అసర్
ప్రథమ్[1] అనే స్వచ్ఛంద సంస్థ భారతదేశం వ్యాప్తంగా అన్ని జిల్లాలలో గ్రామీణ ప్రదేశాలలో విద్యా ప్రమాణాలపై 2005 నుండి అసర్ (Annual Status of Education Report - ASER) అనబడే వార్షిక సర్వే నిర్వహిస్తున్నది. ఆంధ్రప్రదేశ్లో 2006 నుండి సర్వే జరపబడుతున్నది. విద్యా ప్రమాణ గణాంకాలు, మౌలిక సదుపాయాల కల్పనలో దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ వెనుకబడింది.
విద్యాప్రమాణాల కొలబద్ద
[మార్చు]చదువుట
[మార్చు]దీనిలో ఏమి చదవలేకపోవుట, ఆక్షరాలను మాత్రమే చదువుట, పదాలను చదువుట, చిన్న వాక్యాలను చదవగలుగుట (ఒకటవ తరగతి స్థాయి ), చిన్ని వ్యాసాలను చదువగలుగుట (రెండవ తరగతి స్థాయి) విభాగాలున్నాయి.[2]
గణితం
[మార్చు]ఏ అంకె గుర్తించక పోవుట, 1-9 అంకెలను మాత్రమే గుర్తించుట, 10-99 అంకెలను గుర్తించుట, తీసివేత, భాగాహారం చేయుట, సమయం చెప్పటం, డబ్బు లెక్కించుట ముఖ్య విభాగాలు.[3]
అసర్ 2013 నివేదిక
[మార్చు]రాష్ట్రంలోని 21 జిల్లాల్లో 621 గ్రామాలకు వెళ్లి అక్కడి 616 స్కూళ్లలోని 15,841 మంది పిల్లల విద్యాప్రమాణ స్థాయిలను అధ్యయనం చేశారు. జిల్లా విద్యాశిక్షణ సంస్థ (DIETడైట్) లోని 1320 మంది బోధన విద్య విద్యార్థులు ఈ సర్వేలో పాల్గొన్నారు. ఈ సర్వే నివేదికను 'వార్షిక విద్యాస్థితి (అసర్-2013 ) ' ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.[4] దీని ముఖ్యాంశాలు[5]
- విద్యా ప్రమాణాలు
- 2013లో బడి ఈడు పిల్లల్లో (5-14 సంవత్సరాలు) 97.1 శాతం మంది పాఠశాలలలో నమోదవగా, వారిలో 70 శాతం మందే పాఠశాలలకు హాజరవుతున్నారు.
- రెండో తరగతిలో 11.4 శాతం మంది విద్యార్థులు అసలు అక్షరాలు గుర్తించలేకపోతున్నారు.ఇది 2012లో ఇది 6 శాతం నుండి 2013లో అసాధారణంగా పెరిగింది. పదాలు చదవగలిగే వారు 35.2%, సామాన్యమైన వాక్యాలు చదవగలిగే సామర్థ్యం కలవారు 25.6శాతం మంది.
- ఒకటో తరగతిలో అక్షరాలు గుర్తించలేని వారు 15 % (2012) నుండి 36% (2013) కు పెరిగింది.
- ప్రాథమిక పాఠశాల విద్య పూర్తవుతున్న ప్రతి 10 మంది విద్యార్థుల్లో 6 మందికి భాగాహారం చేయటంతెలియదు.
- మొత్తానికి చదవటం, లెక్కలు చేయడంలో ప్రైవేట్ స్కూళ్ల పిల్లలు ప్రభుత్వ స్కూళ్లలో చదివే పిల్లల కంటే మెరుగ్గా ఉన్నారు.
- విద్యాహక్కు ప్రకారం సదుపాయాలు
- పాఠశాలల్లో విద్యా హక్కు నిబంధనల అమలులో లోపంవుంది. ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి 30,, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రతి 35 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు వుండవలసిన నిబంధన 45.8 శాతం పాఠశాలల్లో మాత్రమే పాటించబడుతున్నది.
- 55 శాతం పాఠశాలలలో మరుగు దొడ్డి సౌకర్యం ఉంది. 43 శాతం పాఠశాలల్లో బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్డి సౌకర్యం ఉంది.
- 35 శాతం పాఠశాలలలో తాగునీటి సౌకర్యం లేదు.
- 64 శాతం పాఠశాలలలో ఆట స్థలాలు ఉన్నాయి.
- 48 శాతం పాఠశాలలకు మాత్రమే కంచె ఉంది.
అసర్ 2012 నివేదిక
[మార్చు]అసర్ 2012 నివేదిక [6][7] ముఖ్యాంశాలు.
- 6 నుండి 14 సంవత్సరాల వయస్సుగల పిల్లలలో 2.60% శాతం మంది పాఠశాలవెలుపలనే ఉన్నారు. ఈ సంఖ్య 2006లో 4.19%గా ఉంది.
- అంకగణిత సామర్థ్యం గత సంవత్సరంతో పోల్చితే దేశంలో పలుచోట్ల తగ్గినా ఆంధ్రప్రదేశ్ లోతగ్గలేదు.
