సివిల్ ఇంజనీరింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అంతర్గత నిర్మాణ నిపుణులు అయిన సిసర్ పెళ్ళి మరియు తోర్న్టన్-తోమసేట్టి మరియు రానహిల్ బెర్సేకుటు Sdn Bhd ఇంజనీర్స్ చే తయారుచేయ్యబడ్డ పెట్రోనాస్ కవల టవర్లు 1998 నుండి 2004 వరకు ప్రపంచంలో కెల్లా పొడవైన భవంతులు.

సివిల్ ఇంజనీరింగ్ అనేది వంతెనలు, రహదారులు, కాలువలు, ఆనకట్టలు మరియు భవంతులు వంటి భౌతిక మరియు సహజంగా నిర్మించిన పర్యావరణం యొక్క నమూనా, నిర్మాణం మరియు నిర్వహణలను చేపట్టే ఒక వృత్తి నైపుణ్య ఇంజనీరింగ్ విభాగం.[1][2][3] సివిల్ ఇంజనీరింగ్, సైనిక ఇంజనీరింగ్ తరువాత పాతది అయిన ఇంజనీరింగ్ విభాగం[4] మరియు ఇది సైనికేతర ఇంజనీరింగ్ ను సైనిక ఇంజనీరింగ్ నుండి వేరు చేసి చూపటానికి నిర్వచించబడింది.[5] ఇది సంప్రదాయబద్దంగా అనేక ఉపశాఖలుగా విభజింపబడింది, అవి పర్యావరణ ఇంజనీరింగ్, భూసాంకేతిక ఇంజనీరింగ్, నిర్మాణపరమైన ఇంజనీరింగ్, రవాణా ఇంజనీరింగ్, మున్సిపల్ లేదా పట్టణ ఇంజనీరింగ్, నీటి వనరుల ఇంజనీరింగ్, పదార్దాల ఇంజనీరింగ్, తీర ప్రాంత ఇంజనీరింగ్, [4] సర్వేయింగ్, మరియు నిర్మాణాల ఇంజనీరింగ్.[6] సివిల్ ఇంజనీరింగ్ అన్ని స్థాయిల్లో కూడా జరుగుతుంది: ప్రజా విభాగంలో స్థానికం నుండి తద్వారా కేంద్ర స్థాయి వరకు మరియు ప్రైవేటు విభాగంలో ఒంటరి గృహ యజమానుల నుండి తద్వారా అంతర్జాతీయ సంస్థల వరకు ఉంటుంది.[ఉల్లేఖన అవసరం]

సివిల్ ఇంజనీరింగ్ వృత్తి యొక్క చరిత్ర[మార్చు]

స్కాట్లాండ్ లో ఉన్న ఫ్లాక్రిక్ చక్రం.

మానవ మనుగడ యొక్క ప్రారంభం నుండి కూడా ఇంజనీరింగ్ అనేది జీవితంలో ఒక భాగం అయిపోయింది. సివిల్ ఇంజనీరింగ్ అనేది దాదాపుగా 4000 మరియు 2000 BC మధ్య పురాతన ఈజిప్ట్ మరియు మేసోపోటమియా లలో మానవులు ఒక సంచార పరమైన మనుగడను వదిలివెయ్యటం మొదలుపెట్టినప్పుడు, అందువల్ల ఒక ఆశ్రయం నిర్మించుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు మొదలయ్యింది అని పరిగణించబడింది. ఈ సమయంలో, రవాణా చాలా ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకున్నది, ఫలితంగా చక్రం మరియు ఓడ ప్రయాణం అభివృద్ధి చెందాయి. ఈజిప్ట్ లోని పిరమిడ్ల నిర్మాణం (సిర్కా 2700-2500 BC) పెద్ద ఆకార నిర్మాణాల యొక్క మొదటి సంఘటనగా పరిగణించబడింది. ఇతర పురాతన చారిత్రిక సివిల్ ఇంజనీరింగ్ నిర్మాణాలు పురాతన గ్రీస్లో ఇక్తినోస్ చే నిర్మించబడిన పర్తేనోన్ (447-438 BC), రోమన్ ఇంజనీర్స్ చే నిర్మించబడిన అప్పియన్ మార్గం (c. 312 BC), చిన్ చక్రవర్తి అయిన షిహ్ హుంగ్ టి ఆదేశాల మేరకు జనరల్ మెంగ్ టిన్ చే నిర్మించబడిన గ్రేట్ వాల్ ఆఫ్ చైనా (c. 220 BC) మొదలైనవి ఉన్నాయి.[6] రోమన్లు వారి సామ్రాజ్యం అంతటా సివిల్ నిర్మాణాలను అభివ్రుది చేసారు, వాటిలో ముఖ్యంగా నీటి రవాణా మార్గాలు, ద్వీపకల్పం లాంటి నిర్మాణం, ఓడరేవులు, వంతెనలు, ఆనకట్టలు మరియు రహదారులు ఉన్నాయి.

ఆధునిక కాలాల వరకు సివిల్ ఇంజనీరింగ్ మరియు అంతర్గత నిర్మాణం మధ్య స్పష్టమైన వైవిధ్యం లేదు మరియు ఇంజనీర్ మరియు ఆర్కిటెక్ట్ అనే పదాలు ముఖ్యంగా ఒకే వ్యక్తిని సూచించే భౌగోళిక వైవిధ్యాలు, ఇవి తరచుగా ఒక దానికి బదులు ఇంకొకటి వాడబడేవి.[7] 18వ శతాబ్దంలో సివిల్ ఇంజనీరింగ్ అనే పదం వాడుక దానిని సైనిక ఇంజనీరింగ్ నుండి వేరు చెయ్యటానికి గాను మొదలయ్యింది.[5]

ఆర్కిమెడెస్ స్క్రూ చేతితో నడుపబడుతుంది మరియు సమర్ధంగా నీటిని ఇస్తుంది.

మొదటిగా సొంతంగా అధికారికంగా ప్రకటించుకున్న సివిల్ ఇంజనీర్ జాన్ స్మేటన్, ఇతను ఎడ్డిస్టోన్ లైట్హౌస్ను నిర్మించాడు.[4][6] 1771లో స్మేటన్ తన సహచరులు కొంతమందితో స్మితోనియన్ సొసైటీ అఫ్ సివిల్ ఇంజినీర్స్ ను స్థాపించాడు, వీరు రాత్రి భోజనం తరువాత అనధికారికంగా కలిసిన వృత్తి నాయకుల యొక్క ఒక సమూహం. కొన్ని సాంకేతిక సమావేశాలు జరిగినట్టు సాక్ష్యం ఉన్నప్పటికీ ఇది ఒక సాంఘిక సమితి కంటే కొంచం పెద్దది.

