ్మంలో 78.69, తూర్పు గోదావరిలో 80.55, విశాఖపట్నంలో 78.67, ప్రకాశంలో 77.67, నల్లగొండలో 88.42, ఆదిలాబాద్ లో 82.98, నెల్లూరులో 81.00, శ్రీకాకుళంలో 76.40, విజయనగరంలో 81.57, రంగారెడ్డిలో 75.95, అనంతపురంలో 73.94, వరంగల్ లో 82.90, హైదరాబాదులో 71.79, కర్నూలులో 74.92 శాతం మంది పాసయ్యారు.
- గురుకుల పాఠశాలల ఆధిక్యత
పదో తరగతి పరీక్షల్లో మేనేజ్‌మెంట్ వారీగా పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలకు చెందిన విద్యార్థుల ఉత్తీర్ణతా శాతం అత్యధికంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలు (సొసైటీ) 96.25 శాతం ఉత్తీర్ణత సాధించగా, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 95.10 శాతం పాసయ్యారు. ప్రైవేట్ పాఠశాలల్లో 88.59, ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 88.52 శాతం మంది పాసయ్యారు. జిల్లాపరిషత్ పాఠశాలల్లో ఉత్తీర్ణతా శాతం 77.10 కాగా, ప్రభుత్వ పాఠశాలల్లో 69.70 శాతం ఉత్తీర్ణులయ్యారు. మున్సిపల్ పాఠశాలల్లో అతి తక్కువగా 69.18 శాతం మంది విద్యార్థులు మాత్రమే పాసయ్యారు.
గ్రేడులు
[మార్చు]పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వం తొలిసారి గ్రేడింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. గ్రేడింగ్‌తో వికలాంగ విద్యార్థులకు వెసులుబాటు కల్పించారు. గ్రేడింగ్ విధానాన్ని పరిశీలిస్తే ఐదు రకాలుగా విభజించారు.[5]
- జనరల్ విద్యార్థుల మార్కులు
గ్రేడు | జనరల్ విద్యార్థుల మార్కులు |
---|---|
ఎ-1 | 600-509 |
ఎ-2 | 508-470 |
బి-1 | 469-435 |
బి-2 | 434-404 |
సి-1 | 403-374 |
సి-2 | 373-343 |
డి-1 | 342-308 |
డి-2 | 307-204 |
ఇ | ఫెయిల్ |
పదో తరగతిలో ఉత్తీర్ణులు కావాలంటే కనీసం 35 మార్కులు చొప్పున సాధించాలి. ఐదు పాఠ్యాంశాలకు మొత్తం 175 మార్కులు రావాలి. హిందీలో 20 మార్కులు పొందితే పరీక్షల్లో నెగ్గినట్లే. దీని ప్రకారం మొత్తం 195 మార్కులు సాధించాలి. జనరల్ విభాగంలో డి 2 విభాగంలో గ్రేడ్ 204 మార్కులతో అగిపోయింది, ఎందుకంటే195 నుంచి 203 మధ్య మార్కులు ఎవరికీ రాలేదు.
- చెవిటి, మూగ విద్యార్థులు
వీరికి 400 మార్కులని 12.5 శాతంగా భాగాలు చేసి గ్రేడులు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 600 మంది పరీక్ష రాశారు.
- అంధ విద్యార్థుల మార్కులు
వీరు 600 మార్కులకి రాసినా, ఉత్తీర్ణతా మార్కులు 20 శాతం. రాష్ట్ర వ్యాప్తంగా 500 మంది పరీక్ష రాశారు.
- నరాల బలహీనత (పి హెచ్-4) విద్యార్థుల మార్కులు
వీరికి ఇంగ్లీషు మినహాయించి 500 మార్కులకి గ్రేడులు నిర్ణయిస్తారు.
- ఒఎస్ఎస్సి
ఈ విభాగం కింద పరీక్ష రాస్తే విద్యార్థులకు ఏడు సబ్జెక్టులున్నాఆరు రాస్తే చాలు. గణితం, సామాన్య, సాంఘికశాస్త్రంలో ఒక సబ్జెక్టును మినహాయిస్తారు. 600 మార్కులకు లెక్కిస్తారు. 462 మార్కులు దాటితేఎ- 1 గ్రేడ్ కింద పరిగణిస్తారు.
2009
[మార్చు]2009 ఎస్సెస్సి (పదవ తరగతి) పరీక్షలో[6] 78.83 శాతం మంది విద్యార్థినీ విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.. ఈ ఏడాది నిరుటి కన్నా 3.36 శాతం మంది ఎక్కువ కృతార్థులయ్యారు. మొత్తం 10, 01, 529 మంది పరీక్ష రాయగా 7, 89, 468 మంది పాసయ్యారు. ప్రథమశ్రేణిలో 5, 43, 327 మంది, ద్వితీయ శ్రేణిలో 1, 73, 104 మంది, తృతీయ శ్రేణిలో 73, 027 మంది ఉత్తీర్ణులయ్యారు. నిజామాబాద్ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో 78.83 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. చిట్టచివరి స్థానంలో చిత్తూరు జిల్లా నిలిచింది. ఈ జిల్లాలో 66.93 శాతం మంది మాత్రమే పాసయ్యారు. జిల్లాల వారీగా గుంటూరులో 86.30, కృష్ణాలో 85.69, పశ్చిమ గోదావరిలో 85.28, మహబూబ్ నగర్ లో 85.27, కరీంనగర్ లో 87.22, కడపలో 84.03, మెదక్ లో 81.75, ఖమ్మంలో 81.32, తూర్పు గోదావరిలో 80.82, విశాఖపట్నంలో 80.56, ప్రకాశంలో 80.03, నల్లగొండలో 79.64, ఆదిలాబాద్ లో 77.74, నెల్లూరులో 77.66, శ్రీకాకుళంలో 77.13, విజయనగరంలో 76.76, రంగారెడ్డిలో 73.69, అనంతపురంలో 71.70, వరంగల్ లో 71.51, హైదరాబాదులో 70.37, కర్నూలులో 70.25 శాతం మంది పాసయ్యారు.
మార్చి 1997లో ఎస్సెస్సీ (పదవ తరగతి) 56.67 శాతంమంది ఉత్తీర్ణులుకాగా, మార్చి 2009లో 78.83% శాతంమంది ఉత్తీర్ణులు అయ్యారు.
మూలాలు
[మార్చు]- ↑ "సర్వశిక్షాఅభియాన్". Archived from the original on 2012-01-26. Retrieved 2009-02-21.
- ↑ http://telugu.oneindia.in/news/2012/05/24/andhrapradesh-ssc-results-released-at-11am-100158.html
- ↑ "ఎస్ఎస్సి బోర్డు". Archived from the original on 2011-06-22. Retrieved 2011-05-22.
- ↑ 2011 ఎస్ఎస్సి ఫలితాలు[permanent dead link]
- ↑ [ "ఇదీ గ్రేడింగ్!" ఈనాడు 23.5.2010]
- ↑ పరీక్ష ఫలితాలు దట్ ఈజ్ తెలుగు వార్త[permanent dead link]