Jump to content

ఫ్యాషన్ టెక్నాలజీ

వికీపీడియా నుండి
1974లో డ్రెస్డెన్ లో ఫాషన్ డిజైనర్లు .

ఫ్యాషన్ డిజైన్ అనగా బట్టలు, కొన్ని వస్తువులను అందంగా తీర్చిదిద్దే కళ.దీనిలో అవలంభించే పద్ధతుల సమాహారాన్నే ఫ్యాషన్ టెక్నాలజీ అంటారు. ఇది కాలాన్ని బట్టి, ప్రదేశాలను బట్టి, సంస్కృతులను బట్టి వివిధ పద్ధతులను ఉపయోగిస్తారు. దీనిని ఉపాధిగా చేసుకున్న వాళ్ళను ఫ్యాషన్ డిజైనర్స్ అని అంటారు. మనుషుల అభిరుచిని బట్టి దుస్తులను, వస్తువులను తయారు చేస్తుంటారు.

వర్గీకరణ

[మార్చు]

కొంత మంది ఫ్యాషన్ డిజైనర్స్ కంపెనీలలో పని చేస్తారు. వాళ్ళను 'ఇన్-హౌస్' డిజైనర్స్ అని అంటారు. వాళ్ళు ఒంటరిగా కాని కొంత మందితో కలిసి పనిచేస్తారు. కొంత మంది సొంతంగా డిజైన్స్ తయారు చేస్తూ కంపనీలకు అమ్ముతుంటారు. వాళ్లను ఫ్రీలాన్సర్స్ అని అంటారు.

చరిత్ర

[మార్చు]

చార్లస్ ఫ్రెడ్రిక్ వర్త్ 19 వ శతాబ్దంలో ఫ్యాషన్ డిజైన్ ని మొదలుపెట్టారు. అతను పారిస్ లో "మేసన్ కౌటర్" అనబడు ఫ్యాషన్ హౌస్ ని మొదలుపెట్టి ఎవరికి ఎటువంటివి సరిపడతాయో చెప్పి వాళ్ళకు చెప్పి వ్యాపారం చేసేవాడు. కాలక్రమేణా ప్రజల ఆదరణ పెరిగింది. ముందుగా డిజైన్ తయారు చేసి కస్టమర్లలకు నచ్చిన తరువాత అసలు పని మొదలు పెడతారు.

ఫ్యాషన్ లలో రకాలు

[మార్చు]

బట్టల తయారీ దారులను మూడు రకాలుగా వర్గీకరించ వచ్చు.

1.హౌట్ కౌటర్ :

ప్రతి క్లయింట్ అభిరుచి బట్టి తయారు చేస్తారు. ఇక్కడ మంచి ప్రమాణాలను పాటిస్తారు. ఖరీదు ఎక్కువ్. మన్నిక ఎక్కువ. తయారు చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది.

2. రెడీ మేడ్ :

ఈ పద్ధతిని ఎక్కువ మందిని దృష్టిలో పెట్టుకొని మంచి ప్రమాణాలతో సుమారుగా అందరికి నచ్చే విధంగా తయారు చేస్తారు.

3. మాస్ ప్రొడక్షన్ :

ఇది సామాన్య ప్రజలను ఉద్దేశించి ఎక్కువ మోతాదులలో తయారు చేస్తారు. ఖరీదు తక్కువగా ఉంటుంది.

ఫ్యాషన్ ఎడ్యుకేషన్

[మార్చు]

వివిధ స్థాయిలలో ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులు ఉన్నాయి. 1986 లో భారత దుస్తుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్థాపించబడిన భారత ఫ్యాషన్ సాంకేతిక సంస్థ[1] ద్వారా హైద్రాబాద్తో సహా వివిధ పెద్ద నగరాల్లో వివిధ కోర్సులు నిర్వహిస్తున్నది.

ప్రపంచ ఫ్యాషన్ వ్యవస్థలు

[మార్చు]
  1. అమెరికా ఫ్యాషన్ డిజైన్
  2. బ్రిటిష్ ఫ్యాషన్ డిజైన్
  3. ఫ్రెంచ్ ఫ్యాషన్ డిజైన్
  4. ఇటాలియన్ ఫ్యాషన్ డిజైన్
  5. స్విస్ ఫ్యాషన్ డిజైన్
  6. జపానీస్ ఫ్యాషన్ డిజైన్
  7. ఇండియా ఫ్యాషన్ డిజైన్
  8. మలేషియా ఫ్యాషన్ డిజైన్

వనరులు

[మార్చు]
  1. భారత ఫ్యాషన్ సాంకేతిక సంస్థ