Jump to content

వాడుకరి చర్చ:Arjunaraoc/పాత చర్చ 1

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

పాత చర్చ 1 | పాత చర్చ 2

స్వాగతం

[మార్చు]
Arjunaraoc/పాత చర్చ 1 గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!
  • వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు. సభ్యుల పట్టికకు మీ పేరు జత చేయండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు, వాటిలో మీ పేరు నమోదు చేసుకుని వికీ ప్రస్థానం మొదలు పెట్టండి.
  • మీ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి పక్కనున్న లింకులను అనుసరించండి, అవికూడా మీ సందేహాలు తీర్చకపోతే అప్పుడు తెవికీ అధికారిక మెయిలింగు లిస్టుకి ఒక జాబు రాయండి.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి గూగుల్ గుంపులలో ఈ వ్యాసాన్ని చదవండి.
  • నాలుగు టిల్డె లతో (~~~~) - ఇలా సంతకం చేస్తే మీపేరు, తేదీ, టైము ప్రింటవుతాయి. ఇది చర్చా పేజీలలో మాత్రమే చెయ్యాలి సుమండీ!

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం.

వైఙాసత్య 20:32, 19 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

కొన్ని ఉపయోగకరమైన లింకులు
వికిపీడియా యొక్క ఐదు మూలస్థంబాలు
తరచూ అడిగే ప్రశ్నలు
సహాయము లేదా శైలి మాన్యువల్
ప్రయోగశాల
సహాయ కేంద్రం
రచ్చబండ
సముదాయ పందిరి
ఇటీవలి మార్పులు

గౌతమి ఫాంటు విండోసు XPతో కదా వచ్చేది. మరి Red Hat Linux అని రాసారేమిటి? __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 18:07, 25 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు ఇంతకు ముందు లోహిత్ ఫాంటు గురించిన సమాచారాన్ని గౌతమి ఫాంటు పేజీలో రాశారు. ఇప్పుడు మీరు కావాలంటే పైన ఇచ్చిన లింకులో ఆ సమాచారాన్ని చేర్చవచ్చు. ఏదయినా వర్గంలో ఒక వ్యాసాన్ని చేర్చాలంటే సదరు "వ్యాసంలో" ఆ వర్గాన్ని చేర్చాలి. ఉదాహరణకు మీరు లోహిత్ ఫాంటు వ్యాసాన్ని ఫాంట్లు వర్గంలో చేర్చాలని అనుకుంటే గనక, [[వర్గం:ఫాంట్లు]] అని చేరిస్తే అప్పుడు ఆ వ్యాసం ఆటోమాటిగ్గా ఫాంట్ల వర్గంలో చేరిపోతుంది. లోహిత్ ఫాంటు వ్యాసంలో ఫాంట్లు వర్గం చేర్చిన తరువాత వర్గం:ఫాంట్లు పేజీలోకి ఆ ఫాంటు లింకు వచ్చేసింది గమనించారా. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 14:49, 28 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

జిస్ట్ తెలుగు ఓపెన్ టైపు ఫాంట్లు

[మార్చు]

నా pcqlinux2007 కంప్యూటర్ లో జిస్ట్ ఇంస్టాల్ చేస్తే జిస్త్ మాక్రోమీడియా అనే పేరు మిగతా వాటితో కనపడింది. అందుకని రాసాను. మీరెందుకు తప్పనుకుంటున్నారు. (అర్జు 17:40, 2 జూలై 2007 (UTC))[ప్రత్యుత్తరం]

అది నేను తొలగించలేదు. కానీ ఈ జిస్ట్-మాక్రోమీడియా అన్నది ఫాంటేనా అని నాకూ అనుమానమే --వైజాసత్య 19:13, 3 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ఆర్ టీ ఎస్

[మార్చు]

ఇక్కడ తెలుగు వికీలో బలవంతపు కలుపు వర్తించదనుకుంటా. & అవసరం లేకుండానే ఆమ్లం కల్హర, బిల్హణ టైపు చెయ్యవచ్చు --వైజాసత్య 06:26, 22 సెప్టెంబర్ 2007 (UTC)

తెలుగు వికీ పట్టిక ని ఉదాహరణగా వాడాను. నేను వాడే RTS గురించి రాస్తున్నాను.(అర్జున 06:42, 22 సెప్టెంబర్ 2007 (UTC))

ఒకే..అర్ధమయ్యింది --వైజాసత్య 06:51, 22 సెప్టెంబర్ 2007 (UTC)

ప్దిడిఫ్ ఫైలు (వికీ) లింకు

[మార్చు]

నేను pothanapaper.pdf file upload చేసాను. దానికి లింకు ఎలా ఇవ్వాలి. (అర్జున 02:30, 26 సెప్టెంబర్ 2007 (UTC))

