విద్యా హక్కు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తరగతి గదిలో బోధన, అధ్యయన విషయాలలో రాజకీయ విషయాలను చేర్చడం లేదా విద్యార్థులను బోధించడానికి వారి పాత్రను దుర్వినియోగం చేసే ఉపాధ్యాయులు ఆలోచన స్వేచ్ఛ, విమర్శనాత్మక ఆలోచనను కోరుకునే విద్య యొక్క లక్ష్యాలకు వ్యతిరేకంగా వెళతారు.

విద్యను బాలల ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ విద్యా హక్కు చట్టంచేశారు.[1] ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టాల తరహాలో ఇది అమలౌతుంది. 6-14 ఏళ్ల మధ్య వయసు బాలబాలికలందరూ తప్పనిసరిగా పాఠశాలల్లో చేరి చదువుకునేలా చూస్తూ, వారికి ఉచిత విద్య అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ వయసు పిల్లలు 92 లక్షల మంది పాఠశాల చదువులకు వెలుపలే ఉండిపోతున్నారు. పాఠశాలల్లో చేరని, లేదా మధ్యలోనే చదువు మానేసిన వీరందరినీ తిరిగి చదువుల బాట పట్టించటం విద్యాహక్కు చట్టం ముఖ్యోద్దేశం. స్కూలు నిర్వహణ కమిటీ, లేదా స్థానిక ప్రభుత్వం పాఠశాల చదువులకు దూరంగా ఉండిపోతున్న ఆరేళ్లపైబడిన బాలిబాలికలందరినీ గుర్తించి, వారికి తగిన శిక్షణ ఇప్పించి, పాఠశాలలో తగిన తరగతిలో చేర్పించాల్సి ఉంటుంది. ఏ విద్యార్థికీ పాఠశాలలు అడ్మిషన్‌ను నిరాకరించటానికి వీల్లేదు. ప్రైవేటు పాఠశాలలు సైతం 25% సీట్లను బలహీన, పేద వర్గాలకు కేటాయించాలి.వారి ఖర్చులను ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది.నిధులను 55-45 నిష్పత్తిలో కేంద్రం రాష్ట్రాలు భరించాలి. ఆంధ్ర ప్రదేశ్ రా ష్ట్ర స్థాయిలో నియమ నిబంధనలు రూపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణా సంస్థ కృషి చేస్తుంది.

ఇవీ చూడండి[మార్చు]

వనరులు[మార్చు]

  1. "రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణా సంస్థ విద్యా హక్కు పేజి". Archived from the original on 2010-04-18. Retrieved 2010-05-18.