రాయలసీమ రచయితల చరిత్ర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాయలసీమ రచయితల చరిత్ర
కృతికర్త:
సంపాదకులు: కల్లూరు అహోబలరావు
ముఖచిత్ర కళాకారుడు: బాబు ఆర్ట్స్ & కల్లూరు రావ్
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రక్రియ: జీవిత చరిత్రలు
ప్రచురణ: శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల, హిందూపురం
విడుదల:


రాయలసీమలో నివసించిన 20వశతాబ్దపు కవులు, రచయితల జీవితవిశేషములు, సాహిత్యసేవ, కావ్యపరిచయము, కావ్యములలోని ప్రశస్త ఘట్టములు మొదలైనవాటిని చేర్చి కల్లూరు అహోబలరావు ఈ గ్రంథాన్ని నాలుగు సంపుటాలుగా వెలువరించాడు. ఈ పుస్తకము వెలువడక ముందు రాయలసీమ రచయితలను పరిచయం చేసే పుస్తకాలు జానమద్ది హనుమచ్ఛాస్త్రి గారి మాసీమ కవులు వంటివి కొన్ని వచ్చినా అవి బహుళ ప్రచారానికి నోచుకోలేదు. Who is who of Rayalaseema writers గా మాత్రమే కాకుండా ఈ పుస్తకం ఒక ఎన్‌సైక్లోపీడియాగా ఉపయోగపడాలని సంపాదకుడి ఆశయం. ఎన్నో వ్యయప్రయాసలకు లోనై ఈ గ్రంథాలలోని సమాచారాన్ని సేకరించాడు.

మొదటి సంపుటి[మార్చు]

శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల తన 22వ పుష్పంగా 1975 జూలై నెలలో రాయలసీమ రచయితల చరిత్ర మొదటి సంపుటిని ప్రకటించింది. దీనిలో కల్లూరు వేంకట నారాయణ రావు మున్నుడి, బెళ్లూరి శ్రీనివాసమూర్తి మెప్పు, కల్లూరు అహోబలరావు సంపాదకీయములతో పాటు శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల సంగ్రహ చరిత్ర, కల్లూరు సుబ్బారావు అందజేసిన శుభాశీస్సులు ఉన్నాయి. ఈ సంపుటంలో ఈ క్రింది 20 మంది కవుల చరిత్రలు ప్రకటించబడ్డాయి.

రెండవ సంపుటి[1][మార్చు]

1977 జూలైలో శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల 23వపుష్పంగా ఈ సంపుటి వెలువడింది. పైడి లక్ష్మయ్య దీనికి పీఠిక వ్రాశాడు.కల్లూరు అహోబలరావు సంపాదకీయముకూడా ఉంది. దీనిలో 31మంది కవుల జీవితచరిత్రలు ఉన్నాయి.

ఈ సంపుటిలో ఉన్న కవుల జాబితా:

 1. మరూరు లక్ష్మీనరసప్ప
 2. పూతలపట్టు శ్రీరాములురెడ్డి
 3. చిలుకూరు నారాయణరావు
 4. కట్టమంచి రామలింగారెడ్డి
 5. ఉప్పలపాటి వేంకటనరసయ్య
 6. కలుగోడు అశ్వత్థరావు
 7. కురుత్తాళ్వారు అయ్యంగారు
 8. మేడవరము సుబ్రహ్మణ్యశాస్త్రి
 9. రాప్తాటి సుబ్బదాసు
 10. కాండూరు నరసింహాచార్యులు
 11. గార్లదిన్నె సుబ్బారావు
 12. శీరిపి ఆంజనేయులు
 13. పిళ్లారిసెట్టి రంగబ్రహ్మారావు నాయుడు
 14. హెచ్.దేవదానము
 15. రావాడ వేంకటరామాశాస్త్రి
 16. రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ
 17. పుట్టపర్తి నారాయణాచార్యులు
 18. కుంటిమద్ది శేషశర్మ
 19. పైడి లక్ష్మయ్య
 20. జోస్యం జనార్దనశాస్త్రి
 21. బెళ్లూరి శ్రీనివాసమూర్తి
 22. షేక్ దావూదు సాహేబు
 23. గుంటుపల్లి రాధాకృష్ణమూర్తి
 24. వాడేల వేంకటశేషగిరిరావు
 25. యస్.రాజన్నకవి
 26. మైనంపాటి వేంకటసుబ్రహ్మణ్యము
 27. రాచర్ల తిప్పయ్యగుప్త
 28. లంకా కృష్ణమూర్తి
 29. పప్పూరు రామాచార్యులు
 30. కగ్గల్లు సుబ్బరత్నము
 31. గంటి కృష్ణవేణమ్మ

