ఐటిఐ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారత ప్రభుత్వ కార్మిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఐటిఐ (ఇండస్ట్రియల్ ట్రెయినింగ్ ఇన్సిట్యూట్) లేక ఐటిసి (ఇండస్ట్రియల్ ట్రెయినింగ్ సెంటర్) లు, వివిధ రకాల కోర్సుల ద్వారా నిపుణులైన వృత్తి కార్మికులను తయారు చేస్తున్నది. వీటి వివరాలు కేంద్ర వృత్తి శిక్షణ సమాచార వ్యవస్థ, [1] ద్వారా తెలుసుకోవచ్చు. ఆంధ్ర ప్రదేశ్ లో 651 ఐటిఐలుండగా, వాటిలో ప్రభుత్వరంగంలో, 66 సాధారణ, 21 స్త్రీలకొరకు, 3 ఇతరములు మరియు, ప్రైవేటు రంగంలో 551 సాధారణ 4 స్త్రీలకొరకు, 6 ఇతరములుగా ఉన్నాయి.

ఉపాధి మరియుశిక్షణ శాఖ (ఆంధ్రప్రదేశ్ ) కార్యాలయము హైదరాబాదు లోని బిఆర్కె భవన్, మూడవ అంతస్తు, డి-బ్లాక్, టాంక్ బండ్ 500063 లో ఉంది.

ప్రవేశ నిబంధనలు[మార్చు]

  1. వయస్సు: ప్రవేశ మప్పుడు14-40సంవత్సరాలు . సడలింపులున్నాయి.
  2. విద్యార్హత: వృత్తిని బట్టి 7 నుండి 10 వతరగతి
  3. కేటాయింపులు: నిబంధనల ప్రకారం, దళితులకి, స్త్రీలకు, ఇతర వర్గాల వారికి
  4. ఎంపిక: విద్యార్హత ప్రకారం లేక ప్రవేశ పరీక్ష (అవసపరమైతే) ప్రతిభ ఆధారంగా
  5. దరఖాస్తులు: రాష్ట్ర శాఖ, లేక ఐటిఐ కళాశాల ప్రిన్సిపాల్
  6. ట్రైనింగ్ మొదలు: ఫిభ్రవరి 1, లేక ఆగస్టు 1

వనరులు[మార్చు]

  1. కేంద్ర వృత్తి శిక్షణ సమాచార వ్యవస్థ వెబ్ సైట్
"https://te.wikipedia.org/w/index.php?title=ఐటిఐ&oldid=1977187" నుండి వెలికితీశారు