ఇదిగో ఇలా బొమ్మ:Pothanapaper.PDF లేదా మీడియా:Pothanapaper.PDF ఇస్తే లింకులు వచ్చేస్తాయి. __మాకినేని ప్రదీపు (+/-మా) 19:14, 26 సెప్టెంబర్ 2007 (UTC)

ధన్యవాదాలు (అర్జున 15:49, 27 సెప్టెంబర్ 2007 (UTC))

తెవికీ పాలసీలపై ఒక చర్చ

[మార్చు]

వికీపీడియా:రచ్చబండ (పాలసీలు) పేజీలో నేను తెలుగువికీలో, ఆంగ్లవికీ పాలసీలను వాడుకునే బదులుగా మనమే సొంతంగ పాలసీలను తయారు చేసుకోవాలని ప్రతిపాదించాను. అందుకు మీరు మీ అభిప్రాయాలను అక్కడ తెలుపాలని మనవి. __మాకినేని ప్రదీపు (+/-మా) 08:38, 29 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

పర్చూరు మండల గ్రామ వ్యాసాలు

[మార్చు]

అర్జున్ రావు గారు, మీరు పర్చూరు మండలపు గ్రామ వ్యాసాలలో చేర్చుతున్న సమాచారం బాగుంది. ఇలాగే మీరు గ్రామవ్యాసాలలో తెలిసిన విషయాలన్నింటినీ చేర్చండి. గ్రామ జనాభా, విద్యాలయాలు, దేవాలయాలు, కార్యాలయాలు, సదుపాయాలు, రాజకీయాలు, పంటలు, పరిశ్రమలు, రవాణా సదుపాయాలు, సమాచార సదుపాయాలు మున్నగునవి చేర్చి వ్యాసాలను పరిపూర్ణం చేయండి. ఏవేని సందేహాలుంటే చర్చాపేజీలో వ్రాయండి. -- C.Chandra Kanth Rao(చర్చ) 11:04, 2 అక్టోబర్ 2008 (UTC) ధన్యవాదాలు. --అర్జున 11:20, 2 అక్టోబర్ 2008 (UTC)

లోహిత్ ఫాంటు గురించి

[మార్చు]

అర్జున రావు గారూ! లోహిత ఫాంటు విండోస్ కోసం ఎక్కడైనా లభ్యమౌతుందా! ఉంటే దాని లింకు తెలియజేయగలరు.

అలాగే ఈ ఫాంటు విషయమై మీరు రెడ్ హ్యాట్ సైట్ లో ఒక బగ్ ఫైల్ చేసి ఉన్నారు. దానికి ఒక బొమ్మ జోడించాను. ఒక సారి దాన్ని చూసి, మీరు కూడా అలాంటి సమస్యనే ఎదుర్కొన్నారో అనేది చూడండి. సాంకేతిక వ్యాసాలంటే నాకూ ఆసక్తే. ఇంత దాకా ఎవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. మీరు సాంకేతిక అంశాలను బాగా రాస్తున్నారు. నా సహాయం ఏదైనా కావలంటే అడగండి. రవిచంద్ర(చర్చ) 04:30, 31 డిసెంబర్ 2008 (UTC)

ధన్యవాదాలు. మీరు జోడించిన బొమ్మ లో కనపడిన దోషం ఒక రకం మాత్రమే. ^ లేక స్పేస్ వచ్చిన ఆ సమస్య వుంటుంది. లోహిత్ ఫాంటు GPL కాబట్టి, నేను మీకు పంపిస్తాను. ఇంటర్నెట్ లో దొరుకుతుంది కాని విండోస్ zip application అది తెరవలేకపోవచ్చు. కాని అది విండోస్ లో సరిగా పనిచేయకపోవచ్చుఅర్జున 17:31, 31 డిసెంబర్ 2008 (UTC)

ఆంధ్ర ప్రదేశ్ లో విద్య

[మార్చు]

అర్జునరావుగారూ, మీకు మంచి ఆలోచన వచ్చింది, ఆంధ్ర ప్రదేశ్‌లో విద్య గురించి, ఈ వ్యాసం నేనే వ్రాయాలనుకున్నాను. కానీ వాయిదా వేసుకున్నాను. మీరు లక్షణంగా ఈ వ్యాసం ప్రారంభించండి. నా సహాయ సహకారాలు వుంటాయి. :-) అహ్మద్ నిసార్ 11:43, 14 ఫిబ్రవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు. ఇబ్బందికరమైన సంగతి ఏమిటింటే, తెలుగు విద్యారంగానికి సంభందించిన సమాచారం మన ఆధికారిక వెబ్ సైటలులో లేకపోవటం. ప్రస్తుతానికి ఆ పేరుతో కాకుండా, వివధరకాలైన విద్యల వ్యాసాల లో ఆంధ్రప్రదేశ్ వివరాలు పొందుపరచుదామనుకుంటున్నాను. ఈరోజుకి ప్రాథమిక విద్య వ్యాసం మొదలుపెట్టాను.అర్జున 12:11, 14 ఫిబ్రవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