మూడవ సంపుటి[2][మార్చు]

ఘట్టమరాజు అశ్వత్థనారాయణ పీఠిక, కల్లూరు అహోబలరావు సంపాదకీయము కలిగియున్న ఈ సంపుటి శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల స్వర్ణోత్సవ విశేష ప్రచురణగా, 28వ పుష్పంగా 1981 ఆగస్టు మాసంలో వెలువడింది. 50 మంది కవుల, రచయితల చరిత్రలు ఈ సంపుటంలో చోటు చేసుకున్నాయి.

ఈ సంపుటిలో ఉన్న కవుల జాబితా:

 1. ఉప్పల వేంకటశాస్త్రి
 2. వంకాయలపాటి సుబ్రహ్మణ్యకవి
 3. వేంకటరాయ కవి
 4. వేంకట నారాయణకవి
 5. శొంఠి శ్రీనివాసకవి
 6. శొంఠి శ్రీనివాసమూర్తి
 7. పాలపాటి సరస చిదంబరరాయకవి
 8. రొద్దము హనుమంతరావు
 9. ధర్మవరం గోపాలాచార్యులు
 10. కస్తూరి సుబ్బారావు
 11. చక్రాల నృసింహకవి
 12. రత్నాకరం అప్పప్పకవి
 13. కొడవలూరి రామచంద్రరాజకవి
 14. పెద్ద రామరాజకవి
 15. చిన్న రామరాజకవి
 16. కొఱ్ఱపాటి గురవయ్యకవి
 17. ఆర్య నారాయణమూర్తి
 18. కిడంబి శ్రీనివాసరాఘవాచార్యులు
 19. భైరపురెడ్డి రెడ్డి నారాయణరెడ్డి
 20. పాలా వెంకటసుబ్బయ్య
 21. గొట్టిపాటి సుబ్బారాయుడు
 22. రాప్తాటి ఓబిరెడ్డి
 23. మణూరు రామారావు
 24. మలుగూరు గురుమూర్తి
 25. మాడ్గుల వెంకటరామశాస్త్రి
 26. డి.బాబన్న
 27. కల్లూరు అహోబలరావు
 28. మఠం వాసుదేవమూర్తి
 29. పాళ్లూరు సుబ్బణాచార్యులు
 30. వెల్లాల ఉమామహేశ్వరరావు
 31. మల్లెమాల వేణుగోపాలరెడ్డి
 32. రేవూరు అనంత పద్మనాభరావు
 33. వంగీపురం శేషాచార్యులు
 34. జానమద్ది హనుమచ్ఛాస్త్రి
 35. రావినూతల శ్రీరాములు
 36. యం.బాల విశ్వనాథశర్మ
 37. జి.యస్.మోహన్
 38. తూముకుంట భీమసేనరావు
 39. బండమీదిపల్లి భీమరావు
 40. బి.బసప్ప
 41. తలమర్ల కళానిధి
 42. అలుకూరు గొల్లాపిన్ని వాసుదేవశాస్త్రి
 43. గొల్లాపిన్ని రామకృష్ణశాస్త్రి
 44. సర్దేశాయి తిరుమలరావు
 45. రూపావతారం నారాయణశర్మ
 46. నాగసముద్రం వాసుదేవరావు
 47. తక్కళ్లపల్లి పాపాసాహేబు
 48. గుంటి సుబ్రహ్మణ్యశర్మ
 49. జక్కా వేంకటరమణప్ప
 50. కలచవీడు శ్రీనివాసాచార్యులు

నాలుగవ సంపుటి[3][మార్చు]

ఈ సంపుటిలో జానమద్ది హనుమచ్ఛాస్త్రి పీఠిక, కల్లూరు అహోబలరావు సంపాదకీయము ఉన్నాయి. 1986 ఆగస్టులో ప్రకటింపబడింది. శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల 30వపుష్పము (ప్రచురణ) గా ఇది వెలువడింది. దీనిలో 40 మంది కవుల చరిత్రలున్నాయి. ఈ సంపుటిలో ఉన్న కవుల జాబితా:

