వాడుకరి చర్చ:రవిచంద్ర
|
తెలుగువికీపీడియా భారతీయభాషలన్నింటిలోకి ఎక్కువ వ్యాసాలను కలిగి ఉంది. ఈ స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే ఇంకా చురుగ్గా వ్యాసరచన కొనసాగించాలి. ఇంకో ముఖ్యవిషయం ఏంటంటే కొన్ని ఇతరభాషలతో పోల్చుకుంటే మన తెలుగువికీలో ఉన్న వ్యాసాల లోతు మరియు నాణ్యత చాలా తక్కువగా ఉంది. ఈ నాణ్యతను పెంచాలంటే మీరు వ్రాసే వ్యాసాల నాణ్యత పెంచాలి. ప్రస్తుతము తెలుగువికీపీడియాలో సభ్యుల కొరత కూడా చాలా ఉంది. కావున సభ్యులను ఆకర్షించి వారు వ్యాసరచన కొనసాగించే విధంగా చూడవలసిన భాధ్యత ఇప్పుడున్న తెలుగువికీ సభ్యులదే!
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
నమస్తే, రవి గారు! ఎలా ఉన్నారు. నేను ఇది వరకు దేవా పేరుతో వ్యాస రచన చేసేవాడిని. ఆ యూసర్ నేం మల్లీ వాడుకలోకి తెచ్చే మార్గం ఉందా? ధన్యవాదాలు-- దేవా --Devagain (చర్చ) 14:58, 22 ఏప్రిల్ 2021 (UTC)
- Devagain గారూ, మీ వాడుకరి పేరు (యూజర్ నేం) తెలిస్తే పాస్‌వర్డ్ రీసెట్ చేసుకునే వీలుందండీ. మీ వాడుకరి పేరు వాడుకరి:Dev ఇదేనా? అలా కుదరకపోతే వేరే మార్గమేదైనా చూద్దాము. రవిచంద్ర (చర్చ) 04:31, 23 ఏప్రిల్ 2021 (UTC)
సమాచారం అనే వ్యాసం గురించి
[మార్చు]రవిచంద్ర గారూ, సమాచారం పేజీని మరికొంచెం సవరించాను. తొలగించు అనేది తీసేయ్ లేదు. ఇంకేమి తక్కువ ఉంది అందులో చెప్పగలరు. దీపా చర్చ 12:31, 24 ఏప్రిల్ 2021 (UTC)
- దీప గారూ, సమాచారం పేజీలో నేను ఆ గమనిక చేర్చినందుకు ముఖ్య కారణం, దానిలో అర్థం లేని వాక్యాలు ఉన్నాయి. మీరు కొన్ని మార్పులు చేసినందుకు ధన్యవాదాలు. అయితే ఇంకా చాలా మార్పులు చేయవలసి ఉన్నది. నేను వాటిన్నంటినీ ఓపిగ్గా మీకు ఆ వ్యాసపు చర్చా పేజీలో వివరిస్తాను. అవన్నీ మీరు బాగా అర్థం చేసుకుని సవరించండి. అందుకు కావలసిన ఏ సహాయమైనా చేస్తాను. అప్పటి దాకా ఈ వ్యాసం తొలగింపు జరగదు. భయపడకండి. - రవిచంద్ర (చర్చ) 16:53, 24 ఏప్రిల్ 2021 (UTC)
గుణకారం వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను :
- ఈ వ్యాసం 2010 ఏప్రిల్ లో సృష్టించబడింది.అప్పటి నుండి మొలకగానే ఉంది.ఆంగ్ల వికీపీడియాలో Multiplication అనే వ్యాసం ఉంది.దాని ఆధారంగా విస్తరించటానికి ప్రయత్నించగా ఇది శాస్త్ర సాంకేతిక వ్యాసం అయినందున సాధ్యంకాలేదు .దీనిని సృష్టించిన వాడుకరి లేదా ఇలాంటి వ్యాసాలలో అనుభవం ఉన్న మరే ఇతర వాడుకరులెవరైనా 2021 మే 5 వ తేదీలోపు తగిన మూలాలతో విస్తరించనియెడల తొలగించాలి.
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/గుణకారం పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. యర్రా రామారావు (చర్చ) 16:26, 28 ఏప్రిల్ 2021 (UTC) యర్రా రామారావు (చర్చ) 16:26, 28 ఏప్రిల్ 2021 (UTC)
ప్రధానమంత్రి జీవనజ్యోతి గురించి Akhild13 అడుగుతున్న ప్రశ్న (23:31, 18 మే 2021)
[మార్చు]నమస్తే సార్ ప్రధాన జీవనజ్యోతి పథకం యొక్క వివరములు తెలియజేయండి --Akhild13 (చర్చ) 23:31, 18 మే 2021 (UTC)
- అఖిల్ గారూ, ప్రధానమంత్రి జీవనజ్యోతి పథకం గురించి ఇక్కడ కేవలం కొద్ది సమాచారమే ఉంది. ఆ పథకాన్ని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు ఇంగ్లీషు చదవగలిగితే ఆంగ్ల వ్యాసం చూడండి. అందులో వివరాలు ఉన్నాయి. దాని గురించి మీరు ఇక్కడ రాయాలంటే మేము సహాయం చేస్తాము. ఈ లోపు ఈ వ్యాసంలో మరింత సమాచారం చేర్చడానికి ప్రయత్నిస్తాము. రవిచంద్ర (చర్చ) 04:54, 19 మే 2021 (UTC)
- కొంత సమాచారాన్ని చేర్చాను చూడండి. మీరు ఆ వ్యాసం గురించి ఇంకేమైనా అడగాలంటే చర్చ:ప్రధానమంత్రి జీవనజ్యోతి పేజీలో అడగవచ్చు. - రవిచంద్ర (చర్చ) 05:07, 19 మే 2021 (UTC)
పిప్రా దీక్షిత్ తొలగింపు ప్రాజెక్టు పేజీ సృష్టింపు
[మార్చు]రవిచంద్ర గారూ పిప్రా దీక్షిత్ పేజీని తొలగింపుకు ప్రతిపాదించారు.వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/పిప్రా దీక్షిత్ ప్రాజెక్టు ఉప పేజీని సృష్టించి, మీ ప్రతిపాదన వివరాలురాసి, ఇతర వాడుకరులు అభిప్రాయాలు తెలుపుటకు వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు తాజా చేర్పులలో చేర్చగలరు. ధన్యవాదాలు.--యర్రా రామారావు (చర్చ) 03:23, 9 జూన్ 2021 (UTC)
- రామారావు గారూ, అలాగే చేరుస్తాను. - రవిచంద్ర (చర్చ) 05:09, 9 జూన్ 2021 (UTC)
సరైన నిర్ణయం తీసుకోండి
[మార్చు]రచ్చబండలో చదువరిపై అధికార, నిర్వాహక హోదాల నిరోధంపై సరైన నిర్ణయం తీసుకొని తెవికీ అభివృద్ధికై తోడ్పడండి. వికీపీడియా:రచ్చబండ#చదువరిపై అధికార, నిర్వాహక హోదాలపై నిరోధం ప్రతిపాదన / / అజయ్ కుమార్ / / తెలుగు భాషాభిమాని.
2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters
[మార్చు]Greetings,
The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.
You can also verify your eligibility using the AccountEligiblity tool.
MediaWiki message delivery (చర్చ) 16:39, 30 జూన్ 2021 (UTC)
Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.
[Wikimedia Foundation elections 2021] Candidates meet with South Asia + ESEAP communities
[మార్చు]Hello,
As you may already know, the 2021 Wikimedia Foundation Board of Trustees elections are from 4 August 2021 to 17 August 2021. Members of the Wikimedia community have the opportunity to elect four candidates to a three-year term. After a three-week-long Call for Candidates, there are 20 candidates for the 2021 election.
An event for community members to know and interact with the candidates is being organized. During the event, the candidates will briefly introduce themselves and then answer questions from community members. The event details are as follows:
- Date: 31 July 2021 (Saturday)
- Timings: check in your local time
- Bangladesh: 4:30 pm to 7:00 pm
- India & Sri Lanka: 4:00 pm to 6:30 pm
- Nepal: 4:15 pm to 6:45 pm
- Pakistan & Maldives: 3:30 pm to 6:00 pm
- Live interpretation is being provided in Hindi.
- Please register using this form
For more details, please visit the event page at Wikimedia Foundation elections/2021/Meetings/South Asia + ESEAP.
Hope that you are able to join us, KCVelaga (WMF), 06:35, 23 జూలై 2021 (UTC)
నిరోధాలు వద్దు, సమాధానమే ముద్దు
[మార్చు]రవిచంద్రా, ఐపి ఆడ్రస్ 117.213.196.135ను అనవసరంగా నిరోధించావ్. ప్రజాస్వామ్యంలో పొరపాట్లు కూడా తెల్పరాదా? వైజాసత్య, చంద్రకాంతరావు, కాసుబాబుల వలె మంచిపనులు చేసి మంచి వికీపీడీయన్ గా తయారు కావాల్సి ఉండగా అనవసరంగా వెధవ వికీపీడీయన్‌గా తయారౌతున్నావ్. ఐపి అడ్రస్ లు బ్లాక్ చేసినా మా తెలుగు భాషాభిమానులకు ఏమీ కారు. మేము వందలాది భాషాభిమానులం, వేలాది కంప్యూటర్లు, వేలాది ఐపి అడ్రస్ లు అందుబాటులో ఉన్నాయ్. అనవసరంగా నిరోధాలు విధించి అదే ఐపి అడ్రస్ వాడే వేలాది మంది ఇతరులను ఇబ్బందులకు గురిచేయవద్దు. -- అజయ్ కుమార్
తెవికీపై మరో బ్లాగ్ పోస్ట్
[మార్చు]తెలుగు వికీపీడియాపై మరో బ్లాగ్ పోస్ట్ విడుదలైంది. చదవండి, వాస్తవాలు తెలుసుకోండి. https://cckraopedia.blogspot.com/2021/07/blog-post_22.html -- అజయ్ కుమార్ నోముల
Invitation for Wiki Loves Women South Asia 2021
[మార్చు]Wiki Loves Women South Asia 2021
September 1 - September 30, 2021view details!
