Jump to content

గురజాడ (ఖతి)

వికీపీడియా నుండి
గురజాడ
సృష్టించినవారుపురుషోత్ కుమార్
రూపొందించిన సంస్థసిలికానాంధ్ర
సృష్టించిన తేదీ30 అక్టోబర్, 2012
విడుదల చేసిన తేదీ1 నవంబర్, 2012

గురజాడ ఖతి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ద్వారా విడుదల చేయబడిన తెలుగు యూనికోడ్ ఖతి. ఇది సిలికానాంధ్ర సారధ్యంలో తయారైన ఒక ఖతి.[1] ఇవి 2వ అంతర్జాతీయ తెలుగు అంతర్జాల సదస్సు సందర్భంగా 2-11-2012 నవిశాఖపట్టణం లో విడుదల చేసిన ఏకరూప ఖతుల లలో ఇదీ ఒకటి . దీనిని ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్హు. ముద్రణారంగంలో వున్న తెలుగు ఫాంట్లలోని లోటుపాట్లను గమనించి ముద్రణకు అనుకూలంగా ఈ ఖతిని పురుషోత్త్ కుమార్ గుత్తుల తయారు చేశారు.[2] గూగుల్ ఇచ్చే తెలుగు యూనికోడ్ ఖతులలో గురజాడ కూడా ఉన్నది . @font-face అనే CSS3 సౌలభ్యం ద్వారా వాడుకరుల కంప్యూటర్లలో ఈ ఖతులు లేకున్నా సర్వర్ నుండి అప్పటికప్పుడు తెచ్చి చూపించవచ్చు. .ఈ సౌలభ్యం వలన ప్రత్యేకంగా ఈ ఫాంట్ ను స్థాపించుకొనే అవసరం లేదు.[3]

ఈ గురాజాడ ఖతి తెలుగు చేతివ్రాత ఫాంట్, ఇది శీర్షికలు, పోస్టర్లు, ఆహ్వానాలకు అనువైనది.

తెలుగును 2013 లో పురుషోత్త్ కుమార్ గుత్తుల రూపకల్పన చేసి అభివృద్ధి చేశారు , సిలికాన్ ఆంధ్ర సిల్ ఓపెన్ ఫాంట్ లైసెన్స్ v1.1 కింద అందుబాటులో ఉంచారు. లాటిన్‌ను అర్జెంటీనాలో ఒక రకమైన ఫౌండ్రీ అయిన హుయెర్టా టిపోగ్రాఫియాలో జువాన్ పాబ్లో డెల్ పెరల్ అభివృద్ధి చేశారు మొదట అలెగ్రేయా సాన్స్‌గా ప్రచురించబడింది. ఈ గురజాడ ప్రాజెక్టుకు భారతదేశంలోని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న టైప్ డిజైనర్ అప్పాజీ అంబరీషా దర్భా నాయకత్వంలో తయారు అయినది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమూ సిలికానాంధ్ర సంస్థ కలసి మొత్తం 18 తెలుగు ఖతులను తెలుగు విజయం ప్రాజెక్టు ద్వారా అందించాయి. అలానే, సురవర వారు స్వర్ణ, సంహిత అనే మరో రెండు ఖతులను ఉచితంగా అందిస్తున్నారు. వీటిని దింపుకొని మన కంప్యూటర్లలో స్థాపించుకుని మనం ఉపయోగించుకోవచ్చు. ఇది మీ కంప్యూటర్లో కొత్త తెలుగు ఖతులు లేకున్నా మీకు ఆ పేజీ తెరపట్టులో చూపిన విధంగా కనబడుతుంది. గమనిక: ఈ జాల ఖతుల సౌలభ్యం కనీసం ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ (IE) 9 లేదా ఫైర్‌ఫాక్స్, క్రోమ్, ఓపెరా, సఫారీ వంటి విహారిణులలో పనిచేస్తుంది.

ఈ జాల ఖతుల సౌలభ్యాన్ని మన జాల పుటలలో వినియోగించుకోడానికి, మనకు కావాలసిన ఖతులను ముందుగా మన సర్వర్ లోనికి ఎక్కించాలి. ఆ తర్వాత CSS ఫైలులో (లేదా HTML ఫైలులో నేరుగా CSS ద్వారా), @font-face అన్న నియమం ద్వారా ఖతిని నిర్వచించాలి. ఆపై, కావలసిన అంశాలకు ఆ ఖతిని వర్తింపజేయవచ్చు.

గురజాడ ఖతిని నిర్వచించడం మనం జాల ఖతిగా ఉపయోగించిన ఖతి వాడుకరి కంప్యూటర్లో ఉంటే (మనం సర్వరు నుండి దింపుకోకుండా) దాన్నే ఉపయోగించవచ్చు. అందుకు src లక్షణానికి local() విలువనూ ఇవ్వవచ్చు.


ఈ జాల ఖతుల సౌలభ్యాన్ని మన జాల పుటలలో వినియోగించుకోడానికి, మనకు కావాలసిన ఖతులను ముందుగా మన సర్వర్ లోనికి ఎక్కించాలి. ఆ తర్వాత CSS ఫైలులో (లేదా HTML ఫైలులో నేరుగా CSS ద్వారా), @font-face అన్న నియమం ద్వారా ఖతిని నిర్వచించాలి. ఆపై, కావలసిన అంశాలకు ఆ ఖతిని వర్తింపజేయవచ్చు.

గురజాడ ఖతిని నిర్వచించడం

@font-face {

src: url(Gurajada.ttf);

font-family: 'Gurajada';

}

@font-face అన్న నియమంలో src లక్షణానికి విలువగా మనం నర్వరులోనికి ఎక్కించిన ఖతి యొక్క చిరునామాని url() రూపంలో ఇవ్వాలి. మనం ఎక్కించిన ఖతి CSS ఫైలు ఉన్న సంచయం (ఫోల్డరు) లోనే ఉంటే, కేవలం ఖతి యొక్క ఫైలు పేరు ఇస్తే సరిపోతుంది. లేదా పూర్తి URL కూడా ఇవ్వవచ్చు. వేరే సర్వర్లలో (డొమైన్లలో) ఉన్న ఖతులను మనం ఉపయోగించుకోడానికి మామూలుగా అయితే వీలుండదు. ఆయా సర్వర్లలో ఖతులను ఎవరైనా ఉపయోగించుకునే విధంగా Access-Control-Allow-Origin అనే HTTP headerను పేర్కొనాల్సి ఉంటుంది. గూగుల్ జాల ఖతుల వంటి ప్రజా సేవా గూళ్ళు వారి ఖతులను అందరూ వాడుకొనేలా ఇలా పేర్కొంటాయి.

మూలాలు

[మార్చు]
  1. "Fonts". Archived from the original on 2019-08-29. Retrieved 2019-08-29.
  2. "Telugu Fonts(తెలుగు యూనీకోడ్ ఫాంట్లు)". telugufonts.in. Archived from the original on 2020-08-05. Retrieved 2020-08-30.
  3. "Google Fonts". Google Fonts. Retrieved 2020-08-30.