1818లో సివిల్ ఇంజినీర్స్ యొక్క సంస్థ లండన్లో స్థాపించబడింది మరియు 1820 లో ప్రసిద్ధ ఇంజనీర్ థోమస్ తెల్ఫోర్డ్ దాని యొక్క మొదటి అధ్యక్షుడు అయ్యాడు. ఈ సంస్థ 1828లో సివిల్ ఇంజనీరింగ్ ను ఒక వృత్తి వలె అధికారికంగా గుర్తిస్తున్నట్టు ఒక రాజ అధికార ధృవపత్రాన్ని పొందింది. దాని యొక్క ధృవపత్రం సివిల్ ఇంజనీరింగ్ ను ఈ విధంగా నిర్వచించింది

the art of directing the great sources of power in nature for the use and convenience of man, as the means of production and of traffic in states, both for external and internal trade, as applied in the construction of roads, bridges, aqueducts, canals, river navigation and docks for internal intercourse and exchange, and in the construction of ports, harbours, moles, breakwaters and lighthouses, and in the art of navigation by artificial power for the purposes of commerce, and in the construction and application of machinery, and in the drainage of cities and towns.[8]

సంయుక్త రాష్ట్రాలలో మొదటగా సివిల్ ఇంజనీరింగ్ ను బోధించిన ప్రైవేటు కళాశాల కెప్టెన్ అల్దేన్ పాట్రిడ్జ్ చే 1819లో స్థాపించబడిన నోర్విచ్ విశ్వవిద్యాలయం.[9]. సంయుక్త రాష్ట్రాలలో సివిల్ ఇంజనీరింగ్ లో మొదటి పట్టా 1835లో రెంస్సేలేర్ పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్ చే ఇవ్వబడింది.[10] అలాంటి పట్టా మొదటిసారి ఒక స్త్రీకి అనగా నోర స్తన్టన్ బ్లాత్చ్కి 1905లో కార్నెల్ విశ్వవిద్యాలయం చే ఇవ్వబడింది.[ఉల్లేఖన అవసరం]

సివిల్ ఇంజనీరింగ్ శాస్త్రం యొక్క చరిత్ర[మార్చు]

పాంట్ డు గార్డ్, ఫ్రాన్సు, ఒక రోమన్ కాలువ నిర్మిత సిర్కా 19 BC.

సివిల్ ఇంజనీరింగ్ అనేది భౌతిక మరియు శస్స్త్రీయ నియమాల యొక్క వినియోగం మరియు చరిత్ర మొత్తం భౌతికశాస్త్రం మరియు సంఖ్యాశాస్త్రంలను అర్ధంచేసుకోవటంలో వచ్చిన పురోగతితో దాని యొక్క చరిత్ర చాలా దగ్గరగా అనుసంధానం అయి ఉంది. పలు వైవిధ్యమైన ప్రత్యేకత కలిగిన ఉప విభాగాలతో పాటుగా సివిల్ ఇంజనీరింగ్ ఒక విస్తారమైన పరిధి కలిగిన వృత్తి కావటం వలన దాని యొక్క చరిత్ర నిర్మాణాలు, పదార్ధాల శాస్త్రం, భూగోళశాస్త్రం, జియాలజీ, మట్టి, జలశాస్త్రం, పర్యావరణం, పని చెయ్యు విధానం మరియు ఇతర విభాగాల యొక్క జ్ఞానంతో అనుసంధానం అయి ఉంటుంది.

పురాతన మరియు మెడీవల్ చరిత్ర మొత్తం కూడా చాలా అంతర్గత నమూనా మరియు నిర్మాణం రాళ్ళు కొట్టేవారు మరియు వడ్రంగులు వంటి కళాకారులచే ప్రధాన నిర్మాణకారి పాత్ర వరకు ఎదగటం ద్వారా చెయ్యబడింది. జ్ఞానం వృత్తి సంఘాలలో ఉంచబడుతుంది మరియు తరచుగా పురోగతులతో భర్తీ చెయ్యబడుతుంది. అప్పటిలో మనుగడలో ఉన్న నిర్మాణాలు, రహదారులు మరియు అంతర్గత నిర్మాణం వంటివి మరలా మరలా వచ్చేవి మరియు స్థాయిలో పెరుగుదలలు ప్రోత్సాహకాలు.[11]

తేలటం గురించి మన యొక్క అవగాహనకు మూలం అయిన ఆర్కిమెడిస్ సూత్రం మరియు ఆర్కిమెడిస్ యొక్క పరీక్ష వంటి ఆచరణాత్మక పరిష్కారాలు కలిగి ఉన్న 3వ శతాబ్దం BC లో ఆర్కిమెడిస్ యొక్క పరిశోధన సివిల్ ఇంజనీరింగ్ కి ఆపాదించ తగిన విధంగా భౌతిక మరియు సంఖ్యాశాస్త్ర సమస్యలకి శాస్త్రీయ అవలంబన యొక్క ముందు ఉదాహరణలలో ఒకటి. ఒక భారతీయ సంఖ్యాశాస్త్ర నిపుణుడు అయిన బ్రహ్మగుప్త 7వ శతాబ్దం ADలో డొల్ల అయిన (పరిమాణం) కంప్యుటేషన్స్ కోసం హిందూ-అరబిక్ సంఖ్యల ఆధారితమైన బీజ గణితాన్ని ఉపయోగించాడు.[12]

సివిల్ ఇంజనీర్[మార్చు]

విద్య మరియు ఉత్తరువు పొందటం[మార్చు]

లండన్ లోని సివిల్ ఇంజనీర్స్ యొక్క సంస్థ ప్రధాన కార్యాలయం

సివిల్ ఇంజనీర్లు సంక్లిష్టంగా సివిల్ ఇంజనీరింగ్ ను ఒక ప్రధానాంశంగా కలిగి ఉన్న ఒక విద్యాపరమైన పట్టాను కలిగి ఉంటారు. అలాంటి ఒక పట్టా కోసం చే అధ్యయనం యొక్క కాలం సాధారణంగా మూడు నుండి ఐదు సంవత్సరాలు ఉంటుంది మరియు పూర్తయిన పట్టా సాధారణంగా ఇంజనీరింగ్ పట్టబధ్రుడుగా గుర్తించబడుతుంది, అయితే కొన్ని విశ్వవిద్యాలయాలు మాత్రం ఈ పట్టాను శాస్త్రంలో పట్టబద్రులు అని గుర్తిస్తాయి. ఆ పట్టా సాధారణంగా భౌతికశాస్త్రం, సంఖ్యాశాస్త్రం, ప్రాజెక్ట్ నిర్వహణ, నమూనా మరియు సివిల్ ఇంజనీరింగ్ లో నిర్దిష్ట అంశాలను కలిగి ఉన్న విభాగాలను కలిగి ఉంటుంది. ప్రాధమికంగా అలాంటి అంశాలు అన్నింటినీ కాకపోయినా చాలా సివిల్ ఇంజనీరింగ్ యొక్క ఉప విభాగాలను సాధ్యమైనంత వరకు కలిగి ఉంటాయి. అప్పుడు విద్యార్థులు పట్టా చివరికి వచ్చే నాటికి ప్రత్యేక నైపుణ్యం పొందటానికి ఒకటి లేదా అంత కంటే ఎక్కువ ఉప విభాగాలను ఎంపిక చేసుకుంటారు.[13] అయితే అండర్ గ్రాడ్జుఎట్ (BEng/BSc) పట్టా సాధారణంగా విజయవంతమైన విద్యార్థులకి పరిశ్రమ ఆమోదించే అర్హతను అందిస్తుంది, కొన్ని విశ్వవిద్యాలయాలు పోస్ట్ గ్రాడ్జుఎట్ పట్టాలను కూడా అందిస్తున్నాయి (MEng/MSc) ఇవి విద్యార్థులు ఇంజనీరింగ్ లో తమకు ఆసక్తి కల నిర్దిష్ట విభాగంలో ఇంకా నైపుణ్యాన్ని సాధించటానికి అనుమతిస్తాయి.[14]

