గుంటి సుబ్రహ్మణ్యశర్మ
Appearance
గుంటి సుబ్రహ్మణ్యశర్మ | |
---|---|
జననం | గుంటి సుబ్రహ్మణ్యశర్మ 1905, నవంబరు 11 అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం |
వృత్తి | ఉపాధ్యాయుడు |
ప్రసిద్ధి | ప్రముఖ కవి, నవలారచయిత |
మతం | హిందూ |
తండ్రి | గుంటి భాస్కరప్ప |
తల్లి | జానకమ్మ |
గుంటి సుబ్రహ్మణ్యశర్మ[1] అనంతపురం జిల్లాకు చెందిన శతాధిక గ్రంథకర్త.
జీవిత విశేషాలు
[మార్చు]సంస్కృత, ఆంగ్ల. ఆంధ్ర భాషలలో విద్యావంతుడు. సంస్కృతము గురుముఖంగా కాకుండా కేవలం స్వయంకృషితో నేర్చుకున్నాడు. అనంతపురంజిల్లా లోని అనేక గ్రామాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ప్రైవేటుగా ఇంటర్మీడియెట్, బి.కాం పరీక్షలు పాసయ్యాడు. ఇతని కలం నుండి 18 నవలలు, 18 బాలసాహిత్య కథాసంపుటాలు,18 వచనప్రబంధాలు, 20 జాతీయనాయకుల జీవితచరిత్రలు, 8 పద్యకావ్యాలు, ఇంకా ఎన్నో ఇతర గ్రంథాలు వెలువడినవి. ఇతని అపరాధపరిశోధక నవల 'భూతగృహము' ఆంధ్ర ప్రచారిణీ గ్రంథమాల కాకినాడచే 116/-రూ.ల బహుమతి గెలుచుకుంది.
రచనలు
[మార్చు]- భూతగృహము (అపరాధపరిశోధక నవల)
- రహస్యశోధనము (అపరాధపరిశోధక నవల) [2]
- విశ్వజ్యోతి (గౌతమ బుద్ధుని చరిత్ర కావ్యము)
- మాధవాశ్రమము (నవల)
- విశ్వప్రేమ (బసవేశ్వరుని చరతము కావ్యము)
- శ్రీరామకృష్ణ భాగవతము (5000 పద్యాలున్న ఉద్గ్రంథము)
- జయాపజయములు
- కాసులదండ
- కాలభ్రమణం
- కన్నీటికాపురం
- ఆత్మతత్త్వవిచారము
రచనల నుండి ఉదాహరణలు
[మార్చు]- ఎన్నఁటికైన నన్ను నిను నేర్పడఁజేయును మిత్తి; సంపదల్
- మిన్నలు కావు; నేను మిడిమేలపు జీవితమొంది భూమిపై
- గ్రన్నన జచ్చుకంటె, బలకాయ సముత్థిత శక్తివెల్, నా
- పన్నుల సేవఁజేతు; నిదిపాడియ; మద్భవసార మిద్ధరణన్
- ఏమి సేతు నకట! ఎనలేని నీరూప
- కాంతి, రెంట దీన కష్టజనుల
- యోజ, చేరి మనసు నుఱ్ఱూత లూగించు
- సుదతి నిన్ను విడుతు సుకృతమెంచి
- తనయుడనై నీయొడిలో
- దనరారుచు నుందు నింక తలఁకక,నాపై
- మనసుంచక, యేలోటును
- గనుపించక సుతునితోడ గడుపుము దినముల్
- (విశ్వజ్యోతి నుండి)
- మృత్యుముఖమున దరిజేరి మేధినీశు
- లొక్కటౌదురు,భువిలోన సుక్కి పిదప
- నెవర లేమౌదురో దేవు డెఱుగు? నకట!
- మురిసిపోదురు మూన్నాళ్ళ ముచ్చటలకు
- (విశ్వప్రేమ నుండి)
బిరుదులు/సత్కారాలు
[మార్చు]- అనంతపురము రాయలకళాగోష్ఠి ఇతడికి మహాకవి అనే బిరుదును ప్రదానం చేసింది.
మూలాలు
[మార్చు]- ↑ రాయలసీమ రచయితల చరిత్ర మూడవసంపుటి - కల్లూరు అహోబలరావు, శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల,హిందూపురం
- ↑ [1] Archived 2016-03-05 at the Wayback Machine యూనివర్సల్ డిజిటల్ లైబ్రరీలో