కుమ్మరి (కులం)

వికీపీడియా నుండి
(కుమ్మరి నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

'కుమ్మరి (కులం) ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా బి గ్రూపులో 8వ కులము. ఈ కులాన్ని కులాల , శాలివాహన పేర్లతో కూడా ఈకులాన్ని పిలుస్తారు. మట్టితో కుండలను చేయువానిని కుమ్మరి (Potter) అందురు. కులాలుడు అన్న పదం కూడా సాహిత్యంలో వాడబడుతుంది. వీరి వృత్తిని కుమ్మరం (Pottery) అని అంటారు. ఈ వృత్తి వారసత్వముగా వచ్చునది. దీనిని చేయుటకు తగిన అనుభవము ఉండవలెను. మట్టి గురించి అవగాహన, చేయుపనిలో శ్రద్ధ, కళాదృష్టి లాంటివి ఈ పనికి తప్పని సరి. పూర్వము నుండి కుటుంబ వృత్తిగా ఉన్న కుమ్మరము నేడు కనుమరుగయినది. కేవలము కొన్ని గ్రామాలలో తప్ప కుమ్మరులు కానవచ్చుట లేదు.

ప్రదేశం[మార్చు]

అతి పెద్ద కులాలలో కుమ్మరి ఒకటి. ఇది భారతదేశం లోని 212 జిల్లాలలో విస్తరించి యున్నది. ఈ కులంవారు భారతదేశ రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటకలోని కొన్ని ప్రదేశాలు మరియు ఆంధ్రప్రదేశ్ లలో ఉన్నారు. ఈ కులంవారు వివిధ రాష్ట్రాలలో వివిధ రకాల నామాలతో పిలువబడుతున్నారు.

మూల కధలు,చరిత్రలు[మార్చు]

  • ప్రతీ రాష్ట్రంలో ఈ కులానికి సంబంధించి ఒక్కో చరిత్ర ఉంది. కుమ్మరులు భారతీయ హిందూ దేవతలైన త్రిమూర్తులు (బ్రహ్మ,విష్ణు మరియు శివుడు) ఆశీస్సులతో భూమిపై అవతరించామని చెపుతారు.వారికి బ్రహ్మదేవుడు ఈ కళను అందిచాడనీ, విష్ణువు తన చక్రాన్ని అందించాడనీ మరియు లయకారకుడైన శివుడు తన రూపాన్ని అందించాడని అంటారు.వారి మొదటి ఉత్పత్తి నీటి కుండ.
  • ఒకరోజు బ్రహ్మ తన కుమారులకు చెరకు గడను భాగాలుగా చేసి యిచ్చాడు. వారిలో ప్రతీ ఒక్కరూ దానిని తిన్నారు. కానీ కుమ్మరి తన పనిలో నిమగ్నమై ఆ చెరకు ముక్కను తినడం మరచిపోయాడు.ఆ చెరకు ముక్క మట్టి కుప్పపై ఉంచాడు. అది వేర్లు తొడిగి చెరకు మొక్కగా పెరిగింది. కొన్ని రోజుల తరువాత బ్రహ్మ తన కుమారులను చెరకు గురించి అడిగాడు. కానీ ఎవరూ తిరిగి యివ్వలేకపోయారు. కానీ కుమ్మరి చెరకు పూర్తి మొక్కనే యిచ్చాడు. బ్రహ్మ కుమ్మరి యొక్క ఏకాగ్రతను మెచ్చుకొని ప్రజాపతి బిరుదు నిచ్చాడు.
  • విక్రమాదిత్యుడితో’ యుద్దంలో శాలివాహనుడికి సైన్యం లేకపోతే శాలివాహనుడిది కుమ్మరి కులవృత్తి కాబట్ తమ కులదేవత ’నాగేంద్ర స్వామి" మహిమతో అప్పట్టి కప్పుడు ’మట్టిబొమ్మలు " తయారు చేసి వాటికి ప్రాణం పోసి, ఆ బొమ్మల సైన్యం సహాయం తోనే యుద్దం చేసి, విక్రమాదిత్యుడిని ఓడించి "రాజ్యాధికారం" చేపట్టి మన జాతిని జనరంజకంగా పాలించాడట. ఆయన వంశమే తర్వాత"శాతవాహన వంశం" గా పేరుగాంచి నాలుగు వందల యేండ్లు తెలుగునాట రాజ్య పాలన చేసారు.