చాలా దేశాలలో ఇంజనీరింగ్ లో బ్యాచిలర్స్ పట్టా వృత్తి నైపుణ్య ధృవీకరణపత్రం పొందటానికి మొదటి మెట్టును సూచిస్తుంది మరియు ఆ డిగ్రీ కార్యక్రమం కూడా ఒక వృత్తి నైపుణ్య సంస్థచే ధృవీకరించబడుతుంది. ఒక ధృవీకరించబడిన డిగ్రీ కార్యక్రమ పూర్తి చేసిన తరువాత ధృవీకరణ పత్రం పొందటానికి ముందు ఇంజనీర్ తప్పనిసరిగా అవసరాల యొక్క ఒక స్థాయిని సంతృప్తి పరచాలి (పనిచేసిన అనుభవం మరియు పరీక్ష అవసరాలు) ఒకసారి ధృవీకరణ పత్రం పొందిన తరువాత ఆ ఇంజనీర్ వృత్తి నైపుణ్య కలిగిన ఇంజనీర్ (సంయుక్త రాష్ట్రాలు, కెనడా మరియు దక్షిణాప్రికా లలో), అధికార పత్రం పొందిన ఇంజనీర్ (చాలా మటుకు కామన్ వెల్త్ దేశాలలో), అధికార పత్రం పొందిన వృత్తి నైపుణ్య కలిగిన ఇంజనీర్ (ఆస్ట్రేలియా మరియు న్యూజీలాండ్ లలో) లేదా యూరోపియన్ ఇంజనీర్ (చాలా మటుకు యూరోపియన్ యూనియన్ లో) అని పిలువబడతాడు. సంబంధిత వృత్తి పరమైన సంతలు ఏవైతే ఇంజనీర్లను అంతర్జాతీయ సరిహద్దులలో ఆచరణ చెయ్యటానికి అనుమతించే విధంగా తయారు చెయ్యబడ్డాయో వాటి మధ్య అంతర్జాతీయ ఇంజనీరింగ్ ఒప్పందాలు ఉంటాయి.

ప్రదేశాన్ని బట్టి ధృవీకరణ పత్రం యొక్క ఉపయోగాలు మారుతూ ఉంటాయి. ఉదాహరణకి, సంయుక్త రాష్ట్రాలు మరియు కెనడాలో "కేవలం ఉత్తర్వు కలిగిన ఇంజనీర్ మాత్రమే అనుమతి పొందటానికి సంతకం చేసి మరియు కవరులో పెట్టిన ఇంజనీరింగ్ ప్రణాళికలు మరియు చిత్రాలను ఒక ప్రభ్త్వ అధికారికి సమర్పించాగలదు లేదా ప్రభుత్వ మరియు ప్రైవేటు కక్షిదారులకి ఇంజనీరింగ్ పనులను అందించగలడు".[15] ఈ అవసరం క్వేబెక్స్ ఇంజనీర్స్ చట్టం వంటి రాష్ట్ర మరియు దేశ చట్టాలచే బలబంతం చెయ్యబడుతుంది.[16] ఇతర దేహాలలో ఇలాంటి చట్టాలు మనుగడలో లేవు. ఆస్ట్రేలియాలో, ఇంజనీర్లకి రాష్ట్ర ఉత్తర్వులు ఇవ్వటం అనేది క్వీన్స్లాండ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితం అయ్యింది. ముఖ్యంగా అన్ని అధికారిక ధృవీకరణ ఇచ్చే సంస్థలు కూడా వెడలగొట్టే అపాయానికి లేదా ద్వారా సభ్యులు అందరూ కట్టుబడి ఉండాలని తాము ఆశిస్తున్నామని చెప్పే ఒక నైతిక సంకేతాన్ని నిర్వహిస్తారు.[17] ఈ మార్గంలో వృత్తి కొరకు నైతిక ప్రమాణాలను నిర్వహించటంలో సంస్థలు ఒక ముఖ్య పాత్రను పోషిస్తాయి. పని పై దృవీకరణ పత్రం యొక్క తక్కువ లేదా అసలు చట్ట భోరోసా లేని న్యాయస్థాన పరిధులలో కూడా ఇంజనీర్లు ఒప్పంద చట్టానికి లోబడి ఉండాలి. ఇంజనీర్ యొక్క పని పరాజయం పాలైనప్పుడ్డు అతను లేదా ఆమె నిర్లక్ష్యం చూపిన నేరానికి శిక్షింపబడవచ్చు మరియు మరింత జటిలమైన విషయాలలోనేరపరమైన నిర్లక్ష్యంనకు బాధ్యత వహించవచ్చు.[ఉల్లేఖన అవసరం] ఒక ఇంజనీర్ యొక్క పని పర్యావరణ చట్టానికి సంబంధించి భవంతి నియమాలు మరియు చట్టం వంటి చాలా ఇతర నియమాలు మరియు సంస్కరణలకి లోబడి ఉండాలి.

