గుత్తి (పట్టణం)
పట్టణం | |
Coordinates: 15°07′N 77°38′E / 15.12°N 77.63°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | అనంతపురం జిల్లా |
మండలం | గుత్తి మండలం |
విస్తీర్ణం | |
• మొత్తం | 34.84 కి.మీ2 (13.45 చ. మై) |
జనాభా (2011)[1] | |
• మొత్తం | 48,658 |
• జనసాంద్రత | 1,400/కి.మీ2 (3,600/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1032 |
ప్రాంతపు కోడ్ | +91 ( 8552 ) |
పిన్(PIN) | 515401 |
Website |
గుత్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లాకు చెందిన పట్టణం. ఇది పురపాలకసంఘం హోదా కలిగిన పట్టణం. ఇక్కడ గల గుత్తి కోట, హంపన్న స్మృతి చిహ్నం పర్యాటక ఆకర్షణలు.
పేరు వ్యుత్పత్తి
[మార్చు]గుత్తి సమీపంలో గౌతముడు అనే మహర్షి ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని దానిలో నివసించాడు. గౌతముని పేరు మీద గౌతమపురం అని దీనిని పిలిచేవారు. అది కాలక్రమేణా గుత్తిగా మార్పు పొందినదని ఒక ఐతిహ్యం. గుత్తికోట చుట్టూ వున్న గుట్టలతో కలిపి చూడటానికి పుష్పగుచ్ఛం (పూలగుత్తి) ఆకారంలో వున్నందున దీనిని పూగుత్తి అని తరువాత గుత్తి అని పిలిచేవారని ఒక కథనం.
చరిత్ర
[మార్చు]గుత్తి ఆంధ్రప్రదేశ్‌లోని అత్యంత పూరాతనమైన కోటదుర్గంలలో ఒకటి. గుత్తి కోట చాళుక్యుల కాలములో కట్టబడినదని భావిస్తారు అయితే విజయనగర రాజులు దీనిని పటిష్ఠము చేసారు. గుత్తి కోటను ప్రస్తావించిన తొలి శాసనాలు కన్నడం, సంస్కృతంలో ఉన్నాయి. అవి 7వ శతాబ్దం నాటివని అంచనా. ఒక శాసనంలో ఈ కోట పేరు 'గధ' గా ఇవ్వబడింది. విజయనగర చక్రవర్తి బుక్క రాయల శాసనంలో గుత్తి కోట దుర్గ రాజxగా కీర్తించబడింది.
గుత్తి కైఫియత్తు ప్రకారం కోటను మీర్ జుమ్లా ఆక్రమించుకొనినట్లుగా తెలుస్తుంది.ఆ తరువాత ఇది కుతుబ్ షాహీ వంశస్థుల పాలనలో ఉంది. 1746లో మురారి రావు ఆధ్వర్యంలో మరాఠులు దీనిని జయించారు. 1775లో హైదర్ అలీ గుత్తి కోటను తొమ్మిది నెలల నిర్భంధం తర్వాత వశపరచుకొనెను. 1779లో టిప్పూసుల్తాన్ మరణానంతరం జెరువార్ ఖాన్ అనే ముస్లింగా మారిన బ్రాహ్మణ సేనాని ఆధీనంలో ఈ కోట ఉండగా నిజాం తరఫున బ్రిటిషు కల్నల్ బౌజర్ కోటను ఆక్రమించుకొని బ్రిటిషు వారి పాలనలోకి తెచ్చాడు.కోట గుత్తి చుట్టూ ఉన్న మైదానం కంటే దాదాపు 300 మీటర్ల ఎత్తున ఉంది. ఈ కోట నత్తగుల్ల/శంఖము/గవ్వ (షెల్ల్) ఆకారంలో నిర్మించబడి 15 బురుజులతో, 15 ముఖద్వారాలు కలిగి ఉంది. ఇందులో రెండు శాసనాలు, వ్యాయామశాల, మురారి రావు గద్దె ఉన్నాయి. మురారి రావు గద్దె నుండి మొత్తం గుత్తి ఊరంతా చక్కగా కనిపిస్తుంది. కోటలో చాలా నూతులున్నవి.
