చర్చ:ఉపాధ్యాయుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మెరుగైన పేరుకు దారిమార్పు[మార్చు]

YesY సహాయం అందించబడింది

తెలుగు భాషలో ఉపాధ్యాయుడు పుల్లింగాన్ని సూచిస్తున్నది. ప్రస్తుత ఎక్కువ శాతం ఉపాధ్యాయులు స్త్రీలు కావున ఈ వ్యాసం లింగాన్ని సూచించని గురువు కు దారి మార్పు చేస్తే మంచిది. ఎక్కువమార్పులు చేసిన User:Ch Maheswara Raju,User:Kasyap,User:K.Venkataramana, ఆసక్తి వున్న సభ్యులు వారంలోగా స్పందించండి. --అర్జున (చర్చ) 00:47, 26 ఆగస్టు 2020 (UTC) ,

సాధారణముగా నాకు గురువు అంటే ఎక్కువగా ఆధ్యాత్మిక అర్ధం స్ఫురిస్తుంది
బ్రౌన్ ఇంగ్లీష్-తెలుగు నిఘంటువు 1852 n. s. నేర్పేవాడు, ఉపాధ్యాయులు, శిక్ష చెప్పేవాడు. a spiritual * గురువు, బోధకుడు.

ఉదా : From : https://andhrabharati.com/dictionary/index.php
సం. ఉ. పుం.
1. ఉపాధ్యాయుఁడు;
2. బృహస్పతి;
3. కులముపెద్ద;
4. తండ్రి;
5. తండ్రి తోడఁబుట్టినవాఁడు;
6. తాత;
7. అన్న;
8. మామ;
9. మేనమామ;
10. రాజు;
11. కాపాడువాఁడు.

ఏదైనా పదము సూచించ గలరు Kasyap (చర్చ) 08:20, 26 ఆగస్టు 2020 (UTC)
Kasyap గారు చెప్పినట్లు గురువు అనే మాట తగదనిపిస్తుంది.సమావేశాలలో వారిని గురించి చేప్పేటప్పుడు పనికి వస్తుంది. కానీ దీనికి పనికిరాదనిపిస్తుంది.ఇంకొకటి ఉపాధ్యాయురాలు అనేదానికి ఆంధ్రభారతి నిఘంటువులో అర్థంలేదని చూపిస్తుంది.ఉపాధ్యాయి అనే పదానికి ఉపాధ్యాయత్వము చేసెడి ఆఁడుది, ఉపాధ్యాయుని పెండ్లాము అని, ఉపాధ్యాయ అనే పదానికి దాదాపుగా అవే అర్ధాలు చూపుతుంది.అయితే నిఘంటువు (వావిళ్ల) 1949 దాని ప్రకారం ఉపాధ్యాయురాలు, పంతులమ్మ, female teacher అని అర్థాలు చూపుతుంది.అవసరమనుకుంటే ఆ పదాలుకు పేజీలు సృష్టించి దారిమార్పు చేయవచ్చు.అంతేగానీ గురువు అనే పదం సమంజసంగా లేదనిపిస్తుంది--యర్రా రామారావు (చర్చ) 09:08, 26 ఆగస్టు 2020 (UTC).
గురువు అనే పదం ఈ వ్యాసానికి నప్పదేమో అని నా అభిప్రాయం. ఉపాధ్యాయులు అనే బహువచన పదం వాడవచ్చేమో. - రవిచంద్ర (చర్చ) 06:21, 27 ఆగస్టు 2020 (UTC)
ఆంధ్రభారతి నిఘంటువులలో గురువు కు చాలాచోట్ల పర్యాయపదం ఉపాధ్యాయుడిగా కనబడుతుంది. కావున గురువు అని వాడి ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయురాలు లాంటి ఇతర పదాలకు దారిమార్పులు సృష్టించటం మంచిదనుకుంటాను. మారుతున్న సమాజంతో వికీపీడియాలో భాష మారాలి కావున లింగవివక్షను చూపించే పదాలు వ్యాస శీర్షికలో కనబడకుండా చేయటమే మంచిది.--అర్జున (చర్చ) 00:50, 30 ఆగస్టు 2020 (UTC)
రవిచంద్ర గారు సూచించిన బహువచన వాడుక వికీపీడియా సంప్రదాయం కాదని నా అభిప్రాయం.--అర్జున (చర్చ) 00:52, 30 ఆగస్టు 2020 (UTC)
బహువచనం కాకపోతే ఇంకో పదం. అంతే కానీ గురువు అనే మాటకు పర్యాయపదం ఉపాధ్యాయుడు లేదా ఉపాధ్యాయురాలు అని ఈ వ్యాసాన్ని గురువు అనే పేరు పెట్టడం మంచిది కాదని నా అభిప్రాయం. గురువు అంటే ఉపాధ్యాయులకు కన్నా ఉన్నత స్థానం అని నా అభిప్రాయం. కావాలంటే బోధ గురువు అనే బోధన గురువు అనో పేరు పెట్టవచ్చు. - రవిచంద్ర (చర్చ) 06:25, 30 ఆగస్టు 2020 (UTC)