వృత్తిపరమైన జీవితం[మార్చు]

సివిల్ ఇంజనీర్లకి ఒక సంక్లిష్ట వృత్తి జీవన మార్గం అంటూ ఏమీ లేదు. చాలా మంది ఇంజనీరింగ్ పట్టభద్రులు తక్కువ బాధ్యత ఉన్న ఉద్యోగాలతో మొదలుపెడతారు మరియు వారు తమ సామర్ధ్యాన్ని నిరూపించుకున్నాక ఇంకా ఇంకా ఎక్కువ బాధ్యత కల పనులను ఇవ్వబడతారు కానీ సివిల్ ఇంజనీరింగ్ యొక్క ప్రతీ ఉపశాఖలో మరియు ప్రతీ విభాగంలో ఉన్న మార్కెట్టు యొక్క వివిధ విభాగాలలో ఒక వృత్తి జీవన మార్గం యొక్క వివరాలు మారిపోవచ్చు. కొన్ని విభాగాలు మరియు సంస్థలలో ప్రవేశ స్థాయి ఇంజనీర్లు ప్రాధమికంగా పని జరిగే స్థలంలో నిర్మాణాన్ని పర్యవేక్షించటానికి నియమించబడతారు, చాలా అనుభావన్ ఉన్న నమూనా ఇంజనీర్లకి "కళ్ళు మరియు చెవులు" వలె సేవలు అందిస్తారు; అయితే ఇతర విభాగాల్లో ప్రవేశ స్థాయి ఇంజనీర్లు విశ్లేషణ లేదా నమూనా మరియు వివరణ పలుమార్లు వచ్చే విషయాలను చేస్తూ ఆగిపోతారు. చాలా మంది సీనియర్ ఇంజనీర్లు మరింత సంక్లిష్టమైన విశ్లేషణ లేదా నమూనా పనిలోకి లేదా మరింత సంక్లిష్టమైన నమూనా ప్రాజెక్టుల యొక్క నిర్వహణ లేదా ఇతర ఇంజనీర్ల నిర్వహణ లేదా ఫోరెన్సిక్ ఇంజనీరింగ్ వంటి ప్రత్యేకమైన సంప్రదింపులు లలోకి వెళ్ళవచ్చు.

ఉప విభాగాలు[మార్చు]

సాధారణంగా సివిల్ ఇంజనీరింగ్ గొప్ప ప్రపంచంతో మానవ నిర్మిత స్థిర ప్రాజెక్టుల యొక్క మొత్తం అనుసంధానంతో సంబంధం కలిగి ఉంటుంది. సాధారణ సివిల్ ఇంజనీర్లు నమూనా తయారీ, విభాగన, ముర్గు కాలువలు, కాలి బాట, నీరి సరఫరా, మురుగు సేవ, విద్యుత్పర మరియు సమాచారాల సరఫరా మరియు భూ విభజనలు చెయ్యటం ద్వారా వారికి కేటాయించబడ్డ స్థలం, సంఘం మరియు భూభాగంలలో అమరి మరి సేవలు అందించటానికి సర్వేయర్లు మరియు ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన సివిల్ ఇంజనీర్లతో దగ్గరగా పనిచేస్తారు. సాధారణ ఇంజనీర్లు చాలా మటుకు సమయాన్ని ప్రాజెక్ట్ స్థలాలు సందర్శిస్తూ, సంఘం స్థితులను అభివృద్ధి చేస్తూ మరియు నిర్మాణ ప్రణాళికలను తయారు చేస్తూ గడిపేస్తారు. సాధారణ సివిల్ ఇంజనీరింగ్, స్థల ఇంజనీరింగ్ అని కూడా పిలువబడుతుంది, ఇది స్థలంలో కొంత భాగాన్ని ఒక వినియోగం నుండి మరొక దానికి మార్చటం పై ప్రాధమికంగా దృష్టి పెట్టే సివిల్ ఇంజనీరింగ్ యొక్క ఒక విభాగం. సివిల్ ఇంజనీర్స్ అన్ని పరిమాణాలలో మరియు అన్ని స్థాయిలలో ఉన్న నివాసయోగ్యమైన, వాణిజ్య, పారిశ్రామిక మరియు ప్రజా పనుల ప్రాజెక్టుల నిర్మాణంలో సంక్లిష్టంగా భూసాంకేతిక ఇంజనీరింగ్, పర్యావరణ ఇంజనీరింగ్, రవాణా ఇంజనీరింగ్ మరియు నిర్మాణ ఇంజనీరింగ్ ల నియమాలను వినియోగిస్తారు.

తీరప్రాంత ఇంజనీరింగ్[మార్చు]

తీరప్రాంత ఇంజనీరింగ్ తీర ప్రాంతాల నిర్వహణతో సంబంధం కలిగి ఉంటుంది. కొన్ని చట్ట పరిధులలో సముద్ర రక్షణ మరియు తీరం రక్షణ అనే పదాలు వరద మరియు హరించుకుపోవటంల నుండి రక్షణ కొరకు వరుసగా వినియోగించాబడతాయి. తీరం రక్షణ అనే పదం చాలా సంప్రదాయ పదం కానీ తీరం నిర్వహణ అనే పదం మాత్రం భూమిని దక్కించుకోవటానికి భూమి హరించుకుపోవటాన్ని అనుమతించే పద్ధతులను కలిగి ఉండటానికి ఈ విభాగం విస్తరించినప్పుడు చాలా ప్రసిద్ధి చెందింది.

పలు అపార్ట్మెంట్ విభాగాలకి నిర్మాణాలను నిర్మించటం.

నిర్మాణ ఇంజనీరింగ్[మార్చు]

నిర్మాణ ఇంజనీరింగ్ రవాణా, భూభాగం అభివృద్ధి, ద్రవ సంబంధమైన, పర్యావరణ, నిర్మాణ మరియు భూసాన్కేతిక ఇంజనీర్ల నుండి ప్రణాళికా రచన మరియు అమలును కలిగి ఉంటుంది. ఇతర సివిల్ ఇంజనీరింగ్ సంస్థల కంటే నిర్మాణ సంస్థలు అధిక వ్యాపార అపాయాలను కలిగి ఉండటం వలన చాలా మంది నిర్మాణ ఇంజనీర్లు ఎక్కువగా వ్యాపారం స్వాభావం కలిగి ఉన్న పాత్రను పోషిస్తారు: ఒప్పందాలను తయారు చెయ్యటం మరియు సరి చూడటం, తర్కపరమైన చర్యలను సరి చూడటం మరియు అవసరమైన సరఫరాల యొక్క ధరలను దగ్గరి నుండి నియంత్రించటం.

భూకంప ఇంజనీరింగ్[మార్చు]

భూకంప ఇంజనీరింగ్ నిర్దిష్ట ప్రదేశంలో అపాయకర భూకంపాలు వచ్చినప్పుడు తట్టుకొనే విధంగా ఉన్న వివిధ నిర్మాణాల గురించి చెబుతుంది.

భూకంపాలను తట్టుకొనే మరియు సామూహిక పిరమిడ్ El కాస్తిల్లో, చిచెన్ ఇట్జా

భూకంప ఇంజనీరింగ్ అనేది నిర్మాణ ఇంజనీరింగ్ యొక్క విస్తారమైన విభాగంలో ఒక ఉపవిభాగం. భూకంప ఇంజనీరింగ్ యొక్క ముఖ్యాంశాలు:[ఉల్లేఖన అవసరం]

భూకంప ఇంజనీరింగ్ నిర్మాణం చాలా బలంగా లేదా ఖరీదైనదిగా ఉండాలి అనేమీ లేదు, ఉదా:, పైన చూపిన చిచెన్ ఇట్జా వద్ద ఉన్న ఎల్ కస్టిల్లో పిరమిడ్.[original research?]

