ఉపాధ్యాయుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


ఉపాధ్యాయుడు
పాఠశాల విద్యార్ధులతో ఉపాధ్యాయురాలు (బెంగుళూరు పరిసరప్రాంతంలో)
వృత్తి
పేర్లుఉపాధ్యాయుడు , ఉపాధ్యాయురాలు
వృత్తి రకం
వృత్తి
కార్యాచరణ రంగములు
విద్య
వివరణ
సామర్ధ్యాలునేర్చుకొనే విధాలపై అవగాహన, విషయంపై జ్ఞానం; నైపుణ్యంగా విషయాన్ని బోధించటం, బోధనాంశాలు రూపొందించడం, నేర్చుకొన్నవారి నైపుణ్యాలు తనిఖీ చేయటం,మనస్తత్వ శాస్త్రం, ప్రణాళిక చేయటం,నాయకత్వ లక్షణాలు[1]
విద్యార్హత
(దేశాన్నిబట్టి మారుతుంది) బిఇడి
ఉపాధి రంగములు
పాఠశాలలు
సంబంధిత ఉద్యోగాలు
ఆచార్యుడు, విద్యావేత్త, ఆధ్యాపకుడు, శిక్షకుడు

ఉపాధ్యాయుడు (ఉపాధ్యాయురాలు, విద్యావేత్త) విద్యార్థులు జ్ఞానం, సామర్థ్యం లేదా సత్ప్రవర్తన సంపాదించడానికి సహాయపడే వ్యక్తి.

ఉపాధ్యాయుడి పాత్రను ఎవరైనా తీసుకోవచ్చు (ఉదా: ఒక నిర్దిష్ట పనిని ఎలా చేయాలో సహోద్యోగికి చూపించినప్పుడు). కొన్ని దేశాల్లో, పాఠశాల లేదా కళాశాల వంటి నియత విద్య కాకుండా, ఇంటిలో వారే పిల్లలకు విద్య నేర్పడం (హోమ్‌స్కూలింగ్) లాంటి వంటి అనియత విద్య ద్వారా చిన్నారులకు విద్య నేర్పవచ్చు. కొన్ని ఇతర వృత్తుల్లో గణనీయమైన స్థాయిలో బోధన ఇమిడి ఉండవచ్చు (ఉదా. చేతిపనులు నేర్పేవారు, మతబోధకులు).

చాలా దేశాల్లో, విద్యార్థులకు సంప్రదాయ బోధన సాధారణంగా జీతం తీసుకొనే వృత్తి అధ్యాపకుల ద్వారా నిర్వహించబడుతుంది. ఈ వ్యాసం ఉద్యోగస్థులైన వారి ప్రధాన పాత్రగా, ఒక పాఠశాలలో లేదా ప్రారంభ అధికారిక విద్య లేదా శిక్షణ వంటి ఇతర ప్రదేశాలలో, ఒక అధికారిక విద్యా సందర్భంలో ఇతరులకు బోధించేవారిపై దృష్టి పెడుతుంది.

విధులు, వ్యవహారాలు[మార్చు]

లాటిన్ పాఠశాల ఉపాధ్యాయుడు, ఇద్దరు విద్యార్థులు, 1487

ఒక ఉపాధ్యాయుడి పాత్ర సంస్కృతుల మధ్య మారుతూ ఉండవచ్చు.

ఉపాధ్యాయులు, అక్షరాస్యత సంఖ్యాశాస్త్రం, హస్తకళ లేదా వృత్తి శిక్షణ, కళలు, మతం, పౌరసత్వం, సమాజ పాత్రలు లేదా జీవిత నైపుణ్యాలలో తమ బోధనను అందించవచ్చు.

సంప్రదాయ బోధనా విధుల్లో, అంగీకరించిన పాఠ్యాంశాల ప్రకారం పాఠాలను తయారు చేయడం, పాఠాలు చెప్పడం, విద్యార్థి పురోగతిని అంచనా చేయడం వంటివి ఉంటాయి..

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Williamson McDiarmid, G. & Clevenger-Bright M. (2008), 'Rethinking Teacher Capacity', in Cochran-Smith, M., Feiman-Nemser, S. & Mc Intyre, D. (Eds.): Handbook of Research on Teacher Education. Enduring questions in changing contexts. New York/Abingdon: Routledge/Taylor & Francis.