శాలివాహనులు[మార్చు]

1995 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 28, బిసిడబ్ల్యు (ఎమ్‌ఐ) శాఖ, ప్రకారం శాలివాహన కులం కూడా కుమ్మరి కులంగా పరిగణింపబదినది. భారతీయ శాసనాలు మరియు ఇండోనేషియా మరియు ఇండో చైనాలలోని ప్రాచీన సంస్కృత శాసనాలు ప్రకారం ఈ విషయం చెప్పబడింది. శాలివాహన శకాన్ని తెలియజేసే కాలెండరును భారత ప్రభుత్వం 1957 నుండి తొలగించింది. దీనిని కనిష్క మహారాజు స్థాపించినట్లు ఆరోపణలు ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు(ఆలం+ఊరు=యుద్దం జరిగిన ఊరు) దగ్గర శాతవాహనుడు విక్రమాదిత్యుని ఓడించి శాలివాహన రాజ్యాన్ని స్థాపించాడని ,శాతవాహనుడు కుమ్మరి కులస్తుడని ఒక నానుడి. బౌద్ధ సాహిత్యాన్ని బట్టి దక్షిణ దేశ చరిత్రను క్రీ.పూ 6వ శతాబ్దం నుంచి మనం అంచనా వేయ వచ్చు. శాతవాహనులు రూపొందిన విధానం గురించి కె.కె రంగనాధ చార్యులు ఇలా విశ్లేషిస్తున్నారు.కోసల దేశానికి సంబంధించిన బావరి అనే బ్రాహ్మణుడు దక్షిణాపథానికి వచ్చి గోదావరీ తీరంలో అస్సక జాతివారు నివసించే ప్రాంతంలో స్థిరపడ్డాడు. అతను తన శిష్యులతో బాటు ఊంఛ వృత్తితో జీవించే వాడు. క్రమంగా ఒక గ్రామం వెలసింది. ఒక మహాయజ్ఞం కూడా నిర్వహించాడు. ముసలి తనంలో తన శిష్యులను బుద్ధుడి దగ్గరకు పంపించి సందేహాలను తీర్చుకుని బౌద్ధుడయ్యాడు. బావరి దక్షిణానికి వచ్చిన తర్వాతనే దక్షిణదేశం ఆహారాన్ని సేకరించుకునే దశనుంచి అహోరోత్పత్తి చేసుకునే దశకు వచ్చివుండాలని చారిత్రకుల ఊహ. పైన పేర్కొన్న అస్సక జాతివారే తరువాత శాతవాహన వంశంగా రూపుదిద్దుకున్నారు. బావరి సాంప్రదాయంలో శాతవాహనులు బ్రాహ్మణులను గౌరవించి యజ్ఞాలు చేశారు. ( తెలుగు సాహిత్యం మరోచూపు, కె.కె.రంగనాద చార్యులు పేజి: 2)--కత్తిపద్మారావు (విశాలాంధ్ర 25.7.2010)

శాలివాహన యుగం[మార్చు]

శాలివాహన యుగం "శక యుగం"గా కూడా పిలువబడుతుంది. ఇది హిందూ కాలెండరులలో, భారతీయ జాతీయ కాలెండరు, బాలినేసె కాలెండరు, జవనీస్ కాలెండరు మరియు కంబోడియన్ కాలెండరులలో వాడుతారు. ఈ యుగం యొక్క శూన్యం వెర్నల్ ఈక్వినాక్స్ సంవత్సరం యొక్క 78 నుండి సుమారు ప్రారంభమైనది.[ఆధారం చూపాలి]