Wiki Loves Women South Asia is back with the 2021 edition. Join us to minify gender gaps and enrich Wikipedia with more diversity. Happening from 1 September - 30 September, Wiki Loves Women South Asia welcomes the articles created on gender gap theme. This year we will focus on women's empowerment and gender discrimination related topics.
We are proud to announce and invite you and your community to participate in the competition. You can learn more about the scope and the prizes at the project page.
Best wishes,
Wiki Loves Women Team 22:07, 18 ఆగస్టు 2021 (UTC)
2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు ఎన్నికలలో ఓటు వేయండి
[మార్చు]నమస్తే రవిచంద్ర,
2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు అఫ్ ట్రస్టీస్ ఎన్నికలలు మొదలయ్యాయి. ఈ ఎన్నిక 18 ఆగష్టు 2021 న మొదలైంది, 31 ఆగష్టు 2021 న ముగుస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ తెలుగు వికీపీడియా వంటి ప్రాజెక్టులకు మద్దతు ఇస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఉంటుంది. బోర్డ్ ఆఫ్ ట్రస్టీల గురించి ఈ లింకులో తెలుసుకోండి.
ఈ సంవత్సరం నాలుగు బోర్డు సీట్లకు ఎన్నిక జరుగుతుంది. వీటి కోసం 19 మంది అభ్యర్థులు ఉన్నారు. అభ్యర్థుల గురించి మరింత సమాచారం ఈ పేజీలో తెలుసుకోండి.
70,000 ఓటర్లు ఉన్నారు. ఓటింగ్ ప్రక్రియ 31 ఆగష్టు 23:59 UTC వరకు నడుస్తుంది.
మీరు ఇప్పటికే ఓటు వేసినట్టు అయితే, దయచేసి ఈ ఇమెయిల్‌ను విస్మరించండి. ఓటర్లు ఒక్కసారి మాత్రమే ఓటు వేయవచ్చు.
ఈ ఎన్నికలు గురించి మరింత సమాచారం తెలుసుకోండి. MediaWiki message delivery (చర్చ) 05:02, 29 ఆగస్టు 2021 (UTC)
ఆహ్వానం : ఆజాదీ కా అమృత్ మహోత్సవం - మొదటి Edit-a-thon ( 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకు)
[మార్చు]నమస్కారం ,
తెలుగు వికీపీడియాలో భారత స్వాతంత్ర పోరాటం లో వెలుగు చూడని వీరుల గాథలు, మహిళా స్వాతంత్ర సమరయోధులు, స్వతంత్ర భారతంలో వెలుగు చూసిన ఉద్యమాలు, కీలక సంఘటనల గురించిన సమాచారం, సంబంధిత ఫొటోలు లాంటి విషయాలకు అనుగుణంగా 75 రోజులు ఆజాదీ కా అమృత్ మహోత్సవం అనే పేరుతో నిర్వహిస్తున్నాము, ఇందులో భాగంగా ఈ బుధవారం 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకూ జరిగే మొదటి విడత ఎడిట్ థాన్ కార్యక్రమంలో లో వికీపీడియన్లు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. ఆజాదీ కా అమృత్ మహోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకోడానికి సభ్యులందరు తప్పక చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఆసక్తి గల సభ్యులు, మరిన్ని వివరాలకు , పాల్గొనటానికి ఆజాదీ కా అమృత్ మహోత్సవం ప్రాజెక్టు పేజీ చూడగలరు : Kasyap (చర్చ) 05:10, 1 సెప్టెంబరు 2021 (UTC)
Deleting the article Sathyam Gujja
[మార్చు]Mr.Ravi Chandra, you have deleted the article Sathyam Gujja stating that " it is a summary of existing content". Can you please explain what this means? I am Megha from Waggener Edstrom , We have tried creating Mr.Gujja's article back in 2020 but your response was the same, We would like to get in contact with you regarding this if you are interested.
Thankyou for the reply Mr.Ravi Chandra, the deletion of the tags was a mistake from our team's end, we would like to discuss more about this personally via mail or call if you are interested
తెవికీ నిర్వహణపై ఆసక్తి
[మార్చు]నమస్కారం రవిచంద్ర గారూ, తెవికీలో కృషి చేయడం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. నేను వికీలో చేరిన గత తొమ్మిది నెలలుగా వికీ పట్ల చక్కటి అవగాహన ఏర్పరచుకున్నాను. వికీలో నా సేవలు మరింత విస్తృత స్థాయిలో చేపడుతూ ముందుకు సాగాలని నా ఆశయం .. ఈ క్రమంలో వికీ నిర్వహణ పట్ల నాకు ఆసక్తి కలిగింది, ఈ విషయంపై మీ అభిప్రాయాలు సూచనలు తెలియజేయవలసిందినంగా కోరుతున్నాను. Nskjnv ☚╣✉╠☛ 04:39, 24 సెప్టెంబరు 2021 (UTC)
- వాడుకరి:Nskjnv గారూ, మీ కృషి గమనిస్తున్నాను. బాగా పనిచేస్తున్నారు. నిర్వాహకత్వ ప్రతిపాదన పెట్టండి. అందరూ సభ్యులు కలిసి నిర్ణయం తీసుకుంటారు.- రవిచంద్ర (చర్చ) 10:17, 24 సెప్టెంబరు 2021 (UTC)
Movement Charter Drafting Committee - Community Elections to take place October 11 - 24
[మార్చు]నమస్కారం రవిచంద్ర గారూ ,
వికీమీడియా ఉద్యమంలో వికిపీమీడియన్ల పాత్రలు బాధ్యతలను ఉద్యమ చార్టర్ నిర్వచిస్తుంది. అందరి భాగస్వామ్యంతో వ్యూహాత్మక దిశలో కలిసి పనిచేయడానికి ఈ ఫ్రేమ్‌వర్క్ ఉపయోగపడననుంది.
ఉద్యమ చార్టర్ డ్రాఫ్టింగ్ కమిటీ ఈ చార్టర్ ముసాయిదాను రూపొందిస్తుంది. కంటెంట్ ఈక్విటీ ఇన్ డెసిషన్ మేకింగ్ "అనే మూవ్మెంట్ స్ట్రాటజీ సిఫార్సును అనుసరిస్తుంది. కమిటీ పని ముసాయిదా రాయడం వరకు విస్తరించింది. ఇందులో కమ్యూనిటీలు, నిపుణులు, సంస్థలతో పరిశోధన ఇంకా సంప్రదింపులు ఉంటాయి. ఈ ముసాయిదా చార్టర్‌గా మారడానికి ముందు ఉద్యమం-అంతటా ఆమోదం ద్వారా ఏకాభిప్రాయం పొందాలి.
ఈ గ్రూపులో దాదాపు 15 మంది సభ్యులు ఉంటారు. ఇది ఉద్యమంలో వైవిధ్యాన్ని సూచిస్తుందని భావిస్తున్నారు. లింగం, భాష, భౌగోళికం అనుభవం లాంటి వివిధ వైవిద్యాలతో అభ్యర్థుల ఎంపిక జరగనుంది . ఈ సమూహ సభ్యులు ప్రాజెక్టులు, అనుబంధ సంస్థలు వికీమీడియా ఫౌండేషన్‌కి సంబందించిన కార్యకలాపాలలో పాల్గొనవలసి ఉంటుంది.
సభ్యుడిగా మారడానికి ఆంగ్ల భాష వచ్చి ఉండవలసిన అవసరం లేదు. అవసరమైతే అనువాదం, వివరణ మద్దతు అందించబడుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ప్రతి రెండు నెలలకు US $ 100 పారితోషికం అందిచంబడుతుంది.
ఈ పోటీలో భారత్ నుండి 9 మంది వ్యక్తులు ఉండగా మన తెలుగు వికీ నుండి నేను ఒక్కడిని పాల్గొంటున్నాను అక్టోబరు 11 అనగా రేపటి నుండి దీని ఎన్నికలు జరగనున్నాయి. ఇది నా సభ్యత్వ పేజీ , పరిశీలించగలరు.
వికీమీడియా ఉద్యమంపై మంచి అవగాహన ఉన్న, నాకు మరింత అనుభవం అవసరమని భావిస్తున్నాను. కానీ, ఇటువంటి కార్యాచరణాలలో నేను భాగం కావడం నా కెరీర్ కి చాలా ఉపయోగపడనుంది.
ఈ పోటీలో నాకు మీ మద్దతు ఉంటుందని ఆశిస్తున్నాను. ఒకవేళ నేను ఈ సమూహంలో సభ్యుడను కాగలిగితే మీ అనుభవం నుండి నేర్చుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. Nskjnv ☚╣✉╠☛ 06:25, 10 అక్టోబరు 2021 (UTC)
రాక్షసబల్లి వ్యాసం తొలగింపు ప్రతిపాదన
[మార్చు]రాక్షసబల్లి వ్యాసం వికీపీడియా విధానాలు మార్గదర్శకాలకు అనుగుణంగా ఉందా లేక దాన్ని తొలగించాలా అనే విషయమై ఒక చర్చ జరుగుతోంది.
ఒక అభిప్రాయానికి వచ్చేంతవరకు ఈ విషయంపై వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/రాక్షసబల్లి వద్ద చర్చ జరుగుతుంది. చర్చలో ఎవరైనా పాల్గొనవచ్చు. చర్చ విధానాలు మార్గదర్శకాలపై ఆధారపడి, వాటిని ఉదహరిస్తూ జరుగుతుంది.
చర్చ జరుగుతూండగా వాడుకరులు ఈ వ్యాసంలో మార్పుచేర్పులు చెయ్యవచ్చు. చర్చలో లేవనెత్తిన అభ్యంతరాలను సరిచేసే దిద్దుబాట్లు కూడా చెయ్యవచ్చు. అయితే, వ్యాసంలో పైభాగాన ఉన్న తొలగింపు నోటీసును మాత్రం తీసెయ్యరాదు. చదువరి (చర్చ • రచనలు) 02:15, 27 అక్టోబరు 2021 (UTC)
మీరు ఎక్కించిన అనాధ ఫైళ్లు
[మార్చు]@రవిచంద్ర గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన స్వేచ్ఛానకలు హక్కులు లేని బొమ్మ(లు) వ్యాస పేరుబరిలో వాడలేదు కావున వికీసమగ్రతకొరకు వాటిని తొలగించే వీలుంది.
