శిక్ష

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హంగరీలో నేరస్థుడికి శిక్ష, 1793

శిక్ష లేదా దండన అనేది సాధారణంగా నేరం, అన్యాయం, అక్రమం చేయు వారికి విధించునది. ఏవరైనా నియమాలను ఉల్లంఘించినట్లయితే వారికి శిక్షను విధిస్తారు, శిక్షను పొందిన వారు శిక్షార్హులు అవుతారు. సాధారణంగా నేరస్తులలో మార్పు తీసుకువచ్చేందుకు శిక్షలను విధిస్తారు, శిక్షార్హులు తమ శిక్షలను అనుభవిస్తున్నపుడు తమ తప్పుకు పశ్చాతాపం చెంది మంచివారుగా మారుతారు. నేరాన్ని బట్టి శిక్షలు ఉంటాయి, పెద్ద నేరానికి పెద్ద శిక్ష, చిన్న నేరానికి చిన్న శిక్ష విధిస్తారు. చట్టాల ప్రకారం శిక్షలు ఉంటాయి. న్యాయాధికారులు వాదనలు విన్న తరువాత తుది తీర్పుగా దోషులకు శిక్షను విధిస్తారు. కఠినకారాగారశిక్ష, యావజ్జీవ కారాగారశిక్ష, మరణశిక్ష అనేవి పెద్ద శిక్షలు. చెడ్డవారికి యాదృచ్ఛికంగా ఏదైనా కష్టం కలిగితే తగిన శాస్తి (దేవుడు వేసే శిక్ష) జరిగినది అని అంటారు. కొన్నిసార్లు మంచివారికి కూడా శిక్షలు పడవచ్చు, మంచివారికి శిక్ష పడకూడదనే ఉద్ధేశంతో వంద మంది దోషులు తప్పించుకున్నప్పటికి ఒక నిర్దోషికి కూడా శిక్ష పడకూడదంటారు.

ఉపాధ్యాయులు గోల చేసున్న విద్యార్థులకు గోడకూర్చి వేయించడం, గుంజీళ్ళు తీయించడం, బెత్తంతో చిన్నగా కొట్టడం వంటి చిన్న శిక్షలు వేస్తారు, దీని ద్వారా విద్యార్థులు క్రమశిక్షణతో ఉంటారు.

ఇంటిలోన పిల్లలు అల్లరి చేస్తుంటే పెద్దలు అల్లరి చేస్తున్న పిల్లలను చిన్నగా కొట్టడం, మొట్టికాయలు వేయడం, చెంపదెబ్బలు కొట్టడం వంటి శిక్షలను విధిస్తారు, దీని వలన పిల్లలు బుద్ధిగా మసలు కుంటారు.

ప్రజలు చెడు పనులు చేయకుండా నిరోధించడానికి సమాజంలో శిక్షను మంచిగా చూడవచ్చు. చిన్న చిన్న తప్పులు చేసేవారికి శిక్షలు విధించుటకన్నా మందలించి, మంచిమాటలు చెప్పుట ద్వారా వారిలో సత్ర్పవర్తన తీసుకురావటం మంచిది.

"https://te.wikipedia.org/w/index.php?title=శిక్ష&oldid=2917079" నుండి వెలికితీశారు