ఇప్పుడు, భూకంప ఇంజనీరింగ్లో శక్తివంతమైన మరియు బడ్జెట్ పరిధిలో ఉన్న పరికరం ఏంటంటే భరించే నిర్మాణ ప్రకంపన నియంత్రణ సాంకేతిక పరిజ్ఞానాలకి సంబంధించిన ప్రాధమిక వెలికితీత.[ఉల్లేఖన అవసరం]

పర్యావరణ ఇంజనీరింగ్[మార్చు]

ఒక ఫిల్టర్ బెడ్, మురుగునీటి చికిత్సలో ఒక భాగం.

పర్యావరణ ఇంజనీరింగ్ అనేది రసాయన, జీవపరమైన మరియు/లేదా ఉష్ణ వ్యర్ధాలు, నీరు మరియు గాలిని సుడి చెయ్యటం మరియు ఇంతకూ ముందు వ్యర్ధాలను పడివెయ్యటం లేదా అవాంఛిత కాలుష్యం వలన కలుషితం అయిన ప్రదేశాలను సరి చెయ్యటం వంటి పనులను చేస్తుంది. పర్యావరణ ఇంజనీరింగ్ పరిధిలోకి వచ్చే అంశాలలో కాలుష్య కారకాల రవాణా, నీటిని శుద్ధి చెయ్యటం, మురుగి నీటి నిర్వహణ, వాయు కాలుష్యం, ఘన వ్యర్ధాల నిర్వహణ మరియు హానికర వ్యర్ధాల నిర్వహణ వంటివి ఉన్నాయి. పర్యావరణ ఇంజనీర్లు కాలుష్యం తగ్గించటం, హరిత ఇంజనీరింగ్ మరియు పారిశ్రామిక ఎకాలజీలతో నిమగ్నం అవ్వవచ్చు. పర్యావరణ ఇంజనీరింగ్ సూచించబడిన చర్యల యొక్క పర్యావరణ ఫలితాల యొక్క సమాచారాన్ని సేకరించటం మరియు నిర్ణయం తీసుకొనే విధానంలో సమాజానికి మరియు ప్రణాళిక తయారీదారులకు సహకరించేందుకు సూచించబడిన చర్యల యొక్క ప్రభావాలను అంచనా వెయ్యటం కూడా చేస్తుంది.

పర్యావరణ ఇంజనీరింగ్ అనేది శుభ్రత సంబంధిత ఇంజనీరింగ్ అనే పదానికి సమకాలీన పదం, అయితే సంప్రదాయకంగా శుభ్రత సంబంధిత ఇంజనీరింగ్, అపాయకర వ్యర్దాల నిర్వహణ మరియు పర్యావరణ పరిరక్షణ పనులను పర్యావరణ ఇంజనీరింగ్ చెప్పట్టే అంతలా చెయ్యదు. ప్రజా ఆరోగ్య ఇంజనీరింగ్ మరియు పర్యావరణ ఆరోగ్య ఇంజనీరింగ్ అనే పదాలు వాడుకలో ఉన్న మరికొన్ని ఇతర పదాలు.

భూసాంకేతిక ఇంజనీరింగ్[మార్చు]

ఏ స్లాబ్-ఆన్-గ్రేడ్ ఫౌండేషన్

భూసాంకేతిక ఇంజనీరింగ్ అనేది సివిల్ ఇంజనీరింగ్ వ్యవస్థలు మద్దతు పొందుతున్న రాళ్ళు మరియు ఇసుక లతో సంబంధం కలిగి ఉన్న సివిల్ ఇంజనీరింగ్ యొక్క విభాగం. జియాలజీ, పదార్దాల శాస్త్రం మరియు పరీక్షించటం, పని చేసే విధానం మరియు ద్రవ సంబంధిత శాస్త్రం యొక్క విభాగాల నుండి వచ్చిన జ్ఞానం జాగ్రత్తగా మరియు తక్కువ ఖర్చులో పునాదులు తయారు చెయ్యటానికి, గోడలను ఉంచటానికి మరియు అలాంటి నిర్మాణాల కోసం భూసాంకేతిక ఇంజనీర్లచే వినియోగించబడుతుంది. భూగర్భ జలాలు మరియు వ్యర్దాల తొలగింపులకి సంబంధించిన పర్యావరణ పరిగణలు భూపర్యావరణ ఇంజనీరింగ్ అనే నూతన విభాగ కల్పనకు దారి తీసాయి, ఇందులో రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రాలు ముఖ్యమైనవి.[18][19]

భూసాంకేతిక ఇంజనీరింగ్ యొక్క కొన్ని ప్రత్యేక కస్టాలు మట్టి యొక్క వైవిధ్యం మరియు లక్షణాల వలన వస్తాయి. సరిహద్దు నియమాలు అనేవి తరచుగా సివిల్ ఇంజనీరింగ్ యొక్క ఇతర విభాగాల్లో బాగా నిర్వచించబడతాయి కానీ మట్టితో ఈ నియమాలను నిర్వచించటం అనేది అసాధ్యం. మట్టి యొక్క వైవిధ్యం మరియు పరిమిత పరిశోధన వలన మట్టి యొక్క పదార్డ లక్షణాలు మరియు ప్రవర్తనను కూడా అంచనా వెయ్యటం కష్టం. ఇది సివిల్ ఇంజనీరింగ్ యొక్క ఇతర విభాగాలలో ఉపయోగించబడే ఉక్కు మరియు కాంక్రీట్ల యొక్క బాగా నిర్వచించబడిన పదార్ద లక్షణాలతో విభేదిస్తుంది. మట్టి పని చేసే విధానం, మట్టి యొక్క ప్రవర్తనను నిర్వచిస్తుంది, ఇది పరిమాణ మార్పు, ఒత్తిడి-అలసట భాన్దవ్యం మరియు బలం వంటి ఒత్తిడి ఆధారిత పదార్ద లక్షణాల వలన సంక్లిష్టంగా ఉంటుంది.[18]

నీటి వనరుల ఇంజనీరింగ్[మార్చు]