భౌగోళికం
[మార్చు]గుత్తి భౌగోళిక స్థానం 15°07′N 77°38′E / 15.12°N 77.63°E. ఇది అనంతపురం నుండి 52 కి.మీ దూరంలో వుంది. దీని సగటు ఎత్తు సముద్ర మట్టంపై 345 మీ. (1131 అ.).
జనగణన గణాంకాలు
[మార్చు]2011 జనాభా లెక్కల ప్రకారం, గుత్తి లో మొత్తం 11,419 కుటుంబాలు నివసిస్తున్నాయి. జనాభా మొత్తం 48,658 అందులో 23,943 మంది పురుషులు, 24,715 మంది స్త్రీలు ఉన్నారు. పట్టణ లింగ నిష్పత్తి 1,032. 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 5216, ఇది మొత్తం జనాభాలో 11%. 0-6 సంవత్సరాల మధ్య 2662 మంది మగ పిల్లలు, 2554 మంది ఆడ పిల్లలు ఉన్నారు. పిల్లల లింగ నిష్పత్తి 959. ఇది జిల్లా సగటు లింగ నిష్పత్తి 1,032 కంటే తక్కువ. పట్టణ అక్షరాస్యత 76.9%, జిల్లా అక్షరాస్యత 63.6% కంటే ఎక్కువ. పురుషుల అక్షరాస్యత రేటు 85.5%, స్త్రీల అక్షరాస్యత రేటు 68.66%.
పర్యాటక ఆకర్షణలు
[మార్చు]- గుత్తి కోట: 7వశతాబ్దంనాటి కోట.
పరిపాలన
[మార్చు]గుత్తి పురపాలక సంఘం పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.
రవాణా
[మార్చు]జాతీయ రహదారి 44, 63 పై గుత్తి వున్నది. గుత్తి రైల్వే స్టేషన్ ముంబై - చెన్నై రైలు మార్గంలో వున్నది. ఇక్కడ రైలు ఇంజన్ల నిర్వహణకు లోకో షెడ్ వున్నది.
హంపన్న స్మృతి చిహ్నం
[మార్చు]గుత్తి పట్టణం దర్శనీయ స్థలాలలో ఈ హంపన్న స్మృతి చిహ్నం ఒకటి. వంద సంవత్సరాల క్రితం దేశం పరాయి పాలన క్రింద ఉన్నప్పుడు తన కళ్ళ ఎదుట ఆంగ్ల సిపాయిలు ఇద్దరు మహిళలను మానభంగం చేయబోగా సహించలేక నిరాయుధుడైనప్పటికీ ధైర్యమే ఆయుధంగా వారిని ఎదిరించి ఆ మహిళలను రక్షించి సిపాయిల తుపాకి గుండ్లకు బలైన అమరవీరుడు హంపన్న. మహిళల మానరక్షణకై ప్రాణత్యాగం చేసిన హంపన్నకు జాతి నివాళులు అర్పించింది. మన్రో సత్రం సమీపంలో ఒక స్మృతి చిహ్నం నిర్మించాలని గుత్తి ప్రజలు నిర్ణయించారు. ఈ విషయం తెలిసి హిందూ పత్రిక స్పందించి మద్రాసులోని పూనమల్లి కొండలనుండి తొమ్మిది అడుగుల పొడవుగల రాయిని కొనుగోలు చేసి గుత్తికి పంపగా ఆ రాయినుంచి ఏడు అడుగుల రాయితో హంపన్న త్యాగాన్ని ప్రశంసిస్తూ అతని స్మృతి చిహ్నాన్ని నిర్మించారు.
మూలాలు
[మార్చు]- ↑ ఇక్కడికి దుముకు: 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018