పశ్చిమ క్షత్రపాస్ (35–405 BCE) దక్షిణ భారతదేశానికి (సౌరాష్ట్ర, మాల్వా నవీన గుజరాత్, దక్షిణ సింద్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఆంధ్రప్రదేస్ లోని కొన్ని ప్రాంతాలు మరియు కర్ణాటక) పాలకులుగా ఉండేవారు. వీరు ఇండో-సైథియన్లు తరువాతి వారు. వారు శక యుగాన్ని ప్రారంభించారు.

శాతవాహన రాజు (గౌతమీపుత్ర శాతకర్ణి "శాలివాహన"గా పిలువబడేవాడు) శాలివాహన శకాన్ని ప్రారంభించినట్లు తెలుస్తుంది. క్రీ.శ 78లో ఆయన విజయానికి గుర్తిగా ఈ యుగాన్ని ప్రారంభించాడు. "శాలివాహన చక్రవర్తి" తెలుగు వారి తొలి చక్రవర్తి,’శక పురుషుడు" కూడా. తెలుగు పంచాంగ కాలెండర్ ఈయన జన్మ తేది ననుసరించే గుణించబడుతుంది. దీనినే భారత ప్రభుత్వం అధికారిక కాలెండర్ గా ప్రకటించింది.

ఒడయార్[మార్చు]

ఒడయార్ కులం మైసూర్ రాష్ట్రంలో ప్రధానమైన కులం. మైసూర్ లో ఒడయారు సంస్థానం ఉండేది. మైసూరు ప్యాలెస్ లో యిప్పటికి కూడా బంగారు కుండను ఆనాటి పాలకుల నైపుణ్యానికి గుర్తుగా ఉంచబడింది. ఈ కులం యొక్క వివిధ శాఖలు ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ భారతదేశంలో విస్తరించినవి.

ప్రముఖులు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]


కుటీర పరిశ్రమగా కుమ్మరం[మార్చు]

కుమ్మరి చక్రంపై కుండ చేయుట (టర్కీలో తీసిన చిత్రం)
కుమ్మరి తయారు చేసిన కుండలు. వనస్తలిపురం, హైదరాబాదులో తీసిన చిత్రం

కొందరు కుమ్మరులు దీనిని ఒక పరిశ్రమగా కూడా విస్తరించి, కేవలం కుండల వరకే కాక మట్టితో వివిధ రకాలైన అలంకరణ సామగ్రి సైతం తయారు చేసి విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఈ వృత్తి వారు గతంలో వున్నంత లేకున్నా వున్నవారు కొన్ని కుండలు, ఎక్కువగా పట్టణాలలో కూజాలు, ఎక్కువగా పెద్ద భవంతులలో అలంకరణ సామాగ్రి చేసి అమ్ముతున్నారు. అవి ఎంతో ఆకర్షణీయంగా కూడా వుంటున్నవి. ఇవిగాక పూల కుండీలు కూడా ఎక్కువగా అమ్ముడవుతున్నవి. ఈ వృత్తి పూర్తిగా కనుమరుగయే అవకాశం లేదు.

మట్టితో చేసిన కళాత్మకమైన కుండలు, ఇతర అలంకరణ వస్తువులు.. మలక పేట రోడ్డు ప్రక్కన తీసిన చిత్రం