హూవెర్ ఆనకట్ట

నీటి వనరుల ఇంజనీరింగ్ నీటి సేకరణ మరియు నిర్వహణలతో సంబంధం కలిగి ఉంది (ఒక సహజ వనరు వలె). అందువల్ల అది ఒక క్రమశిక్షణ వలె హైడ్రాలజీ, పర్యావరణ శాస్త్రం, మెటియోరోలోజి, జియాలజీ, పరిరక్షణ మరియు వనరుల నిర్వహణ వంటి వాటిని మిళితం చేస్తుంది. సివిల్ ఇంజనీరింగ్ లోని ఈ విభాగం భూగర్భ నీటి (ఆక్విఫెర్స్) మరియు నేల పై ఉన్న నీటి (సరస్సులు, నదులు మరియు ప్రవాహాలు) వనరుల రెండింటి యొక్క నాణ్యత మరియు పరిమాణం లను అంచనా వెయ్యటం మరియు నిర్వహించటంలతో సంబంధం కలిగి ఉంటుంది. నీటి వనరుల ఇంజనీర్లు చాలా పెద్ద భూభాగాలను వాటి లోకి, ద్వారా లేదా ఆ సౌకర్యం లేనప్పుడు అవి ఎంత మొత్తం నీరు కలిగి ఉన్నాయి అని అంచనా వెయ్యటానికి విశ్లేషిస్తారు మరియు నమూనా తయారుచేస్తారు. అయితే ఈ సౌకర్యం యొక్క అసలైన నమూనా ఇతర ఇంజనీర్ల కోసం వదిలి వెయ్యబడుతుంది. హైడ్రాలిక్ ఇంజనీరింగ్ ద్రవాలు, ముఖ్యంగా నీటి యొక్క ప్రవాహం మరియు అందచెయ్యటంలతో సంబంధం కలిగి ఉంటుంది. సివిల్ ఇంజనీరింగ్ లో ఈ విభాగం పైపులైన్ల యొక్క నమూనా, నీటి సరఫరా వ్యవస్థలు, మురుగుకాలవల సౌకర్యాలు (వారధులు, ఆనకట్టలు, జల సంధులు, చిన్న కాలువల పై ఉన్న వంతెనలు, నది చుట్టూ ఉన్న ప్రహారీ, తుఫాను నీటిని గ్రహించేవి) మరియు కాలువలు మొదలైనవాటితో చాలా దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. హైడ్రాలిక్ ఇంజనీర్లు ఈ సౌకర్యాలను ఇతరులలో ద్రవ ఒత్తిడి, ద్రవ నిలకడత్వం, ద్రవ డైనమిక్స్, మరియు హైడ్రాలిక్స్ యొక్క విధానాలను ఉపయోగించి తయారు చేస్తారు.

పదార్ధాల ఇంజనీరింగ్[మార్చు]

పదార్ధాల శాస్త్రం అనేది సివిల్ ఇంజనీరింగ్ యొక్క మరొక కోణం. పదార్ధాల ఇంజినీరింగ్ సేరమిక్స్ అయిన కాంక్రీట్, మిక్స్ అస్ఫల్ట్ కాంక్రీట్, పెంచిన బలం చుట్టూ కేంద్రీకృతమయ్యే ఖనిజాలు, అల్యూమినియం మరియు ఉక్కు వంటి ఖనిజాలు మరియు పాలీమిథైల్మేతక్ర్యలేట్ (PMMA) మరియు కార్బన్ ఫైబర్లు వంటి పాలీమర్లు మొదలైనవాటి గురించి చెబుతుంది.

కట్టడాల ఇంజనీరింగ్[మార్చు]

బుర్జ్ దుబాయ్, ప్రపంచపు ఎత్తైన భవంతి, ప్రస్తుతం దుబాయ్ లో నిర్మాణంలో ఉంది
Suspension bridge between two brick built towers, over a wooded gorge, showing mud and water at the bottom. In the distance are hills.
క్లిఫ్టన్ వేలాడే ఆనకట్ట, ఇసంబార్డ్ కింగ్దొం బృనేల్ చే బ్రిస్టల్, UK లో తయారుచెయ్యబడింది.

నిర్మాణ ఇంజనీరింగ్ అనేది నిర్మాణ నమూనా మరియు భవంతులు, ఆనకట్టలు, టవర్లు, ఫ్లయ్ఓవర్లు, సొరంగాలు, భూభాగేతర నిర్మాణాలు అయిన సముద్రంలోని చమురు మరియు వాయు విభాగాలు మరియు ఇతర నిర్మాణాల నిర్మాణ విశ్లేషణతో సంబంధం కలిగి ఉంది. ఇది నిర్మాణం పై పని చేసే బరువులను మరియు ఆ బరువుల వలన నిర్మాణంలో ఉద్భవించే బలాలు మరియు ఒత్తిడిలను గుర్తించటాన్ని మరియు ఈ బరువులను విజయవంతంగా తట్టుకొనే మరియు నివారించే నిర్మాణాన్ని తయారు చెయ్యటాన్ని కలిగి ఉంటుంది. ఆ బరువులు నిర్మాణాల యొక్క సొంత బరువులు, ఇతర జీవం లేని బరువులు, జీవం ఉన్న బరువులు, కదిలే (చక్రం) బరువు, గాలి బరువు, భూకంప బరువు, ఉష్ణోగ్రత మార్పు వలన వచ్చే బరువు మొదలైన వాటిని కలిగి ఉంటాయి. ఒక నిర్మాణ ఇంజనీర్ తమ వినియోగదారులకి భద్రంగా ఉండే విధంగా మరియు అవి నిర్మించటానికి గల కారణాన్ని విజయవంతంగా పూర్తి చేసే విధంగా (సేవలు అందించే విధంగా ఉండాలి) నిర్మాణాలను తయారు చెయ్యాలి. కొన్ని లోడింగ్ పరిస్థితుల యొక్క స్వభావం వలన నిర్మాణ ఇంజనీరింగ్ లో గాలి ఇంజనీరింగ్ మరియు భూకంప ఇంజనీరింగ్ వంటి ఉప శాఖలు ఉద్భవించాయి.

సామాగ్రి లేదా సొంత-బరువు వంటి కదలిక లేని బరువులు లేదా గాలి, సేసిమిక్ (భూకంప సంబంధితాలు), వ్యక్తుల సమూహాలు లేదా వాహనాల బరువులు వంటి డైనమిక్ విషయాలు లేదా తాత్కాలిక నిర్మాణ బరువులు లేదా ప్రభావాలు వంటి బదిలీ అయ్యే వాటికి సంబంధించి నమూనా పరిగణలు దారుడ్యం, దృఢత్వం మరియు నిర్మాణం యొక్క నిలకడను పరిగణలోకి తీసుకుంటాయి. ఇతర పరిగణలు ఖరీదు, నిర్మాణ అనుకూలత, భద్రత, సౌందర్యము మరియు భరించే సామర్ధ్యం మొదలైనవాటిని కలిగి ఉంటాయి.

