రాయదుర్గం
రాయదుర్గం, అనంతపురం జిల్లా, రాయదుర్గం మండలానికి చెందిన పురపాలకసంఘం హోదా కలిగి పట్టణం. ఇది విజయనగర రాజుల 3వ రాజధాని. ఇక్కడ 15వ శతాబ్ద వైభవం మనకు కనిపిస్తుంది. ఇక్కడ చాలా ఆలయాలు కనిపిస్తాయి. ఇక్కడ తిరుమలలోని వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని పోలిన ఆలయ శిథిలాలు ఉన్నాయి. ఇక్కడి దేవాలయ శిఖరాన్ని లోహాలతో కాక చందనంతో తయారు చేసారు. ఈ ఆలయాన్ని పునర్నిర్మించక వదిలేయడంతో ప్రస్తుతం అవశేషాలు మాత్రం మిగిలాయి.
రాయదుర్గం కర్ణాటక రాష్ట్ర సరిహద్దు నుండి 7 కి.మీ. దూరంలో ఉంది. కర్ణాటక లోని బళ్ళారికి 50 కి.మీ దూరంలో ఉంది. మరో వైపు 12 కి.మీ దూరంలో మొలకాళ్మారు (కర్ణాటక) అనబడే పట్టణం, ఇంకో వైపు కళ్యాణదుర్గం 40 కి.మీ దూరంలో ఉన్నాయి.
రాయదుర్గం పట్టణంలో పట్టు చీరలు నేయటం ఒక కుటీర పరిశ్రమ. ఇక్కడి జనాభాలో అధిక శాతం చేనేత కార్మికులు అయితే కాలక్రమేణ చేనేత పరిశ్రమ కుంటుపడడంతో జీన్స్ పరిశ్రమ ఊపందుకుంది. ఇప్పుడు ఈ ప్రాంతం జీన్స్ ప్యాంట్లుకు ప్రసిద్ధి. ఇది సరిహద్దు ప్రాంతం కావడం చేత ఇక్కడి ప్రజలు అధిక శాతం తెలుగు, కన్నడ రెండు భాషలూ మాట్లడగలరు.
దేవాలయాలు[మార్చు]
పూర్తి వ్యాసం:దశభుజ గణపతి ఆలయం
రాయదుర్గంలోని దశభుజ గణపతి మందిరం ప్రత్యేకమైంది.ఆ కళ్లు అచ్చంగా తండ్రి పోలికే, మూడుకన్నులతో ముక్కంటి బిడ్డ అనిపించుకున్నాడు. చేతులేమో అమ్మను తలపిస్తాయి, మహాశక్తిని గుర్తుకుతెచ్చేలా దశభుజాలు. మేనమామ లక్షణాలూ వచ్చాయి, విష్ణుమూర్తిలా చేతిలో సుదర్శనం. అనంతపురం జిల్లాలోని రాయదుర్గంలో వెలసిన దశభుజ గణపతి వైభవాన్ని చూడాల్సిందే!
ప్రముఖులు[మార్చు]
- జానమద్ది హనుమచ్ఛాస్త్రి :తెలుగులో ఒక విశిష్టమైన బహు గ్రంథ రచయిత.ఇతడు జూన్ 5, 1926 లో అనంతపురం జిల్లా రాయదుర్గంలో జన్మించాడు.[1] రాయదుర్గం జిల్లా బోర్డు హైస్కూలులో ఎస్.ఎస్.ఎల్.సి చదివాడు. ప్రైవేటుగా బి.ఎ. ఉత్తీర్ణుడైనాడు. బి.ఇడి. కూడా పూర్తి చేశాడు. స్వయంకృషితో తెలుగు, ఇంగ్లీషు భాషలలో ఎం.ఏ. పట్టా పొందాడు.
తహసీల్దారు కార్యాలయం[మార్చు]
రాయదుర్గం తహసీల్దార్ కార్యాలయానికి 150 ఏళ్లు ప్రభుత్వ శాఖల్లో ముఖ్యమైంది.తహసీల్దార్ కార్యాలయం నిర్మించి రాయదుర్గంలో 150 సంవత్సరాలు గడిచింది. తహసీల్దార్ భవనం నిర్మించి 150 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ భవనం పదిలంగా ఉండటం హర్షనీయం. 1859వ సంవత్సరంలో అప్పటి బళ్లారి జిల్లా కలెక్టర్ అరర్ హథావే ఎద్దులబండ్లను అద్దెకు తీసుకొని సైన్యానికి అవసరమైన వస్తవులను రావాణా కోసం వాటిని వినియోగించుకొనేవారు. అనంతరం రాయదుర్గం ఎద్దుల బండ్లు టెండర్ల ద్వారా తీసుకొన్నారు. ఈ నేపథ్యంలో 1865లో కరువు ఏర్పడటంతో పాటు, కలరా లాంటి వ్యాధులతో వందలమంది చనిపోయారు. ఈ నేపథ్యంలో 1265 ఫస్లీకు సంబంధించిన భూమి శిస్తును రద్దు చేశారు. అనంతరం రాయదుర్గంలో రెవెన్యూ వ్యవహారాల కోసం తహసీల్దార్‌గా వెంకట్రావును నియమించారు. అప్పట్ ఆంగ్లేయులులో రాయదుర్గం నుంచి పాలనా పరమైన కార్యకలాపాలను నిర్వహించేందుకు కార్యాలయాన్ని నిర్మించతలపెట్టారు. దీంతో 1865 భవనాన్ని నిర్మించారు. భవన నిర్మానానికి కావాల్సిన పెంకులను కర్ణాటకలోని మంగళూరు నుంచి తెప్పించినట్లు తెలుస్తోంది. ఇప్పటికీ పెంకులపై ఉన్న 1865 సంవత్సరాన్ని చూడవచ్చు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రెవెన్యూ కార్యకలపాలను కొనసాగుతునే ఉన్నాయి. ముఖ్యంగా 1910లో కర్ణాటకలోని కూడ్లిగి తాలూకాను కూడా కలిపి పాలన సాగించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. రాయదుర్గం తహసీల్దార్ కార్యాలయ భవనం నేడు నిర్మించబడుతున్న భవనాలకు ఆదర్శంగా నిలుస్తుంది.