వాడుకరి చర్చ:Arjunaraoc

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

సూచనలు:

  • మీ వ్యాఖ్య చేర్చేముందు గమనించండి. నా వరకే సంబంధించిన వ్యాఖ్యలను లేక నేను మాత్రమే స్పందించాల్సిన వ్యాఖ్యలను, లేక అభ్యర్ధనలను నా చర్చాపేజీలో రాయండి. లేక పోతే మీ వాడుకరి చర్చ పేజీలో లేక సహాయం కొరుతున్న పేజీ యొక్క చర్చా పేజీలో తగు శీర్షికతో కొత్త విభాగం ప్రారంభించి దానిలో {{సహాయం కావాలి}} ముూస చేర్చి ఆతరువాత మీ సందేహాన్ని లేక సమస్యను వివరించండి. ఆలా చేస్తే మీ అభ్యర్ధన రచ్చబండలో సహకార స్థితి పెట్టె ద్వారా మరి ఇతర చోట్ల ప్రతిఫలించబడి, క్రియాశీలంగా వున్న సభ్యులు ఎవరైనా త్వరగా స్పందించటానికి వీలవుతుంది. ఒకవేళ కొంతమంది వాడుకరులకు ప్రత్యేకంగా తెలియచేయదలచుకుంటే, అభ్యర్ధనలో ఆ వాడుకరి పేర్లకు వికీలింకులు చేర్చటం ద్వారా వారికి వికీ సూచనల వ్యవస్థ(ఎకో) ద్వారా సందేశాలు పంప వీలుంది. స్పందనకు సహాయపడతారనుకున్నవ్యక్తి లేక వ్యక్తులు ఇటీవల క్రియాశీలకంగా లేకపోతే వారి పేజీలను లేక వారి చర్చాపేజీలను చూసినప్పుడు పక్కపట్టీలో కనబడే 'ఈ సభ్యునికి ఈ మెయిల్ పంపు' ద్వారా ఈ మెయిల్ పంపండి. ఈ పద్దతి వాడడం ద్వారా మీ సందేహాలకు త్వరితంగా సహాయం పొందడమే గాక, వికీని ఒక వ్యక్తి లేక కొద్దిమంది వ్యక్తులపై ఆధారపడనిదిగా చేసి వికీ అభివృద్ధికి తోడ్పడగలుగుతారు.
  • వ్యాఖ్యకి మూలం ఏ పేజీలో వుంటే అదే పేజీలో మీ స్పందన రాయండి. మీ చర్చా పేజీలో నేను వ్యాఖ్య రాస్తే, మీ స్పందన అక్కడే రాయండి. మీ చర్చా పేజీని నా వీక్షణ జాబితాలో చేరుస్తాను. స్పందన ఆలస్యమైతే నా చర్చా పేజీలో సూచన వ్యాఖ్య లేదా ఇ-మెయిల్ ద్వారా హెచ్చరించిండి .
  • కొత్త చర్చ ప్రారంభించటానికి పైనున్న అదేశ వరుసలో విషయాన్ని చేర్చు నొక్కి రాయండి.

నూతన సంవత్సర శుభాకాంక్షలు[మార్చు]

అర్జునరావు గారూ,
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు 2015 ఆంగ్ల సంవత్సర ప్రారంభ శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో మీరి తెవికీలో పునరాగమనం చేసి మరలా మీ విశేశ కృషిని కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఇట్లు,
మీ మిత్రుడు,
--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 06:47, 2 జనవరి 2015 (UTC)

సుల్తాన్ ఖాదర్ గారి సందేశానికి ధన్యవాదాలు. వీలున్నంతవరకు అప్పుడప్పుడు కృషి చేద్దామనుకుంటున్నాను. --అర్జున (చర్చ) 12:47, 27 జనవరి 2015 (UTC)

స్వాగతం[మార్చు]

