ఖతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లోహిత్ తెలుగు ఖతిలో 'అ' నిర్మాణం
అ కనిపించే తీరు

ఖతి అనేది ఒక లిపిని చూపే విధానం. లిపి ఒక భాషను లిఖిత రూపంలో చూపించే సాధనం, స్థూలంగా చెప్పాలంటే ముద్రణలో లేదా కంప్యూటర్లలో భాష యొక్క అక్షరాలను చూపే శైలే ఖతి. అంటే ఖతిలో ఒక లిపికి సంబంధించిన అన్ని అక్షరాలు,అంకెలు,చిహ్నాలు ఉంటాయనమాట! ఒక ఖతిలో ఉండే అన్ని అక్షరాల-అంకెల-చిహ్నాల ఆకృతి, రూపూ-రేఖా-లావణ్యాలు ఒకే విధంగా ఉంటాయి. ఒకే రకమయిన నిబంధనలను అనుసరించి, ఆకారంలో కొద్ది కొద్ది మార్పులతో ఉండే ఖతుల సమూహమును ఖతి పరివారం అనవచ్చును. ఆంగ్లంలో కొన్ని వేల ఖతులు వెలువడినాయి.

సాంకేతిక రకాలు[మార్చు]

బిట్‍మాప్[మార్చు]

దీనిలో అక్షరరూపం ఒక చుక్కల దీర్ఘచతురస్రపు గడి పై (ఉదా:8*12) రూపు దిద్దుతారు. పరిమాణం పెంచడానికి, ఇంకా పెద్ద దీర్ఘచతురస్రపుపై రూపు (ఉదా: 24*36) దిద్దుతారు. సరియైన పరిమాణం లేక పోతే, దగ్గరగా ఉన్న పరిమాణాన్ని పెంచి వాడితే, అక్షరరూపం సరిగారాదు. ఇది చాలాకాలం క్రిందట కంప్యూటర్ ల తోవాడేవారు. ఇప్పటికి బిందు మాత్రిక (డాట్ మాట్రిక్స్) ప్రింటర్లో లేక ఆక్షరాలు మాత్రమే చూపే టర్మినల్స్ లో వాడతారు.

ట్రూ టైప్[మార్చు]

ఆపిల్ 1981 లో ఈ ఫాంటుని అభివృద్ధి పరిచింది, అడోబ్ పోస్ట్‍స్క్రిప్ట్ టైప్-1 ఫాంటుకి ఇది పోటీ. తరువాత మైక్రోసాఫ్ట్ తో కలసి దీనిని ఇంకా మెరుగు పరిచారు. దీనిలో ఆకారాలను సరళ రేఖలతో, వర్గ సమీకరణాలతో రూపు దిద్దుతారు. దీనివలన ఏ పరిమాణంలో నైనా సరియైన రూపు దిద్దబడుతుంది. వీటిలో తెలుగు అక్షర రూపాల సంఖ్యపై పరిమితి వుండేసరికి, ఒక ఆక్షర రూపాన్ని తయారు చేయడానికి రెండు లేక ఎక్కువ చిహ్నాలు వాడేవారు. ఉదాహరణకి, ఋ కోసం బ తరువాత కొమ్ము జతచేసి చూపించడం. ఈ రకపు ఫాంట్లునే, చాలా తెలుగు మరియు భారతీయ భాష వార్తాపత్రికలు తమ అంతర్జాల స్థలాలకి ప్రారంభంలో వాడేవి, కొన్ని ఇంకా వాడుతున్నాయి. ఉదా: ఈనాడు ఫాంటు. డిటిపి సాఫ్ట్వేర్ లో వీటిని సాధారణంగా వాడతారు.

ఓపెన్ టైప్[మార్చు]

ఇది ట్రూటైపు కన్నా మెరుగైనది. దీనిని మైక్రోసాఫ్ట్ మరియు అడోబ్ కంపెనీలు తయారుచేశాయి. దీనిలో ఆకారాలు పోస్ట్‍స్క్రిప్ట్ లో లాగా బెజియర్ స్ప్లైన్ లతో కాని, లేక ట్రూటైప్ లో లాగా కాని వుండవచ్చు. వీటి ఫైళ్లు .ttf లేక .otf పొడిగింత లతో వుంటాయి. దీనిలో యూనికోడ్ అనుకూలంగా వుంటాయి. సాధారణంగా కంప్యూటర్ వాడేవారు అందరూ దీనినే వాడుతున్నారు. ఉదా: పోతన ఫాంటు, లోహిత్ ఫాంటు

పద వ్యుత్పత్తి[మార్చు]

ఖతి అనే పదం ఖత్ అనే సంస్కృత మూల పదం నుండి వచ్చింది. సాధారణంగా సంస్కృత పదాలకు 'ఇ' కారం చేర్చి తెనుగీకరించే విధానం ద్వారా ఈ ఖతి పదం వచ్చింది.