ఇక్కడికి గెంతు: పేజీకి సంబంధించిన లింకులు, అన్వేషణ కుమ్మరి మట్టితో కుండలు చేసి కాల్చి రైతులకు ఇచ్చేవారు. వీరికి కూడా ప్రతి ఫలితానిki 'మేర' వరి మోపు ఇచ్చేవారు. పెద్ద వస్తువులైన, కాగు, తొట్టి, ఓడ మొదలగు వాటికి కొంత ధాన్యం తీసుకొని ఇచ్చేవారు. పెళ్ళి సందర్భంగా ''అరివేణి'' కుండలని కుమ్మరి వారు ఇవ్వాలి. అనగా కొన్ని కుండలకు రంగులు పూసి కొన్ని బొమ్మలు వేసి ఇచ్చేవారు. ఇవి పెళ్ళిలో అత్యవసరం. అదే విధంగా ఎవరైనా మరణించినా ఆ కార్యక్రమాలకు కొత్త కుండలు అత్యవసరం. వాటిని కుమ్మరి సమకూర్చే వాడు. ఈ కుమ్మరి వ్వవస్త చాల కాలం క్రితమే కనుమరుగైనది. మట్టి కుండల స్థానంలో లోహ పాత్రలు వచ్చినందున వాటి ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. పెళ్ళిల్లలో అరివేణి కుండలు ఏనాడో మాయమైనవి. కాని మరణానంతర కార్యాలకు మాత్రం కొత్త కుండల అవసరం ఈ నాటికి తీరలేదు. వాటికొరకు కొన్ని పల్లెల్లో, పట్టణాలలో కొనుక్కోవాలి. ఆవి అరుదుగానైనా దొరుగుతున్నాయి. మట్టి కుండల అవసరము శుభాశుభ కార్యక్రస్మాలకేకాకుండా........ అనేక దేవాలయాలలో కొత్త మట్టి కుండలలోనే మొదటి ప్రసాదము వండుతారు. ఇది ఒక సంప్రదాయము.

అత్యంత కళాత్మకమైన మట్టి పాత్రలు, ఇతర ఆలంకరణ వస్తువులు. మలకపేట రోడ్డు పక్కన తీసిన చిత్రం
కాని ఈ కాలంలో మట్టి తోచేసిన ఇతర అలంకరణ వస్తువులు రంగు రంగులవి, ఎంతో కళాత్మకమైనవి తయారవుతున్నాయి. ఇలాంటివి కేవలం పట్టణ వాసులకే పరిమితం అయ్యాయి. వీటిని పెద్ద పెద్ద ప్రదర్శన శాలలోనె గాక రోడ్డు ప్రక్కన కూడా అమ్ముతున్నారు. కళాత్మకమైన వీటి ధరలు అధికమె.

మట్టి కుండలు గతంలో ప్రతి ఇంట్లోను అత్యవసరం. నీళ్లు తాగె గ్లాసులు తప్ప ఇంకొన్ని చిన్న వస్తువులు తప్ప మిగతావి అన్ని మట్టితో చేసినవే. అదొక సాంప్రదాయం. మట్టి కుండల్లో చేసిన వంటలు రుచిగా వుంటాయని నమ్మే వారు. ఆ తర్వాత కొంత కాలానికి లోహ పాత్రలు వచ్చినా కొన్ని వంటలకు మట్టి పాత్రలనే తప్పని సరిగా వాడె వారు. ఉదాహరణకు పాలు కాగ బెట్టడానికి తప్పనిసరిగా మట్టి పాత్రనె వాడె వారు. దానివలన పాలకు, మజ్జిగకు మంచి రుచి వస్తుంది. అలా పాలను కాచె మట్టి పాత్రను ''పాల సట్టి'' అనె వారు. అలా వంటింటి పాత్రలె గాక ఇళ్లలో ధాన్యం నిలవ చేసుకునే పెద్ద వస్తువులైన, ''ఓడ'',''కాగు'' ''బాన'' ''నీళ్ల తొట్టి'' మొదలగునవి కూడా మట్టితో చేసినవే. ప్రస్తుతం ఇటువంటివి చాల వరకు కనుమరుగైనవి. కొన్ని ఇళ్లల్లో పాతవి కొన్ని ఇప్పటికి కనబడతాయి. లోహ పాత్రలు అందు బాటులోకి వచ్చింతర్వాత కుమ్మరి వృత్తి పూర్తిగా కనుమరుగైనది. వారు తమ బ్రతుకు తెరువుకు ఇతర మార్గాల వైపు మరలి పోయారు. కుమ్మరి మట్టితో కుండలను చేసె విధానము చాల సున్నితమైనై. నేర్పరి తనం కలిగినది, జాగ్రత్తగా చేయ వలసినది.

