జిల్లా పరిషత్ చైర్మన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఛైర్మన్ జిల్లా పరిషత్, మొరిగాన్, శ్రీ శ్యామ్ దాస్, (2013 డిసెంబరు 07, న అస్సాంలోని మొరిగావ్ వద్ద, గువహతిలోని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నిర్వహించిన భారత్ నిర్మన్ పై పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ముగింపు కార్యక్రమంలో ప్రసంగించిన చిత్రం)

జిల్లా ప్రజాపరిషత్తుకు నాయకత్వం వహించేది జిల్లా పరిషత్ ఛైర్మన్. జిల్లా ప్రజాపరిషత్తుకు నేరుగా ఎన్నుకోబడిన సభ్యులు తమ నాయకుని ఎన్నుకుంటారు. ఆధిక్యంతో ఆమోదించిన తీర్మానాలను జిల్లాపరిషత్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి (సిఇఒ) ద్వారా ఛైర్మన్ అమలు పరుస్తారు.[1]

అధికారాలు

[మార్చు]
 • జిల్లా పరిషత్ సమావేశాలకు అధ్యక్షత,విధాన నిర్ణాయక ఓటు
 • ముఖ్య కార్యనిర్వాహణ అధికారి (సిఇఒ) పై అజమాయిషీ
 • అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకు, జిల్లాగ్రామీణాభివృద్ధి సంస్థకు, పేదరిక నిర్మూలన సంస్థకు, ఖాదీ, గ్రామీణ పరిశ్రమల బోర్డు, జిల్లా స్థాయి కమీటీ ఛైర్మన్ గా వుంటారు.
 • జిల్లా ఆహార కమిటీ సభ్యత్వం
 • జిల్లా విద్యా కమిటీ ఛైర్మన్
 • ఉపాధ్యాయ బదిలీల కౌన్సెలింగ్ కమిటీ ఛైర్మన్
 • జిల్లా క్రీడల అధారిటీ ఛైర్మన్
 • జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ కు విధులు కేటాయింపు
 • జిల్లాలో జరుగు అన్నికార్యక్రమాలకు ఆహ్వానితులు

విధులు

[మార్చు]
 • ఆధిక్యంతో ఆమోదించిన తీర్మాలను జిల్లాపరిషత్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి(CEO) ద్వారా ఛైర్మన్ అమలు పరచుట
 • జిల్లా పరిషత్ నిధులు, ప్రభుత్వ నిధులతో చేపట్టు పనులు అమలు, పర్యవేక్షణ
 • సాంఘిక సంక్షేమ వసతిగృహాల మెరుగుదలకు సూచనలు చేయుట
 • జిల్లా ఉపాధి, శిక్షణ శాఖ శిక్షణ సంస్థల మెరుగుదలకు సూచనలు చేయుట
 • రాష్ట్ర సహాయ మంత్రి హోదా.
 • జిల్లా అభివృద్ధిశాఖల పనితీరు సమీక్ష, సూచనలు చేయుట

మూలాలు

[మార్చు]
 1. GO MS no: 756 Panchayatiraj date:1994-11-30

వనరులు

[మార్చు]
 • జిల్లాపరిషత్ కరదీపిక (PDF). Archived from the original (PDF) on 2021-01-30. {{cite book}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2014-03-27 suggested (help)
 • "గుంటూరు జిల్లా పరిషత్ వెబ్సైట్". Archived from the original on 2021-02-03. Retrieved 2021-01-30.