కుండ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
మట్టితో కుండను తయారుచేస్తున్న కుమ్మరి, టర్కీ.

కుండ లేదా కడవ (ఆంగ్లం Pot) సాధారణంగా ఇంట్లో ఉపయోగించే వస్తువు. మట్టితో కుండలను తయారుచేయువారిని కుమ్మరి అంటారు. కుండలను ఇంట్లో నీరు నిలువచేయడానికి ఉపయోగిస్తారు. సాధారణంగా మొక్కలను పెంచడానికి మట్టితో తయారుచేయు కుండలను కుండీలు అంటారు. వీటిలో ఎక్కువగా పూలు పూసే చిన్న మొక్కలను పెంచడం వలన పూల కుండీలు అని పిలుస్తారు.

Meillandine rose in a terra cotta flowerpot

పూర్ణ కుంభం అంటే నిండు కుండ అనేది మన రాష్ట్ర అధికారిక చిహ్నము. ఈ కుంభం లేదా కలశమ్ అనేది సాధారణంగా నీటితో నింపబడిఉండి, పైభాగాన 'టెంకాయ'(కొబ్బరికాయ) ను కలిగి, చుట్టూ మామిడాకులచే అలంకరింపబడి వుంటుంది.

కుండలతో పోసినట్లుగా కురిసే భారీ వర్షాన్ని 'కుండపోత' లేదా 'కుంభవృష్టి' అంటారు.

భాగ్యవంతుల ఇండ్లలో కుండ ఆకారంలోని పాత్రలు స్టీలు, కంచు, రాగి మొదలైన లోహాలతో చేయబడి ఉపయోగంలో ఉన్నాయి. వీటిని బిందెలు అంటారు.

తాగేనీళ్ళు చల్లబడడానికి సన్నని మెడతో పొడవుగా ఉండే కుండల్ని కూజా అంటారు. వేసవికాలంలో ఇలాంటి మట్టి కుండలో నిలవచేసిన నీరు చల్లగా ఉంటాయి. అందుకనే దీనిని "పేదవాని ఫ్రిజ్" అంటారు.

కర్ణాటక సంగీతంలోని వాద్యపరికరం ఘటం

కర్ణాటక సంగీతంలోని వాద్య పరికరాలలో ఘటం అనేది విశిష్టమైనది. ఇదొక కుండ మాదిరిగా ఉంటుంది. Script error: No such module "Side box".

"https://te.wikipedia.org/w/index.php?title=కుండ&oldid=827312" నుండి వెలికితీశారు