మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం
స్థాపితం | 1976 |
---|---|
డైరక్టరు | అనితారాజేంద్ర |
స్థానం | జూబ్లీ హిల్స్, హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం |
కాంపస్ | పట్టణ, 45 ఎకరాలు (18.2 హె.) |
డా. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదునగరంలో ఉన్న ఒక శిక్షణా సంస్థ.[1] తెలంగాణ ప్రభుత్వ సివిల్ సర్వెంట్లు, ప్రభుత్వ అధికారులకు శిక్షణ అందించడంకోసం ఈ సంస్థ ఏర్పాటు చేయబడింది.
చరిత్ర
[మార్చు]1976 ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌గా ఈ సంస్థ ప్రారంభమైంది.[2] ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నా రెడ్డి పేరు మీదుగా 1998లో డా. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంగా పేరు మార్చబడింది. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల ఉద్యోగులు, అధికారులకు శిక్షణ ఇచ్చే సమున్నత కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దారు.
ప్రభుత్వ విభాగాల్లోని అన్ని శాఖలకు సంబంధించిన శిక్షణ ఇవ్వడంలో దేశంలోనే అత్యున్నత సంస్థగా ఇది పేరొందింది. ఈ సంస్థకు ఐఎస్ఓ 9001:2000 గుర్తింపు కూడా లభించింది.[3]
ప్రాంగణం
[మార్చు]కేంద్ర ప్రభుత్వం నియమించిన అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ సూచనల మేరకు ఈ కేంద్రం నెలకొల్పబడింది. 45 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న క్యాంపస్‌లో ఈ సంస్థ ఉంది. 2006లో ఇందులో 375 సెంట్రల్ ఏసీ గదులను నిర్మించారు. దీని ప్రాంగణంలో హెలికాప్టర్ దిగడానికి హెలిప్యాడ్ కూడా ఉంది. 15 గదులతో కూడిన ఒక గెస్ట్‌హౌస్ కూడా ఉంది. లెక్చర్ హాళ్ళు, ఆడిటోరియం, సెమినార్ హాళ్ళు/కాన్ఫరెన్స్ గదులు, కంప్యూటర్ శిక్షణ ల్యాబ్ లు, గ్రంథాలయం, సిబ్బంది కోసం నివాస సదుపాయం, అతిథిగృహం మొదలైన సౌకర్యాలు ఉన్నాయి.[3]
డైరెక్టర్ జనరల్
[మార్చు]2022, జనవరి 20న మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డైరెక్టర్ జనరల్‌గా అనితారాజేంద్ర నియమించబడింది.[4]
మాజీ డైరెక్టర్ జనరల్స్
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Archived copy". www.hindu.com. Archived from the original on 8 April 2011. Retrieved 17 January 2022.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ Dr.Marri Channa Reddy Human Resource Development Institute
- ↑ 3.0 3.1 "కొత్త సచివాలయంగా 'మర్రి చెన్నారెడ్డి' భవనం?". Sakshi. 2013-11-14. Archived from the original on 2022-02-27. Retrieved 2022-02-27.
- ↑ telugu, NT News (2022-01-20). "పలువురు ఐఏఎస్‌ల బదిలీ". Namasthe Telangana. Archived from the original on 2022-01-21. Retrieved 2022-02-27.