గుత్తి (పట్టణం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గుత్తి (పట్టణం), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లాకు చెందిన పట్టణం.ఇది పురపాలకసంఘం హోదా కలిగిన పట్టణం.

పేరువెనుక చరిత్ర[మార్చు]

గుత్తి కోట

గుత్తి సమీపంలో గౌతముడు అనే మహర్షి ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని దానిలో నివసించాడు. గౌతముని పేరు మీద గౌతమపురం అని దీనిని పిలిచేవారు. అది కాలక్రమేణా గుత్తిగా మార్పు పొందినదని ఒక ఐతిహ్యం. గుత్తికోట చుట్టూ వున్న గుట్టలతో కలిపి చూడటానికి పుష్పగుచ్ఛం (పూలగుత్తి) ఆకారంలో వున్నందున దీనిని పూగుత్తి అని తరువాత గుత్తి అని పిలిచేవారని ఒక కథనం.

హంపన్న స్మృతి చిహ్నం[మార్చు]

హంపన్న స్మృతి

గుత్తి పట్టణం దర్శనీయ స్థలాలలో ఈ హంపన్న స్మృతి చిహ్నం ఒకటి. వంద సంవత్సరాల క్రితం దేశం పరాయి పాలన క్రింద ఉన్నప్పుడు తన కళ్ళ ఎదుట ఆంగ్ల సిపాయిలు ఇద్దరు మహిళలను మానభంగం చేయబోగా సహించలేక నిరాయుధుడైనప్పటికీ ధైర్యమే ఆయుధంగా వారిని ఎదిరించి ఆ మహిళలను రక్షించి సిపాయిల తుపాకి గుండ్లకు బలైన అమరవీరుడు హంపన్న. మహిళల మానరక్షణకై ప్రాణత్యాగం చేసిన హంపన్నకు జాతి నివాళులు అర్పించింది. మన్రో సత్రం సమీపంలో ఒక స్మృతి చిహ్నం నిర్మించాలని గుత్తి ప్రజలు నిర్ణయించారు. ఈ విషయం తెలిసి హిందూ పత్రిక స్పందించి మద్రాసులోని పూనమల్లి కొండలనుండి తొమ్మిది అడుగుల పొడవుగల రాయిని కొనుగోలు చేసి గుత్తికి పంపగా ఆ రాయినుంచి ఏడు అడుగుల రాయితో హంపన్న త్యాగాన్ని ప్రశంసిస్తూ అతని స్మృతి చిహ్నాన్ని నిర్మించారు. ఆ శిలాఫలకంపై ఆంగ్లంలో ఈ క్రింది విధంగా చెక్కారు.

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

  • పట్టణ సంభందిత వివరాలకు ఇక్కడ చూడండి [1]
  • పట్టణ గణాంకాల కొరకు ఇక్కడ చూడండి [2]