చిన్న సూచన

[మార్చు]

అర్జున రావు గారూ, చిన్న విన్నపం. మామూలుగా వికీ సభ్యులతో సంభాషించేటపుడు వారి చర్చా పేజీలను వాడతారు. మీరు కాసుబాబు గారికి కృతజ్ఞతలను వారి సభ్య పేజీలోనే తెలిపినట్టున్నారు. దాన్ని వారి చర్చా పేజీలోకి మార్చగలరా? --రవిచంద్ర (చర్చ) 11:00, 6 మే 2010 (UTC)[ప్రత్యుత్తరం]

పొరపాటయింది. నిన్న నాకే అనుమానం వచ్చింది. మారుస్తాను. 199.64.0.252 03:27, 7 మే 2010 (UTC)[ప్రత్యుత్తరం]

అభినందనలు

[మార్చు]

అర్జునరావు గారూ, నిర్వాహకులైన సందర్భంగా శుభాభినందనలు. --వైజాసత్య 02:37, 14 మే 2010 (UTC)[ప్రత్యుత్తరం]

మీకు, మద్ధతు ప్రకటించిన అందరికి ధన్యవాదాలు. అర్జున 04:05, 14 మే 2010 (UTC)[ప్రత్యుత్తరం]
నా అభినందనలు కూడా అందుకోండి. —రవిచంద్ర (చర్చ) 04:40, 14 మే 2010 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ వార్త

[మార్చు]

ఓ సారి ఇది చూడండి. —రవిచంద్ర (చర్చ) 11:33, 10 జూన్ 2010 (UTC)[ప్రత్యుత్తరం]

చూశాను. మీ వ్యాఖ్యని ఇంకొంచెం వివరించండి. గణాంకాల విశ్లేషణ వ్యాస రాయబోతున్నారా? అర్జున 12:46, 10 జూన్ 2010 (UTC)[ప్రత్యుత్తరం]
ఇలాంటిది తెవికీ వార్తగా రాయవచ్చా అని అనుమానం వచ్చింది. మీ సలహాలు, సూచనలు అందించండి. --రవిచంద్ర (చర్చ) 17:41, 10 జూన్ 2010 (UTC)[ప్రత్యుత్తరం]
ఓ, నిక్షేపంగా. నేను కొంత విశ్లేషణ జరిపి కొన్ని వివరాలు చేరుస్తాను. అర్జున 01:15, 11 జూన్ 2010 (UTC)[ప్రత్యుత్తరం]

Request for help

[మార్చు]

Please help me translate this part into te.wikipedia.org. Thank you very much for your help.Genghiskhan 13:41, 10 జూన్ 2010 (UTC)[ప్రత్యుత్తరం]

Dong Hoi Airport

Dong Hoi Airport is an airport in Vietnam. It is in Dong Hoi city, Quang Binh province, 450 km south of Hanoi. The runway is 2400 meters long 45 meters wide. It can serve 500,000 passengers per years and can serve Airbus A321. en:Dong Hoi Airport

Thanks for your request.I am working on other priorities at the moment and can't take up your request. I will communicate to other Telugu wikipedians who may be interested. అర్జున 01:58, 11 జూన్ 2010 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ వార్త/మాటామంతీ ఆహ్వానం

[మార్చు]

వైజాసత్య గారు, తెవికీ వార్త/మాటామంతీ లో మీ అనుభవాలని చదువరులతో పంచుకోటానికి ఆహ్వానం. వికీపీడియా:తెవికీ వార్త/మాటామంతీ ముసాయిదా చూడండి. --తెవికీ వార్త సమన్వయకర్త, అర్జున 10:05, 2 జూన్ 2010 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జునరావు గారూ, తెవికీ నిర్వహణా బాధ్యతలు చేపట్టి ముందుకుసాగిస్తున్నందుకు ధన్యవాదాలు. నాకున్న కొద్దిసమయంలో నిర్వహణా వ్యవహారాల్లో పాలుపంచుకోలేనందుకు క్షమించాలి. మాటామంతీ ముసాయిదా కొద్దిగా వ్రాశాను. మెల్లిగా పూర్తిచేస్తాను. --వైజాసత్య 06:37, 13 జూన్ 2010 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు. మీ ముసాయిదా బాగుంది. ఇతరులకి స్ఫూర్తి దాయకంగా వుంటుంది. తెవికీ వార్త మొదటి సంచికని జులై 1 కల్లా విడుదల చేద్దామనుకుంటున్నాను.మీరు వీలుని బట్టి పూర్తి చేయండి.అర్జున 06:46, 13 జూన్ 2010 (UTC)[ప్రత్యుత్తరం]
మార్పులు ఏవి కనబడలేదు. ఇప్పుడున్నదానినే జులై 1న ప్రారంభమయ్యే తెవికీ వార్త కి తీసుకోనా?. అర్జున 13:25, 29 జూన్ 2010 (UTC)[ప్రత్యుత్తరం]
క్షమించాలి. ఇప్పుడు పూర్తయ్యింది. ఓ ఫోటో జత చెయ్యాలి కదా. అదీ జతచేస్తాను --వైజాసత్య 02:20, 1 జూలై 2010 (UTC)[ప్రత్యుత్తరం]