కుమ్మరి తయారు చేసిన "అరివేణి కుండ" (అయిరేని) గతంలో ఈ కుండలు పెళ్ళిల్లో తప్పని సరి. ఇది కొత్త పేట రైతు బజారు వద్ద తీసిన చిత్రం:
  • కుమ్మరి కుండలను తయారు చేయు విధానము

కుమ్మరి సమీపంలోని చెరువు నుండి మెత్తటి ఒండ్రు మట్టిని సేఖరించి తీసుక వచ్చి దానిని మరింత మెత్తగా చేసి అందులో వున్న చిన్న చిన్న రాళ్లను వేరు చేసి దానిని నీళ్లతొ తడిపి నాలుగైదు రోజులు ముగ్గ బెడతారు. ఆ తర్వాత దానికి నీళ్లు కలిపి కాళ్లతో బాగ తొక్కు తారు. అలా తయారైన మట్టిని సుమారు ఒక అడుగు కైవారం రెండడుగులు ఎత్తు వున్న స్థూపాకారంగా తయారు చేసి దానిని కుమ్మరి చక్రం మధ్యలో పెడతారు. ఆ కుమ్మరి చక్రం సుమారు రెండడుగుల వ్యాసార్థం కలిగి క్రింద ఒక చిన్న లోహపు బుడిపె వంటిది వుంది అది క్రింద నున్న మరొక లోహపు గిన్నె పై నిలబడి బాలెన్సుడుగా నిలబడి వుంటుంది. ఆ చక్రానికి ఒక చోట సుమారు ఒక అంగుళం లోతున ఒక చిన్న రంధ్రం వుంటుంది. కుమ్మరి ఆ రంధ్రంలో ఒక కర్రను పెట్టి చక్రాన్ని తిప్పు తాడు. అది చాల వేగంగా తిరుగు తుంది. అప్పుడు దానిమీద వున్న మట్టి ముద్ద కూడా తిరుగు తుంది. అప్పుడు కుమ్మరి చక్రానికి అవతల నిలబడి వంగి తన చేతులతో చక్రంపై వున్న మట్టి ముద్ద పైబాగాన కొంత మట్టిని ఒడిసి పట్టి తనకు కావలసిన కుండ మూతి ఆకారానికి మలుస్తాడు. కొత్త ఆకారాల కొరకు అతడు చిన్న చిన్న పుల్లలను వాడు తాడు. చక్రం వేగంగా తిరుగు తున్నందున కుమ్మరి తన చేతులతొ మట్టిపై వత్తిడి కలుగ జేసినందున అది గుండ్రటి ఆకారానికి వస్తుంది. అలా పూర్తిగా కుండ ఆకారానికి రాగానె ఒక సన్నని పుల్ల తీసుకొని కుండ అడుగు బాగాన గుచ్చుతాడు. అప్పుడు చక్రం వేగంగా తిరుగు తున్నందున దానిపై వున్న మట్టి ముద్దకు పైన తయారైన కుండకు బంధం తెగి పోయి కుండ మట్టి ముద్దపై అలానె వుంటుంది. అప్పుడు కుమ్మరి ఒడుపుగా ఆకుండను తీసి క్రింద పెడతాడు. అప్పుడు కుండకు అడుగు భాగం వుండదు. అక్కడ ఖాళీగా పైమూతి లాగానె ఒక పెద్ద రంధ్రం వుంటుంది. చక్రం వేగం తగ్గితె మరలా కర్ర తీసుకొని దాని వేగాన్ని పెంచు తారు. అలా చక్రం పైనున్న మట్టి అంతా అయిపోయి నంతవరు కుండలను, కూజాలను, ఇతర పాత్రలను చేసి వాటిని పక్కన పెడతాడు. అలా తయారయిన ఆ పాత్రలు పచ్చిగా వున్నందున అతి సున్నితంగా వుంటాయి. వాటిని అలా నీడలో ఒక రోజు ఆర బెట్టితె కొంత వరకు గట్టి పడతాయి. అప్పుడు కుమ్మరి ఒక్కొక్క పాత్రను తన ఒడిలోనికి తీసుకొని ఎడం చేతిలోని ఒక అతి నునుపైన రాయిని తీసుకొని, కుండ లోనికి పెట్టి లోపల కుండ అంచులకు తాకించి కుడి చేత్తో కుండ పైన ........ క్రింద రాయి ఆనించిన భాగాన మెత్తగా కొడతాడు. అలా కుండ ఉపరితలమంతా కొట్టగా ఆమెత్తటి కుండ సాగి అడుగున వున్న రంధ్రం మూసుక పోతుంది. అప్పుడు దానిని నీడలో పక్కన పెడతాడు. అదే విదంగా కుండలన్ని పూర్తిగా చేసి రెండు రోజులు నీడలో ఆర బెడతారు.