వీటిని తొలగించకుండా కాపాడాలంటే వాటిని ఏ వ్యాసంలో వాడదలచారో నిర్ణయించి, దానికి తగిన సముచిత వినియోగ వివరణ చేర్చాలి లేక సవరించాలి. దీనికొరకు బొమ్మ పేజీలో అవసరమైతే {{Non-free use rationale 2}} వాడండి, అలాగే లైసెన్స్ కూడా అవసరమైతే సరిచేయండి. లైసెన్స్ ఉదాహరణలు వర్గం:Wikipedia_image_copyright_templates లో చూడండి. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. మీరు సవరణలు చేస్తే ఆ వివరం స్వేచ్ఛానకలు హక్కులు లేని మీ బొమ్మ(లు) విభాగంలో ఆ బొమ్మ పేరు తరువాత చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 11:21, 2 జనవరి 2022 (UTC)
How we will see unregistered users
[మార్చు]Hi!
You get this message because you are an admin on a Wikimedia wiki.
When someone edits a Wikimedia wiki without being logged in today, we show their IP address. As you may already know, we will not be able to do this in the future. This is a decision by the Wikimedia Foundation Legal department, because norms and regulations for privacy online have changed.
Instead of the IP we will show a masked identity. You as an admin will still be able to access the IP. There will also be a new user right for those who need to see the full IPs of unregistered users to fight vandalism, harassment and spam without being admins. Patrollers will also see part of the IP even without this user right. We are also working on better tools to help.
If you have not seen it before, you can read more on Meta. If you want to make sure you don’t miss technical changes on the Wikimedia wikis, you can subscribe to the weekly technical newsletter.
We have two suggested ways this identity could work. We would appreciate your feedback on which way you think would work best for you and your wiki, now and in the future. You can let us know on the talk page. You can write in your language. The suggestions were posted in October and we will decide after 17 January.
Thank you. /Johan (WMF)
18:20, 4 జనవరి 2022 (UTC)
Mallekedi ramoji అడుగుతున్న ప్రశ్న (08:49, 18 జనవరి 2022)
[మార్చు]గురువు గారూ! వికీపీడియా లో వ్యాసాలు ఎలా వ్రాయాలి ఎలా ప్రచురించాలి తెలుపగలరు --Mallekedi ramoji (చర్చ) 08:49, 18 జనవరి 2022 (UTC)
- వాడుకరి:Mallekedi ramoji గారూ, మొదటగా మీరు కోరుకున్న సమాచారం ఉందో లేదో పైన కుడి వైపున ఉన్న వెతుకు పెట్టె (సర్చ్ బాక్స్)లో వెతకండి. ఒకవేళ మీరు వెతుకుతున్న పేరుతో వ్యాసం లేకపోతే ఆ పేరుతో వ్యాసం సృష్టించమని ఒక ఎర్రటి లంకె వస్తుంది. దాన్ని నొక్కి మీరు వ్యాసం సృష్టించవచ్చు. వికీపీడియాకు కొత్త అయితే మరిన్ని వివరాల కోసం వికీపీడియా:దిద్దుబాట్లు ఎలా చెయ్యాలి అనే లంకె నొక్కి తెలుసుకోండి. ఇంకా ఏదైనా సందేహాలుంటే అడగండి.- రవిచంద్ర (చర్చ) 11:34, 18 జనవరి 2022 (UTC)
Nemani Times అడుగుతున్న ప్రశ్న (06:41, 4 ఫిబ్రవరి 2022)
[మార్చు]నేను రచించిన కథలను వికీపీడియా లో పోస్ట్ చెయ్యడం ఎలా? --Nemani Times (చర్చ) 06:41, 4 ఫిబ్రవరి 2022 (UTC)
- నేమాని గారూ, వికీపీడియా కథల కోసం ఉద్దేశించినది కాదు. ఇది ఒక విజ్ఞాన సర్వస్వం. అంటే వ్యక్తుల గురించి, ప్రాంతాల గురించి, ఇంకా ఇతర అంశాల గురించి వ్యాసాలు ఉంటాయి. అంటే కథల గురించి కూడా రాయవచ్చు. కానే కథలే వ్యాసాలుగా ఉండకూడదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే వికీపీడియాలో స్వంతంగా ఊహించి ఏదీ రాయకూడదు. ఉదాహరణకు మీరు రాసిన కథ గురించి వ్యాసం రాయాలంటే దాన్ని గురించి పేరుపొందిన ఏ వార్తా పత్రికలోనో, లేదా మరో విమర్శ లేదా సమీక్ష పుస్తకంలోనో, లేదా ఇంకో పరిశోధనా పత్రంలోనే ఇదివరకే ప్రచురించి ఉండాలి. అప్పుడు వాటిని మూలాలుగా చూపిస్తూ వ్యాసం రాయవచ్చు. మీకు ఇంకా వికీ గురించి తెలియాలంటే ముందుగా మీకు వచ్చిన స్వాగత సందేశంలో దీని గురించి తెలుసుకోవడానికి కొన్ని లింకులు ఉన్నాయి. వాటిని క్లిక్ చేసి చదవండి. అనుమానాలుంటే అడగండి. అలాగే వికీపీడియా మొదటి పేజీలోకి కొన్ని వ్యాసాల పేజీలకు వెళ్ళి వాటిని ఎలా రాశారో చూడండి. అలాగే పైన ఉన్న వెతుకు పెట్టెలో దేని గురించైనా (మీ ఊరి గురించో, లేక మీకిష్టమైన ప్రముఖ రచయిత గురించో) వెతికి చూడండి. ఆ వ్యాసాలు ఎలా ఉన్నాయో చూడండి. - రవిచంద్ర (చర్చ) 10:37, 4 ఫిబ్రవరి 2022 (UTC)
పల్నాటి యుద్ధం గురించి గూండ్లనారాయణ అడుగుతున్న ప్రశ్న (11:17, 4 ఫిబ్రవరి 2022)
[మార్చు]బాలచంద్రుడు పలికిన వీర వాక్కులు నాకు కావాలి --గూండ్లనారాయణ (చర్చ) 11:17, 4 ఫిబ్రవరి 2022 (UTC)
- నారాయణ గారూ, పల్నాటి యుద్ధం వ్యాసంలో బాలచంద్రుడు పలికిన వీరవాక్కులు యథాతథంగా పేర్కొనడం వికీ ప్రమాణాలకు సరిపోదండీ. పల్నాటి యుద్ధం గురించి స్థూల వివరణ మాత్రమే వ్యాసంలో ఉంటుంది. మీరడిగిన వివరాలు కావాలంటే పుస్తకాల్లో వెతకడం సరైన పద్ధతి. ఒకవేళ అది ఏ పుస్తకంలో రాసుందో మీకు తెలిసి ఉంటే రచయిత పేరు, పుస్తకం పేరు ఆన్ లైన్ లో వెతకండి. ఒకవేళ పాత పుస్తకమైతే ఏదైనా డిజిటల్ గ్రంథాలయంలో దొరకవచ్చు. - రవిచంద్ర (చర్చ) 12:13, 4 ఫిబ్రవరి 2022 (UTC)
2013-11-19కి ముందు ఎక్కించిన సముచిత వినియోగ వివరాలు లేని ఫైళ్లు
[మార్చు]@రవిచంద్ర గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. 2013-11-19కి ముందు ఎక్కించిన స్వేచ్ఛానకలు హక్కులు లేని బొమ్మ(లు) వ్యాస పేరుబరిలో వాడారు కాని, వాటికి సముచిత వినియోగం వివరాలు NFUR లాంటి మూస వాడి చేర్చలేదు. కావున వికీసమగ్రతకొరకు వాటిని తొలగించే వీలుంది.
