టి.శివశంకరం పిళ్లె
టి.శివశంకరం పిళ్లె అనంతపురం జిల్లా పెనుకొండ లో నివసించాడు. న్యాయవాదిగా పేరు సంపాదించాడు. మంచి రచయిత. మంచి వక్త. ఇతడు గుత్తిలో డాక్టర్ సుబ్బయ్య పిళ్లె పెంపుడు కొడుకు. డాక్టర్ సుబ్బయ్య గుత్తి నుండి పెనుకొండకు బదిలీ అయ్యాడు. పెనుకొండలో ఉండగా శివశంకరం పిళ్లెను పెంచి పెద్ద చేశాడు. ఎలిమెంటరీ విద్య పెనుకొండలో చదివాడు. ఆ కాలంలో పెనుకొండలో ఉన్నత పాఠశాల లేదు. దానితో శివశంకరంపిళ్లెను బళ్లారికి పంపించి మెట్రిక్యులేషన్ చదివించాడు. తరువాత పెనుకొండలో రెవెన్యూ ఆఫీసులో గుమాస్తాగా చేరాడు. భారత,భాగవత పురాణాలన్నీ బాగా చదువుకున్నాడు. తెలుగు సాహిత్యంలో పాండిత్యం సంపాదించాడు. ఆ కాలంలో బహుళ ప్రచారంలో ఉన్న కందుకూరి వీరేశలింగం సాహిత్యం చదివి ప్రభావితుడై పెనుకొండలో ఉన్న విధవరాలైన ఒక మధ్వ బ్రాహ్మణస్త్రీని పునర్వివాహానికి అంగీకరింపజేసి బెంగళూరులోని తన మిత్రుడితో విధవావివాహం జరిపించాడు. గుమాస్తా ఉద్యోగం వదిలి వకీలు పరీక్షకు కట్టి ప్యాసై వకీలు వృత్తిని చేపట్టాడు. శివశంకరం పిళ్లె ఒక మరాటి అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. కొంతకాలానికే ఆమె మృతి చెందింది. ఇతడు తాలూకా బోర్డు ప్రెసిడెంటుగా చాలా కాలం పనిచేశాడు. 1913లో బాపట్లలో జరిగిన మొదటి ఆంధ్ర మహాసభకు హాజరయ్యాడు. హిందూ పత్రికకు పెనుకొండ నుండి విలేఖరిగా ఉండి వార్తలు, వ్యాసాలు పంపేవాడు. కృషి పేరుతో ఒక పత్రికను కూడా నడిపాడు.
రచనలు
[మార్చు]- అళియ రామభూపాలుడు [1] 1932లో ఆంధ్రగ్రంథమాల,మద్రాసు 20వ కుసుమంగ వెలువడింది.
- శ్రీ వేంకటపతి దేవమహారాజు
- రాజత్వపౌరత్వము
- ఆంగ్లదేశాటన చరిత్ర
- భగవద్గీత
- స్థానిక కూటములు
- దేశమాతాస్తవము(National Anthem) - ఇది ఒక దేశభక్తి గీతము. 1883నాటికే దీనిని వ్రాశాడు.
- The Pearl of Citizenship
- ఉల్‌సత్తుఖాజాకంగళ్ (తమిళగ్రంథం)
- రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ గాథాసప్తశతికి ఆంగ్లానువాదం
మూలాలు
[మార్చు]- ↑ [https://archive.org/details/in.ernet.dli.2015.371372 డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో
- రాయలసీమ రచయితల చరిత్ర - నాలుగవ సంపుటి - కల్లూరు అహోబలరావు - శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల,హిందూపురం
- వార్త దినపత్రిక అనంతపురం జిల్లా ప్రత్యేక సంచిక అనంతనేత్రంలో జి.రామకృష్ణ వ్యాసం