వికీపీడియా:రచ్చబండ (పాలసీలు)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
అడ్డదారి:
WP:VPP
రచ్చబండ
వార్తలు | పాలసీలు | ప్రతిపాదనలు | సాంకేతికము | ఆలోచనలు | పత్రికా సంబంధాలు | ఇతరత్రా..

తేదీ ఆకృతి ఎలా ఉండాలి[మార్చు]

తెవికీలో సాధారణంగా మనం తేదీని 2 జనవరి 2012 లాగానో జనవరి 2, 2012 లాగానో రాస్తున్నాం. ఈ ఆకృతి మన భాషకు అంతగా అతకదనిపిస్తోంది.

 1. సుబ్బారావు 1980 మే 12 న జన్మించాడు
 2. సుబ్బారావు 12 మే 1980 న జన్మించాడు
 3. సుబ్బారావు మే 12, 1980 న జన్మించాడు
 4. సుబ్బారావు 12 మే, 1980 సం.న జన్మించడం జరిగింది.

పై మూడు వాక్యాల్లో మొదటిది మన భాషకు సహజంగా కనిపిస్తోంది. ఈ విషయంలో మన విధానం ఎలా ఉండాలి? __చదువరి (చర్చరచనలు) 15:14, 17 ఆగష్టు 2016 (UTC)

చర్చ[మార్చు]

మొదటిదే బావుంది..--Viswanadh (చర్చ) 15:55, 17 ఆగష్టు 2016 (UTC)
నాలుగవది నప్పుతుంది అని నా అభిప్రాయము. --JVRKPRASAD (చర్చ) 16:02, 17 ఆగష్టు 2016 (UTC)
"సుబ్బారావు 12 మే, 1980 సం.లో జన్మించాడు" సరైనదనుకుంటాను గదండీ. సంవత్సరంలో అంటాం గానీ, సంవత్సరా అనం గదా! __చదువరి (చర్చరచనలు) 17:47, 18 ఆగష్టు 2016 (UTC)
నా ఉద్దేశంలో మొదటి వాక్యమే మెరుగైనది.--స్వరలాసిక (చర్చ) 17:55, 18 ఆగష్టు 2016 (UTC)
మొదటివాక్యము సరైనది. --Nrgullapalli (చర్చ) 09
17, 6 సెప్టెంబరు 2016 (UTC)

మొదటిది[మార్చు]

 1. మొదటిదే బావుంది..--Viswanadh (చర్చ) 15:55, 17 ఆగష్టు 2016 (UTC)
 2. నా ఉద్దేశంలో మొదటి వాక్యమే మెరుగైనది.--స్వరలాసిక (చర్చ) 17:55, 18 ఆగష్టు 2016 (UTC)
 3. మొదటిదే బాగుంది __చదువరి (చర్చరచనలు) 17:57, 23 ఆగష్టు 2016 (UTC)
 4. మొదటిదే బాగుంది. --శ్రీరామమూర్తి (చర్చ) 13:33, 24 ఆగష్టు 2016 (UTC)
 5. మొదటిదే బాగుంది --Pranayraj1985 (చర్చ) 06:16, 25 ఆగష్టు 2016 (UTC)

రెండోది[మార్చు]

మూడోది[మార్చు]

అక్షరాలలో వ్రాసేటప్పుడూ నెల, తేది ఆ తర్వాత సంవత్సరం రాయడం మంచిది. సి. చంద్ర కాంత రావు- చర్చ 21:03, 24 ఆగష్టు 2016 (UTC)

మనవాళ్ళు కొంతమంది ఈ విధానం వ్రాసేటప్పుడు సుబ్బారావు జనవరి 12 1953 అని వ్రాసేందుకు అవకాశం ఉంది. కామాలు లేకపోతే అర్థం మారుతుంది. అంకెలు కలిసిపోతాయి.JVRKPRASAD (చర్చ) 23:48, 24 ఆగష్టు 2016 (UTC)

నాలుగోది[మార్చు]

 1. నాలుగవది నప్పుతుంది అని నా అభిప్రాయము.--JVRKPRASAD (చర్చ) 16:02, 17 ఆగష్టు 2016 (UTC)
 2. మాకు చిన్నప్పుడు తేదీ, నెల మరియు సంవత్సరము అని ఇప్పటి వరకు వ్రాయడము పద్ధతి మాకు మా మాష్టర్లు తప్పుడు రకంగా నేర్పారేమోనని ఇప్పుడు ఇతరుల ద్వారా భవిష్యత్తులో అనుమానించాల్సి రావాల్సి వస్తోందా అని అనుకోవాల్సి ఉంటుందేమో ? JVRKPRASAD (చర్చ) 13:46, 24 ఆగష్టు 2016 (UTC)

ఫలితం[మార్చు]

సభ్యుల అభిప్రాయాలను పరిశీలించాక, 1980 మే 12 అనే రూపమే తెవికీ అనుకూలిస్తుందని సభ్యులు భావించాఅరు కాబట్టి ఆ రూపాన్నే తెవికీ స్వీకరించాలని నిర్ణయించడమైనది. __చదువరి (చర్చరచనలు) 09:11, 6 సెప్టెంబరు 2016 (UTC)

