విక్రయ కేంద్రాలు (రిటైల్)
సాధారణంగా మన దేశంలో, చిన్న చిన్న దుకాణాల ద్వారా చిల్లర వ్యాపారం (రిటైల్) జరిగేది. సరళీకృత ఆర్థిక విధానాల ఫలితంగా, మధ్యాదాయ వర్గం పెరగటం, వ్యవస్థీకృత రంగంలో విక్రయ కేంద్రాలు జోరందుకున్నాయి. వీటివలన షాపింగ్ మాల్స్, డిపార్ట్మెంటల్ స్టోర్స్, సూపర్ మార్కెట్సు తరహాలోనిత్యావసర వస్తువుల నుండి, బంగారం వరకు అన్నిరకాల వస్తువులని అమ్ముతున్నారు. అందువలన వీటిలో ఉద్యోగవకాశాలు పెరిగాయి.
ఉద్యోగ రకాలు
[మార్చు]సేల్స్ అసిస్టెంట్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, టీం లీడర్, అసిస్టెంట్ సేల్స్ మేనేజర్, మేనేజర్
ఉద్యోగానికి అర్హతలు
[మార్చు]పదవతరగతి నుండి ఎంబిఎ చదువుతో రకరకాల స్థాయిలలో ఉపాధి పొందవచ్చు.వాక్చాతుర్యం, ఓపిక, చిరునవ్వు, వినయంగా మాట్లాడటం, కష్టమర్ని ఒప్పించగల నేర్పు లాంటి మృదు నైపుణ్యాలుండాలి.
ప్రముఖ సంస్థలు
[మార్చు]ప్రముఖ సంస్థలలో కొన్ని: పుడ్ వరల్డ్, ఫ్యూచర్ గ్రూప్ వారి బిగ్ బజార్, పాంతలూన్, షాపర్స్ స్టాప్, మ్యూజిక్ వరల్డ్, మోప్, ఫ్రెష్, మెక్డొనాల్డ్స్, హెచ్డిఎఫ్సి బిపిఒ.
ఉపాధికి శిక్షణ, తోడ్పాటు
[మార్చు]ఉద్యోగ కల్పన, మార్కెటింగ్ మిషన్ ( EGGM) [1][2] గ్రామీణ ప్రాంతాలలోని స్వయం సహాయ బృందాల కుటుంబాలలోని యువతకి, ప్రైవేటు భాగస్వాములతో శిక్షణ ఏర్పాటు చేసి, బిపిఒ,రిటైల్ రంగంలో ఉపాధికి తోడ్పడుతున్నది. 2005-2008 లో 15000 మందికి శిక్షణ ఇవ్వగా వారిలో 80 శాతం మంది ఉపాధి పొందారు.
వనరులు
[మార్చు]- ↑ "ఉద్యోగ కల్పన , మార్కెటింగ్ మిషన్ వెబ్ సైటు". Archived from the original on 2010-09-27. Retrieved 2020-01-13.
- ↑ "ఉద్యోగ కల్పన , మార్కెటింగ్ మిషన్ కరపత్రం, ఫిబ్రవరి 2008" (PDF). Archived from the original (PDF) on 2010-12-02. Retrieved 2010-05-28.