రవిచంద్ర,User:Kasyap గార్లకు వ్యక్తిగత అభిప్రాయాల ద్వారా నిర్ణయం చేయటం సరికాదు కదా. గురువు అనేది విస్తృతమైన అర్ధం వున్నది కావున దానిలో కావాలంటే ఇతర విభాగాలు చేర్చుకోవచ్చుకదా. వెతికేవారుకూడా గురువు అని వెతుకుతారు కాని బోధన గురువు అని వెతకరు. తెవికీ లో గురువుకి శిక్షణ పరంగా వేరే పర్యాయపదాల వ్యాసాలు (en:professor, en:Reader (academic rank) )ఇంకా ఏర్పడలేదు కావున, ప్రస్తుతానికి గురువు వాడకమే మెరుగు. మరల ఆలోచించి స్పందించండి.--అర్జున (చర్చ) 23:57, 31 ఆగస్టు 2020 (UTC)

  1. గురువు అనే మాటకు ఉపాధ్యాయుడు అనేది చాలా చిన్న అర్థం (సంకుచితార్థం). ఆ మాట చాలా విస్తృతమైనది. ఆ మాటకు సమానమైన ఇంగ్లీషు మాట లేదు, "ధర్మం" లాగా. ఉండుంటే వాళ్ళు అదే వాడేవాళ్ళు. లేదు కాబట్టే guru అనే మాటను ఆ భాష లోకి తీసుకున్నారు. దీన్ని బట్టి "టీచర్" వేరు, "గురు" వేరు అని తెలిసిపోతోందని నా అభిప్రాయం!
  2. లింగ తటస్థతే ధ్యేయమైతే, గురువు అనే మాటకు పైన ఉదహరించిన ఆంధ్రభారతి చూపిస్తున్న అర్థాల్లో ఒక్ఖటైనా స్త్రీలింగ పదం ఉందా? చూపించిన అర్థాలన్నీ పుంలింగ పదాలే కదా. మరి ఈ పదానికి లింగ తటస్థత ఉందా?
  3. "గురువు అనేది విస్తృతమైన అర్ధం వున్నది కావున దానిలో కావాలంటే ఇతర విభాగాలు చేర్చుకోవచ్చుకదా." అని అర్జున గారు రాసారు. మరి అలా అయితే ఉపాధ్యాయుడు పుంలింగము, స్త్రీలిగ రూపం ఉపాధ్యాయిని అని వ్యాసంలో రాసుకోవచ్చు గదా. ఉపాధ్యాయిని అనే దారిమార్పు పేజీ పెట్టుకోవచ్చు గదా? గురువు అనే విస్తృతార్థం ఉన్న మాటను తెచ్చి సంకుచితార్థంలో ఎందుకు వాడాలి? ఆలోచించండి.
  4. లింగ తటస్థత అనేది వాంఛనీయమే. అయితే దాని కోసం ఎక్కువ సముచితంగా ఉన్న పదాన్ని త్రోసిరాజనడం తప్పు.
  5. ఇది "నా" అభిప్రాయం. అర్జున గారు "నా" అభిప్రాయం చెప్పకూడదంటారేమో తెలీదు. అయితే ఒకటి.. చర్చను మోడరేటు చెయ్యడం మాత్రం మంచి పద్ధతి కాదు. అందరూ తమతమ వ్యక్తిగత అభిప్రాయాలే చెబుతారు. "మరొకరి" అభిప్రాయం చెప్పరు గదా. నా అభిప్రాయమే ఒప్పు, దాని ప్రకారమే నిర్ణయం చెయ్యాలి అని అంటే తప్పు, దాన్ని ఖండించొచ్చు. లేదా మీరు చెప్పేదానికి ఆధారాలు చూపించండి అని అడగొచ్చు. అంతేగానీ చర్చలో ఎవరైనా ఏదైనా రాయగానే వెంటనే దాన్ని ఖండించడం అనేది సరైన పద్ధతి కాదు. మీరు మీ అభిప్రాయం రాసి చర్చకు పెట్టారు. ఇక ఇతరులను స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు చెప్పనివ్వండి, దయచేసి మోడరేటు చెయ్యకండి.
నమస్కారం. __చదువరి (చర్చరచనలు) 01:53, 1 సెప్టెంబరు 2020 (UTC)
చదువరి గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. చర్చను నేను మోడరేటు చేస్తున్నట్లు మీరు పొరబాటుగా అనుకున్నారు. చర్చలో వేరేకోణాలు తెలిపే ప్రతిస్పందనకూడ ఇవ్వకూడదంటారా? అలాంటప్పుడు చర్చ ఎలాఅవుతుంది. నేను ఇంతకు ముందే రాద్దామన్న ఇంకొక కోణంతో పాటు మీ వ్యాఖ్యలకు స్పందనలు తెలుపుతాను.