కి.మీ / కిమీ[మార్చు]

కిలోమీటర్లను తెవికీలో కి.మీ.', కి.మీ కిమీఅని, మీటర్లను మీ., మీ అని రాస్తున్నాం. ఇంగ్లీషులో చుక్కలు పెట్టడం లేదు - km అని, m అనీ రాస్తున్నారు. మరి వీటి విషయంలో మన విధానం ఎలా ఉండాలో నిర్ణయించుకోవాలి. మీ అభిప్రాయాలు చెప్పగలరు.__చదువరి (చర్చరచనలు) 12:40, 23 ఆగష్టు 2016 (UTC)

చర్చ[మార్చు]

కి.మీ.[మార్చు]

 1. ఈ విధంగానే ఉండాలి. కి.మీ. పదానికి చుక్కలు లేకపోతే అది కిమీ అనే ఒక పదంగా అవుతుంది. JVRKPRASAD (చర్చ) 00:15, 24 ఆగష్టు 2016 (UTC)
 2. ఆంగ్ల వికీ అంత ప్రాచుర్యం తెలుగు భాషకు లేదు. నా వరకు కి.మీ. గానే ఉండాలని కోరుతున్నాను. ఇదే పద్ధతి మిగిలిన కొలమానాలకు కూడా వర్తింపజేయండి.--Rajasekhar1961 (చర్చ) 13:04, 24 ఆగష్టు 2016 (UTC)
 3. ఇదే సరైనది. సి. చంద్ర కాంత రావు- చర్చ 21:04, 24 ఆగష్టు 2016 (UTC)
 4. ఇదే సరైనది --Pranayraj1985 (చర్చ) 06:18, 25 ఆగష్టు 2016 (UTC)
 5. ఇదే సరియైనది. --ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 06:23, 25 ఆగష్టు 2016 (UTC)
 6. కి.మీ గానే వుంటే బాగుంటుంది. --Nrgullapalli (చర్చ) 09:21, 6 సెప్టెంబరు 2016 (UTC)

కిమీ[మార్చు]

 1. __చదువరి (చర్చరచనలు) 17:57, 23 ఆగష్టు 2016 (UTC)

ఫలితం[మార్చు]

మెజారిటీ సబ్యుల అభిప్రాయాల కనుగుణంగా కి.మీ. అనే రూపాన్నే తెవికీ స్వీకరించాలని నిర్ణయించడమైనది. __చదువరి (చర్చరచనలు) 09:11, 6 సెప్టెంబరు 2016 (UTC)

నెలల పేర్లు[మార్చు]

మార్చ్, ఏప్రిల్, జూన్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల పేర్లు ఇంగ్లీషు ఉచ్చారణ ప్రకారం హలంతాలు. ఏప్రిల్, జూన్ తప్పించి మిగతా వాటిని తెలుగులో అజంతాలుగా మార్చి రాయడం జరుగుతూంటుంది. పాత రచనల్లో ఏప్రిల్ ను ఏప్రియలు అని రాసేవారు, ప్రస్తుతం అలా రాయడం అరుదు. కాబట్టి ఆ రెంటినీ పక్కనబెడితే మిగతా నెలల పేర్లు ఎలా రాయాలో మనం నిర్ణయించాఅలి. ఆయా పేర్ల కోసం గూగిలిస్తే ఫలితాలిలా ఉన్నాయి:

మార్చ్, 1,24,000 మార్చి 72,30,000
ఆగస్ట్ 4,53,000 ఆగస్టు 47,70,000
సెప్టెంబర్ 47,80,000 సెప్టెంబరు 2,45,000
అక్టోబర్ 49,60,000 అక్టోబరు 2,30,000
నవంబర్ 49,80,000 నవంబరు 1,63,000
డిసెంబర్ 54,50,000 డిసెంబరు 2,73,000

గమనిక: పై అన్వేషణలో తెవికీని మినహాయించాను.

మార్చ్ ఆగస్ట్‌లు అజంతాలవైపు మొగ్గు చూపిస్తే, మిగతా వాటికి హలంతరూపాలు ఎక్కువగా వాడుతున్నారు. మన పత్రికలు కూడా ఒక విధానాన్ని పాటించడం లేదు, రెండు రూపాలనూ వాడేస్తున్నాయి. మనం మాత్రం ఒక రూపాన్ని ఎంచుకుందాం. మీ అభిప్రాయాలు చెప్పండి.

అజంత రూపం ఎందుకు వాడాలంటే:

 1. మన భాషకు సహజం. అసలు మన భాష ప్రత్యేకతే అది.
 2. అవి ఇంగ్లీషు పదాలు కాబట్టి అలాగే వాడదామని అనుకోరాదు. అలా అనుకునే పనైతే భాషలో కొచ్చిన పరభాషా పదాలన్నీ అలాగే పలకాల్సి ఉంటుంది. అపుడు మన భాష సహజ గుణాన్నీ, రూపునీ కోల్పోతుంది. ఏ భాషైనా పరాయి భాషా పదాలను తీసుకుంటే దాన్ని తమకనుగుణంగా మార్చుకుంటుంది -పందికొక్కు బ్యాండికూట్‌ ఐనట్టు. వాళ్ళు pandikokku అని అనడం లేదు, మనం గమనించాలి. మనం కూడా రైల్ అనో రెయిల్ అనో అని రాయడం లేదు, రైలు అని అంటున్నాం.
 3. పదాంతంలో లో కలిపి రాయాలంటే తేలిక, "^" పెట్టనవసరం లేదు.

