Jump to content

భాస్కరాచార్య రామచంద్రస్వామి

వికీపీడియా నుండి
భాస్కరాచార్య రామచంద్రస్వామి
జననంభాస్కరాచార్య రామచంద్రస్వామి
1905
కర్ణాటక రాష్ట్రం, బళ్లారి పట్టణం
మరణం1965, జూన్ 25
ప్రసిద్ధిసంస్కృతాంధ్ర పండితుడు
మతంహిందూ
భార్య / భర్తఅంబమ్మ
పిల్లలుటి.బి.రామమూర్తి, కమలమ్మ, స్వర్ణమ్మ
తండ్రిభాస్కరాచార్య పట్టాభిరామస్వామి
తల్లినాగలక్ష్మాంబ

కుటుంబ చరిత్ర

[మార్చు]

భాస్కరాచార్య రామచంద్రస్వామి[1] 1905లో జన్మించాడు. భాస్కరాచార్య పరంపరా పీఠానికి అధ్యక్షుడైన పట్టాభిరామస్వామికి ఇతడు దత్తపుత్రుడు. తల్లి పేరు నాగలక్ష్మమ్మ. భార్య అంబమ్మ. ఇతడికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కలిగారు. కుమారుడి పేరు టి.బి.రామమూర్తి. కుమార్తెలు కమలమ్మ, స్వర్ణమ్మ.

విద్యాభ్యాసము

[మార్చు]

ఇతడు బళ్ళారిలో సంస్కృతాంధ్రములు అధ్యయనం చేశాడు. తరువాత విజయనగరంలోని సంస్కృత కళాశాలలో చేరి కావ్యనాటక సాహిత్యములు చదువుకున్నాడు. స్వయం కృషితో కన్నడ, మలయాళ, హిందీ, తమిళ, బెంగాలీ మొదలైన అనేక భాషలలో ప్రావీణ్యం సంపాదించుకున్నాడు. వీటితో పాటు జ్యోతిషశాస్త్రము, తంత్రశాస్త్రములలో నిష్ణాతుడైనాడు.

రచనలు

[మార్చు]
  • అభిజ్ఞాన శాకుంతలము ఆంధ్రీకరణము
  • బాటసారి
  • మా హంపి
  • యాత్రికుడు[2]

రచనల నుండి ఉదాహరణ

[మార్చు]

యాత్రికుడు కావ్యం నుండి మచ్చుకు రెండు పద్యాలు

గీ. ఎన్నఁడీ యాత్రకు మొదలొ, ఎప్పుడు తుదియొ?
   బ్రతుకు నాల్గు దినమ్ముల - పాంథశాల
   రస మిగిరి పోవ, శక్తి నీరసత నొందు
   బాత్ర మున్నంత నింపుము ప్రాత మధువు

గీ. విందు వలదు - కపూరంపు - విడెము వలదు
   వలదు కనకాభిషేక సంభావనలును
   అంద అనుభవమునకు, నానందమొకఁడె
   పంచిపెట్టుము - త్రావుము - ప్రాత మధువు

మూలాలు

[మార్చు]
  1. కల్లూరు, అహోబలరావు (జూలై 1975). రాయలసీమ రచయిత్రల చరిత్ర - మొదటి సంపుటి (1 ed.). హైదరాబాదు: శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల. pp. 42–46. Retrieved 27 December 2014.
  2. భాస్కరాచార్య, రామచంద్రస్వామి (1947). యాత్రికుడు (2 ed.). జలదుర్గం, ప్యాపిలి: సాహిత్యకుటీరము. Retrieved 27 December 2014.