సుప్రసిద్ధుల జీవిత విశేషాలు
సుప్రసిద్ధుల జీవిత విశేషాలు | |
కృతికర్త: | జానమద్ది హనుమచ్ఛాస్త్రి |
---|---|
అంకితం: | మిత్రులు |
ముఖచిత్ర కళాకారుడు: | రమ |
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | జీవితచరిత్రలు |
విభాగం (కళా ప్రక్రియ): | చరిత్ర |
ప్రచురణ: | విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ |
విడుదల: | 1994 |
పేజీలు: | 86 |
ఐ.ఎస్.బి.ఎన్(ISBN): | 81-7098-108-5 |
సుప్రసిద్ధుల జీవిత విశేషాలు 1994లో రచించబడిన తెలుగు పుస్తకం. దీనిని జానమద్ది హనుమచ్చాస్త్రి రచించగా విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారు ప్రచురించారు. దీనిలో సుమారు 20 మంది ప్రముఖుల జీవితచరిత్రలు వివరించబడ్డాయి.
రైతులోకం మాసపత్రిక ప్రధాన సంపాదకులు ఎన్. శివరామరెడ్డి గారు హనుమచ్ఛాస్త్రి గారిని మహనీయుల జీవిత విశేషాలు గలవ్యాసాలు కూడా తన పత్రికలో వుంటే బాగుండునన్న అభిప్రాయంతో సుప్రసిద్ధుల జీవిత విశేషాలను ధారావాహికంగా వ్రాయమని కోరారు. వారి కోరిక మేరకు సుమారు ఇరవైకి పైగా వ్యాసాలు వ్రాశాను.
రచయిత గురించి
[మార్చు]జానమద్ది హనుమచ్ఛాస్త్రి 5-9-1926 తేదీన రాయదుర్గం, అనంతపురం జిల్లా లో జన్మించారు. వీరి జననీ జనకులు: జానకమ్మ- సుబ్రహ్మణ్య శాస్త్రి వీరి విద్యాయోగ్యతలు: ఎం.ఏ. (ఆంగ్లం); ఎం.ఏ. (తెలుగు); బి.ఎడ్ -రాష్ట్ర భాషా విశారద. వీరు ప్రభుత్వ విద్యాశాఖలో అధ్యాపకుడుగా - స్కూళ్ల ఇన్ స్పెక్టర్ గా, జిల్లా విద్యావిషయక సర్వే ఆఫీసర్ గా, కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్ గా నాలుగు దశాబ్దాలు పనిచేశారు. వీరి ముద్రిత రచనలు: మా సీమకవులు, కడప సంస్కృతి, దర్శనీయ స్థలాలు, నాట్యకళాప్రపూర్ణ బళ్ళారి రాఘవ జీవిత చరిత్ర, కస్తూరి-కన్నడ సాహిత్య సౌరభం , గణపతి - వినాయకుని గురించిన పరిశోధనాత్మక గ్రంథం (కన్నడం నుండి తెనిగింపు), మన దేవతలు, రసవద్ఘట్టాలు, దేవుని కడప, విదురుడు, డా. సర్వేపల్లి రాధాకృష్ణన్, డా.భీమరావ్ అంబేద్కర్, సి.పి.బ్రౌన్ చరిత్ర. వీరు వివిధ దినపత్రికలలో 2 వేలకు పైగా వ్యాసాలను ప్రచురించారు. అనేక సాహిత్య సదస్సులలో ప్రసంగాలు-పత్ర సమర్పణ. అయ్యంకి అవార్డు స్వీకారం, కవిత్రయ జయంతి పురస్కారం రెండుసార్లు. మరెన్నో సత్కారాలు పొందారు.
పుస్తక విశేషాలు
[మార్చు]పుస్తకంలో చేర్చబడిన వారు.
- బళ్ళారి రాఘవ
- సి.పి.బ్రౌన్
- పొట్టి శ్రీరాములు
- గాడిచర్ల హరిసర్వోత్తమరావు
- భీమ్‌రావ్ అంబేద్కర్
- దుర్గాబాయి
- సర్వేపల్లి రాధాకృష్ణన్
- మోక్షగుండం విశ్వేశ్వరయ్య
- కోడి రామమూర్తి నాయుడు
- ప్రకాశం పంతులు
- ఉయ్యాలవాడ నరసింహారెడ్డి
- సురవరం ప్రతాపరెడ్డి
- యల్లాప్రగడ సుబ్బారావు
- సి.వి.రామన్
- నాగయ్య
- పింగళి వెంకయ్య
- రఘుపతి వెంకటరత్నం నాయుడు
- జాషువా
- థామస్ మన్రో
- కాలిన్ మెకంజీ
- బాలగంగాధర తిలక్