వికీప్రాజెక్టు విద్య, ఉపాధి కి బాట్ సహాయం

[మార్చు]

{{సహాయం కావాలి}} ‎ వికీప్రాజెక్టు విద్య, ఉపాధి వ్యాసాల పట్టిక తయారీకి బాట్ సహాయం కావాలి. {{వికీప్రాజెక్టు విద్య, ఉపాధి}} మూస వ్యాసాల చర్చాపేజీలలో వుంచడం జరిగింది. దీని ఆధారంగా వివిధ రకాల పట్టికలు, వ్యాస పరిమాణం, బొమ్మ స్థితి, అంతర లింకుల సంఖ్య, బాహ్య లింకుల సంఖ్య, నాణ్యత విలువ తయారు చేయటానికి సహాయం కావాలి--అర్జున 04:06, 2 సెప్టెంబర్ 2010 (UTC)

ఇతర ప్రాజెక్టులకై తయారు చేసిన ఈ ప్రోగ్రాము, ఏమన్నా పనికొస్తుందేమో చూడండి. __మాకినేని ప్రదీపు (+/-మా) 11:34, 2 సెప్టెంబర్ 2010 (UTC)
నేను ఇంతవరకు బాట్ పై కృషి చేయలేదు. పరిశీలిస్తాను. ధన్యవాదాలు.. --అర్జున 05:34, 3 సెప్టెంబర్ 2010 (UTC)
టెంప్లేట్ ఫైల్ లో ఖాళీలైనుతో ఇబ్బంది వస్తుందని తెలిసి సరిచేశాను --అర్జున 05:31, 13 సెప్టెంబర్ 2010 (UTC)

స్వాగత సందేశం

[మార్చు]

అర్జునరావుగారూ! మీరు కొందరు క్రొత్త సభ్యులకు స్వాగత సందేశం వారి సభ్య పేజీలో వ్రాస్తున్నారు. వారి చర్చా పేజీలో గదా వ్రాయవలసింది? --కాసుబాబు 08:32, 17 సెప్టెంబర్ 2010 (UTC)

ఒకటి రెండు చోట్ల పొరపాటైంది. నా దృష్టికి తెచ్చినందులకు ధన్యవాదాలు. ఇకముందు జాగ్రత్తగా చేస్తాను. --అర్జున 14:48, 17 సెప్టెంబర్ 2010 (UTC)

విక్షనరీ అభివృద్ధి

[మార్చు]
  • అర్జునరావు గారూ వ్యాసం విక్షనరీ అభివృద్ధి పూర్తయింది. మీరు పరిశీలించి లోపాలు లేవనుకుంటే విడుదల చేయవచ్చు.--t.sujatha 04:18, 20 సెప్టెంబర్ 2010 (UTC)
  • అర్జునరావు గారూ విక్షనరీ అభివృద్ధి వ్యాసం ఇక ప్రచురించ వచ్చు. శ్రమ తీసుకుని తుది మెరుగులు దిద్దినందుకు ధన్యవాదాలు. తేవీకీ వార్త గురించి మీరు తీసుకుంటున్న శ్రద్ధ అభినందించ తగినది.--t.sujatha 05:48, 23 సెప్టెంబర్ 2010 (UTC)

విక్షనరీ సహాయం

[మార్చు]

నేను పంపిన మెయిల్స్ ని, తెలుగు విక్షనరీ లో మీ వాడుకరి పేజీని గమనించినట్లులేరు. విక్షనరీ మొదటి పేజీ అసంపూర్ణంగా, కొత్తవారికి పదాలు సృష్టించడంలో సహాయపడేలా లేదు. రచ్చబండంకు లింకు, పదాలు వెదకటం, లేక పోతే తొలి సారి మూసతో సృష్టించడానికి మార్పులు చేయాలి. మీరు వెంటనే సమయంకేటాయించలేకపోతే, నాకు మార్పులు చేసే సాలభ్యం కలిగించండి. అది చేసిన తరువాత తెవికీవార్తలో సుజాత గారు రాసిన తెలుగు విక్షనరీ అభివృద్ధి అనే వ్యాసాన్ని ప్రచురించాలి. ఆ వ్యాసం ఇప్పటికే తయారైంది. -- అర్జున 01:34, 22 సెప్టెంబర్ 2010 (UTC)

ఆలస్యంగా స్పందించినందుకు క్షమించాలి. ఈ విషయానికి సమాధానం విక్షనరీలోని నా చర్చాపేజీలో వ్రాశాను --వైజాసత్య 10:52, 23 సెప్టెంబర్ 2010 (UTC)