వీటిని తొలగించకుండా కాపాడాలంటే వాటిని ఏ వ్యాసంలో వాడుతున్నారో, దానికి తగిన సముచిత వినియోగ వివరణ చేర్చాలి లేక సవరించాలి. దీనికొరకు బొమ్మ పేజీలో {{Non-free use rationale 2}} లేక అటువంటి మూస వాడండి, అలాగే లైసెన్స్ కూడా అవసరమైతే సరిచేయండి. లైసెన్స్ ఉదాహరణలు వర్గం:Wikipedia_image_copyright_templates లో చూడండి. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. మీరు సవరణలు చేస్తే ఆ వివరం మీ బొమ్మ(లు) విభాగంలో ఆ బొమ్మ పేరు తరువాత చేర్చండి. మీరు ప్రయత్నించి, ఒక వారం రోజులలోగా మీకు అదనపు సమయం కావలసి వస్తే తెలియచేయండి. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 15:06, 1 మార్చి 2022 (UTC)
Po.indicwiki అడుగుతున్న ప్రశ్న (10:43, 21 మార్చి 2022)
[మార్చు]నమస్సులు , పొరపాటు చేస్తే నా దృష్టి కి తీసుకురండి , వెనువెంటనే సరిదిద్దుకుంటాను సాంకేటిక విషయాలు నాకు కొత్త కనుక నన్ను ముందుకు తీసుకువెళ్లండి Po.indicwiki (చర్చ) 10:43, 21 మార్చి 2022 (UTC)Po.indicwikiPo.indicwiki (చర్చ) 10:43, 21 మార్చి 2022 (UTC)
- తప్పకుండా సహాయం చేస్తామండీ. మీకు ఏ సందేహం ఉన్నా నన్ను అడగండి. - రవిచంద్ర (చర్చ) 06:29, 22 మార్చి 2022 (UTC)
చర్చలలో చురుకైనవారు
[మార్చు]చర్చలలో చురుకైనవారు | ||
@రవిచంద్ర గారు, 2021 లో వ్యాస, వికీపీడియా పేరుబరుల చర్చాపేజీలలో చురుకుగా పాల్గొన్నందులకు అభివందనాలు. గుర్తింపుగా ఈ పతకాన్ని స్వీకరించండి. మరిన్ని వివరాలు చూడండి. వికీపీడియా అభివృద్ధికి సామరస్యపూర్వక చర్చలు కీలకం. మీరు మరింత క్రియాశీలంగా చర్చలలో పాల్గొంటారని ఆశిస్తున్నాను. అర్జున (చర్చ) 06:54, 23 మార్చి 2022 (UTC) |
I want to write about my village. How to start. Please tell me menus/options నేను మా ఊరు గురించి వ్రాయాలి అనుకుంటున్నాను. ఎలా మొదలు పెట్టాలి అండి. నాకు విషయ సూచిక దాని క్రమము తెలుపగలరు --Archavali (చర్చ) 07:45, 20 ఏప్రిల్ 2022 (UTC)
- Archavali గారూ, వికీలో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఊర్ల వ్యాసాలు సృష్టించి ఉన్నాయి. కాబట్టి ముందుగా వాటికోసం వెతకండి. పైన కుడివైపున ఉన్న వెతుకు పెట్టెలో మీ ఊరిపేరు సరైన స్పెల్లింగుతో టైపు చేయండి. అది ఆ పేరుతో ఉన్న వ్యాసానికి దారి తీస్తుంది. ఆ పేజీకి వెళ్ళిన తర్వాత పై భాగంలో మార్చు లేదా సవరించు అనే ట్యాబు ఉంటుంది. అది నొక్కితే మీ ఊరి గురించిన సమాచారాన్ని చేర్చవచ్చు. మీరు వికీకి కొత్త అయితే మీకు పంపిన స్వాగత సందేశంలో అసలు వికీ అంటే ఏమిటి, అందులో ఎలా రాయాలి అనే అంశాలు పొందుపరచబడి ఉన్నాయి. వాటిని తీరిక చేసుకుని చదివి ఆ మీదట మీ సందేహాలను అడగండి. - రవిచంద్ర (చర్చ) 09:15, 20 ఏప్రిల్ 2022 (UTC)
భాను వారణాసి అడుగుతున్న ప్రశ్న (13:16, 20 మే 2022)
[మార్చు]రవిచంద్ర గారూ! మూలాలు ( references) వుంటేనే వ్యాసమవుతుందా? ఈ మూలాల లింక్ ని ఎలా కూర్చవలెను.నేను ఈ వికీ పేడియా ( సమాచార సంక్షిప్త అంతర్జాల విజ్నాన భాండాగారం ) క్రొత్త వాడుకరిని. --భాను వారణాసి (చర్చ) 13:16, 20 మే 2022 (UTC)
- భాను గారూ, అవును, మూలాలు లేనిదే వికీలో వ్యాసం ఉండకూడదని నియమం. మీకు వచ్చిన స్వాగత సందేశంలోనే సహాయం:పరిచయం అనే లంకె మీద నొక్కితే అందులో మూలాలు ఇవ్వడం గురించి రాసి ఉంది. అది చదివిన తర్వాత ఇంకా అనుమానాలు ఉంటే నన్ను అడగండి. కొత్త వాడుకరి అంటున్నారు గనుక కొద్ది రోజులు ఇటీవలి మార్పులు అని ఎడమ వైపున ఉన్న లింకు నొక్కి చూస్తే ఇతర సభ్యులు ఎలాంటి మార్పులు చేస్తున్నారో తెలుస్తుంది.- రవిచంద్ర (చర్చ) 16:57, 20 మే 2022 (UTC)
Mollaraheem అడుగుతున్న ప్రశ్న (03:03, 24 మే 2022)
[మార్చు]నమస్కారం సార్ --Mollaraheem (చర్చ) 03:03, 24 మే 2022 (UTC)
- నమస్తే Mollaraheem గారూ, వికీపీడియాలో మీ సందేహాలుంటే అడగండి. - రవిచంద్ర (చర్చ) 10:06, 24 మే 2022 (UTC)
Sravanthijanardhan అడుగుతున్న ప్రశ్న (06:37, 28 మే 2022)
[మార్చు]hi sir na peru sravanthi --Sravanthijanardhan (చర్చ) 06:37, 28 మే 2022 (UTC)
Sravanthijanardhan అడుగుతున్న ప్రశ్న (06:38, 28 మే 2022)
[మార్చు]sir nenoka story rayalanukuntunna --Sravanthijanardhan (చర్చ) 06:38, 28 మే 2022 (UTC)
- స్రవంతి గారూ, నమస్తే. మీకు పంపిన స్వాగత సందేశంలో వికీలో ఎలాంటి రచనలు రాయవచ్చో ఉంది చూడండి. ఆ లింకు ఇది. దీని మీద నొక్కి ఒకసారి వికీ గురించి చదవండి. కథలు రాయడానికి వికీపీడియా వేదిక కాదు. అందుకోసం మీరు బ్లాగులు లాంటి ఇంకేదైనా వేదిక ఎంచుకోవచ్చు. - రవిచంద్ర (చర్చ) 06:15, 31 మే 2022 (UTC)
నమస్కారం .శ్లోకాలు ,భగవద్గీత శ్లోకాలు వాటి భావము గురుంచి వికీ లో ఆర్టికల్ రాయాలని అనుకుంటున్నాను . ఇది సరియైనా అంశమేనా తెలియచేయగలరు . --అఖిల.ఎస్ (చర్చ) 06:45, 2 జూన్ 2022 (UTC)
- అఖిల గారూ, సాధారణంగా శ్లోకాలు, వాటి తాత్పర్యం, భావం, వివరణ లాంటివి వికీపీడియాకి సరిపడనివి. ఎందుకంటే ఇందులో ఏదైనా అంశం గురించి ఉంటుంది కానీ, అంశమే రాయకూడదు. అంటే భగవద్గీత గురించి - భగవద్గీత అంటే ఏమిటి, ఎవరు, ఎవరితో చెప్పారు, క్లుప్తంగా దాని సారాంశం ఏమిటి లాంటి వివరాలు చేర్చవచ్చును కానీ, శ్లోకాలు మొత్తం అర్థాలతో సహా రాయడానికి వికీ శైలి అంగీకరించదు. అయితే అందుకోసం వికీపీడియా నడుపుతున్న వికీమీడియా ఫౌండేషన్ సంస్థ నడుపుతున్న మరో సోదర ప్రాజెక్టు వికీసోర్సు ఉంది. అందులో మీరనుకుంటున్నవి రాయవచ్చు. ఇందులో మరేదైనా సందేహాలుంటే ఇక్కడే అడగండి. - రవిచంద్ర (చర్చ) 06:52, 2 జూన్ 2022 (UTC)
- ధన్యవాదములు . మన సాంప్రదాయాలు గురుంచి ,ఆహార వివరాల గురుంచి రాయవచ్చ ? అఖిల.ఎస్ (చర్చ) 07:17, 2 జూన్ 2022 (UTC)
- అఖిల గారూ, రాయవచ్చు. అయితే మీరు స్వయంగా కన్నవీ, విన్నవీ, తెలిసినవి కాకుండా వాటిని పుస్తకాలు, పరిశోధనా పత్రాలు లేదా పేరు పొందిన వెబ్ సైట్లు ఆధారంగా చేసుకుని (మూలాలు) రాయాలి. వికీలో స్వీయరచనలు ఉండవు. మూలాలను ఎలా పేర్కొనాలి? ఇంకా ఇతర వివరాల కోసం మీ స్వాగత సందేశంలోని సహాయం:పరిచయం పేజీని చూడండి. - రవిచంద్ర (చర్చ) 08:02, 2 జూన్ 2022 (UTC)
- ధన్యవాదములు . మన సాంప్రదాయాలు గురుంచి ,ఆహార వివరాల గురుంచి రాయవచ్చ ? అఖిల.ఎస్ (చర్చ) 07:17, 2 జూన్ 2022 (UTC)
ఆహ్వానం: వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ (WPWP) 2022
[మార్చు]నమస్కారం
వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ (WPWP) అనేది ప్రతి యేటా నిర్వహించే ఉద్యమం. దీనిలో పాల్గొనే వాడుకరులు బొమ్మలు లేని వ్యాసాలలో బొమ్మలను చేరుస్తారు. వికీమీడియా నిర్వహించే అనేక ఫోటోగ్రఫీ పోటీలద్వారా, ఫోటో వాక్‌ల ద్వారా సేకరించిన ఫోటోలను వికీపీడియా వ్యాసాలలో ఉపయోగించడాన్ని ప్రోత్సహించడమే ఈ ఉద్యమం ఉద్దేశం. బొమ్మలు పాఠకుల దృష్టిని అక్షరాలకన్నా ఎక్కువగా ఆకర్షిస్తాయి. సచిత్ర వ్యాసాలు బొమ్మలు లేని వ్యాసాలతో పోలిస్తే ఆకర్షణీయంగా ఉండి పాఠకుల మనసును ఆకట్టుకుంటాయి.
వికీ లవ్స్ మాన్యుమెంట్స్, వికీ లవ్స్ ఆఫ్రికా, వికీ లవ్స్ ఎర్త్, వికీ లవ్స్ ఫోక్‌లోర్ వంటి అనేక అంతర్జాతీయ పోటీలద్వారా, ఇతర అనేక మార్గాల ద్వారా వికీమీడియా కామన్స్లో ఎన్నో వేల చిత్రాలను చేర్చారు. ఐతే వీటిలో కొన్ని మాత్రమే వికీపీడియా వ్యాసాలలో ఉపయోగించబడ్డాయి. ఈ ఖాళీని పూరించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం.
ఈ ప్రాజెక్టుని ఘనంగా జరుపుకోవడానికి మన తెలుగు వికీపీడియా సభ్యులందరూ చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఆసక్తి గల సభ్యులు, మరిన్ని వివరాలకు , పాల్గొనటానికి ప్రాజెక్టు పేజీ వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2022 ని చూడగలరు.
మీ NskJnv 18:13, 29 జూన్ 2022 (UTC)
తొలగింపు వ్యాసాలపై పూర్తి చర్యలు చేపట్టుట
[మార్చు]రవిచంద్ర గారూ మీరు ఈ రోజు తొలగింపు వ్యాసాలపై చర్యలు చేపట్టినందుకు ధన్యవాదాలు.అయితే మీరు మీ వృత్తిరీత్యా పనివత్తిడిలో ఉన్నందుననేమో అసంపూర్తిగా చేపట్టారు.వికీపీడియా:తొలగింపు పద్ధతి ప్రకారం ఇంకా కొన్ని చర్యలు చేపట్టవలసి ఉంది.మీకు తెలియదు అని కాదు.చేయరని కాదు.గుర్తు చేద్దామనే ఉద్దేశ్యంతో వివరిస్తున్నాను.ఏమి అనుకోవద్దు.
- వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/యమగోల మధుమతి
- వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/గెరాల్డ్ ఎడెల్మాన్
- వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/అయనీకరణం
- వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/గణక వ్యవహారిణి
- వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/గోర్యో
- వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/హోమ్
- వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/మద్యం ప్రభావం
- తొలగించిన వ్యాసాల చర్చా పేజీలలో వ్యాతొలపైన (శీర్శిక పైన), వ్యాతొలకింద (చర్చ దిగువ) మూసలు పెట్టి, వ్యాతొలపైన మూస కింద మీరు "తొలగించవచ్చును", లేదా "తొలగించాలి" అనే నిర్ణయం సంతకంతో రాసి ఆ చర్చాపేజీని తాజా వ్యాసాల జాబితా నుండి తొలగించి, దానిని తొలగించిన వ్యాసాల చర్చల జాబితా లో చేర్చాలి.
- కొన్ని వ్యాసాలలో తగిన సవరణలు చేసి, మూలాలు కూర్పు చేస్తున్నారు.ఇది చాలా హర్షించతగ్గ విషయం.అయితే మీరు ఆ చర్చాపేజీలో ఈ వ్యాసాన్ని నేను బాగు చేసాను. తొలగింపు అవసరం లేకుండా మూస తీసివేశాను అని రాస్తున్నారు.తొలగించటానికి మీరు కాకుండా ఇతరులు ప్రతిపాదించిన వ్యాసాలలో సవరించిన తరువాత మీ అభిప్రాయం మాత్రమే రాసి,మూసను మాత్రం మీరు తీసివేయకండి.చర్చలో పాల్గొనని వాడుకరి నిర్ణయం ప్రకటించి, అది చేరవలసిన స్థానానికి (అంటే పైన వివరించిన ప్రాసెస్ ప్రకారం) చేరుస్తారు.అదే మీరు ప్రతిపాదిస్తే, దానిలో ఎవరైనా తగిన సవరణలు చేసి,మూలాలు అవి కూర్పు చేస్తే,మీరు దానికి సంతృప్తి చెందితే, పైన వివరించిన ప్రకారం తగిన నిర్ణయం ప్రకటించి,తొలగింపు మూసను మీరు తొలగించి, తదుపరి చర్యలు చేపట్టాలి.అన్యధా బావించవద్దు.--యర్రా రామారావు (చర్చ) 08:45, 1 జూలై 2022 (UTC)
- రామారావు గారూ, మీరు చెప్పినట్లే తొలగింపు విధానం నేను పూర్తిగా అనుసరించలేదు. ఆ అసంపూర్తి పనులను వీలు వెంబడి పూర్తి చేస్తాను. అలాగే మీరు పైన చెప్పిన పద్ధతుల్లో కొంత అనవసర బ్యూరోక్రసీ ఉన్నట్లు నాకు అనిపించింది. ఉదాహరణకు మీరు ఒక పేజీని తొలగింపుకు ప్రతిపాదించారు. నేను దానికి సవరణలు చేసి, చర్చా పేజీలో రాశాను. కొద్ది రోజులకు మీరు చేర్చిన తొలగింపు ప్రతిపాదన తీసేస్తారేమోనని ఎదురు చూశాను కానీ అలా జరగలేదు. అందుకనే చొరవగా ఆ పేజీలోని తొలగింపు మూస నేనే తీసేశాను. (పరిటాల ఓంకార్) మనం ఎన్ని నియమాలు ఏర్పాటు చేసుకున్నా చొరవగా మార్పులు చేయడమనేది ఒక మూల సిద్ధాంతం. రవిచంద్ర (చర్చ) 09:07, 1 జూలై 2022 (UTC)
- రవిచంద్ర గారూ మీరు వెంటనే స్పందించి, చర్యలు చేపట్టినందుకు ధన్యవాదాలు.నేను వివరించిన మూస తొలగించే విషయంలో పేజీ సృష్టికర్త లేదా సాధారణ వాడుకరిని దృష్టిలో పెట్టుకుని తొలగింపు విధానం తెలిపే ఉద్దేశ్యంతో వివరించాను.నిర్వాహకుడిగా నిర్ణయం ప్రకటించి మూసను తొలగించే హక్కు మీకుంది. దానిలో ఎంత మాత్రం తప్పులేదు.భాదిస్తే క్షమించండి. యర్రా రామారావు (చర్చ) 10:48, 1 జూలై 2022 (UTC)
- రామారావు గారూ, నిర్వాహకుడైనా సరే, ఎవరైనా ఒక పనిని ఇలా ఎందుకు చేశారని ప్రశ్నించవచ్చు. మీరు మంచి పని చేశారు. మీరు చెప్పింది సరైంది అనిపించింది కాబట్టి దాన్ని సరిదిద్దుకుంటాను. ఇందులో మీరు, నేను బాధ పడాల్సింది ఏమీ లేదు. క్షమాపణలు అంతకన్నా అవసరం లేదు. తెవికీలో క్రియాశీలకంగా ఉన్న సభ్యులు, నిర్వాహకులు తక్కువగా ఉండటం వల్ల పనులు వేగిరం చేయడం కోసమే మనం ఏర్పాటు చేసిన నియమాలను అతిక్రమించి ఉంటాను కానీ, ఉద్దేశపూర్వకంగా కాదు. అది కూడా వికీకి మేలు జరిగేలా ఉండేలానే ప్రయత్నిస్తాను. తొలగింపు ప్రతిపాదనల విషయంలో అదే జరిగింది. చాలా రోజులుగా ఆ పని పెండింగులో ఉంది కాబట్టి పలువురు సభ్యులు పద్ధతి ప్రకారం చేయాల్సిన కొన్ని పనులు నేను ఒక్కడినే చేశాను. - రవిచంద్ర (చర్చ) 10:59, 1 జూలై 2022 (UTC)
- రవిచంద్ర గారూ మీరు వెంటనే స్పందించి, చర్యలు చేపట్టినందుకు ధన్యవాదాలు.నేను వివరించిన మూస తొలగించే విషయంలో పేజీ సృష్టికర్త లేదా సాధారణ వాడుకరిని దృష్టిలో పెట్టుకుని తొలగింపు విధానం తెలిపే ఉద్దేశ్యంతో వివరించాను.నిర్వాహకుడిగా నిర్ణయం ప్రకటించి మూసను తొలగించే హక్కు మీకుంది. దానిలో ఎంత మాత్రం తప్పులేదు.భాదిస్తే క్షమించండి. యర్రా రామారావు (చర్చ) 10:48, 1 జూలై 2022 (UTC)
వాడుకరి చర్చ:Durgam Madhukar గురించి Durgam Madhukar అడుగుతున్న ప్రశ్న (08:58, 1 జూలై 2022)
[మార్చు]Okkk --Durgam Madhukar (చర్చ) 08:58, 1 జూలై 2022 (UTC)
కృతజ్ఞత
[మార్చు]నమస్కారం సార్, మీ సూచనకు కృతజ్ఞతలు --Prasharma681 (చర్చ) 09:09, 14 జూలై 2022 (UTC)
వికీపీడియా చర్చ:కోరుచున్న వ్యాసములు గురించి Yalagalaramesh అడుగుతున్న ప్రశ్న (17:11, 5 ఆగస్టు 2022)
[మార్చు]Sir how shown google my Wikipedia. --Yalagalaramesh (చర్చ) 17:11, 5 ఆగస్టు 2022 (UTC)
- రమేష్ గారూ, మీరు అడిగిన ప్రశ్న నాకు సరిగా అర్థం కాలేదు. తెలుగులో అడగండి. తెలుగును ఇంగ్లీషులో టైపు చేసిన పరవాలేదు. - రవిచంద్ర (చర్చ) 16:28, 9 ఆగస్టు 2022 (UTC)
Lekhanandaswamy అడుగుతున్న ప్రశ్న (12:38, 12 ఆగస్టు 2022)
[మార్చు]హాయ్ --Lekhanandaswamy (చర్చ) 12:38, 12 ఆగస్టు 2022 (UTC)
- హలో వికీపీడియాకు సంబంధించి ఏదైనా సందేహాలుంటే నన్ను అడగండి. - రవిచంద్ర (చర్చ) 14:46, 16 ఆగస్టు 2022 (UTC)
ఆంధ్రప్రదేశ్ సంబంధించిన తొలి పరస్పర నిర్వహణ ప్రక్రియకు చురుకుగా తోడ్పడినవారు
[మార్చు]ఆంధ్రప్రదేశ్ సంబంధించిన తొలి పరస్పర నిర్వహణ ప్రక్రియకు చురుకుగా తోడ్పడినవారు | ||
@రవిచంద్ర గారికి, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన తొలి పరస్పర నిర్వహణ ప్రక్రియ లో చురుకుగా పాల్గొన్నందులకు, మీ సహకారానికి అభివందనాలు. గుర్తింపుగా ఈ పతకాన్ని స్వీకరించండి. --అర్జున (చర్చ) 09:34, 15 ఆగస్టు 2022 (UTC) |
కరుణాకరన్ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను :
- ఈ వ్యాసం ఏక వాక్యంతో సృష్టించి చాలా కాలం అయింది. మూలాలు లేవు. 2022 సెప్టెంబరు 10 లోపు తగిన మూలాలతో విస్తరించనియెడల తొలగించటానికి ప్రతిపాదిస్తున్నాను.
