బి.పి. ఆచార్య
బి.పి. ఆచార్య | |
---|---|
జననం | 30 అక్టోబరు 1960 |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్ |
బి.పి. ఆచార్య, తెలంగాణ రాష్ట్రానికి చెందిన మాజీ ఐఏఎస్. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ 1983 బ్యాచ్ సీనియర్ అధికారి.
జననం
[మార్చు]ఆచార్య 1960, అక్టోబరు 30న జన్మించాడు. ఐఏఎస్ చదివాడు.
వృత్తిరంగం
[మార్చు]1985లో భద్రాచలం సబ్ కలెక్టర్‌గా పనిచేసిన ఆచార్య 1993లో వరంగల్ జిల్లా కలెక్టర్ గా పదోన్నతి పొందాడు.[1] ఆ తరువాత 2017 డిసెంబరు వరకు తెలంగాణలో ప్లానింగ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేశాడు.[2][3][4] 2020లో పదవీ విరమణ చేసిన తర్వాత, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డైరెక్టర్ జనరల్ గా, తెలంగాణ రాష్ట్ర సాధారణ పరిపాలన విభాగంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశాడు.[1][5]
పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శిగా ఉన్న సమయలంఓ హైదరాబాద్ శివార్లలో జీనోమ్ వ్యాలీ, అనేక పారిశ్రామిక సమూహాలను రూపొందించడంలో కీలకపాత్ర పోషించాడు.[6] పదవీ విరమణ తర్వాత, జీనోమ్ వ్యాలీలో బయోమెడికల్ రీసెర్చ్ కోసం నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ కోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌కి సలహాదారుగా నియమించబడ్డాడు.[5][7]
అవినీతి విచారణ
[మార్చు]పబ్లిక్ యాజమాన్యంలోని ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పోరేషన్ కు 2005–2010 మధ్యకాలంలో వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న సమయంలో గచ్చిబౌలిలో ఎమ్మార్ ప్రాపర్టీస్‌తో జాయింట్ డెవలప్‌మెంట్ వెంచర్‌కు సంబంధించి కుట్ర, మోసం, అవినీతి ఆరోపణలపై జనవరి 2012లో ఆచార్యను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అరెస్టు చేసింది.[8][9] 2012, మార్చిలో బెయిల్‌పై విడుదలయ్యాడు, అదే నెలలో బెయిల్‌ను రద్దు చేయడంతో లొంగిపోయాడు.[10] 2016 ప్రారంభంలో కోర్టు నుండి స్టే పొందాడు.[11] ఆచార్యపై ఉన్న అభియోగాన్ని తదనంతరం హైకోర్టు రద్దు చేసింది. 2019, జూన్ లో అభియోగాలు మోపబడిన 15 మందిలో ఆచార్య గానీ, మరో సీనియర్ ఐఏఎస్ అధికారి పేరుగానీ లేదు.[12]
వ్యక్తిగత జీవితం
[మార్చు]ఆచార్యకు సీనియర్ ఐఏఎస్ అధికారిణి రంజీవ్ తో వివాహం జరిగింది.[8]
ప్రచురణలు, ప్రదర్శనలు
[మార్చు]- కాకతీయ హెరిటేజ్, ed. ఎం పాండు రంగారావు (సహకారం)[13]
- హైదరాబాదులోని గోథే జెంట్రమ్‌లో అబ్ట్యుస్ యాంగిల్ (ఎగ్జిబిషన్)[14]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "CRHRD Institute director-general BP Acharya set to retire today". The New Indian Express. 31 October 2020.
- ↑ "Bathukamma is made Telangana state festival". Deccan Chronicle. July 25, 2014. Archived from the original on 2022-02-26. Retrieved 2022-02-26.
- ↑ "B.P. Acharya posted as Principal Secretary, Planning". The Hindu (in Indian English). 2013-11-13. ISSN 0971-751X. Retrieved 2022-02-27.
- ↑ Reddy, Ravi (August 10, 2015). "Big plans on tourism". The Hindu.
- ↑ 5.0 5.1 "ICMR appoints BP Acharya advisor to NARFBR". The New Indian Express. 11 April 2021.
- ↑ Swarup, Anil (1 March 2021). "Making it Happen: Genome Valley, the biotech hub of India". The Daily Guardian. Archived from the original on 14 April 2021. Retrieved 2022-02-27.
- ↑ "ఎన్‌ఏఆర్‌ఎఫ్ బీఆర్‌కి సలహాదారుగా బీపీ ఆచార్య" [BP Acharya elected as NIRF BR advisor]. Eenadu. 11 April 2021.
- ↑ 8.0 8.1 Rahul, N. (18 October 2016) [30 January 2012]. "Andhra Pradesh Home Secretary arrested". The Hindu (in Indian English).
- ↑ "B.P. Acharya urges court to absolve him in Emaar case". The Hindu. 25 July 2016 [4 May 2013].
- ↑ "Emaar case: Suspended IAS officer BP Acharya surrenders". NDTV.com. 30 March 2012.
- ↑ Mutha, Sagarkumar (22 February 2017). "Emaar case: No progress in trial last year". The Times of India.
- ↑ Kumar, M Sagar (19 June 2019). "Enforcement Directorate files chargesheet in Emaar scam". The Times of India.
- ↑ Parveen, Zareena (31 August 2020). "An expansive treatise on the golden era of Kakatiyas". The New Indian Express.
- ↑ Nadadhur, Srivathsan (2017-04-29). "B P Acharya's Obtuse Angle: Travails of a civil servant". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2022-02-27.