  1. వికీడేటాద్వారా ఇతర భాషలలో లింకు అయ్యే పదం అర్ధానికి దగ్గరగాపోలినవి మాత్రమే. నిఘంటు సారూప్యంగా అనుకోవాల్సినపనిలేదు.
  2. లింగ తటస్థత గురించి, వాడుకలో ఎలా వుంది అని పరిశీలిస్తే చాలుగదా, పాత కాలపు నిఘంటువులలో లేదని వదిలేస్తామా?
  3. ఉపాధ్యాయని కి దారిమార్పు ఎందుకు కూడదో ఇంతకుముందు చర్చలో తెలిపాను. లింగవివక్షను సూచించేది శీర్షికలో వుండడం అభిలషణీయం కాదు.
ఇతరులు అపార్ధం చేసుకోకుండా వుండటానికి నా ఉద్దేశం ఏవిటోస్పష్టం చేస్తాను. ఇటువంటి చర్చలలో ఎక్కువమంది సభ్యులు పాల్గొనడం ముఖ్యం, ప్రతిపాదించినవారి వాదన నెగ్గిందా అన్నది ముఖ్యంకాదు. ఇప్పుడు అధిక సభ్యులు దారిమార్పు వద్దనుకుంటే వదలివేయడానికి నాకేమి అభ్యంతరం లేదు. బహుశా ఇంకొన్ని సంవత్సరాలతరువాత ఎవరికైనా ఇటువంటి అలోచన వస్తే ఈ చర్చ ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 03:53, 1 సెప్టెంబరు 2020 (UTC)
అర్జున గారూ మీరు చేస్తున్నది నిస్సందేహంగా మోడరేషను. ఇక్కడ ఇంకా చాలా తక్కువగా ఉంది. ఈ మధ్య ప్రతిపాదించిన యాంత్రికానువాదాల చర్చలోనైత మీరు మరీ అతిగా జోక్యం చేసుకున్నారు. అసలు ఆ చర్చ అంటేనే ఆసక్తి, రుచి లేకుండా పోయింది నాకైతే. కేవలం మిమ్మల్ని విమర్శించేందుకు అనడం లేదు, నాకు అనిపించింది చెప్పాను. దయచేసి, మీరు నెగటివుగా తీసుకోవద్దు. అయితే ఇక దీన్ని నేను పొడిగించను, ఇక్కడితో వదిలేస్తాను. మీ మనసు నొచ్చుకుంటే క్షమించండి. కానీ నా అభిప్రాయం మాత్రం మారదు.
  1. "వికీడేటాద్వారా ఇతర భాషలలో లింకు అయ్యే పదం అర్ధానికి దగ్గరగాపోలినవి మాత్రమే. నిఘంటు సారూప్యంగా అనుకోవాల్సినపనిలేదు." అని రాసారు. భేష్, బాగుంది. ఉపాధ్యాయుడు అనే పేజీకి ఎన్వికీలో Teacher అనే పేజీ ఉంది. కానీ అక్కడ "Guru" కు వేరే పేజీ కూడా ఉంది. వాళ్ళకు గురువుకు ప్రత్యేకంగా ఇక పేజీ ఉంటే మనకు అక్కర్లేదా? మరి వికీడేటా ద్వారా లింకు చెయ్యాలంటే "Guru" కు ఏ తెలుగులో ఏ పేజీని లింకిస్తారు?
  2. "లింగ తటస్థత గురించి, వాడుకలో ఎలా వుంది అని పరిశీలిస్తే చాలుగదా, పాత కాలపు నిఘంటువులలో లేదని వదిలేస్తామా?" - పాతకాలపు నిఘంటువా!!? ఆంధ్రభారతి ఒక నిఘంటువు కాదు, అది నిఘంటువుల యాగ్రిగేటరు. సరే "కొత్తకాలపు" నిఘంటువు ఏదో చెప్పండి అందులో చూద్దాం.
__చదువరి (చర్చరచనలు) 04:17, 1 సెప్టెంబరు 2020 (UTC)
పై అభిప్రాయాన్ని సరైన చోతకు మార్చాను. మరొక్క సారి చెబుతున్నాను.. గురువు వేరు, ఉపాధ్యాయుడు వేరు. గురువు ఉపాధ్యాయుని మించిన మాట. ఉపాధ్యాయునికి పైమాట. ఈ పేజీని గురువు కు మార్చడం తగదు. __చదువరి (చర్చరచనలు) 04:21, 1 సెప్టెంబరు 2020 (UTC)

ఉపాధ్యాయవృత్తిలో వాడుక[మార్చు]

పురుష, స్త్రీ ఉపాధ్యాయలున్నప్పుడు ఇతరులు ఏ విధంగా లింగవివక్షత లేకుండా స్పందిస్తున్నారో ఉపాధ్యాయవృత్తిలో వున్న వాడుకరి:K.Venkataramana గారు తెలపగలరా? టీచర్ తెలుగు వాడుకలో ప్రాధాన్యం పొందితే అదే పదం కూడా వాడవచ్చు. --అర్జున (చర్చ) 03:58, 1 సెప్టెంబరు 2020 (UTC)