భూమి కొలత పని[మార్చు]

ఇదాహోలో మొత్తం స్త్రీ సర్వేయింగ్ క్రూ, 1918

సర్వేయింగ్ అనే విధానంలో ఒక సర్వేయర్ సాధారణంగా భూ ఉపరితలం పై ఉండే నిర్దిష్ట కోణాలను కొలుస్తాడు. కొలవాతిని వాడే పరికరాలు అయిన స్థాయిలు మరియు తియోదోలైట్లు క్రమం తప్పిన కోణాన్ని, అడ్డంగా, నిలువుగా మరియు వాలుగా దూరాలను కచ్చితంగా కొలవటానికి వినియోగించాబడతాయి. కంప్యూటరైజేషన్, విద్యుత్ పరంగా దూరాన్ని కొలవటం (EDM), మొత్తం స్టేషన్లు, GPS సర్వేయింగ్ మరియు లేజర్ స్కానింగ్ లు (చాలా మటుకు బదులుగా వచ్చాయి) సంప్రదాయ దృష్టి సంబంధిత పరికరాలను భర్తీ చేసాయి. భూ ఉపరితల సమాచారాన్ని ఒక పటం నమూనా వలె రేఖాచిత్ర నమూనాలా మార్చటానికి ఈ సమాచారం చాలా ముఖ్యమైనది. అప్పుడు ఈ సమాచారం సివిల్ ఇంజనీర్లు, గుత్తేదారులు మరియు భూ వ్యాపారులచే కూడా నమూనా చెయ్యటం నుండి, నిర్మించటం మరియు వాణిజ్యం కోసం వరుసగా వినియోగించబడతాయి. ఒక భవంతి లేదా నిర్మాణం యొక్క భాగాలు సరైన ప్రమాణంలో ఉండాలి మరియు పరస్పర సంబంధాలు మరియు స్థల సరిహద్దులు మరియు ప్రక్కన ఉన్న నిర్మాణాలతో ఉన్న సంబంధాలు పరంగా సరైన స్థానంలో పెట్టబడాలి. సర్వేయింగ్ అనేది ప్రత్యేక అర్హతలు మరియు ఉతర్వు ఇచ్చే అమరికలు కలిగి ఉన్న ఒక వైవిధ్యమైన వృత్తి అయినప్పటికీ సివిల్ ఇంజనీర్లు సర్వేయింగ్ మరియు మాపింగ్, అదే విధంగా భౌగోళిక సమాచార వ్యవస్థలు యొక్క ప్రాధమిక విషయాలలో శిక్షణ ఇవ్వబాడతారు. కొలతలు తీసుకొనే వారు రైల్వే, ట్రంవే మార్గాలు, ప్రధాన రహదారులు, రహదారులు, పైపులైన్లు మరియు వీధులు యొక్క మార్గాలను కొలుస్తారు అదే విధంగా ఓడరేవులు వంటి ఇతర అంతర్గత నిర్మాణాల నిర్మాణానికి ముందు వాటి స్థానాన్ని కొలుస్తారు.

భూభాగాన్ని కొలవటం

సంయుక్త రాష్ట్రాలు, కెనడా, యునైటెడ్ కింగ్డం లలో మరియు చాలా కామన్వెల్త్ దేశాలలో దేశాలా భూభాగాన్ని కొలవటం అనేది ఒక వినూత్న వృత్తి వలె పరిగణించబడుతుంది. భూభాగాన్ని కొలిచే వారు ఇంజనీర్స్ గా పరిగణించబడరు మరియు తమ సొంత వృత్తి పరమైన సంఘాలు మరియు ఉత్తర్వు అవసరాలు కలిగి ఉంటారు. ఉత్తర్వు కలిగిన భూభాగ సర్వేయర్ యొక్క సేవలు సాధారణంగా సరిహద్దు కొలతలు తియ్యటానికి (చట్టబద్దమైన వివరణ ఉపయోగిస్తూ ఒక భాగం యొక్క సరిహద్దులను స్థాపించటానికి) మరియు ఉపవిభాగా ప్రణాళికలు (నూతన సరిహద్దు రేఖలను మరియు రహదారులను సూచించటానికి పెద్ద భాగం లోపల గీసిన సరిహద్దు రేఖలతో భూభాగం యొక్క ఒక భాగం కొలతల ఆధారంగా గీసిన ఒక రేఖాచిత్రం లేదా పటం) కోసం అవసరం అవుతాయి.

నిర్మాణాన్ని సర్వే చెయ్యటం

నిర్మాణాన్ని అనేది సాధారణంగా అందులో ప్రత్యేకంగా నిపుణులు అయిన వారిచే చెయ్యబడుతుంది. భూమిని కొలిచే వారిలా ఇందులో వచ్చే ప్రణాళిక చట్టబద్దతను కలిగి ఉండదు. నిర్మాణాన్ని కొలిచే వారు క్రింది పనులను చేస్తారు:

 • టోపోగ్రఫీ, మనుగడలో ఉన్న భవంతులు మరియు అంతర్గత నిర్మాణం మరియు ఎక్కడ సాధ్యమయితే అక్కడ భూగర్భ అంతర్గత నిర్మాణంలతో భవిష్యత్తులో పని చెయ్యు స్థలంలో అప్పటికే ఉన్న పరిస్థితులను సర్వ్ చెయ్యటం.
 • నిర్మాణాన్ని సరే చెయ్యటం (కాకపొతే "లేఔట్" లేదా "సెట్టింగ్ ఔట్") : తరువాత నిర్మాణం కోసం రహదారులు లేదా భవంతులు వంటి నూతన నిర్మాణాల యొక్క నిర్మాణానికి మార్నిర్దేశం చేసే సూచన గుర్తులు మరియు గుర్తులను గుర్తించటం.
 • నిర్మాణ సమయంలో నిర్మాణాల యొక్క ప్రదేశాన్ని పరీక్షించటం;
 • పూర్తయిన నిర్మాణాన్ని సర్వే చెయ్యటం: ఒక నిర్మాణం పూర్తయిన తరువాత అది ద్రువీకరించబడిన నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి చెయ్యబడింది లేదో తెలుసుకోవటానికి చేపట్టే ఒక సర్వే.

రవాణా ఇంజనీరింగ్[మార్చు]

రవాణా ఇంజనీరింగ్ ప్రజలను మరియు వస్తువులను సమర్ధంగా, జాగ్రత్తగా మరియు ఒక ప్రకంపిత సంఘానికి ఆమోదయోగ్యంగా కదిలించటంతో సంబంధం కలిగి ఉంటుంది. ఇది వీధులు, కాలువలు, ప్రధాన రహదారులు, రైల్ వ్యవస్థలు, విమానాశ్రయాలు, ఓడ రేవులు, మరియు సామూహిక రవాణా మొదలైనవాటి గురించి నిర్దిష్టంగా చెప్పటం, తయారుచెయ్యటం, నిర్మించటం మరియు రవాణా అంతర్గత నిర్మాణాన్ని నిర్వహించటం వంటివి కలిగి ఉంటుంది. ఇది వివిధ విభాగాలు అయిన రవాణా నమూనా, రవాణా ప్రణాళిక తయారీ, ట్రాఫిక్ ఇంజనీరింగ్, పట్టణ ఇంజనీరింగ్ యొక్క కొన్ని అంశాలు, క్యూఇంగ్ సిద్దాంతం, పేవ్మెంట్ ఇంజనీరింగ్, తెలివైన రవాణా వ్యవస్థ (ITS) మరియు అంతర్గాతనిర్మాణ నిర్వహణ మొదలైన వాటిని కలిగి ఉంటుంది.