తెలుగు లిపి

[మార్చు]

అర్జునరావు గారు, తెలుగు లిపి వ్యాసములో మీరు చేసిన మార్పు చెర్పులకు ధన్యవాదాలు. వ్యాసము ఇపుడు చాల బాగున్నది.Kumarrao 10:45, 12 అక్టోబర్ 2010 (UTC)

parichayam

[మార్చు]

namaste,

naa peru mahesh, manduru village, guntur district. nenu telugu wikipedia lo paalu panchukovalanukuntunnanu. naaku vivaralu teliyacheyandi. nenu prastutam medical transcriptionist ga pani cheyuchunnanu.

dhanyavadamulu mahesh 8125818106 phone number. Devireddymahesh 09:20, 29 అక్టోబర్ 2010 (UTC)

మీ ఆసక్తికి ధన్యవాదాలు. నా (బ్లాగులో http://teluginux.blogspot.com ) తెవికీ అకాడమీ పోస్టులు, దానిలోని సమర్పణలు చూచితే, మీకు అర్థమవుతుంది. నేను ఈ రోజు, నిన్న జెకెసి, విజ్ఞాన్ కాలేజీ ఎమ్ సిఎ విద్యార్థులకి దీనిగురించి అనుభవపూర్వకంగా ప్రయోగాలతో వివరించాను. వీలైతే, ఒకసారి ఆ ఎమ్ సి ఎ శాఖాధికారులను సంప్రదించండి. ఇంకేదైనా సందేహాలుంటే నాకు ఇ-మెయిల్ పంపించండి. -- 210.212.228.65 09:01, 2 నవంబర్ 2010 (UTC)

వినతి

[మార్చు]

నమస్తే అండి!

నా పేరు త్రైలింగస్వామి... నేను వికి లో 'భావనారాయణ స్వామి ' అను వ్యాసాన్ని రాసాను..

ఇంకా కొన్ని వ్యాసాలు పుణ్యక్షేత్రాలపైనా, చారిత్రాత్మక ప్రదేశాలపైనా రాయాలని ఉన్నది... అందుకొరకు దయ ఉంచి ఈ రంగములో అనుభవం ఉన్నవారిని సంప్రదించటం ఎలానో కొంచెం తెలియజేయగలరు..

త్రైలింగ..

మీరు వికీపీడియా:WikiProject/హిందూమతం లోని సభ్యులను సంప్రదించండి. చిన్న సూచనలు. వికీ విధానాలను చదవండి. మీరు వనరులను ఉదహరించుతూ వ్యాసాలు రాయాలి. బొమ్మలకోసం హక్కులు గల బొమ్మలు మాత్రమే చేర్చాలి. --అర్జున 05:50, 10 ఫిబ్రవరి 2011 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు అర్జునగారు.... త్రైలింగ!

పతకానికి ధన్యవాదాలు

[మార్చు]

2010 లో అత్యధిక మార్పులు చేసిన 10 మంది సభ్యులలో ఒకరిగా గుర్తించి పతకం సమర్పించినందుకు ధన్యవాదాలు. వీర శశిధర్ జంగం 07:13, 27 మార్చి 2011 (UTC)[ప్రత్యుత్తరం]

మూసలు

[మార్చు]

తెవికీలో చాలా ముసలు పనిచేయడం లేదు. మీకు తెలిస్తే సరిచేయండి.Rajasekhar1961 05:57, 21 జూన్ 2011 (UTC)[ప్రత్యుత్తరం]

మీకు అత్యవసరమైన మూసల ఉదహరించండి.వీలువెంబడి ప్రయత్నిస్తాను. అర్జున 07:04, 23 జూన్ 2011 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ వార్త వ్యాసం

[మార్చు]

అర్జునరావు గారు, మీరు కోరిన విధంగా ఒక వ్యాసం తయారు చేశాను, పరిశీలించండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:18, 25 జూన్ 2011 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు నేను దాని చర్చాపేజీలో సమీక్ష రాశాను చూసి స్పందించండి. అర్జున 03:51, 26 జూన్ 2011 (UTC)[ప్రత్యుత్తరం]

మీ మాటామంతీ కోసం ఫొటో

[మార్చు]

త్వరగా స్పందించండి. --అర్జున 16:38, 9 జూలై 2011 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జునరావు గారు, నా వ్యక్తిగత వివరాలు కాని, ఫోటో కాని వికీలో ఇప్పుడే ఇవ్వదలుచుకోలేను. తెలుగు వారి ప్రయోజనాల దృష్ట్యా రెండు పేద్ద ప్రాజెక్టులలో కృషిచేస్తున్నాను. అవి పూర్తయ్యే వరకు నా వివరాలు బయటపెట్టదలుచుకోలేను. ఫోటో లేకుండా ప్రచురించడానికి అవకాశం ఉంటే పరిశీలించండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:15, 9 జూలై 2011 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు. సరే. ఇలాగే ప్రచురణకి విడుదలచేద్దాము. --అర్జున 01:08, 10 జూలై 2011 (UTC)[ప్రత్యుత్తరం]