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/కరుణాకరన్ పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. యర్రా రామారావు (చర్చ) 18:04, 31 ఆగస్టు 2022 (UTC) యర్రా రామారావు (చర్చ) 18:04, 31 ఆగస్టు 2022 (UTC)
కృతజ్ఞతలు సార్ తప్పకుండా మీ సూచనలు పాటిస్తాను. --Prasharma681 (చర్చ) 06:12, 14 సెప్టెంబరు 2022 (UTC)
గురువు గారికి నమస్కారం. వికీపీడియా లో శ్రీ సూరంపూడి సీతారాం గారిని గురించి చూసినప్పటినించీ వారిని గురించిన వివరాలు అక్కడ చాలాతక్కువ ఉన్నందున వారిమీద గౌరవం కొద్దీ నాకు ఇన్టర్నెట్ లో లభించిన వారి ఒక పుస్తకం లో అనువాదకుని గురించిన 'పరిచయం' లోని విషయాలు యధాతథంగా చేర్చాను. ఇది కాపీరైట్ కి ఎంతవరకూ వ్యతిరేకమో నాకు తెలియదు. దయచేసి ఈ విషయంలో మార్గదర్శనం చేయగలరు. భవదీయుడు. డారాకృ --డారాకృ (చర్చ) 04:29, 14 అక్టోబరు 2022 (UTC)
- డారాకృ గారూ, పుస్తకంలో ఉన్న వివరాలు యధాతథంగా చేర్చడం కాపీరైటుకి వ్యతిరేకమే. సాధారణంగా ఆవిషయాలు క్లుప్తంగా, విజ్ఞానదాయకమైన వికీశైలిలోకి మార్చి రాస్తాము. నేను మీరు పేర్కొన్న వ్యాసాన్ని పరిశీలించి తగ్గ మార్పులు చేసి మీకు చెబుతాను. ఒకసారి గమనించండి. - రవిచంద్ర (చర్చ) 05:35, 14 అక్టోబరు 2022 (UTC)
గురువుగారికి నమస్కారం! సూరంపూడి సీతారాం గారిమీద, నేను వ్రాసినదాని విషయమై, కాపీరైట్ గురించిన మీ సూచనలు చదివాను. ఆ తర్వాత నేను నా సొంత వాక్యాలలో రాసి క్రింద పొందుపరిచాను. ఇది మీకు సమ్మతమైతే ప్రచురిస్తాను. -- డారాకృ
జననం: 10 జనవరి, 1921 (పశ్చిమ గోదావరి జిల్లా, కోరుమిల్లి గ్రామం) మరణం: 16 సెప్టెంబర్, 1987 (హైద్రాబాద్) విద్య : B.A. (Mathematics) సాహిత్యవ్యాసంగం: కలకత్తా లో పనిచేసినప్పుడు వంగ భాషను నేర్చుకొని కొన్ని ప్రముఖ రచనలను తెలుగులోకి అనువదించారు. వీటిలో ముఖ్యమైనవి రవీంద్రుని ‘యోగా యోగ్’, బిభూతి భూషన్ బంధోపాధ్యాయ రచన ‘అరన్యక’, మహాశ్వేతాదేవి రచన ‘ఆత్మజ’ మొదలైనవి. ఆంగ్లభాషా సాహిత్యం నుండి అనువదించిన నవలల్లో ‘కౌంట్ ఆఫ్ మాంట్ క్రిస్టో’ (‘అలెక్జాన్డర్ డ్యూమాస్’ రచన), ‘ఘంటారావం’ (‘హంచ్ బ్యాక్ ఆఫ్ నాటర్ డామ్’ రచన) ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. పలు సంవత్సరాలు ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక (దిన, వార పత్రిక) ల్లో సంపాదకత్వం నిర్వహించారు. 1981 లో కేంద్ర ప్రభుత్వ సమాచార శాఖ లో డెప్యూటీ ప్రిన్సిపల్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ గా రిటైర్ అయ్యారు. వ్యక్తిత్వం: సీతారాం పిన్నవయస్సులోనే భగవద్గీత, ఉపనిషత్తులూ, శంకరాచార్యులవారి భాష్యాలు మొదలైనవి చదివారు. ఐనా ఆయన అభ్యుదయవాదిగానే పేరుగాంచారు. ఆయన సాహిత్యపిపాసి అని అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆలిండియా రేడియో నించి రోజూ ఉదయం, సాయంత్రం సరీగ్గా 7:00 గంటలకి “వార్తలు, చదువుతున్నది, సూరంపూడి సీతారాం” అన్న ఆయన గళం అప్పట్లో తెలుగువారందరికీ సుపరిచయం. ఆయన మరణం తెలుగు సాహిత్యానికి తీరని లోటు. --డారాకృ (చర్చ) 10:11, 16 అక్టోబరు 2022 (UTC)
- డారాకృ గారూ, మీరు రాసినది చాలా వరకు వికీ శైలిలో ఉంది. సూరంపూడి సీతారామ్ పేజీలో నేను కొన్ని సవరణలు చేసి ఉన్నాను. ఒకసారి అవి పరిశీలించ గలరు. తెలుగువికీలో ఎవరి వ్యాసమైనా ఏకవచనం లో రాయడం ఇక్కడి సాంప్రదాయం. అదే నేను వాడాను. ఇంకా వికీపీడియా:శైలి లో కొన్ని మార్గనిర్దేశనాలు ఉన్నాయి. వాటిని కూడా పరిశీలించి కొరవడిన సమాచారాన్ని చొరవగా పేజీలో చేర్చండి. శైలికి తగినట్లుగా నేను గానీ, మరెవరరైనా మారుస్తారు. - రవిచంద్ర (చర్చ) 06:44, 17 అక్టోబరు 2022 (UTC)
Gangula sreenivasareddy అడుగుతున్న ప్రశ్న (11:44, 18 అక్టోబరు 2022)
[మార్చు]good evening sir.... telugu type ela cheyali --Gangula sreenivasareddy (చర్చ) 11:44, 18 అక్టోబరు 2022 (UTC)
- శ్రీనివాసరెడ్డి గారూ, వికీపీడియా:టైపింగు_సహాయం లింకును నొక్కి తెలుసుకోండి. అందులో కీబోర్డులో ఏది నొక్కితే ఏ తెలుగు అక్షరం వస్తుందో రాసి ఉంది. అలాగే తెలుగు వికీలో టైపు చేసేటపుడు భాషను ఎలా ఎంచుకోవాలో, తెలుగుకి, ఇంగ్లీషుకి మారడానికి Ctl + M ని వాడవచ్చు. ఇంకా సందేహాలుంటే అడగండి. - రవిచంద్ర (చర్చ) 12:33, 18 అక్టోబరు 2022 (UTC)
WikiConference India 2023: Program submissions and Scholarships form are now open
[మార్చు]Dear Wikimedian,
We are really glad to inform you that WikiConference India 2023 has been successfully funded and it will take place from 3 to 5 March 2023. The theme of the conference will be Strengthening the Bonds.
We also have exciting updates about the Program and Scholarships.
The applications for scholarships and program submissions are already open! You can find the form for scholarship here and for program you can go here.
For more information and regular updates please visit the Conference Meta page. If you have something in mind you can write on talk page.
‘‘‘Note’’’: Scholarship form and the Program submissions will be open from 11 November 2022, 00:00 IST and the last date to submit is 27 November 2022, 23:59 IST.
Regards
MediaWiki message delivery (చర్చ) 11:25, 16 నవంబరు 2022 (UTC)
(on behalf of the WCI Organizing Committee)
WikiConference India 2023: Help us organize!
[మార్చు]Dear Wikimedian,
You may already know that the third iteration of WikiConference India is happening in March 2023. We have recently opened scholarship applications and session submissions for the program. As it is a huge conference, we will definitely need help with organizing. As you have been significantly involved in contributing to Wikimedia projects related to Indic languages, we wanted to reach out to you and see if you are interested in helping us. We have different teams that might interest you, such as communications, scholarships, programs, event management etc.
If you are interested, please fill in this form. Let us know if you have any questions on the event talk page. Thank you MediaWiki message delivery (చర్చ) 15:21, 18 నవంబరు 2022 (UTC)
(on behalf of the WCI Organizing Committee)
WikiConference India 2023: Open Community Call and Extension of program and scholarship submissions deadline
[మార్చు]Dear Wikimedian,
Thank you for supporting Wiki Conference India 2023. We are humbled by the number of applications we have received and hope to learn more about the work that you all have been doing to take the movement forward. In order to offer flexibility, we have recently extended our deadline for the Program and Scholarships submission- you can find all the details on our Meta Page.
COT is working hard to ensure we bring together a conference that is truly meaningful and impactful for our movement and one that brings us all together. With an intent to be inclusive and transparent in our process, we are committed to organizing community sessions at regular intervals for sharing updates and to offer an opportunity to the community for engagement and review. Following the same, we are hosting the first Open Community Call on the 3rd of December, 2022. We wish to use this space to discuss the progress and answer any questions, concerns or clarifications, about the conference and the Program/Scholarships.
Please add the following to your respective calendars and we look forward to seeing you on the call
- WCI 2023 Open Community Call
- Date: 3rd December 2022
- Time: 1800-1900 (IST)
- Google Link': https://meet.google.com/cwa-bgwi-ryx
Furthermore, we are pleased to share the email id of the conference contact@wikiconferenceindia.org which is where you could share any thoughts, inputs, suggestions, or questions and someone from the COT will reach out to you. Alternatively, leave us a message on the Conference talk page. Regards MediaWiki message delivery (చర్చ) 16:21, 2 డిసెంబరు 2022 (UTC)
On Behalf of, WCI 2023 Core organizing team.
WikiConference India 2023:WCI2023 Open Community call on 18 December 2022
[మార్చు]Dear Wikimedian,
As you may know, we are hosting regular calls with the communities for WikiConference India 2023. This message is for the second Open Community Call which is scheduled on the 18th of December, 2022 (Today) from 7:00 to 8:00 pm to answer any questions, concerns, or clarifications, take inputs from the communities, and give a few updates related to the conference from our end. Please add the following to your respective calendars and we look forward to seeing you on the call.
- [WCI 2023] Open Community Call
- Date: 18 December 2022
- Time: 1900-2000 [7 pm to 8 pm] (IST)
- Google Link: https://meet.google.com/wpm-ofpx-vei
Furthermore, we are pleased to share the telegram group created for the community members who are interested to be a part of WikiConference India 2023 and share any thoughts, inputs, suggestions, or questions. Link to join the telegram group: https://t.me/+X9RLByiOxpAyNDZl. Alternatively, you can also leave us a message on the Conference talk page. Regards MediaWiki message delivery (చర్చ) 08:11, 18 డిసెంబరు 2022 (UTC)
On Behalf of, WCI 2023 Organizing team
దశరథుడు వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను :
- ఈ వ్యాసంలో తగిన మూలాలు లేవు.వారం రోజులలోపు వ్యాసంలో తగిన మూలాలు చేర్చనియెడల తొలగించాలి.
