వికీపీడియా:రచ్చబండ (పాలసీలు)/తెవికీలో అంబేద్కర్ , అంబేడ్కర్ నామవాచకం వాడుక విషయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గతంలో వీటిని గురించి అంతగా ఆలోచించవలసిన లేదా పట్టించుకునే అవసరం కలగలేదనుకుంటాను.ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్య్వస్థీకరణలో కోనసీమ జిల్లాకు ఈ పేరు పెట్టబడింది.దీని ప్రభావం వర్గాలు, మూసలు, జిల్లా పేరుపై ఉంది.అంతే గాదు కొన్ని వ్యాసాలలో ఈ నామవాచకం వాడుక రెండు విధాలుగా వాడబడుతుంది.దీని నిర్ణయ ప్రకారం వర్గాలు, మూసలు, వ్యాసాలలో కొన్ని సవరణలు చేయవలసి ఉంది.అందువలన వీటి వాడుక ప్రభావం విషయంలో ఒక పద్దతి లేదా పాలసీని సముదాయ సభ్యులు చర్చించి లేదా విశ్లేషించి ఒక విధాన నిర్ణయంచేయవలసిన అవసరం ఉందని చర్చకు ప్రవేశ పెట్టటమైనది.

వీటికి గూగుల్ ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి.
తెవికీలో వాడకం
  • అంబేద్కర్ వాడకానికి అనుకూలురు
  1. --యర్రా రామారావు (చర్చ) 08:08, 3 అక్టోబరు 2023 (UTC) ఎందుకంటే చిన్నప్పటి నుండి చదువుకున్న, చదివిన పుస్తకాలలో ఈ నామవాచకం మాత్రమే చూసాను.[ప్రత్యుత్తరం]
  2. ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 09:10, 3 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
  3. కె.వెంకటరమణచర్చ 12:00, 3 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
  4. చదువరి (చర్చరచనలు) 01:07, 6 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
  • అంబేడ్కర్ వాడకానికి అనుకూలురు

అభిప్రాయాలు[మార్చు]

  • రెండు పదాల వినియోగం గూగుల్ మరియు తెవికీలో ఉంది. హిందీ వికీలో भीमराव आम्बेडकर గానూ, కన్నడ వికీలో ಬಿ. ಆರ್. ಅಂಬೇಡ್ಕರ್ అనే వాడుకలో ఉన్నాయి. అంటే "అంబేడ్కర్" పదాన్నే ఉపయోగించాయి. వివిధ ప్రముఖులు అంబేద్కర్ గురించి రాసిన పుస్తకాలను పరిశీలిస్తే జానమద్ది హనుమచ్ఛాస్త్రి రాసిన సుప్రసిద్ధుల జీవిత విశేషాలు లో "డా. భీమ్‌రావ్ అంబేద్కర్" అని వాడగా, కత్తి పద్మారావు గారు తాను రాసిన అంబేడ్కర్ జీవిత చరిత్ర లో "అంబేడ్కర్" అనే పదాన్ని వాడారు. గూగుల్ లో ప్రముఖులు అంబేద్కర్ గురించి రాసిన పుస్తకాల శీర్షికలను పరిశీలిస్తే రెండు పదాలను ఉపయోగించడం జరుగుతుంది. రెండు పదాలు కూడా సరియైనవే. అయితే ఎస్.సి.ఇ.ఆర్.టి రెండు తెలుగు రాష్ట్రాలలో 10వ తరగతులకు అందించే సోషల్ స్టడీస్ పుస్తకాలలో "అంబేద్కర్" పదాన్నే ఉపయోగించారు. చాలాకాలంగా మనం చదువుకుంటున్న వివిధ పుస్తకాలలో "అంబేద్కర్" అనే పదం ఉపయోగిస్తున్నాం. దానినే విద్యార్థిలోకం నేర్చుకుంటుంది. కనుక 8 డిసెంబర్ 2012 న ఆ వ్యాస చర్చా పేజీలో "అంబేద్కర్" గా శీర్షికను మార్చమని తెలియజేసాను. కనుక "అంబేద్కర్" సరైన పేరుగా నేను సమర్థిస్తాను. ➤ కె.వెంకటరమణచర్చ 12:00, 3 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
  • తెవికీలో అంబేద్కర్ పేజీ పేరు బి.ఆర్. అంబేడ్కర్. మరాఠీ వికీలో అంబేడ్కర్ అనే ఉంది. దేవనాగరి లిపిని వాడే ఇతర భారతీయ వికీపీడియాలన్నిటిలోనూ ఆ పేజీ పేరు అంబేడ్కర్ అనే ఉంది. కన్నడంలో కూడా అలానే ఉంది. కానీ...
తెలుగులో విస్తృతంగా ఉన్న పేరు అంబేద్కర్ కాబట్టి అది వాడడమే సబబు, అదే వాడాలి. బి.ఆర్. అంబేడ్కర్ పేజీని కూడా ఆ పేరుకే తరలించాలి. అంతేకాదు..
ఇలాంటి సందేహాలున్న పేజీలు ఇంకా అనేకం ఉండే ఉంటాయి, ముందుముందు వస్తాయి కూడా. వాటిని ప్రతీదాన్నీ చేర్చించే అవసరం లేదు. విస్తృత వినియోగంలో ఉన్న పేరునే వాడాలి అనే నియమం/మార్గదర్శకం ఒకటి వికీలో ఉంది కాబట్టి, ప్రతీ అంశాన్నీ చర్చించే పని పెట్టుకోకుండా, దాన్ని అమలు చెయ్యాలని నా అభిప్రాయం. _చదువరి (చర్చరచనలు) 01:07, 6 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
అమూల్యమైన అభిప్రాయాలు తెలిపినందుకు చదువరిగార్కి, అలాగే వెంకటరమణ గార్కి ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 03:41, 6 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ చర్చను తీకుకొచ్చినందుకు ధన్యవాదాలు యర్రా రామారావు గారు. గతంలో వికీలో ఉన్న బి.ఆర్. అంబేడ్కర్ పేజీని అనుసరించి డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం, డా. బి.ఆర్. అంబేడ్కర్ స్మృతివనం, బి.ఆర్. అంబేడ్కర్ రాజగృహం పేర్లతో వ్యాసాలు రాశానుకానీ, అంబేడ్కర్ అనే పదం కంటే అంబేద్కర్ అనే పదం సరైనదని మనసులో మెదలుతూఉండేది. దానిని నిర్థారిస్తూ తెలంగాణ ప్రభుత్వం కొత్తగా నిర్మించిన తెలంగాణ రాష్ట్ర సచివాలయం ప్రవేశద్వారాలపై 'డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం' అని పేరును రాసింది. దాంతో అంబేద్కర్ అనే పదమే సరైనదని నిర్ణయించుకొని, ఆ ఒక్కవ్యాసాన్ని సరైన పేరుకు తరలించాను. మిగతా పేజీలను కూడా సరైన పేరుకు తరలించాలని నా అభిప్రాయం.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 04:12, 6 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]