తాగునీరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఒక అమ్మాయికి మంచినీరు త్రాగిస్తున్న చిత్రం
వేసవిలో ఉచితంగా మంచినీటిని అందించేందుకు ఏర్పాటు చేసిన చలివేంద్రం

మానవులు త్రాగుటకు అర్హమైన స్వచ్ఛమైన నీరును తాగునీరు లేక మంచినీరు అంటారు. మానవునితో పాటు అనేక జీవులకు జీవించడానికి అత్యంత అవసరమైన పదార్థం నీరు, మానవుడు తన ఆరోగ్య సంరక్షణ కొరకు సురక్షితమైన మంచినీటిని వినియోగిస్తాడు. బాగా అభివృద్ధి చెందిన దేశాలలో గృహాలకు, వాణిజ్య, పరిశ్రమలకు తాగునీటి ప్రమాణాలు కలిగిన నీరు సరఫరా జరుగుతుంది, అయితే వాస్తవంగా వినియోగానికి లేదా ఆహార తయారీకి అవసరమయినంత నీరు అందటం లేదు. సాధారణంగా మంచినీటిని తాగటానికే కాక ఇంటిని, వంటిని కడగటానికి, బట్టలు ఉతకటానికి, వ్యవసాయ సాగుకు ఉపయోగిస్తారు. ప్రపంచంలోని పెద్ద ప్రాంతాలలో మానవుని అవసరానికి సరిపడినంత త్రాగు నీరు లభించటం లేదు, ఉన్న నీటి వనరులలో వ్యాధి గ్రాహకాలు, వ్యాధి కారకాలు ఉండి కలుషితమయి ఉన్నాయి. అనేక దేశాలలో దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్న మానవులు సురక్షితమైన మంచినీటిని త్రాగేందుకు, ఆహార తయారీలో ఉపయోగించకపోవటం వలన దీర్ఘకాలిక రోగాలతో పాటు మరణానికి గురౌతున్నారు. అనేక దీర్ఘకాలిక రోగాలకు ప్రధాన కారణం స్వచ్ఛమైన మంచినీటిని ఉపయోగించకపోవటమే. నీటి ద్వారా వచ్చే వ్యాధులను అరికట్టడం అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఒక ప్రధాన లక్ష్యం.

మానవ శరీరంలో సుమారు 70%  నీటితో ఇమిడి ఉంది. ఇది జీవప్రక్రియలలో కీలకమైన భాగం. అనేక శారీరక ద్రావణాలకు ద్రావకంగా పనిచేస్తుంది.

స్వచ్ఛమైన నీరు[మార్చు]

స్వచ్ఛమైన నీరు త్రాగుటకు అవసరం. మనకు అందుబాటులో వున్న నీరు వివిధ రకాలుగా కలుషితమైనది. దీనిని త్రాగుటకు యోగ్యమైనదిగా చేయటానికి చాలా రకాల పద్ధతులున్నాయి.

 • వేడి చేయుట
 • ఆధునిక పద్ధతులు (రివర్స్ ఆస్మోసిస్)

గ్రామాలలో రక్షిత మంచినీటి కేంద్రం ద్వారా త్రాగు నీటిని తక్కువ ఖర్చుతో ప్రజలకు అందచేస్తున్నారు.

మంచి నీరు[మార్చు]

స్వచ్ఛమైన త్రాగు నీరు ఎలా ఉండాలంటే?:

 • లీటరు నీటిలో ఇనుము శాతం ఒక మిల్లీ గ్రాముకు మించి ఉండకూడదు.
 • నైట్రైట్‌ కణాలు సున్నా శాతం ఉండాలి. ఒక లీటరు నీటిలో నైట్రేట్‌ వంద మిల్లీగ్రాముల మించి ఉండకూడదు.
 • హెచ్‌.టు.ఎస్‌. కాగితాన్ని నీటిలో ఉంచితే నీరు నలుపురంగులోకి మారితే బ్యాక్టీరియా ఉన్నట్లే.
 • ఒక లీటరు నీటికి 2500 మిల్లీగ్రాముల విద్యుత్‌ ప్రసరణ సామర్థ్యం ఉండాలి. అంతకు మించి ఉండకూడదు.
 • నీటి స్వచ్ఛతను పి.హెచ్‌. అనే కొలమానంతో కొలుస్తారు. తాగేనీటిలో పి.హెచ్‌. విలువ 6.5 నుంచి 9.2 మధ్యలో ఉండాలి.
 • లీటరు నీటిలో 2 వేల వరకు వివిధ రకాల ఖనిజాలు కరిగి ఉంటే తాగేందుకు మంచిదే. అంతకు మించి ఖనిజాలు ఉండకూడదు.
 • ఒక లీటరు నీటిలో ఆల్‌కలైనిటి 600 మిల్లీగ్రాముల వరకు ఉండొచ్చు.
 • ఒక లీటరు నీటికి తలతన్యత 600 మిల్లీగ్రాములు దాటకూడదు.
 • లీటరు నీటిలో కాల్షియం పరిమాణం 200 మిల్లీగ్రాములు మించకూడదు. ఇక్కడ 68 మిల్లీగ్రాములు
 • 400 మిల్లీగ్రాముల సల్ఫేట్స్‌ ఉండాలి.
 • లీటరు నీటిలో వెయ్యి మిల్లీగ్రాముల క్లోరైడ్‌ కణాలుండవచ్చు.
 • మెగ్నీషియం కణాలు 100 వరకు మాత్రమే ఉండాలి.

తాగునీటిని వృథా చేస్తే జైలు[మార్చు]

ముంబయిలో ఎవరైనా తాగునీటిని వృథా చేస్తే జైలు శిక్ష అనుభవించడం లేదా జరిమానా చెల్లించాల్సి వస్తుంది. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా నీటిని వృథా చేయడాన్ని క్రిమినల్‌ నేరంగా పరిగణిస్తారు. ఉద్యాన వనాల్లో మొక్కలకు నీరు పట్టడం, భవన నిర్మాణాల ప్రయోజనం నిమిత్తం, కార్లను శుభ్రం చేసేందుకు కొళాయి నీటిని ఉపయోగిస్తే వృథాగా పరిగణించనున్నారు. తాగునీరు అరుదైన వస్తువుగా మారింది. నగరానికి సరఫరా అవుతున్న నీటిలో 30 శాతం చౌర్యానికి గురవుతున్నది. తాగునీటిని నిత్యావసర వస్తువుల చట్టం కిందకు తీసుకురావాలని డిమాండ్‌ ఉంది.

ఇవి కూడా చూడండి[మార్చు]

సాగునీరు

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=తాగునీరు&oldid=3031393" నుండి వెలికితీశారు