ఈ వాడుకరికి తెలుగు వికీపీడియాలో నిర్వహణ బాధ్యతలు ఉన్నాయి.

వాడుకరి:యర్రా రామారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ వాడుకరి, అయోమయ నివృత్తి పేజీలకు ఉన్న లింకులను పరిష్కరిస్తూంటారు.
?ఈ వాడుకరి ఆంగ్ల వికీ లో లేని వ్యాసాలని సైతం తెలుగు వికీపీడియా లో సృష్టిస్తూ ఉంటారు.
40px వాడుకరి ఎర్రలింకుల సంస్కరణ ప్రాజెక్టులో కృషి చేసారు.
నా చిత్రం

నా పేరు యర్రా రామారావు. స్వంత విషయాలు చెప్పుకోవటానికి, రాసుకోవటానికి పెద్దగా ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, ఫిరంగిపురం మండలం, పొనుగుపాడు. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ, పంచాయతీరాజ్ శాఖ నందు చిరు ఉద్యోగంలో ది.01.01.1969 న అరంగేట్రం. ఆ తర్వాత వివిధ హోదాలలో నలభై సంవత్సరాలు సర్వీసు చేసి, చివరగా విస్తరణాధికారి (పంచాయితీ రాజ్ & గ్రామీణాభివృద్ధి) గా కారెంపూడి, మండల ప్రజాపరిషత్ నందు ది.31.08.2009 న పదవీ విరమణ పొందాను.

అంతర్జాలంలో ఆరంగ్రేటం[మార్చు]

2008 ఆ ప్రాంతంలో విస్తరణాధికారి (పంచాయితీ రాజ్ & గ్రామీణాభివృద్ధి) గా కారెంపూడి, మండల ప్రజాపరిషత్ నందు పనిచేసే సమయంలో కంప్యూటరు, అంతర్జాలం మొదలగు విషయాలపై హైదరాబాదులోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం నందు 10 రోజులపాటు జరిగిన శిక్షణాతరగతులకు వెళ్ళటం జరిగింది. దాని పర్యవసానంగా వెంటనే కంప్యూటరు తీసుకుని అంతర్జాలంలో మొదటిసారిగా ప్రవేశించాను. అంతకుముందు కూడా కార్యాలయానికి సంబంధించిన డాక్యుమెంట్స్ నాకు కంప్యూటరు పరిజ్ఞానం లేకపోయినా పక్కన కూర్చొని ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పి నాకునచ్చిన విధంగా ఎలా ఉండాలో అలా చేయించేవాడిని.

వికీపీడియాలో తొలి అడుగు[మార్చు]

తెలంగాణ గ్రామ వ్యాసాలపై జరిగిన అభివృద్దిని గురించి వివరిస్తున్న చిత్రం

2012 డిసెంబరు 16న వికీపీడియాలో ఖాతా ప్రారంభించాను. తెలిసి కాదు. అదేరోజు మా గ్రామ వ్యాసం పేజీలో మొదటిసారిగా రెండు సనరణలు చేశాను. ఎందుకో గానీ మరలా 2016 నవంబరు 28 వరకు వికీపీడియా జోలికిపోలేదు. తిరిగి మరుసటిరోజున (2016 నవంబరు 29) మా గ్రామ వ్యాసం పేజీలో రెండవసారి రెండు సవరణలు చేశాను.ఆ రోజు నుండి కంటిన్యూగా వికీమీద కాలం జరిగిపోతూనే ఉంది

నేను సృష్టించిన పేజీలు[మార్చు]

నాకు ఇష్టం లేదంటానే గొప్పలు చెప్పుకుంటున్నాను.ఇక్కడ క్లిక్ చేసి వికీపీడియాలో నేను సృష్టించిన పేజీలు చూడవచ్చు. ఇంకా ఏమైనా చూడాలనిపిస్తే మిగతావి అలాగే పైన క్లిక్ చేసి చూడవచ్చు.

వికీ మిత్రుల ప్రోత్సాహం, గుర్తింపు పతకాలు[మార్చు]

విశిష్టమైన కొత్త వాడుకరి పతకం
తొలి అడుగులే చరిత్ర సృష్టించే మారథాన్ గా మలుచుకుంటున్నందుకు
2012లోనూ, 2016లోనూ మొత్తం కలిపి నాలుగే మార్పులు చేశారు కాబట్టి 2017 డిసెంబరులో మీరు విజృంభించి చేస్తున్న కృషిని విశిష్టమైన కొత్త వాడుకరి పతకానికి అర్హుల్ని చేస్తున్నాయి. అంతేకాక గత సంవత్సరపు కొత్తవాడుకరుల్లో మీకు ప్రత్యేకతను ఆపాదించిపెట్టేలా వేలాది తెలుగు గ్రామాల వ్యాసాల ముఖచిత్రం మార్చే మీ కృషి అభినందనీయం. చేయిచేయి కలిపి ప్రాజెక్టు ముఖచిత్రాన్ని మార్చేయాలని ఆశిస్తూ మీకు ఈ పతకాన్ని ప్రదానం చేస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 07:49, 4 జనవరి 2018 (UTC)