మున్సిపల్ లేదా పట్టణ ఇంజనీరింగ్[మార్చు]

మున్సిపల్ ఇంజనీరింగ్ స్థానిక అంతర్గత నిర్మాణంతో సంబంధం కలిగి ఉంటుంది. ఇది వీధులు, పాదచారుల కోసం ప్రక్కన మార్గాలు, నీటి సరఫరా నెట్వర్కులు, భూగర్భ కాలువలు, వీధి దీపాలు, స్థానిక ఘన వ్యర్ధాల నిర్వహణ మరియు తొలగింపు, నిర్వహణ మరియు ప్రజా పనుల కోసం వినియోగించే భారీ మొత్తాలలో ఉన్న వివిధ పదార్ధాల నిల్వ (ఉప్పు, ఇసుక మొదలైనవి), ప్రజా పార్కులు మరియు సైకిలు మార్గాలు మొదలైనవాటి గురించి నిర్దిష్టంగా చెప్పటం, తయారుచెయ్యటం, నిర్మించటం మరియు నివహించటం లను చేస్తుంది. భూగర్భ వినియోగ నెట్వర్కులు విషయంలో ఇది విద్యుత్పరమైన మరియు సమాచార సాంకేతిక సేవల యొక్క స్థానిక పంపిణీ నెట్వర్కుల యొక్క సివిల్ భాగాన్ని (గొట్టాలు మరియు వినియోగ గదులు) కూడా కలిగి ఉంటుంది. ఇది వ్యర్ధాల సేకరణ మరియు బస్ సేవ నెట్వర్క్స్ లను అనుగుణంగా చెయ్యటాన్ని కూడా కలిగి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఈ విభాగాలలో కొన్ని ఇతర సివిల్ ఇంజనీరింగ్ ప్రత్యేకతల వలె ఉంటాయి, అయితే మున్సిపల్ ఇంజనీరింగ్ అంతర్గత నిర్మాణ నెట్వర్కులు మరియు సేవల యొక్క సామరస్యం పై దృష్టి పెడుతుంది ఎందుకంటె అవి తరచుగా ఒకే సారి నిర్మితం అవుతాయి మరియు ఒకే స్థానిక అధికారంచే నిర్వహింపబడతాయి.

సూచనలు[మార్చు]

 1. ది అమెరికన్ హెరిటేజ్ డిక్షనరీ ఆఫ్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్, నాలుగవ కూర్పు. హౌఘ్టన్ మిఫ్ఫ్లిన్ కంపెనీ, 2004. [1] (వినియోగం: 2007-08-08).
 2. "History and Heritage of Civil Engineering". ASCE. మూలం నుండి 2016-04-07 న ఆర్కైవు చేసారు. Retrieved 2007-08-08.
 3. "Institution of Civil Engineers What is Civil Engineering" (PDF). ICE. మూలం నుండి 2006-09-23 న ఆర్కైవు చేసారు (PDF). Retrieved 2007-09-22.
 4. 4.0 4.1 4.2 "What is Civil Engineering?". The Canadian Society for Civil Engineering. మూలం నుండి 2007-08-12 న ఆర్కైవు చేసారు. Retrieved 2007-08-08.
 5. 5.0 5.1 "Civil engineering". Encyclopædia Britannica. Retrieved 2007-08-09.
 6. 6.0 6.1 6.2 Oakes, William C.; Leone, Les L.; Gunn, Craig J. (2001), Engineering Your Future, Great Lakes Press, ISBN 1-881018-57-1
 7. ' ది అర్చిటేక్టుర్ ఆఫ్ ది ఇటాలియన్ రిఎసేన్స్/1} జాకబ్ బుర్చ్ఖర్ద్ట్ ISBN 0805210822
 8. "Institution of Civil Engineers' website". Retrieved 2007-12-26. Cite web requires |website= (help)
 9. ""నోర్విచ్ విశ్వవిద్యాలయ చట్టబద్దమైన వెబ్సైటు"". మూలం నుండి 2014-07-06 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-01-07. Cite web requires |website= (help)
 10. గ్రిగ్గ్స్, ఫ్రాన్సిస్ ఇ జూనియర్. "Amos Eaton was Right!". జర్నల్ ఆఫ్ ప్రొఫెషనల్ ఇస్సుస్ ఇన్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అండ్ ప్రాక్టీసు , వాల్యూం. 123, No. 1, జనవరి 1997, పేజీలు . 30–34. RPI టైంలైన్ Archived 2014-07-02 at the Wayback Machine. కూడా చూడుము
 11. Victor E. Saouma. "Lecture notes in Structural Engineering" (PDF). University of Colorado. మూలం (PDF) నుండి 2018-04-13 న ఆర్కైవు చేసారు. Retrieved 2007-11-02. Cite web requires |website= (help)
 12. ఆల్జీబ్రా విత్ అర్తేమాతిక్ అండ్ మేన్సురేషణ్ బై హెన్రీ థోమస్ కలేబ్రూక్, http://books.google.com/books?id=A3cAAAAAMAAJ&printsec=frontcover&dq=brahmagupta
 13. MIT Archived 2013-05-22 at the Wayback Machine., కాల్ పోలి Archived 2013-10-29 at the Wayback Machine., క్వీన్స్ మరియు పోర్త్స్మౌత్ Archived 2010-12-09 at the Wayback Machine. ల వద్ద వివిధ అండర్గ్రాడుఎట్ పట్టా అవసరాలు
 14. ,"CITE Postgrad". మూలం నుండి 2009-08-31 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-01-07. Cite web requires |website= (help)
 15. "Why Should You Get Licensed?". National Society of Professional Engineers. మూలం నుండి 2007-07-11 న ఆర్కైవు చేసారు. Retrieved 2007-08-11.
 16. "Engineers Act". Quebec Statutes and Regulations (CanLII). Retrieved 2007-08-11.
 17. "Ethics Codes and Guidelines". Online Ethics Center. Retrieved 2007-08-11.
 18. 18.0 18.1 మిత్చేల్, జేమ్స్ కెన్నెత్ (1993), ఫన్దమేన్తల్స్ ఆఫ్ సొఇల్ బెహేవియర్ (2nd ed.), జాన్ విలీ అండ్ సన్స్, పేజీలు 1–2
 19. శ్రోఫ్ఫ్, అరవింద్ వి.; షః, ధనంజయ్ ఎల్. (2003), సొఇల్ మెకానిక్స్ అండ్ జియో టెక్నికల్ ఇంజనీరింగ్, టేలర్ అండ్ ఫ్రాన్సిస్, 2003, పేజీలు 1–2

వెలుపటి వలయము[మార్చు]

మూస:Technology-footer