అర్జునరావు గారూ, మీరు మళ్ళీ తెవికీలో కనిపించడం ఆనందదాయకం. మీకు వీలున్నప్పుడల్లా క్రియాశీలకంగా పనిచేయాలని కోరుకుంటున్నాను --వైజాసత్య (చర్చ) 00:38, 27 జనవరి 2015 (UTC)

వైజాసత్య గారి సందేశానికి ధన్యవాదాలు. వీలున్నంతవరకు అప్పుడప్పుడు కృషి చేద్దామనుకుంటున్నాను. --అర్జున (చర్చ) 12:48, 27 జనవరి 2015 (UTC)
చాలా రోజుల విరామం తర్వాత తెవికీలో కనిపించారు. మళ్ళీ క్రియాశీలకంగా పనిచేస్తారని ఆశిస్తున్నాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 14:03, 27 జనవరి 2015 (UTC)
సభ్యుడు:C.Chandra Kanth Rao గారి స్పందనకు ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 08:14, 28 జనవరి 2015 (UTC)

స్వాగతం[మార్చు]

Tewiki 11 logo.png

తిరుపతిలో జరుగనున్న తెవికీ 11వ వార్షికోత్సవాల ఉత్సవాలకు మిమ్ములను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ రెండు రోజులు అనగా ఫిబ్రవరి 14 మరియు 15 తేదీలలో (రెండవ శనివారం, ఆదివారం) మీరు రావడానికి ముందుగా నమోదు చేసుకున్న వికీ సభ్యులకు వసతి, రవాణా సదుపాయాలు సమకూరుస్తున్నది. కనుక ముందుగా ఇక్కడ మీ పేరు నమోదు చేసుకోండి.

తెవికీ నాణ్యత[మార్చు]

మీరు వ్యక్తిగత శూన్యం నుండి కోలుకొంటున్నారని భావిస్తాను. మీరు ప్రారంభించిన వికీట్రెండ్స్ మేము ఉపయోగించుకొంటున్నాము. దానికి రూపొందిన మీకు మేమెంతో కృతజ్నులము. మీలాంటి అనుభవం కలిగిన వ్యక్తులు మాకు ఎంతో అవసరం. మీరు తిరుపతిలో జరగబోయే 11వ వార్షికోత్సవంలో పాల్గొని మాకు తెవికీ నాణ్యత అభివృద్ధికి కొన్ని సూచనలు చేస్తారని కోరుతున్నాము.--Rajasekhar1961 (చర్చ) 10:44, 8 ఫిబ్రవరి 2015 (UTC)

వికీసోర్స్[మార్చు]

Arjunaraoc గారు నమస్కారములు. ఇక్కడ నుండి వికీసోర్స్, విక్షనరీ ఇలాంటి వాటికి తరలించడము ఎలాగో దయచేసి తెలియజేయ గలరు. JVRKPRASAD (చర్చ) 12:56, 4 మార్చి 2015 (UTC)

@JVRKPRASAD, చేర్చవలసిన వికీలో కావలసిన ఇతర వికీలనుండి దిగుమతి చేసుకోవటానికి వికీమీడియాPhabricator (బగ్జిల్లా కొత్త రూపం) లో బగ్ నమోదు చేయాలి. ఆ బగ్ పరిష్కారం అయిన తరువాత నిర్వాహక హోదా కలవారు ఆంగ్ల వికీనుండి ఎలా దిగుమతి చేస్తున్నారో అలానే దిగుమతి చేయవచ్చు. అప్పటివరకు నకలు చేసి అతికించడమే సరైన పద్ధతి.--అర్జున (చర్చ) 04:03, 5 మార్చి 2015 (UTC)
మీకు ధన్యవాదములు. నేను అలాగే అనుకున్నాను. కానీ, పేజీ చరిత్రము కూడా విలీనము చేయుట, వికీపీడియాలో అంతర్గముగా అయితే సమస్య లేదు. మరి ఇతర వికీలలో అటువంటి ఆ అవకాశము ఉందంటారా ? తెలియచెప్పగలరు. JVRKPRASAD (చర్చ) 05:01, 5 మార్చి 2015 (UTC)
@JVRKPRASAD , దిగుమతి చేసేటప్పుడు అన్ని రూపాలను దిగుమతి చేసుకుంటే సరి. కాని వికీ లో ప్రతి చర్య నమోదవుతుంది కాబట్టి ప్రత్యేకంగా చరిత్ర గురించి అంత శ్రద్ధ అవసరములేదనుకుంటాను.--అర్జున (చర్చ) 05:22, 6 మార్చి 2015 (UTC)
-అర్జున గారు, సృష్టికర్తల సమస్య మనకి ఒకటి ఉంది కదండి ! అటువంటి సమస్య వస్తుందేమోనని ఆడిగాను. JVRKPRASAD (చర్చ) 06:08, 6 మార్చి 2015 (UTC)