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/దశరథుడు పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. యర్రా రామారావు (చర్చ) 07:10, 26 ఫిబ్రవరి 2023 (UTC) యర్రా రామారావు (చర్చ) 07:10, 26 ఫిబ్రవరి 2023 (UTC)
Creativethinks4c5 అడుగుతున్న ప్రశ్న (13:02, 5 మార్చి 2023)
[మార్చు]hi sir ,how to change my name? --Creativethinks4c5 (చర్చ) 13:02, 5 మార్చి 2023 (UTC)
- @Creativethinks4c5 గారూ, మీ పేరు మార్చుకోవడానికి వికీ అధికారులను సంప్రదించవచ్చు. లేదా మెటావికీ లో పేరు మార్చమని అడగవచ్చు. - రవిచంద్ర (చర్చ) 10:12, 7 మార్చి 2023 (UTC)
- నేను చూసాను కానీ సరిగా అర్థం అవలేదు Creativethinks4c5 (చర్చ) 16:16, 29 మార్చి 2023 (UTC)
Hi! You have uploaded this file with the text "The author has given permission to use this photo.". Permissions should be send to the permission system (c:COM:VRT). Do you still have contact to the author? If yes then author should send the permission to VRT. Same with any other files you have uploaded with a permission. --MGA73 (చర్చ) 19:10, 1 ఏప్రిల్ 2023 (UTC)
- Actually, I am the author of this photo. I might have written the description by mistake. I should have mentioned that the person in this photo has agreed to upload this photo on Wikimedia. If I ask him to send an email to permissions-commons@wikimedia.org with his approval to use this photo, will that suffice for using this photo on Wiki? - రవిచంద్ర (చర్చ) 07:36, 4 ఏప్రిల్ 2023 (UTC)
Kontham vasundhara అడుగుతున్న ప్రశ్న (14:47, 2 జూన్ 2023)
[మార్చు]halo gurugaru namaskaram ela cheyalo koncham explain chesthara please Thank you. --Kontham vasundhara (చర్చ) 14:47, 2 జూన్ 2023 (UTC)
- వసుంధర గారూ, వికీపీడియాలో వ్యాసాలు ఎలా రాయాలో, దిద్దుబాట్లు ఎలా చేయాలో తెలుసుకోవడానికి ముందుగా మీకు స్వాగత సందేశంలో వచ్చిన సహాయం:పరిచయం నొక్కి అందులో ఉన్న స్టెప్స్ అనుసరించండి. అది చాలా సులభమైన పద్ధతి. దాన్ని అనుసరించడంలో సమస్యను సూటిగా అడిగితే దానికి నేరుగా సమాధానం ఇవ్వగలము. మీరు పైన అడిగిన ప్రశ్న పెద్దది. దానికి నేను పెద్దగా సమాధానం ఇచ్చినా అంత ఉపయోగకరం కాకపోవచ్చు. - రవిచంద్ర (చర్చ) 18:16, 2 జూన్ 2023 (UTC)
అధికారిగా
[మార్చు]అధికారి బాధ్యతలను నెత్తికెత్తుకున్నందుకు ధన్యవాదాలు, అభినందనలు. __ చదువరి (చర్చ • రచనలు) 23:31, 9 జూలై 2023 (UTC)
- రవిచంద్ర గారూ మీరు అధికారిగా బాధ్యతలను స్వీకరించిన సందర్భంగా అభినందనలు. యర్రా రామారావు (చర్చ) 05:06, 10 జూలై 2023 (UTC)
- ధన్యవాదాలు రామారావు గారూ! రవిచంద్ర (చర్చ) 06:10, 10 జూలై 2023 (UTC)
- ధన్యవాదాలు చదువరి గారూ! అధికారిగా మీరు చాలా చేశారు. అందులో నేను కొద్దిభాగం చేసిన సఫలీకృతుణ్ణి అయినట్టే. - రవిచంద్ర (చర్చ) 06:10, 10 జూలై 2023 (UTC)
Translation request
[మార్చు]Hello.
Can you create the article en:Laacher See, which is the third most powerful volcano in Europe after Campi Flegrei and Santorini, in Telugu Wikipedia?
Yours sincerely, Multituberculata (చర్చ) 05:20, 12 జూలై 2023 (UTC)
Please delete this vandalism
[మార్చు]Hi, I found your account with the help of [1]. Could you please execute this speedy deletion request? It's a few weeks old now. Thank's a lot and greetings from Germany! -- Aka (చర్చ) 20:36, 14 జూలై 2023 (UTC)
- It's still there ... :( -- Aka (చర్చ) 14:34, 1 సెప్టెంబరు 2023 (UTC)
N.sathyanarayanareddy అడుగుతున్న ప్రశ్న (20:14, 12 ఆగస్టు 2023)
[మార్చు]Hi --N.sathyanarayanareddy (చర్చ) 20:14, 12 ఆగస్టు 2023 (UTC)
Invitation to Rejoin the Healthcare Translation Task Force
[మార్చు]You have been a medical translators within Wikipedia. We have recently relaunched our efforts and invite you to join the new process. Let me know if you have questions. Best Doc James (talk · contribs · email) 12:34, 13 August 2023 (UTC)
గొడ్డు వెలగల ఉదయ్ కిరణ్ అడుగుతున్న ప్రశ్న (06:21, 22 ఆగస్టు 2023)
[మార్చు]రవిచంద్ర గారు ముందుగా మీకు ధన్యవాదాలు. నేను వికీపీడియాలో కొత్తవాడు కరిని. మీరు దయచేసి వికీపీడియాలో కొత్త వ్యాసాలను ఎలా సృష్టించాలో తెలియజేయండి. --గొడ్డు వెలగల ఉదయ్ కిరణ్ (చర్చ) 06:21, 22 ఆగస్టు 2023 (UTC)
- ఉదయ్ కిరణ్ గారు, కొత్త వ్యాసం సృష్టించడానికి కుడివైపున పైన ఉన్న వెతుకు అనే పెట్టెలో మీకు కావలసిన పేరును ఎంటర్ చేస్తే ఒక వేళ అదే పేరుతో వ్యాసం ఉంటే అది తెరుచుకుంటుంది. లేకపోతే, వ్యాసం సృష్టించమని ఒక ఎర్ర లింకు వస్తుంది. ఆ ఎర్ర లింకు మీద నొక్కి మీరు వ్యాసం సృష్టించవచ్చు. ఇంకా మంచి పద్ధతి ఏమిటంటే ముందుగా మీరు రాయదలుచుకున్న వ్యాసాన్ని మీ సభ్యపేజీకి ఉప పేజీగా (ప్రయోగశాల, లేదా శాండ్ బాక్స్) లో సృష్టించవచ్చు. అంతా బాగుంది అనుకుంటే దాన్ని వ్యాసంగా ప్రచురించవచ్చు. మరిన్ని వివరాలకు సహాయం పేజీని చూడండి. - రవిచంద్ర (చర్చ) 06:48, 22 ఆగస్టు 2023 (UTC)
లలిత గ్లోబల్ అడుగుతున్న ప్రశ్న (21:10, 30 ఆగస్టు 2023)
[మార్చు]హాయ్ సార్ నేనొక పేజీని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను సహాయం cheyandi --లలిత గ్లోబల్ (చర్చ) 21:10, 30 ఆగస్టు 2023 (UTC)
- లలిత గారూ, దేని మీద వ్యాసం రాయాలనుకుంటున్నారో చెప్పండి. ముందుగా ఆ పేరుతో కుడివైపున పైన ఉన్న పెట్టెలో టైపు చేసి వెతకండి. ఒకవేళ ఇదివరకే ఆ వ్యాసం ఉంటే కనిపిస్తుంది. లేకపోతే ఒక ఎర్ర లింకు చూపిస్తుంది. దానిమీద క్లిక్ చేసి వ్యాసం సృష్టించవచ్చు. - రవిచంద్ర (చర్చ) 17:42, 31 ఆగస్టు 2023 (UTC)
మీకు తెలుసా..?
[మార్చు]- ... "మీకు తెలుసా" శీర్షికలో ఉన్న విశేషాల్లో సుమారు 35% మీరే చేర్చారనీ, ఆ విధంగా తెవికీ మొదటిపేజీని సమాచార భరితంగా చేసారనీ!
మీకు తెలుసా బార్న్‌స్టార్ | ||
రవిచంద్ర గారూ, మీకు తెలుసా శీర్షికలో మీ కృషికి ధన్యవాదాలతో ఈ చిరుకానుక. __చదువరి (చర్చ • రచనలు) 09:25, 18 సెప్టెంబరు 2023 (UTC) |
- మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు, చదువరి గారూ! రవిచంద్ర (చర్చ) 15:59, 20 సెప్టెంబరు 2023 (UTC)
Padamatinti nagendar అడుగుతున్న ప్రశ్న (05:55, 29 సెప్టెంబరు 2023)
[మార్చు]రవిచంద్ర గురువులకు ప్రణామాలు. గురువు గారు, నా పేరు నాగేందర్ పడమటింటి. జర్నలిస్టుగా 16 సంవత్సరాలు పనిచేశాను. ఆ అనుభవం వృధా కాకూడదు అనే ఉద్దేశంతో వికీపీడియాకు స్వచ్ఛందంగా పనిచేయాలని అనుకుంటున్నాను. మీరు గురువుగా నాకు లభించడం మహద్భాగ్యం. దయచేసి నాకు ఈ విషయంలో సహాయం చేయగలరు. ఏమైనా సందేహాలు ఉంటే వాటికి జవాబులు తెలపవలసిందిగా మిమ్ములను కోరుతున్నాను. ధన్యవాదములు. మీ సమాధానం కొరకు ఎదురు చూస్తున్నాను. --Padamatinti nagendar (చర్చ) 05:55, 29 సెప్టెంబరు 2023 (UTC)
- నాగేందర్ గారూ, నమస్తే, ముందుగా వికీపీడియాలో ఖాతా తెరిచి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు. వికీపీడియా అనేది ఎవరైనా రాయదగిన ఉచిత, స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం అని మీకు తెలిసే ఉండవచ్చు. మీరు జర్నలిస్టుగా పనిచేసిన అనుభవం వికీలో సమాచారం చేర్చేందుకు బాగా ఉపకరిస్తుంది అనుకుంటున్నాను. అయితే వికీ అనేది నిజాలు (ఫ్యాక్ట్స్) మీద ఆధార పడ్డ వ్యవస్థ. ఇందులో ఏది రాసినా అందుకు తగ్గ మూలం (పరిశోధనా పత్రమో, పుస్తకమో, పేరు పొందిన వెబ్ సైటు) చూపించాలి. వేరే చోట ఉన్న విషయాలు యథాతథంగా కాపీ చేయకూడదు. ఇంకా వికీలో రాసేందుకు ఒక ప్రత్యేకమైన శైలి ఉంది. ఇవన్నీ మీకు పంపిన స్వాగత సందేశంలో లింకులు రూపంలో ఉన్నాయి. వాటిని గమనించి, ఇతరులు రాసిన వ్యాసాలు పరిశీలించి మీరు కూడా రాయడం మొదలు పెట్టవచ్చు. ఇందులో ఎలాంటి సందేహాలున్నా నన్ను ఇక్కడే అడగండి. మరొక్కసారి ధన్యవాదాలు. - రవిచంద్ర (చర్చ) 06:07, 3 అక్టోబరు 2023 (UTC)
తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం
[మార్చు]నమస్కారం, తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు విశాఖపట్నం వేదికగా 20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. 10 రోజులపాటు (అంటే డిసెంబరు 21, 2023 దాకా) ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 14:19, 11 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)
Sir maa inti perunu list nandu cherchandi --UNDRU SVU (చర్చ) 12:02, 16 డిసెంబరు 2023 (UTC)
- మీ ఇంటి పేరును ఏ జాబితాలో చేర్చాలో కాస్త చెబుతారా?- రవిచంద్ర (చర్చ) 15:57, 16 డిసెంబరు 2023 (UTC)
నమస్కారం @ రవిచంద్ర గారు,
స్త్రీవాదము - జానపదము అనేది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలలలో వికీపీడియాలో జరిగే అంతర్జాతీయ రచనల పోటీ. వికీపీడియాలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన జానపద సంస్కృతి, జానపద కథలతో సంబంధం ఉన్న స్త్రీలకు సంబంధించిన అనేక అంశాలను డాక్యుమెంట్ చేయడం దీని ఉద్దేశం. ఈ ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా జానపద వారసత్వాన్ని డాక్యుమెంట్ చేయడానికి వికీమీడియా కామన్స్‌లో నిర్వహించబడిన వికీ లవ్స్ ఫోక్‌లోర్ (WLF) ఫోటోగ్రఫీ ప్రచారానికి వికీపీడియా మరోరూపం. ఈ ప్రాజెక్టులో జానపద ఉత్సవాలు, జానపద నృత్యాలు, జానపద సంగీతం, జానపద మహిళలు, విచిత్రమైన జానపద కథలు, జానపద ఆటల క్రీడాకారులు, పురాణాలలో మహిళలు, జానపద కథలలో మహిళా యోధులకు గురించిన కొత్త వ్యాసాలను రాయడం లేదా వికీలో ఉన్న వ్యాసాలను మెరుగుపరచవచ్చు.
