జిల్లా పరిషత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గ్రామీణ ప్రాంతాల స్థానిక స్వపరిపాలన సంస్థల వ్యవస్థ ( పంచాయతీ రాజ్) లో గ్రామ పంచాయతీ, మండల పరిషత్ తరువాత మూడవ (చివరి) అంచె (జిల్లా స్థాయి) జిల్లా పరిషత్ . ప్రతి జిల్లాకి ఒక జిల్లా పరిషత్తు వుంటుంది. పూర్తి పట్టణ జిల్లా అయితే జిల్లా పరిషత్తు వుండదు. ఉదా: రంగారెడ్డి జిల్లా.

జిల్లా పరిషత్ నిర్మాణం[మార్చు]

జిల్లాని ప్రాదేశిక నియోజక వర్గాలుగా విభజించి, ఒకరిని ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు. వీరిని జడ్పిటిసి (Zilla Parishad Territorial Constituency : ZPTC) సభ్యులంటారు. రాజకీయ పార్టీలు అభ్యర్థులను నిలబెట్టవచ్చు. షెడ్యూల్డ్ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతులు, స్త్రీలకు సీట్లు కేటాయింపు ఉంది. వీరి పదవీకాలం 5 సంవత్సరాలు. వీరితో పాటు, జిల్లాకి ప్రాతినిధ్యం వహించే విధానసభ, లోక్‌సభ సభ్యులు, జిల్లాలో నివాసముంటున్న రాజ్యసభ సభ్యులు, అల్ప సంఖ్యాక వర్గాలకు చెందిన సభచే ఆహ్వానించబడిన (కో ఆప్టెడ్) వారు సభ్యులుగా వుంటారు. సమావేశాలకుశాశ్వత ఆహ్వానితులు: జిల్లా కలెక్టర్, జిల్లా పరిధిలో మండల అధ్యక్షులు, జిల్లా మార్కెటింగ్ సంఘం అధ్యక్షులు. జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు .వీరికి సమావేశాలలో ఓటు హక్కు లేదు.

అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు[మార్చు]

జడ్పిటిసి సభ్యుల మొదటి సమావేశంలో, వారిలో ఇద్దరిని అధ్యక్షుడు, ఉపాధ్యక్షులుగా ఎన్నుకుంటారు. అధ్యక్ష పదవికి, షెడ్యూల్డ్ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతులు, స్త్రీలకు సీట్లు కేటాయింపు ఉంది.

జిల్లా పరిషత్ ముఖ్య పాలనాధికారి[మార్చు]

జిల్లా పరిషత్ నిర్ణయాలని అమలు పర్చటానికి జిల్లా పరిషత్ ముఖ్య పాలనాధికారి వుంటారు. వీరిని ప్రభుత్వం నియమిస్తుంది. జిల్లా పరిషత్ పరిధిలో పనిచేసే అధికారులందరిపైన, అన్ని సంస్థల పనితీరుపైన పర్యవేక్షణాధికారం వుంటుంది.

స్థాయి కమిటీలు[మార్చు]

జిల్లా పరిషత్ విధులు[మార్చు]

 1. జిల్లా పరిధిలో మండల పరిషత్ బడ్జెట్ ల ఆమోదం
 2. మండల పరిషత్ ప్రణాళికల సమన్వయం చేసి జిల్లా ప్రణాళిక తయారి
 3. పథకాల నిర్వహణ
 4. మండల పరిషత్ కార్యకలాపాల నిర్వహణ
 5. జిల్లా అభివృద్ధికి సలహాలు
 6. ఉన్నత పాఠశాలలు, వృత్తి విద్య పాఠశాలల ఏర్పాటు, నిర్వహణ
 7. ప్రభుత్వం నుండి అందిన నిధులను మండల పరిషత్ లకు పంపిణీ

జిల్లా పరిషత్ ఆర్థిక వనరులు[మార్చు]

 1. భూమి శిస్తు, రాష్ట్ర పన్నులలో భాగం
 2. మండల పరిషత్లు, ప్రజలు ఇచ్చే విరాళాలు
 3. ప్రభుత్వ గ్రాంటులు
 4. పథకాలకు ప్రభుత్వం ఇచ్చే నిధులు

ఇవీ చూడండి[మార్చు]

వనరులు[మార్చు]