గూగుల్ అనువాద వ్యాసాలు

[మార్చు]
  • అర్జునరావుగారూ మీ ప్రశంశకు ధన్యవాదాలు. మీరుకోరినట్లు గూగుల్ అనువాదవ్యాసాల గురించి వ్యాసము తప్పక వ్రాస్తాను. కాకుంటే కొంత సమయము తీసుకుంటుంది. వీకీపిడియా కొరకు మీరు చేస్తున్న కృషి. మీరు చూపిస్తున్న శ్రద్ధ అమోఘము.--t.sujatha 12:55, 13 జూలై 2011 (UTC)
  • అర్జునరావు గారూ తెవికీ కొరకు మీరు కృషి అపురూపము. అత్యంత చురుకైన క్రియాశిలకమైన మీ కృషి ఇలా కొనసాగి తెవికీని మరింత అభివృద్ధి పరచాలని కొరుకుంటున్నాను. అలాగే అనువాదాల వ్యాసం గురించి అభినందనకు కృతజ్ఞతలు. తెవికీ వార్త కొరకు వ్యాసము మరి రెండు రోజులలో తయారు అవ వచ్చు. పూర్తి అయిన తరువాత తెలియజేస్తాను. మీరు పరిశీలించి దానిని ప్రచురించ వచ్చు.--t.sujatha 18:31, 16 సెప్టెంబర్ 2011 (UTC)
ధన్యవాదాలు. అర్జున 04:50, 17 సెప్టెంబర్ 2011 (UTC)
  • అర్జునరావుగారూ అనువాదవ్యాసాల సంస్కరణ వ్యాసాన్ని ఉపన్యాసంగా మార్చడనికి తగిన సూచనలు అందచేసారంటే వ్యాసాన్ని కొన్ని రొజులలో పూర్తి చేస్తాను.--t.sujatha 15:02, 26 సెప్టెంబర్ 2011 (UTC)

పుస్తకాల ప్రోజెక్టు

[మార్చు]
  • అర్జునరావు గారికి చిన్న విన్నపం. పుస్తకాల ప్రోజెక్ట్ లోని వివిధ రకాల పుస్తకాల పేజీల కోసం ఒక మంచి సమాచార పెట్టెను తయారుచేయమని అభ్యర్ధిస్తున్నాను - రాజశేఖర్.
మూస:విద్య,_ఉపాధి లాగానా? మరిన్ని వివరాలు తెలియచేయండి. వీలువెంబడి ప్రయత్నిస్తాను. --అర్జున 05:43, 5 ఆగష్టు 2011 (UTC)
  • మూస కాదు. సమాచార పెట్టి (Infobox). ఆంగ్లంలో మంచిదేదైనా ఉంటే దాని నుండి ఎలా తయారుచేయాలో నాకు తెలియదు. మీరు తయారుచేయగలరని మనవి.Rajasekhar1961 13:56, 15 సెప్టెంబర్ 2011 (UTC)
ఇప్పటికే వున్నది కదండి. వాడి చూడండి అర్జున 10:03, 25 సెప్టెంబర్ 2011 (UTC)

Invite to WikiConference India 2011

[మార్చు]

Hi Arjunaraoc,

The First WikiConference India is being organized in Mumbai and will take place on 18-20 November 2011.
You can see our Official website, the Facebook event and our Scholarship form.

But the activities start now with the 100 day long WikiOutreach.

Call for participation is now open, please submit your entries here. (last date for submission is 30 August 2011)

As you are part of Wikimedia India community we invite you to be there for conference and share your experience. Thank you for your contributions.

We look forward to see you at Mumbai on 18-20 November 2011

ధన్యవాదము

[మార్చు]

నమస్తే, నా సందేహలకు స్పందించి సమాధానాలను ఇచ్చినందుకు ధన్యవాదాలతో, Rama krishna reddy.P 13:52, 15 సెప్టెంబర్ 2011 (UTC)


అర్జున్‌గారు నమస్తే, మీరుచెప్పినట్లె లింకుకు వెళ్లి,అక్కడ వున్నవిధంగానే,కంట్రొల్‌ప్యానల్‌లో రిజినల్‌లాంగ్యెజ్‌కు వెళ్లి,లాంగ్యెజి ట్యాబ్‌కు వెళ్ళి,ఫస్ట్ బటన్ సెలెక్ట్‌చేసి ఒకే బటన్‌నొక్కాను.కాని ప్రొగ్రాం ఇన్‌స్టాల్ కాలేదు.దయచేసి పరిష్కారమార్గం చెప్పగలరు.117.197.213.243 14:48, 15 సెప్టెంబర్ 2011 (UTC)

ఈ లింకు ఉపయోగంగా వుండవచ్చు. అర్జున 04:23, 16 సెప్టెంబర్ 2011 (UTC)

Pictures of mahabharata

[మార్చు]

My uploads are painted by Rajaravi varma. According to Indian law they are out of copyright.--Sridhar1000 17:20, 20 అక్టోబర్ 2011 (UTC)

I replaced all of them with alternatives found on wikicommons.

