వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/తెలుగు ఆవిష్కరణలు
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగింపుకు చూపిన కారణాలను తోసిపుచ్చే వాదనేదీ చర్చలో కనిపించలేదు. వ్యాసంలో చోటుచేసుకున్న మార్పులు కూడా ఏమీ లేవు. అంచేత తొలగించాలని నిర్ణయిస్తున్నాను. __చదువరి (చర్చ • రచనలు) 08:51, 13 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఇది వ్యాసంలా లేదు. ప్రవేశిక లేదు. తెలుగులో ఆవిష్కరణలు అని అన్నారు. అంటే శాస్త్ర పరంగా ఆవిష్కరణలా? మరెలాంటి ఆవిష్కరణలో తెలియజేయలేదు. సరైన మూలాలు లేవు. తెలుగు వారిలో కొందరి గొప్పతనం చెప్పారు కానీ దేనికీ ఎలాంటి ఆధారం చూపలేదు. "శ్రీదేవి చిరునవ్వుల కనికట్టు" అన్నారు. శ్రీదేవి తమిళనాడులో పుట్టింది. అనేక భారతీయ భాషల్లో నటించింది. అది ఆవిష్కరణ ఎలా అవుతుంది? "నాయుడమ్మ వైద్యం" అన్నారు. అది ఎలాంటి ఆవిష్కరణ? ఇలా ఎన్నో అంశాలు మూలాలు లేనివి ఉన్నాయి. దయచేసి వ్యాసాన్ని మూలాల సహితంగా వికీ నియమాల ప్రకారం విస్తరించనిచో తొలగించాలి. లేదా శీర్షికను సరైన రీతిలో మార్చి వ్యాసాన్ని వికీకరించి మూలాలతో తిరిగి రాయాలి.➠ కె.వెంకటరమణ⇒చర్చ 04:16, 22 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- @K.Venkataramana గారు, ఇది జాబితా వ్యాసం అనే ఉద్దేశ్యంతో నేను ప్రారంభించాననుకుంటాను. ఆంగ్లంలో Indian inventions లాగా. జాబితాలో వ్యాసాల లింకులు వుంటే మూలాలు తప్పనిసరికాదు అని నా అభిప్రాయం. తరువాత ఇతరులు సరిపోలని కొన్ని మార్పులు చేసినట్లున్నారు. జాబితాగా కొనసాగించవచ్చని నా అభిప్రాయం. అర్జున (చర్చ) 03:34, 24 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- అర్జున గారూ, మీరు తెలియజేసిన ఆంగ్ల వ్యాసం Indian inventions లో భారతదేశలో ఆవిష్కరణలున్నాయి. వాటికి సరైన మూలాలు కూడా ఉన్నాయి. గమనించగలరు.➠ కె.వెంకటరమణ⇒చర్చ 12:33, 17 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- @K.Venkataramana గారు, అవునండి. అదే పద్దతిని తెలుగువికీలో అనుసరించడానికి నాకు అభ్యంతరము లేదు. నా అభిప్రాయం తెలియచేశాను. ఈ చర్చ ఫలితంగా ఏ విధంగా నిర్ణయించినా నాకు అభ్యంతరము లేదు. అర్జున (చర్చ) 04:09, 18 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- మూలాలు లేకపోతే జాబితానే గదా అని ఎటువంటి ప్రామాణికం లేకుండా గుర్తు వచ్చిందల్లా రాయటానికి అవకాశం ఉందని నా అబిప్రాయం.జాబితా వ్యాసాలకు మూలాలు అవసరంలేదని సముదాయంలో లేదా మార్గదర్శకాలలో ఎటువంటి ప్రామాణికాలు నిర్థారించలేదు. కావున వ్యాసాన్ని మూలాల సహితంగా వికీ నియమాల ప్రకారం విస్తరించనిచో తొలగించాలి. యర్రా రామారావు (చర్చ) 04:56, 18 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- @K.Venkataramana గారు, అవునండి. అదే పద్దతిని తెలుగువికీలో అనుసరించడానికి నాకు అభ్యంతరము లేదు. నా అభిప్రాయం తెలియచేశాను. ఈ చర్చ ఫలితంగా ఏ విధంగా నిర్ణయించినా నాకు అభ్యంతరము లేదు. అర్జున (చర్చ) 04:09, 18 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- అర్జున గారూ, మీరు తెలియజేసిన ఆంగ్ల వ్యాసం Indian inventions లో భారతదేశలో ఆవిష్కరణలున్నాయి. వాటికి సరైన మూలాలు కూడా ఉన్నాయి. గమనించగలరు.➠ కె.వెంకటరమణ⇒చర్చ 12:33, 17 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.