కుమ్మరి వామి అనగా ఆరిన కుండలను కాల్చడానికు ఉపయోగించె ఒక పొయ్యి లాంటిది. ఇది అర్థ చంద్రాకారంలో వుండి మధ్యలో సుమారు మూడడుగుల ఎత్తు వుండి క్రింద ఒక ఆడుగు కైవారంతొ ఒక రంధ్రం వుండి ఒకడుగు మందంతో గోడ వుండి ఆ గోడ రాను రాను ఎత్తు తగ్గి చివరకు భూమట్టానికి వుంటుంది. దీనినే కుమ్మరి వామి అంటారు. ఆరిన కుండలను ఇందులో నిండుగా వరుసగా పేర్చి తర్వాత అన్నికుండలకు కలిపి పైన చెత్త, ఇతర ఆకులు అలుములతో కప్పులాగ వేసి దానిపై బురద మట్టితో ఒక పొరలాగ అంతటికి ఒక కప్పు వేస్తారు. ఇప్పుడు ముందున్న రంధ్రంలో చెత్త, కంపలు మొదలగునవి వేసి మంట పెడతారు. అలా సుమారు ఒకరోజు కాల్చి ఆ తర్వాత దాన్ని అలాగె వదెలేస్తారు. ఆ వామి చల్లారిన తర్వాత ఒక వైపున మెల్లిగా పైనున్న కప్పును తొలగించి తనకు కావలసిన కుండలను తీసుకొంటారు. ఆ విదంగా కుమ్మరి కుండలను తయారు చేస్తారు.
కూజాలు ఇతర నీటిని నింపె మట్టి పాత్రలు; కొత్తపేట రౌతు బజారు వద్ద తీసిన చిత్రం
అలంకార వస్తువులుగా మట్టి పాత్రలు

ప్రస్తుత కాలంలో అలంకార వస్తువులుగా అనేక మట్టి పాత్రలు పట్టణాలలో కనబడు తున్నాయి. పెద్ద పెద్ద కూజాల వంటి పాత్రలు, వాటిపై అనేక అలంకారలతో, లతలు, పువ్వులు మొదలగు అలంకారాలతో ఎంతో అందంగా కనబడు తున్నాయి. అలాగె ఇండ్లలో వేలాడదేసె వస్తువులు మొదలగునవి ఎక్కువగా వస్తున్నాయి. ఇవి అధిక ధరలు కలిగి వుంటాయి. నీళ్లకు కూజాలు, కుండలు, దీపావళికి ప్రమెదెలు మొదలగు మట్టి పాత్రలు పట్టణాలలో ఇప్పటికి కనబడుతూనె ఉన్నాయి. అంతరించి పోతున్న కుమ్మరి వృత్తికి పాత వాసనలు తెలియ జేయడాని ఇవే ఆధారాలు.

కుండలు తయారీ విధానం