2024 గాను ఫిబ్రవరి మార్చి రెండు నెలల్లో స్త్రీవాదం- జానపదం ప్రాజెక్టును నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టులో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు కూడ అందిస్తున్నాము.
వెంటనే స్త్రీవాదము-జానపదము ప్రాజెక్టు పేజీ సందర్శించి మీ వంతు సహకారం అందించగలరు.
ధన్యవాదాలు.
ఇట్లు
Tmamatha (చర్చ) 10:42, 5 ఫిబ్రవరి 2024 (UTC)
నిర్వాహకత్వ హక్కులు పొందటానికి కొత్త మార్గదర్శకాలు పేజీలో స్పందించం
[మార్చు]రవిచంద్ర గారూ, నిర్వాహకత్వ బాధ్యతలు స్వీకరించుటకు కావలిసిన కనీస మార్గదర్శకాలు సూచించటానికి తయారుచేసిన కొత్త మార్గదర్శకాల ప్రతిపాదనల పేజీలో మీరు 2024 మార్చి 31 లోపు స్పందించవలసినదిగా కోరుచున్నాను. ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 13:43, 25 మార్చి 2024 (UTC)
- పరిశీలిస్తానండీ. - రవిచంద్ర (చర్చ) 10:03, 26 మార్చి 2024 (UTC)
- @రవిచంద్ర గారూ గారూ పై లింకులోని నిర్వాహకత్వ హక్కులు పొందటానికి కొత్త మార్గదర్శకాలు పేజీలోని మధ్యంతర ప్రతిపాదనల విభాగంలో కూడా స్పందించగలరు. ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 06:41, 29 మార్చి 2024 (UTC)
- రామారావు గారూ, సెలవులో ఉన్నందున ఆలస్యమైంది, క్షమించాలి. ఇప్పుడే స్పందించాను. - రవిచంద్ర (చర్చ) 11:28, 1 ఏప్రిల్ 2024 (UTC)
- రవిచంద్ర గారూ ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 11:39, 1 ఏప్రిల్ 2024 (UTC)
- రామారావు గారూ, సెలవులో ఉన్నందున ఆలస్యమైంది, క్షమించాలి. ఇప్పుడే స్పందించాను. - రవిచంద్ర (చర్చ) 11:28, 1 ఏప్రిల్ 2024 (UTC)
- @రవిచంద్ర గారూ గారూ పై లింకులోని నిర్వాహకత్వ హక్కులు పొందటానికి కొత్త మార్గదర్శకాలు పేజీలోని మధ్యంతర ప్రతిపాదనల విభాగంలో కూడా స్పందించగలరు. ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 06:41, 29 మార్చి 2024 (UTC)
ఈ వారం వ్యాసం కోసం
[మార్చు]రవిచంద్ర గారూ, ఈవారం వ్యాసం కోసం పరిశీలించేందుకు 30000 బైట్లకు పైబడిన వ్యాసాల జాబితాలు తయారు చేసి కింద చూపిన మూడు పేజీల్లో పెట్టిం వాటిని వర్గం:ఈ వారం వ్యాసం పరిగణనలు వర్గంలో పెట్టాను. పరిశీలించండి.
- వికీపీడియా:ఈవారం వ్యాసం పరిశీలన కోసం వ్యాసాలు - వ్యక్తులు
- వికీపీడియా:ఈవారం వ్యాసం పరిశీలన కోసం వ్యాసాలు - చరిత్ర
- వికీపీడియా:ఈవారం వ్యాసం పరిశీలన కోసం వ్యాసాలు - కళలు
__ చదువరి (చర్చ • రచనలు) 04:26, 24 జూన్ 2024 (UTC)
- ధన్యవాదాలు చదువరి గారూ, వీటిని పరిశీలించి ఈ వారం వ్యాసం పరిగణనలోకి తీసుకుంటాను. - రవిచంద్ర (చర్చ) 06:22, 24 జూన్ 2024 (UTC)
ఇండిక్ మీడియావికి డెవలపర్స్ యూజర్ గ్రూప్ - టెక్నికల్ సంప్రదింపులు 2024
[మార్చు]నమస్తే,
ఇండిక్ మీడియావికీ డెవలపర్స్ యూజర్ గ్రూప్ వికీమీడియా ప్రాజెక్ట్‌లకు సహకరిస్తున్నప్పుడు వివిధ సాంకేతిక సమస్యలపై సభ్యుల అవసరాలను అర్థం చేసుకోవడానికి కమ్యూనిటీ టెక్నికల్ కన్సల్టేషన్ ప్రక్రియను ప్రారంభించారు. వీటి లక్ష్యం కమ్యూనిటీలలోని సవాళ్లను బాగా అర్థం చేసుకోవడం, సాధారణ సమస్యలను అర్థం చేసుకోవడం మరియు భవిష్యత్ సాంకేతిక అభివృద్ధి కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం.
మొదటి దశ మీ సాధారణ సమస్యలు, ఆలోచనలు మొదలైనవాటిని ఎక్కడ నివేదించాలనే సర్వే. దయచేసి సర్వేను (మీకు నచ్చిన భాషలో) ఇక్కడ పూరించండి. https://docs.google.com/forms/d/e/1FAIpQLSfvVFtXWzSEL4YlUlxwIQm2s42Tcu1A9a_4uXWi2Q5jUpFZzw/viewform?usp=sf_link
చివరి తేదీ 20 సెప్టెంబర్ 2024.
మీరు బహుళ సమస్యలు లేదా ఆలోచనలను నివేదించాలనుకుంటే, మీరు సర్వేను ఒకటి కంటే ఎక్కువసార్లు పూరించవచ్చు.
కార్యాచరణ గురించి మరింత చదవడానికి, దయచేసి సందర్శించండి: https://w.wiki/AV78
సర్వే తెలుగులో పైన పేజీలో ఉన్నాయ్.
ధన్యవాదాలు! MediaWiki message delivery (చర్చ) 13:29, 9 సెప్టెంబరు 2024 (UTC), ఇండిక్ మీడియావికీ డెవలపర్స్ తరపున
కృష్ణశాస్త్రి ప్రూఫ్ రీడథాన్
[మార్చు]నమస్కారం!
వికీపీడియాలో మనందరం సమిష్టిగా చేస్తున్న కృషి అమోఘం. ఈ చురుకుదనాన్నిసోదర ప్రాజెక్టులలోకి సైతం తీసుకువెళ్లడానికి ఈ నవంబర్ 1న తెలుగు సాహిత్యంలో ఎంతో కృషి చేసిన భావకవి అయిన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వికీసోర్సులో ప్రూఫ్ రీడథాన్ ను నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు పేజీ ని గమనించి పాల్గొనగలరు. --అభిలాష్ మ్యాడం (చర్చ) 09:26, 7 నవంబరు 2024 (UTC)
Surendra Oruganti అడుగుతున్న ప్రశ్న (05:21, 14 డిసెంబరు 2024)
[మార్చు]Good morning sir- Need expert content writing support to add an article in wikipedia. Please suggest good writers who could help writing and adding article to wikipedia. --Surendra Oruganti (చర్చ) 05:21, 14 డిసెంబరు 2024 (UTC)
- సురేంద్ర గారూ, మీరు ఏ వ్యాసం రాయాలనుకుంటున్నారో చెప్పండి. అది వికీపీడియాలో ఉండదగినదా కాదా నేను చెప్పగలను. వికీలో వ్యాసం ఉండాలంటే ముందుగా ఆ అంశానికి విషయ ప్రాముఖ్యత ఉండాలి. అంటే దానిని గురించి పుస్తకాలు, పరిశోధనా పత్రాలు, పేరొందిన వెబ్ సైట్లలో వేరే వ్యక్తులచే ప్రచురింపబడి ఉండాలి. అప్పుడే దాని గురించి వ్యాసం రాయగలం. వికీలో నేనే నాకుండా ఇంకా కొంతమంది రచయితలు మీకు సహాయపడగలము. - రవిచంద్ర (చర్చ) 15:24, 14 డిసెంబరు 2024 (UTC)