లోహిత్ ఫాంటు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లోహిత్ తెలుగు ఫాంటు నమూనా

లోహిత్ ఫాంటు రెడ్ హ్యాట్ లినక్సులో వాడుతున్న భారతీయ భాషల ఫాంటుల సమూహము. 2004లో రెడ్ హ్యాట్ సంస్థ ఐదు లిపులకు చెందిన ఖతులను స్వేచ్ఛా సాఫ్టువేరు లైసెన్సుకు అనుగుణంగా జీపీఎల్ ద్వారా విడుదల చేసింది. 2011కి ఈ ఖతులను సిల్ ఓఎఫ్ఎల్ లైసెన్స్ ద్వారా విడుదల చేసింది. [1][2] లోహిత్ అనే పదానికి ఎఱుపు అని సంస్కృతంలో అర్ధం ఉంది. ప్రస్తుతం 21 భారతీయ భాషలను ఈ ఖతి సమూహం ద్వారా రాయవచ్చు. ఈ ఖతులను ప్రస్తుతం ఫెడోరా ప్రాజెక్టు వారు నిర్వహిస్తున్నరు. ఏమయినా లోపాలు లేదా దిద్దుబాట్లకు వీరే తోడ్పాటు అందిస్తున్నారు. లోహిత్ ఖతులు యూనికోడ్ 6 కు అనుగుణంగా ఉన్నాయి.

లోహిత్ ఖతి అందుబాటులో ఉన్న భాషలు:

 • అస్సామీ
 • బెంగాలీ
 • గుజరాతీ
 • హిందీ
 • కన్నడ
 • కాశ్మీరీ
 • కొంకణి
 • మలయాళం
 • మరాఠీ
 • నేపాలీ
 • ఒరియా
 • పంజాబీ
 • సింధీ
 • తమిళం
 • తెలుగు

సాంకేతిక సమాచారం[మార్చు]

లోహిత్ తెలుగు ఖతిలో 556 గ్లిఫ్లు ఉన్నాయి. ఇది సాధారణ ఖతిగా అందుబాటులో ఉంది. బొద్దు వాలు అక్షరాలు విడిగా రూపొందించలేదు. ఇది ఫాంట్ఫోర్జ్ 1.0 సహాయంతో రూపొందించబడింది. ఇది ఒక ట్రూటైప్ ఖతి.

మూలాలు[మార్చు]

 1. "లోహిత్ ఖతి". Archived from the original on 2012-02-13. Retrieved 2010-07-26.
 2. "Re: [Lohit-devel-list] Relicensing Lohit fonts". 2011-09-15. Archived from the original on 2019-08-29. CS1 maint: discouraged parameter (link)

బయటి లింకులు[మార్చు]