హలంత రూపం ఎందుకు వాడాలంటే

 1. మార్చ్ ఆగస్ట్ లు తప్పించి మిగతావి హలంత రూపాలే ప్రచురంగా ఉన్నాయి
 2. ఏప్రిల్, జూన్ లను అజంతాలుగా అసలు రాయడం లేదు (దాదాపు). అలాంటపుడు అన్నీ అలాగే రాయొచ్చు గదా, ఒకే పద్ధతిలో ఉంటాయి.
__చదువరి (చర్చరచనలు) 13:25, 23 ఆగష్టు 2016 (UTC)

చర్చ[మార్చు]

ఏప్రిలు, జూను అనడం అసహజంగా ఉంటుంది. అది వ్యవహారంలో లేదు. కానీ మిగతా అజంత రూపాలు వ్యవహారంలో ఉన్నాయి. వ్యవహారంలో అజంత రూపం ఉన్నప్పుడు, అది జనానికి అర్థమవుతున్నప్పుడు మనం అజంత రూపమే ఎంచుకోవడం మేలని నా భావన.--పవన్ సంతోష్ (చర్చ) 14:42, 23 ఆగష్టు 2016 (UTC) (పి.ఎస్. ఇటువంటివి నిర్ధారించేప్పుడు గూగులించడం మనకు అనువుగా ఉంటుందన్నది నిజమే కానీ ప్రస్తుతం తెలుగు అంతర్జాలం ఎదుగుతున్న దశలో ఉన్నందువల్ల అది పూర్తిగా భాషా స్వరూపాన్ని వ్యక్తపరచదు కనుక మనం మరో పద్ధతిని కూడా ప్రయత్నించాల్సివుంటుందేమో. ఈ విషయమై ఆలోచించి చూడాలి)
....పాత పుస్తకాల్లో చూడొచ్చు. ఇప్పుడొస్తున్న పుస్తకాల్లోనూ చూడవచ్చు. తెలుగు ఆకాడమీ లాంటివాళ్ళు ఏం చెబుతున్నారో చూడవచ్చు. __చదువరి (చర్చరచనలు) 17:57, 23 ఆగష్టు 2016 (UTC)
పరాయి భాషా ద్వారా వచ్చిన పదాలన్నింటికీ అంజతాల రూపంలో పెట్టడం వల్ల కొన్నింటికి ఎబ్బెట్టుగా ఉండవచ్చు. కాబట్టి వాడుకలో ఉన్న ఉచ్ఛారణకే ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 21:08, 24 ఆగష్టు 2016 (UTC)
వాడుక ఏప్రిల్, జూన్ అనే ఉండాలి లేదా ఏప్రియలు, జూను అని తెలుగులో ఎక్కడైనా వ్రాసుకుంటామంటే వ్రాసుకోవచ్చును. JVRKPRASAD (చర్చ) 23:50, 24 ఆగష్టు 2016 (UTC)
మార్చకుండా ఏప్రిల్, జూన్ అనడం బాగుంటుంది --Nrgullapalli (చర్చ) 09
25, 6 సెప్టెంబరు 2016 (UTC)

అజంతం[మార్చు]

 1. మనం అజంత రూపమే ఎంచుకోవడం మేలని నా భావన.--పవన్ సంతోష్ (చర్చ) 14:42, 23 ఆగష్టు 2016 (UTC)
 2. అజంతమే ఉండాలి__చదువరి (చర్చరచనలు) 17:57, 23 ఆగష్టు 2016 (UTC)
 3. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రియలు, మే, జూను, జూలై, ఆగష్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు మరియు డిసెంబరు అని ఉండాలని నా అభిప్రాయము. JVRKPRASAD (చర్చ) 00:18, 24 ఆగష్టు 2016 (UTC), JVRKPRASAD (చర్చ) 13:27, 24 ఆగష్టు 2016 (UTC)
 4. అన్ని నెలల పేర్లు అజంతా రూపాలలోనే ఉండాలని నా సూచన. ఏప్రిలు, జూను నెలలు కూడా మెల్లగా వాడుకలోకి వస్తాయి.--Rajasekhar1961 (చర్చ) 12:59, 24 ఆగష్టు 2016 (UTC)

హలంతం[మార్చు]

ఫలితం[మార్చు]

మెజారిటీ సభ్యుల అభిప్రాయాలకు అనుగుణంగా ఏప్రిల్, మార్చి, జూన్, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు అనే రూపాలను వాడాలని నిర్ణయించడమైనది. __చదువరి (చర్చరచనలు) 09:11, 6 సెప్టెంబరు 2016 (UTC)