- ప్రైవేటు పాఠశాలలో పిల్లలనమోదు పెరుగతూవున్నది. రెండవతరగతిలో ప్రైవేటు పాఠశాలలో చదివేపిల్లల శాతం 45.10%గా ఉంది. ఇది 2006 లో 26.23%గా ఉంది. ఇలాగే కొనసాగితే దేశంలో 2018కి 50 శాతం పిల్లలు ప్రైవేటుపాఠశాలలో చదువుతారు. కేరళలో ఇప్పటికే ఇది 60 శాతంపైగా ఉంది.
- ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులలో చదివేస్థాయి ఫలితాలలో తేడా తగ్గింది.
- 2011 నివేదిక ప్రకారం పాఠశాలలో చదివేపిల్లలలో 30.8 శాతం మంది ఇంటి భాష కాని మాధ్యమంలో చదువుతున్నారు.
వివరమైన పట్టికలు
[మార్చు]చదవగలిగే స్థాయి
[మార్చు]ఆంధ్రప్రదేశ్ లోని 5-16 సంవత్సరాల వయస్సుగల బడిలో నమోదైన పిల్లల స్థితి [8]
సంవత్సరం | ఏమి చదవలేకపోవుట | అక్షరం | పదం | పేర | కథ | మొత్తం |
---|---|---|---|---|---|---|
3.42% |12.36%| 17.13%| 20.16%| 46.92%| 100.00% | ||||||
6.18% |12.05% |14.18% |12.56% |55.04% |100.00% | ||||||
3.71% |12.23% | 15.43% | 16.09%| 52.55%| 100.00% | ||||||
5.89% |13.57% |14.90% |15.17% |50.47% | 100.00% | ||||||
4.67% | 12.98%| 14.91%| 15.43%| 52.02%| 100.00% | ||||||
4.56% |13.60% |15.76% |15.78% |50.30% |100.00% | ||||||
6.90% |14.10% |15.30%| 13.20%| 50.60%| 100% | ||||||
8.40%| 12.10%| 15.50%| 16.30% |47.70% |100% |
అంకగణితం స్థాయి
[మార్చు]ఆంధ్రప్రదేశ్ లోని 5-16 సంవత్సరాల బడిలో నమోదైన విద్యార్థుల స్థితి
సంవత్సరం | ఏమి గుర్తించ లేకపోవుట | అంకెలు పదిలోపు | అంకెలు 99 లోపు | తీసివేత | భాగహారం | మొత్తం |
---|---|---|---|---|---|---|
4.48% | 9.27%| 26.69%| 24.15%| 35.41%| 100.00% | ||||||
3.26% |9.67%| 24.75%| 25.87%| 36.45%| 100.00% | ||||||
5.02% | 10.92%| 20.82%| 22.24%| 41.00% |100.00% | ||||||
4.02% |10.02% |23.33% | 23.88% |38.76% | 100.00% | ||||||
3.97% |10.13%| 24.58%| 25.66%| 35.66%| 100% | ||||||
3.80%| 9.90%| 23.80%| 25.20%| 37.30%| 100% | ||||||
6.50%| 9.20%| 28% |24.70%| 31.60%| 100% |
పిల్లల బడి నమోదు వివరాలు
[మార్చు]ఆంధ్రప్రదేశ్ లోని 5-16 సంవత్సరాల విద్యార్థుల స్థితి
సంవత్సరం | ప్రభుత్వ | ప్రైవేట్ | ఇతర | నమోదు కాని | మొత్తం |
---|---|---|---|---|---|
75.23% | 18.52% |0.17% |6.08% | 100.00% | |||||
63.90%| 29.32%| 0.46%| 6.32%|100.00% | |||||
67.07% | 27.43%| 0.11%| 5.39% |100.00% | |||||
61.90% | 29.30% | 0.18%| 8.62% |100.00% | |||||
58.65%| 35.56%| 0.31%| 5.48%|100.00% | |||||
60.14% |34.43%| 0.24% | 5.19%|100.00% | |||||
57.80%| 37.20% |0.50%| 4.50%| 100% | |||||
60.20%| 34.80%| 0.40%| 4.60%| 100% |
మూలాలు
[మార్చు]- ↑ "అసర్ సెంటర్ వెబ్సైట్". Archived from the original on 2014-02-10. Retrieved 2014-01-31.
- ↑ "చదువట పరీక్ష ఉపకరణం" (PDF). అసర్ సెంటర్. Archived from the original (PDF) on 2014-09-20. Retrieved 2014-01-31.
- ↑ "గణిత పరీక్ష ఉపకరణం" (PDF). అసర్ సెంటర్. Archived from the original (PDF) on 2015-04-19. Retrieved 2014-01-31.
- ↑ "Andhra Pradesh Rural 2013" (PDF). అసర్ సెంటర్. 2011-01-15. Archived from the original (PDF) on 2014-01-23. Retrieved 2014-01-31.
- ↑ ఆంధ్రజ్యోతి.కాం, " ఇదేమి అక్షరమో! ముద్రణ, 18-01-2014 07:23 AM
- ↑ "2012 నివేదిక" (PDF). Archived from the original (PDF) on 2015-04-24. Retrieved 2014-01-31.
- ↑ "గ్రామీణ విద్యపై అసర్ నివేదిక....పెరిగిన నమోదు- తరిగిన నాణ్యత". సూర్య. 2013-02-08. Retrieved 2014-01-31.[permanent dead link]
- ↑ "అసర్ దత్తాంశ ప్రశ్న అంతర్జాల పేజి". Archived from the original on 2014-09-05. Retrieved 2014-01-31.