రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (RMSA) [1][2] లక్ష్యం తొమ్మిది, పది తరగతుల ఉన్నత పాఠశాల విద్య ప్రమాణాలని అభివృద్ధి చేయడముమరియు విస్తరించడము . ప్రాథమిక విద్యకోసం ప్రభుత్వం ప్రారంభించిన సర్వ శిక్షా అభియాన్ పథకం సత్ఫలితాలివ్వడంతో దీనికై మానవ వనరుల మంత్రిత్వ శాఖ, 11 వ ప్లాన్ లో, 20,120 కోట్లతో రాష్ట్రీయ మాధ్యమిక్ శిక్షా అభియాన్ ను రూపొందించింది.

ముందుచూపు[మార్చు]

దీని దార్శనికత లేకముందుచూపు లోని ముఖ్య విషయం14-18 సంవత్సరముల వయస్సు గల అందరి యువతీ యువకులకు మంచి ప్రమాణాలతో కూడిన విద్య అందుబాటులో మరియు తక్కువ ఖర్చుతో అందచేయటం . అనగా నివాస స్థలానికి తగిన దూరములో 7 -10 కిలో మీటర్ల లోపల ఉన్నత పాఠశాల వుండేటట్లు చేయటం, 2017 నాటికి, ఉన్నత పాఠశాల విద్యలో అందరు నమోదయేటట్లు చూడటం (GER 100%) మరియు సమాజంలో ఆర్థికంగా బలహీన వర్గాలవారికి, విద్యా పరంగా వెనుకబడినవారికి, బాలికలకి, గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న వికలాంగ పిల్లలకి మరియు షెడ్యూల్ వర్గాలు, షెడ్యూల్ తెగలు, ఇతర వెనుక బడిన తరగతులు, మరియు విద్యా పరంగా వెనుకబడిన అల్పసంఖ్యాకులకుఉన్నత పాఠశాల విద్యపొందేటట్లు చూడడం.

వనరులు[మార్చు]

  1. "కేంద్రప్రభుత్వసెకండరీ విద్యా శాఖ సైటు". మూలం నుండి 2012-02-13 న ఆర్కైవు చేసారు. Retrieved 2012-02-16. Cite web requires |website= (help)
  2. భారత ప్రవేశ ద్వారము లో వ్యాసం[permanent dead link]