 1. పాణ్యం లక్ష్మీనరసింహయ్య
 2. పాణ్యం నరసరామయ్య
 3. పాణ్యం లక్ష్మీనరసయ్య
 4. శ్రీనివాసపురం శేషాచార్యులు
 5. శ్రీనివాసపురం నరసింహాచార్యులు
 6. శ్రీనివాసపురం వేంకటలక్ష్మీనారాయణ్
 7. శ్రీనివాసపురం అనంతాచార్యులు
 8. శ్రీనివాసపురం రామాచార్యులు
 9. టేకుమళ్ల కామేశ్వరరావు
 10. ఎస్.గంగప్ప
 11. తిరుమల రామచంద్ర
 12. కె.సుబ్బరామప్ప
 13. చొక్కపు నారాయణస్వామి
 14. శంకరంబాడి సుందరాచారి
 15. ఆలూరు రామశాస్త్రి
 16. వేదాంతం నరసింహారెడ్డి
 17. రత్నాకరం వెంకటేశ్వరులు
 18. వెంకట వరదాచార్యులు
 19. లింగుట్ల కోనేటప్ప
 20. గాజుల వెంకటరమణప్ప
 21. మీసరగండ పుల్లమరాజు
 22. కోగిర జయసీతారాం
 23. విద్వాన్ విశ్వం
 24. నూతలపాటి పేరరాజు
 25. తూమాటి దోణప్ప
 26. అంతటి నరసింహం
 27. అవధాని రమేష్
 28. పాలుట్ల వెంకటనరసయ్య
 29. గరుడంపల్లి రోషన్
 30. బత్తలపల్లి నరసింగరావు
 31. టి.శివశంకరం పిళ్లె
 32. పమిడికాల్వ చెంచు నరసింహశర్మ
 33. దుత్తలూరి రామరావు
 34. దేశాయి రామచంద్రరావు
 35. కొలకలూరి స్వరూపరాణి
 36. గుంటి లక్ష్మీకాంతమ్మ
 37. చౌళూరు రామరావు
 38. గొల్లాపిన్ని రామలక్ష్మమ్మ
 39. సఱ్ఱాజు లక్ష్మీనరసింహారావు
 40. జి.పి.నాగలక్ష్మమ్మ

అభిప్రాయాలు[మార్చు]

 • రాయలసీమలోని రచయితల ప్రజ్ఞోపప్రజ్ఞలలో ఆధునికాంధ్ర సాహిత్యములోని తీరుతెన్నులూ తెలుసుకోవడానికి వీటిద్వారా వీలవుతుంది. విద్వజ్జన లోకానికి సుపరిచితులులతో పాటు ఆంధ్రసాహిత్య లోకంలో ప్రచారం లేకుండా అజ్ఞాతంగా వున్న కొందరు కవులూ, మనోజ్ఞాలైకూడా రచ్చకెక్కనివారి ఆధునిక ప్రబంధాలూ చోటుచేసుకోవడం సంతోషదాయం. ఈ జీవితచరిత్రలలో అనేక గ్రంథాలను సమీక్షించడమే కాకుండా ఉత్కంఠ కలిగించే ఎన్నో సంఘటనలు వివరించడం కల్లూరు అహోబలరావు సాహితీ ప్రజ్ఞకు తార్కాణం. సహృదయలోకానికి ఈ రాయలసీమ చరిత్రలు మోదం చేకూర్చగలవని విశ్వసించవచ్చును. - రావుల సూర్యనారాయణమూర్తి (ఆకాశవాణి సమీక్ష)
 • ఈ శతాబ్దిలోని రచయితలను గురించిన చరిత్రలు ఇదివరకే ఎన్నో ఉన్నాయి. రచయితల చిత్రాలతో, వారి కవితావిశేషాలను ఉదహరిస్తూ వ్రాసిన చరిత్రలలో ఇది మొదటిగా కానవస్తున్నది. ఆయా రచయితల కుటుంబ చరిత్రకు కూడా ప్రాధాన్యమివ్వడం ఇందలి మరొక విశేషం. - ఆయాన్య (ఆంధ్రప్రభ వారపత్రికలో సమీక్ష)

మూలాలు[మార్చు]

 1. Lua error in మాడ్యూల్:Citation/CS1/Date_validation at line 148: attempt to index field 'quarter' (a nil value).
 2. కల్లూరు, అహోబలరావు (1981). రాయలసీమ రచయితల చరిత్ర మూడవ సంపుటి. హిందూపురం: శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల.
 3. కల్లూరు, అహోబలరావు (ఆగస్టు 1986). రాయలసీమ రచయితల చరిత్ర నాలుగవ సంపుటము. హిందూపురం: శ్రీకృష్ణదేవరాయగ్రంథమాల.