వికీపీడియా:వికీప్రాజెక్టు/స్త్రీవాదం ప్రాజెక్టు[మార్చు]

Womanpower logo.svg

హలో Arjunaraoc! గారు, స్త్రీవాదం కు సంబంధించిన కథనాలు నందు మీ సహకారానికి ధన్యవాదాలు. వికిప్రాజెక్ట్ ఫెమినిజం ఒక వికీప్రాజెక్ట్ నందు మీరు కూడా ఒక భాగంగా కావాలని మీకు ఈ ఆహ్వానము ద్వారా ఆహ్వానించుతున్నాము. ఈ వికీప్రాజెక్ట్ ఇక్కడి స్త్రీవాదం వ్యవహరించే వ్యాసాల నాణ్యత మెరుగుపరచడం ముఖ్య ఉద్దేశ్యం.

మరింత సమాచారం కోసం వికీప్రాజెక్టు/స్త్రీవాదం నందు మీరు పాల్గొనేందుకు కావాలనుకుంటే, దయచేసి సందర్శించండి. "సభ్యులు" కింద మీ పేరు సైన్ అప్ కొరకు సంకోచించకండి. ధన్యవాదాలు!

JVRKPRASAD (చర్చ) 06:50, 12 మార్చి 2015 (UTC)

@JVRKPRASADగారికి, మీ ఆహ్వానానికి ధన్యవాదాలు. నేను గతంలో తలపెట్టిన కొన్ని పనులు చేసే పనిలో వున్నాను.అదీ వికీసోర్స్ లో నిర్వహణ ఎక్కువగా ప్రాధాన్యం క్రింద పెట్టుకున్నాను. కనుక నేను పాల్గొనలేనని తెలపటానికి చింతించుచున్నాను. అయినా మీకేమైనా సలహాలు, సాంకేతిక సహకారం కావలసి వస్తే సంప్రదించండి, వీలైనంత సహాయం చేయగలను.--అర్జున (చర్చ) 07:15, 19 మార్చి 2015 (UTC)

ముఖ్యతా ప్రమాణాలు పరిశీలించండి[మార్చు]

వికీప్రాజెక్టు పత్రికలు ముఖ్యతా ప్రమాణాలు మూస:వికీప్రాజెక్టు పత్రికలులో వ్రాశాము. ఐతే దీనిపై కొంత చర్చను మీరూ, వైజాసత్య గారూ మరికొందరు నాణ్యతపై అవగాహన కలిగిన వికీపీడియన్లు చర్చిస్తే బావుంటుందని ఇక్కడ పెడుతున్నాను. మీకు వీలైనప్పుడు చూసి మూస చర్చ పేజీలో అభిప్రాయం వ్రాయగలరు.--పవన్ సంతోష్ (చర్చ) 14:21, 16 మార్చి 2015 (UTC)

@పవన్ సంతోష్ ,మూస చర్చ:వికీప్రాజెక్టు పత్రికలులో స్పందించాను.--అర్జున (చర్చ) 07:11, 19 మార్చి 2015 (UTC)

తెలుగు సమాచారం అందుబాటులోకి ప్రాజెక్టు ఉపయోగాలు[మార్చు]