గ్రామ వ్యాసాల్లో చేసిన కృషికి పతకం[మార్చు]

సార్, గ్రామ వ్యాసాల పేజీలు ఖాళీగానో, ఖాళీ విభాగాలతోనో ఉండేవి. అలాంటి కొన్ని వేల పేజీల్లో సమాచారాన్ని చేర్చే బృహత్కార్యంలో పాలుపంచుకుని నిర్విరామంగా కృషి చేస్తున్నందుకు అభినందనలతో ఈ తారకను ఇస్తున్నాను. స్వీకరించగలరు. __చదువరి (చర్చరచనలు) 02:04, 14 సెప్టెంబరు 2018 (UTC)

గ్రామ తారక
వేలాది గ్రామాల పేజీల్లో సమాచారాన్ని చేర్చే పనిని నిర్విరామంగా చేస్తున్నందుకు, అభినందనలతో.. చదువరి (చర్చరచనలు) 02:04, 14 సెప్టెంబరు 2018 (UTC)

తెలుగు అనువాద వ్యాసాల పతకం[మార్చు]

తెలుగు అనువాద వ్యాసాల పతకం
యర్రా రామారావు గారికి, జూన్ 2015-జులై 2020 కాలంలో తెలుగులో కంటెంట్ ట్రాన్స్లేషన్ ఉపకరణం వాడి తొలగింపుకు గురికాని 1238 వ్యాసాలకు కృషిచేసిన 149 మందిలో వ్యాసాల సంఖ్యా పరంగా 80% వ్యాసాలు చేర్చిన 23 మందిలో మీరొకరు. మీరు చేసిన కృషికి గుర్తింపుగా ఈ పతకం అందజేస్తున్నాను. మీరిలాగే తెవికీలో అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ..--అర్జున (చర్చ) 07:43, 13 ఆగస్టు 2020 (UTC)

మొలకల విస్తరణ ఋతువు 2020 ప్రాజెక్టులో పాల్గొనినందుకు అభినందిస్తూ పతకం[మార్చు]

మొలకల విస్తరణ ఋతువు ప్రాజెక్టులో భాగంగా మీరు చేసిన కృషికి గుర్తింపుగా ఈ పతకాన్ని స్వీకరించండి - స్వరలాసిక.


మీడియా ఫైల్స్ చేర్చినందుకు పతకం[మార్చు]

బొమ్మలు చేర్చిన నేర్పరులు
వికీపీడియా పేజీలలో సముచితమైన బొమ్మలను చేర్చినందులకు గుర్తుగా ఈ మెడల్‌ను స్వీకరించండి.--స్వరలాసిక (చర్చ) 09:31, 14 సెప్టెంబరు 2021 (UTC)

చర్చలలో చురుకుగా పాల్గొంటున్నందుకు పతకం[మార్చు]

చర్చలలో చురుకైనవారు
@యర్రా రామారావు గారు, 2021 లో వ్యాస, వికీపీడియా పేరుబరుల చర్చాపేజీలలో చురుకుగా పాల్గొన్నందులకు అభివందనాలు. గుర్తింపుగా ఈ పతకాన్ని స్వీకరించండి. మరిన్ని వివరాలు చూడండి. వికీపీడియా అభివృద్ధికి సామరస్యపూర్వక చర్చలు కీలకం. మీరు మరింత క్రియాశీలంగా చర్చలలో పాల్గొంటారని ఆశిస్తున్నాను. అర్జున (చర్చ) 06:52, 23 మార్చి 2022 (UTC)

ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ కృషిలో చురుకుగా పాల్గొన్నందుకు పతకం[మార్చు]

ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ కృషిలో చురుకైనవారు
@యర్రా రామారావు గారికి, ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీరణ 2022 - సంబంధిత అధిక ప్రాధాన్యతా వ్యాసాల అభివృద్ధి కృషిలో చురుకుగా పాల్గొన్నందులకు,మీ సహకారానికి ధన్యవాదాలు. గుర్తింపుగా ఈ పతకాన్ని స్వీకరించండి.. అర్జున (చర్చ) 14:14, 10 ఆగస్టు 2022 (UTC)