తెలుగులో ఖతులు - చరిత్ర[మార్చు]

ఖతులు ముద్రణ వ్యవస్థతో పాటే అభివృద్ధి చెందాయని చెప్పుకోవచ్చు. డీటీపీ చేసే సమయం నుండి తెలుగుకు ఎన్నో ఖతులు ఎర్పడ్డాయి. కంప్యూటర్ల రాకతో ఖతులు కూడా సాంఖ్యిక(డిజిటల్) రూపాన్ని సంతరించుకున్నాయి. శ్రీలిపి వారు మొదట్లో కొన్ని ఖతులను తెలుగులో ప్రవేశ పెట్టారు, కానీ అవి ఎక్స్టెండెడ్ ఆస్కీ లో ఉండేవి.తరువాత భారత ప్రభుత్త్వం వారి ఖతులు కూడా ఎక్స్టెండెడ్ ఆస్కీ లో మరికొన్ని ఖతులు ప్రవేశ పెట్టాయి. అంతకు ముందు డీటీపీ లో పేరుగాంచిన అను సంస్థ వారు కూడా వారి ఖతులను సాంఖ్యీకరించి విడుదల చేసారు. కానీ ఇవేవీ యూనికోడ్(విశ్వవ్యాప్త విశిష్ట సంకేతపదాలు) లో లేవు.

మైక్రోసాఫ్ట్ సంస్థ వారి గౌతమి ఖతి[1]యూనికోడ్ లో వచ్చిన ఖతి, కానీ ఇది స్వేచ్ఛా నకలుహక్కులు లేని ఖతి.అదే సమయంలో స్వేచ్ఛగా వాడుకునే వీలున్న ఖతులు పోతన మరియు వేమన ఖతి విడుదలయ్యాయి. ఆ తరువాత అక్షర్, కోడ్ 2000, ప్రభుత్వ సంస్థ సీ-డాక్ వారి జిస్ట్ [2] ఖతులు అందుబాటులోకి వచ్చాయి [3][4]లోహిత్ తెలుగు ఆధారంగా రమణీయ మరియు వజ్రం (ఫాంటు) ఖతులు 2011 లో విడుదల అయ్యాయి. 2012 లో సిలికానాంధ్ర ద్వారా మూడు ఖతులు విడుదలయ్యాయి - అవి పొన్నాల, రవిప్రకాష్ మరియు లక్కిరెడ్డి [5].2012 అక్టోబరు 17న సురవర డాట్ కామ్ నుండి స్వర్ణ ఖతి విడుదల అయింది. [6]. 2014 లో గూగుల్ తెలుగు ఖతులను విడుదలచేసింది[7].

లైసెన్సు రకాలు[మార్చు]

సిల్ ఓఎఫ్‍ఎల్[మార్చు]

దీనినే ఓపెన్ ఫాంట్స్ లైసెన్స్ అని కూడా అంటారు. స్వేచ్ఛా ఖతులకి వర్తించే లైసెన్స్ ఇది.

జిపిఎల్[మార్చు]

జిపిఎల్ అందరికి అన్ని విధాల ఉపయోగించుకొనటం లేక మార్పు చేసుకోవటం, ఇతరులకి ఇవ్వడం అనుమతులు వుండే లైసెన్సు.ఉదా: పోతన ఫాంటు ఈ లెసెన్సు ప్రకారం విడుదలచేయబడింది.

షరతుల లైసెన్సు[మార్చు]

సాధారణంగా అన్ని హక్కులు యజమాని వరకే వుండేవి షరతుల లైసెన్స్. అయితే ఇతరులు వాడుకోటానికి కొన్ని పరిమితులు సడలించవచ్చు. ఉదాహరణకి కంప్యూటర్ లో చూడటానికి, ముద్రించడానికి(Print) అనుమతి వుండే లైసెన్సు . ఉదా: ఈనాడు ఫాంటు లైసెన్సు.

ఇతర తెలుగు ఖతులు[మార్చు]

తెలుగు ఫాంట్ల ప్రదర్శన పుస్తకాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

వనరులు[మార్చు]

 1. "Gautami Font Family". October 20, 2017.
 2. "Open Type Fonts : (For Linux)(GIST)".
 3. "Telugu Fonts".
 4. "లోహిత్ ఖతి".
 5. "Telugu spell checker, 15 fonts launched". Nov 3, 2012.
 6. "సురవర స్వర్ణ ఉచిత దిగుమతి పుట".
 7. "Google fonts named after NTR, Mandali". Dec 16, 2014.
 8. తెలుగుఫాంట్ల కేటలాగ్
 9. సిడాక్ ఒపెన్ టైప్ ఫాంట్ల కేటలాగ్
 10. ట్రూ టైప్ ఫాంట్ల కేటలాగ్
 11. మాడ్యులర్ తెలుగు ఫాంట్ కేటాలాగ్
"https://te.wikipedia.org/w/index.php?title=ఖతి&oldid=2619675" నుండి వెలికితీశారు