గ్రాంట్ ద్వారా నేను చేసిన ప్రాజెక్టు ఫైనల్ రిపోర్టును వ్రాసే పనిలోవున్నాను. అందులో భాగంగా కొన్ని టెక్నికల్ విషయాలు అడ్డుపడుతున్నాయి. ప్రాజెక్టు ద్వారా అభివృద్ధి చేసిన పేజీలన్నిటికీ చర్చపేజీల్లో నేను {{వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి}} మూస దాదాపుగా చేర్చాను. పనులు నడుస్తున్నప్పుడే ఈ ప్రయత్నాన్ని చేశాను. ఇప్పుడు వేయిన్నాలుగు పేజీలు దాని క్రింద అభివృద్ధి అయినట్టుగా తెలుస్తోంది. కానీ వీటిలో ముఖ్యంగా ఏయే పేజీల్లో ఇన్లైన్ రిఫరెన్సులు అభివృద్ధి చేశాము, మొత్తంగా ఎంత కంటెంట్ చేర్చాము వంటి వివరాలూ, ఈ ప్రాజెక్టు ద్వారా ఎన్ని ఇమేజిలు కామన్స్‌లోకి అప్లోడ్ అయినాయి వంటి వివరాలు మాత్రం నేనంత నేనుగా అంచనా వేయలేకపోతున్నాను. ఇక్కడ మీరు చూస్తే గనక వాటిలోని మొదటి మూడైన Number of active editors involved, Number of newly registered users, Number of individuals involved అనేవి చెప్పేందుకు నా వద్ద సరంజామా ఉంది. Number of articles added or improved on Wikimedia projects అనే ప్రమాణాన్ని నేను చెప్పగలను. Number of new images/media added to Wikimedia article pages, Number of bytes added to and/or deleted from Wikimedia projectsNumber of bytes added to and/or deleted from Wikimedia projects అన్న రెంటినీ నేను నేరుగా చెప్పలేకున్నాను. ఈ రెండింటి విషయంలోనూ ఏయే పేజీల నుంచి మీరు అంచనా తీసుకోవాలన్న మౌలికమైన ఆధారాన్ని మాత్రం నా వద్ద ఉంచుకున్నాను. వీటిని అంచనా కట్టేందుకు వర్గం:ఎంత ముఖ్యమో తెలియని తెలుగు సమాచారం అందుబాటులోకి వ్యాసాలు పేరిట వర్గీకరణ అయిన పేజీలు, వికీసోర్సులో కొన్ని పుస్తకాలు(వాటినీ వర్గీకరించి మీకు లింకు తక్షణం ఇవ్వగలను) అంచనా వేస్తే చాలు. కాకుంటే సమస్య ఎక్కడంటే ప్రాజెక్టు ప్రారంభమైన జూలై 2014 నుంచి ప్రాజెక్టు పేజీల్లో జరిగిన మార్పుల నుంచే పై ప్రమాణాలను అంచనా వేసుకోవాలి. ఈ పనిలో నాకు సాయం చేయగలరా? ప్రాజెక్టు రిపోర్టు పూర్తి చేయాల్సిన సమయం దగ్గరపడుతోంది.--పవన్ సంతోష్ (చర్చ) 14:36, 28 మార్చి 2015 (UTC)

పవన్ సంతోష్ గారికి,మీ ప్రాజెక్టు దిగ్విజయంగా పూర్తి చేసినందుకు, మీకు, సహకరించిన సభ్యులకు అభివందనాలు. నేను కేవలం సులభమైన గణాంకాలనే SQLquery తో సేకరించేవాడిని. మీకు కావలసిన వాటికి ప్రత్యేకమైన పరికరము వివరాలుచూడండి. ఉదాహరణకు లింకు లో చెప్పినట్లు చేయండి మీకు కావలసిన బైట్ల గణాంకాలు అందుతాయి.--అర్జున (చర్చ) 12:26, 29 మార్చి 2015 (UTC)