--Sridhar1000 10:51, 22 అక్టోబర్ 2011 (UTC)

మాటామంతి సమీక్ష

[మార్చు]
అర్జునరావుగారూ మాటామంతి పూర్తి చేసాను. ఒక్కసారి చూసి ఏవైనా మార్పులు అవసరమనుకుంటే సూచించండి.--t.sujatha 14:07, 25 నవంబర్ 2011 (UTC)

గణాంకాలు

[మార్చు]

పుస్తకాల ప్రాజెక్టు పేజీలో కూడా గణాంకాలు పట్టిక తయారుచేయమని అభ్యర్ధిస్తున్నాను.Rajasekhar1961 07:52, 28 డిసెంబర్ 2011 (UTC)

మూస:వికీప్రాజెక్టు పుస్తకాలు వున్న విషయ పేజీలను విలువకట్టితే, గణాంకాలు చేయడం సహాయచేయగలను. -- అర్జున 09:15, 28 డిసెంబర్ 2011 (UTC)
పైనుదహరించిన మూస బాగానే పనిచేస్తున్నది. రేపటి స్థితితో గణాంకాలు తయారుచేయటానికి ప్రయత్నిస్తాను. --అర్జున 16:38, 30 డిసెంబర్ 2011 (UTC)
  • పుస్తకాల ప్రాజెక్టులోని పేజీలన్నింటిని విలువ కట్టాను. గణాంకాలు సరిగా ఎలా చేయాలో చెబితే నేను చేస్తాను. మీకు చేసేంత సమయం ఉంటే ఇంకా సంతోషం.Rajasekhar1961 08:42, 31 డిసెంబర్ 2011 (UTC)
    • గణాంకాలు పూర్తిచేసినందుకు ధన్యవాదాలు. పాత గణాంకాలు అసంపూర్తిగా ఉన్నాయి. అందువలన తొలగించాను. ఈ పుస్తకాల ప్రాజెక్టులో 168 వ్యాసాలున్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైన వాటిని తీసుకొని మంచి వ్యాసాలుగా అభివృద్ధి చేస్తే బాగుంటుంది.Rajasekhar1961 12:33, 31 డిసెంబర్ 2011 (UTC)

ధన్యవాదాలు

[మార్చు]

అర్జునరావుగారూ! నాకు పతకం బహూకరించినందుకు కృతజ్ఞతలు. కొన్ని వ్యక్తిగత కారణాలవలన ఈ మధ్య వికీకి సమయం తగ్గించాను. త్వరలో ఆ సమస్యలు పరష్కారమవుతాయి. కాసుబాబు 16:52, 30 డిసెంబర్ 2011 (UTC)

అర్జునరావు గారు, ఇటీవల రాజశేఖర్ గారు ఒక సభ్యుడి చర్చాపేజీలో వ్రాసిన విషయానికి మీరు ఏ అంశంతో ఏకీభవిస్తున్నారో కోరదలిచాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 16:52, 31 డిసెంబర్ 2011 (UTC)

