బిపిఒ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భారతదేశంలో ఒక కాల్ సెంటర్

బిపిఒ పూర్తి పేరు బిజినెస్ ప్రాసెస్ ఔట్సోర్సింగ్ (BPO). దీని అర్థం వ్యాపార పద్ధతులను పొరుగు సేవల రూపంలో నిర్వహించడం. ప్రతి సంస్థకి రకరకాల వ్యక్తులు, (ఉద్యోగస్థులు, అమ్నకం దారులు, కొనుగోలు దారులు, మదుపరులు, వాటాదారులు..), ప్రభుత్వము, ఇతర సంస్థలతో సంబంధం వుంటుంది. వీరితో లావాదేవీలు జరపడానికి, స్వంత ఉద్యోగులు నియమించుకోకుండా, పొరుగు సేవల సంస్థలతో ఒప్పందం చేసుకోవడమే బిపిఒ. చాలా లావాదేవీలు ముఖాముఖిగా కాక, ఫోను ద్వారా చేయవచ్చు, అందుకనే వీటిని కాల్ సెంటర్లు అనికూడా అంటారు. ఇవి ఐటి ఆధారంగా పనిచేస్తాయి కాబట్టి ఐటిఇఎస్ అని కూడా అంటారు.

ఉద్యోగాల పరిమాణం[మార్చు]

2008 లో ప్రకటించిన నాస్కామ్ -ఎవరెస్ట్ బిపిఒ స్టడీ : రోడ్ మాప్ 2012[1] ప్రకారం, బిపిఒ పరిశ్రమ 7,00,000 మంది ఉద్యోగులతో $10.9 బిలియన్లు ఎగుమతుల ఆదాయం కలిగివుంది. $26–29 బిలియన్లు మొత్తము మార్కెట్ 35% పెరుగుతున్నది. ప్రధానంగా కొనుగోలుదారు సంపర్కం మరియు సహాయం, ఆర్థిక మరియు గణాంక సేవలు, తక్కువ స్థాయిలో మానవ వనరులు, కొనుగోలు సేవలు, జ్ఞాన సేవలు, ఇవన్నీకలిస్తే భాగం 70 శాతంగా ఉంది. 25 దేశాల్లోని 75 నగరాల నుండి భారత బిపిఒ సంస్థలు పనిచేస్తున్నాయి. భారతదేశంలో 30 నగరాలలో (రెండవ, మూడవ నగరాలు కూడా) సంస్థలు పనిచేస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో 2008-09 లో రు. 32,509 కోట్ల ఐటి ఎగుమతులలో, 55శాతం ఐటి సేవలు, 20 శాతం బిపిఒ,25శాతం, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ మరియు ఇతరాలుగా ఉన్నాయి.

ఉద్యోగ రకాలు[మార్చు]

ఇవి రెండు రకాలు.

జాతీయ (డొమెస్టిక్) కాల్ సెంటర్లు
ఇవి దేశంలోని వారికి సేవలందిస్తాయి.
అంతర్జాతీయ కాల్ సెంటర్లు
ఇవి విదేశాలలోని వారికి సేవలందిస్తాయి.

ప్రారంభ స్థాయిలో నియామక పద్దతి[మార్చు]

ఇంటర్ లేదా, ఎదైనా డిగ్రీ, వుండి, ఇంగ్లీషు, ఇతర భాషల ఉచ్ఛారణ, వాక్చాతుర్యం వున్నవారు ఈ రంగంలో ఉపాధి పొందటానికి అర్హులు. ప్రారంభ జీతం 6000. (2009 లో) 45 లేక 90 రోజుల శిక్షణతో ఉద్యోగం సంపాదించవచ్చు. ఈ శిక్షణలో ప్రధానంగా వాక్చాతుర్యం, కాల్ సెంటర్ సాంకేతికాలు, ఉచ్ఛారణ తటస్థీకరణ, వ్యక్తిత్వ నైపుణ్యాలు అంశాలు వుంటాయి.

ఉపాధికి శిక్షణ, తోడ్పాటు[మార్చు]

ఉద్యోగ కల్పన మరియు మార్కెటింగ్ మిషన్ ( EGGM) [2][3] గ్రామీణ ప్రాంతాలలోని స్వయం సహాయ బృందాల కుటుంబాలలోని యువతకి, ప్రైవేటు భాగస్వాములతో శిక్షణ ఎర్పాటు చేసి, బిపిఒ, రిటైల్ రంగంలో ఉపాధికి తోడ్పడుతున్నది. 2005-2008 లో 15000 మందికి శిక్షణ ఇవ్వగా వారిలో 80 శాతం మంది ఉపాధి పొందారు.

వనరులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=బిపిఒ&oldid=2141029" నుండి వెలికితీశారు