చలివేంద్రం
Jump to navigation
Jump to search
![]() | ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
ప్రజల దాహార్తిని తీర్చేందుకు దాతల సహాయంతో ఏర్పాటు చేయబడిన ఉచిత మంచినీటి కేంద్రాన్ని చలివేంద్రం అంటారు.
కొత్త కుండలలో మంచినీటిని నింపడం వలన ఈ నీరు చల్లగా ఉంటుంది.
వీటిని ఎక్కువగా రద్దీగా ఉండే కూడలి ప్రదేశాలలో ఏర్పాటు చేస్తారు.
ఎక్కువగా దాహాం వేసే ఎండా కాలంలో వీటిని ఏర్పాటు చేస్తారు.
వివిధ పనుల నిమిత్తం వచ్చే ఇతర గ్రామస్తులకు, ముఖ్యంగా పేదవారికి ఈ చలివేంద్రాలు ఎంతో ఉపకరిస్తాయి.
చలివేంద్ర నిర్వహణకు తీసుకోవలసిన జాగ్రతలు[మార్చు]
చలివేంద్ర ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచడం.
ప్రతిరోజు మంచినీటిని మార్చడం.
కుండలను, గ్లాసులను పరిశుభ్రంగా ఉంచడం.