నాకు అప్పటి వివాదం గురించి ప్రత్యక్ష సంబంధం లేదు, దాని గురించి అభిప్రాయంలేదు. గతంలో చురుకుగా పనిచేసిన సభ్యులను మరల తెవికీలో కృషిచేయటానికి చేసే రాజశేఖర్ గారు గాని మరి ఎవరైనా సరే చేసే ప్రయత్నాలకు తెవికీ అభిమానిగా, సభ్యునిగా నా తోడ్పాటు వుంటుంది. అదే నా వ్యాఖ్య అర్ధం మని గమనించగోర్తాను. --అర్జున 02:46, 1 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
అలా వ్రాస్తే నాకు ఇబ్బంది లేదు కాని రాజశేఖర్ గారి అభిప్రాయానికి ఏకీభవిస్తున్నాను అని వ్రాసినందుకే ఇబ్బందిగా ఉంది. మీరు మొత్తం పరిశీలించి వ్రాస్తే బాగుండేది. ఎవరో ఒకరు ఏదో ఒక అభిప్రాయాన్ని వ్రాస్తే వారికి గుడ్డిగా మద్దతు ఇవ్వడం బాగుండదు. రాజశేఖర్ గారు పాత చర్చలను గొడవలుగా చిత్రీకరిస్తూ ఇప్పడు తెవికీని ఇబ్బందుల్లోకి నెట్టుతున్నట్లు కనిపిస్తోంది. నిన్న ఛాట్‌లో కూడా ఇదే విషయం గమనించాను. తెవికీ నియమాలపై సదభిప్రాయం లేని వ్యక్తిపై ఒక నిర్వాహకుడిగా రాజశేఖర్‌గారికి ఎలాంటి అభిప్రాయముందో తెలియదు కాని నిర్వహణలో భాగంగా తెవికీ నియమాలను సూచించిన నన్నే తప్పుపట్టడం నాకు అస్సలు నచ్చడం లేదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 08:38, 1 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
క్షమించాలి. మీ సలహా బాగుంది. నేను ఇకముందు వ్యాఖ్యలలో జాగ్రత్త వహిస్తాను. --అర్జున 08:46, 1 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
రాజశేఖర్ గారి అభిప్రాయం కూడా నాకు నచ్చలేదు. తెవికీ నియమాలు చెప్పిన సభ్యుడిపై అసహ్యం ఉన్న వ్యక్తికి అతను చెప్పిన తప్పు జరిగిందని ఎలా చెప్పగలుతున్నాడు. క్షమాణలు అతని వ్యక్తిగతం, చర్చలలో పాల్గొనకుండా ఇన్నేళ్ళ తర్వాత తెవికీ నిర్వహణలో భాగంగా పరిశీలించి సూచనలు చేయడం తప్పని రాజశేఖర్ గారు అనుకుంటే ఎలా? ఆ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాను. దీనిపై రాజశేఖర్ గారు సమాధానం చెప్పాలి. సి. చంద్ర కాంత రావు- చర్చ 08:59, 1 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
రాజశేఖర్ గారు, మీరు ఆఫ్లైన్ లో చర్చించండి ఏదైనా అపార్థాలుంటే తొలగించుకోవచ్చు. --అర్జున 09:28, 1 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
తెవికీలో మళ్ళీ గొడవలు తీయడానికి, రెచ్చగొట్టే విధంగా చేయడానికి ఒక సభ్యుడు ప్రయత్నిస్తున్నాడు. ఆ సభ్యుడి రాతలను పరిశీలించండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 09:11, 1 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
తెవికీ స్థాపన స్వప్నాలను సాకారం చేయటానికి మనమందరము కృషి చేద్దాం.--అర్జున 09:28, 1 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
[మార్చు]

Recently there has been quite a number of links added to the domain samputi.com, which I have come across while doing other clean-up across the wikis. I wasn't sure of your community's attitude to such addition of links so I have left them alone and brought the matter to you as an administrator (who I am hoping speaks English). Billinghurst 04:27, 1 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

Thanks for bringing to my attention. The linked site looks to be a good source of information and appears to be run by non profit. I will discuss with other Admins and address the same. --అర్జున 04:51, 1 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
Thanks for taking the time to consider. They have done a bit of en:WP:LINKFARM on at enWP, some removed, some not. Thanks for the 2012 wishes :-) Billinghurst 04:57, 1 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
I have brought it to the notice of our Admins. --అర్జున 08:39, 2 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

కుక్కుట శాస్త్రం

[మార్చు]

కుక్కుట శాస్త్రం గురించి Redaloes మంచి వ్యాసాన్ని తయారుచేస్తున్నారు. వారిదే స్వంత కృతి ఆంగ్ల వికీలో చేర్చబడినది. దానిని మీరు దయచేసి కామన్స్ లోకి లోడ్ చేసి తెలుగు వికీపీడియా వ్యాసంలో కూడా చేర్చమని మనవి. ఆ బొమ్మ లింకు : File:Kukkuta Sastra.jpg ఇది. AngajalaARS 11:02, 1 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

అ బొమ్మ త్వరలో కామన్స్ లోకి మార్చటానికి గుర్తించబడిందట. నెల వేచిచూసి అప్పుడు చూద్దాం. ఇప్పటి ప్రాధాన్యాలపై దృష్టి తగ్గించకుండా వుండటానికి వెంటనే చేయటం లేదు --అర్జున 12:15, 1 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

ఆర్యా ....... మీసలహా ప్రకారం...... చాటింగు లో పాల్గొన గలను. నేను విశ్రాంత ఉద్యోగిని కనుక నాకు కావలసినంత సమయమున్నది. నేనెలా ఉపయోగ పడగలని తెలపండి. నేను సర్వదా సిద్దమే. నా ఇ మైల్ బహిరంగంగానె వున్నది. ...... ఎల్లంకి భాస్కర నాయుడు ॰ జిమైల్ . కామ్. ఆంగ్లక్షరాలలొ ఇది నా ఇ.మైల్. ellanki 13:46, 3 జనవరి 2012 (UTC)

నిర్వాక హోదా

[మార్చు]

అర్జునరావుగారూ ! నా నిర్వాహక హోదాకు మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.t.sujatha 04:44, 23 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]