జానమద్ది హనుమచ్ఛాస్త్రి
జానమద్ది హనుమచ్ఛాస్త్రి | |
---|---|
![]() | |
జననం | జానమద్ది హనుమచ్ఛాస్త్రి జూన్ 5, 1926 అనంతపురం జిల్లా రాయదుర్గం |
మరణం | 2014 ఫిబ్రవరి 28 | (వయసు: 87)
ఇతర పేర్లు | జానమద్ది హనుమచ్ఛాస్త్రి |
వృత్తి | ప్రభుత్వ పాఠశాలలో సెకండరీ గ్రేడు ఉపాధ్యాయుడు |
ప్రసిద్ధి | విశిష్టమైన బహు గ్రంథ రచయిత. |
తండ్రి | కె.సుబ్రహ్మణ్యశాస్త్రి |
తల్లి | జానకమ్మ |
జానమద్ది హనుమచ్ఛాస్త్రి (జూన్ 5, 1926 - ఫిబ్రవరి 28, 2014) [1][2] తెలుగులో ఒక విశిష్టమైన బహు గ్రంథ రచయిత. సి. పి. బ్రౌన్ స్మారక గ్రంథాలయాన్ని 1995 లో నెలకొల్పాడు.
జీవిత విశేషాలు
[మార్చు]ఇతడు జూన్ 5, 1926 లో అనంతపురం జిల్లా రాయదుర్గం లో జన్మించాడు.[3] రాయదుర్గం జిల్లా బోర్డు హైస్కూలులో ఎస్.ఎస్.ఎల్.సి చదివాడు. ప్రైవేటుగా బి.ఎ. ఉత్తీర్ణుడైనాడు. బి.ఇడి. కూడా పూర్తి చేశాడు. స్వయంకృషితో తెలుగు, ఇంగ్లీషు భాషలలో ఎం.ఏ. పట్టా పొందాడు.
1946లో బళ్ళారి లోని ప్రభుత్వ పాఠశాలలో సెకండరీ గ్రేడు ఉపాధ్యాయునిగా ఉద్యోగ జీవితం ప్రారంభించాడు. కడప లో సి.పి.బ్రౌన్ స్మారక గ్రంథాలయ ట్రస్టును నెలకొల్పి, దాని కార్యదర్శిగా అహర్నిశలూ పాటుపడి 10 లక్షల రూపాయల విరాళాలు సేకరించాడు. వీరి కృషితో అది వాస్తవ రూపం ధరించింది. ఈ కేంద్రానికి 15 వేల గ్రంథాలను శాస్త్రి సేకరించి, బ్రౌన్ ద్విశతి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించాడు. 'బ్రౌన్ శాస్త్రి'గా పేరు గడించాడు. కడపజిల్లా రచయితల సంఘం 1973లో స్థాపించి 20ఏళ్లు కార్యదర్శిగా పనిచేశాడు. రాష్ట్రంలోని సుప్రసిద్ధ రచయితలను కడపజిల్లాకు పరిచయం చేసిన ఘనత ఇతనిదే. బెజవాడ గోపాలరెడ్డి, ఆరుద్ర, దాశరథి, కుందుర్తి, పురిపండా అప్పలస్వామి, శ్రీశ్రీ, సి.నా.రె.,దేవులపల్లి రామానుజరావు,దివాకర్ల వెంకటావధాని మొదలైన రచయితలను, విద్వాంసులను రప్పించి అద్భుతమైన కార్యక్రమాలను ఏర్పాటు చేశాడు.
రచనలు
[మార్చు]జానమద్ది కథా రచనే కాకుండా వివిధ పత్రికలలో, సంచికలలో 2,500 పైగా వ్యాసాలు రాసాడు. 16 గ్రంథాలు వెలువరించాడు.
గ్రంథాల జాబితా
[మార్చు]- మా సీమకవులు
- నాట్యకళాప్రపూర్ణ బళ్ళారి రాఘవ (జీవిత చరిత్ర) [4]
- కస్తూరి కన్నడ సాహిత్య సౌరభం 2
- కడప సంస్కృతి- దర్శనీయ స్థలాలు
- రసవద్ఘట్టాలు
- మన దేవతలు
- భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జీవిత చరిత్ర
- సి.పి.బ్రౌన్ చరిత్ర
- మొండి గోడలనుంచి మహా సౌధం దాకా
- విదురుడు
- త్యాగమూర్తులు
- మనిషీ నీకు అసాధ్యమేదీ
- ఎందరో మహానుభావులు
- భారత మహిళ
- శంకరంబాడి సుందరాచారి
పురస్కారాలు, సత్కారాలు
[మార్చు]శాస్త్రి కి అనేక అవార్డులు లభించాయి.
- పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేటు
- లోకనాయక్ ఫౌండేషన్ సాహితీపురస్కారం (2011)
- గుంటూరులో అయ్యంకి వెంకటరమణయ్య అవార్డు
- అనంతపురం లలిత కళా పరిషత్ అవార్డు
- ధర్మవరం కళాజ్యోతి వారి సిరిసి ఆంజనేయులు అవార్డు
- కడప సవేరా ఆర్ట్స్ వారి సాహితీ ప్రపూర్ణ అవార్డు
- మదనపల్లి భరతముని కళారత్న అవార్డు
- తెలుగు విశ్వవిద్యాలయ ప్రతిభా పురస్కారం
- బెంగళూరులో అఖిల భారత గ్రంథాలయ మహాసభ పురస్కారం
- ఉడిపి పెజావరు పీఠాధిపతిచే 'ధార్మికరత్న' బిరుదు
మొదలైన అనేక పురస్కారాలు ఇతనికి లభించాయి.
మరణం
[మార్చు]కడపలోని రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2014, ఫిబ్రవరి 28 న వీరు పరమపదించారు.
మూలాలు
[మార్చు]- శాస్త్రి గారిని గురించి ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి రాసిన నివాళి వ్యాసం
- ↑ కథా కిరణాలు : మన తెలుగు కథకులు, పైడిమర్రి రామకృష్ణ, పైడిమర్రి కమ్యూనికేషన్స్, ఖమ్మం, 2002.
- ↑ రాయలసీమ రచయితల చరిత్ర మూడవ సంపుటి - కల్లూరు అహోబలరావు-శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల, హిందూపురం- 1981
- ↑ పరిణతవాణి 6వ సంపుటి. పరిణతవాణి 6వ సంపుటి (సాయి లిఖిత ప్రింటర్స్ ed.). ఆంధ్ర సారస్వత పరిషత్తు. p. 132.
{{cite book}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ జానమద్ది హనుమచ్ఛాస్త్రి. "నాట్యకళాప్రపూర్ణ బళ్ళారి రాఘవ (జీవిత చరిత్ర)".