Jump to content

వికీపీడియా:నిర్వాహకులు

వికీపీడియా నుండి
వికీపీడియాలో నిర్వాహకులచిహ్నం
వికీపీడియాలో అధికారులచిహ్నం

సిస్ఆప్("sysop") అధికారాలున్న వికిపీడియా సభ్యులను నిర్వాహకులు అంటారు. ప్రస్తుతం వికిపీడియాలో పాటిస్తున్న విధానం ప్రకారం చాలా కాలం నుంచి వ్యాసాలు రాస్తున్న సభ్యులు నిర్వాహకులు అవ్వచ్చు. ఈ సభ్యులు సాధారణంగా వికిపీడియా సమాజంలో విశ్వసనీయులై ఉంటారు.

నిర్వాహకులకు ప్రత్యేకమైన అధికారాలు ఏవీ లేవు, వ్యాఖ్యాన బాధ్యతలలో వారు మిగతా సభ్యులతో సమానం. నిర్వాహకుల‌కు మిగతా సభ్యులపై ఎటువంటి అధికారాలు ఉండవు, వారు కేవలం అందరు సభ్యుల నిర్ణయాలను అమలు చేస్తారు. నిర్వాహకులు తమకు మిగతా సభ్యుల కన్నా ఎక్కువ ఉన్న అనుమతులను ఉపయోగించి కొన్ని ముఖ్యమైన వికీపీడియా కుటుంబసంబంధమైన బాధ్యతలను నెరవేరుస్తారు. ఉదాహరణకు - కొన్ని వ్యాసాలను ఉంచాలా, తొలిగించాలా అనే సమాజ నిర్ణయాలను అమలు పరచడం, సిస్‌ఆప్స్‌ అనుమతులు అవసరమైన సభ్యుల అభ్యర్ధనలను నెరవేర్చటం, కొత్త, మార్చబడిన వ్యాసాలలో దుశ్చర్యలను పరిశీలించి, ఆ దుశ్చరలను నిరోధించడం మొదలైనవి. సహాయం అవసరమైన సభ్యులకు నిర్వాహకులు సలహా, సమాచారాలు ఇస్తారు.

వివరాలు

[మార్చు]

వికీ సాఫ్ట్‌‌వేర్ (మీడియావికీ) లో కొన్ని ముఖ్యమైన అంశాలలో మార్పులు చేయటంపై ఆంక్షలు ఉన్నాయి. ఆ అంశాలలో నిర్వాహకులకు అనుమతి ఉంటుంది.

మార్పు చేయుటకు అనుమతి లేని పేజీలు

[మార్చు]
  • మొదటి పేజీని, మార్చుటకు అనుమతించని ఇతర పేజీలను నిర్వాహకులు మార్చగలరు.
  • నిర్వాహకులు పేజీల అనుమతులను మార్చగలరు.

తొలగించుట, పునస్థాపన

[మార్చు]
  • నిర్వాహకులకు పేజీలను తొలగించటానికి అనుమతి ఉంది. వారు పేజీల చరిత్రను కూడా తొలగించగలరు.
  • తొలగించబడిన పేజీలను, వాటి చరిత్రను వారు చూడగలరు. అంతే కాక వారు ఆ పేజీలను పునస్థాపించగలరు.
  • బొమ్మలను శాశ్వతముగా తొలగించగలరు.

ఇంకా

[మార్చు]

నిర్వాహకులు ఒక పేజీ పాత కూర్పును తిరిగి స్థాపించగలరు. మిగతా సభ్యులు కూడా ఈ పని చేయవచ్చు, నిర్వాహకులు దీనిని త్వరగా చేయగలరు.

నిర్వాహక హోదా కావాలంటే..

[మార్చు]

మీరు నిర్వాహకులు కావాలనుకుంటే మీ పేరును నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి పేజీలో అక్కడి నిబంధనలకు అనుగుణంగా చేర్చాలి. మీరు నిర్వాహకులు కావచ్చో కాకూడదో తోటి సభ్యులు వోటింగు ద్వారా తెలియజేస్తారు.

విజ్ఞప్తి చేసే ముందు మీరు వికీపీడియాలో కొన్నాళ్ళ పాటు కృషి చేసి ఉండాలి. వోటు వేసే ముందు ఇతర సభ్యులు మిమ్మల్ని గుర్తించగలగాలి కదా మరి. తెలుగు వికీపీడియాకు ఇతర వికీపీడియాలకు ఈ విధానాల విషయంలో తేడాలు ఉండవచ్చు.

దయచేసి జాగ్రత్తగా ఉండండి! , నిర్వాహక హోదా వచ్చాక ఆ బాధ్యతలను నిర్వర్తించేటపుడు జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాం. ముఖ్యంగా పేజీలూ, వాటి చరితం తొలగించేటపుడు, బొమ్మలను తొలగించేటపుడు (పైగా ఇది శాశ్వతం కూడా), IP అడ్రసులను అడ్డగించేటపుడు. ఈ కొత్త అధికారాల గురించి నిర్వాహకులకు సూచనలు లో తెలుసుకోవచ్చు. అలాగే ఈ అధికారాలను వాడే ముందు నిర్వాహకులు చదవవలసిన జాబితా లో లింకులు ఉన్న పేజీలను కూడా చదవండి.

నిర్వాహకుల గణాంకాలు

[మార్చు]
తేదినిర్వాహకుల సంఖ్య
2024-05-0110
2023-06-0311
2020-10-0912
2020-07-2913
2019-01-2414
2017-09-0617
2016-11-0816
2015-08-0517
2013-10-1915
2008-03-0114
2008-11-1412
2007-05-049

ఇవీ చూడండి

[మార్చు]