శ్రీ సత్యసాయి జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీ సత్యసాయి జిల్లా
జిల్లా
జిల్లా కేంద్రం పుట్టపర్తి ప్రవేశ ద్వారం
జిల్లా కేంద్రం పుట్టపర్తి ప్రవేశ ద్వారం
Location of శ్రీ సత్యసాయి జిల్లా
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లా కేంద్రముపుట్టపర్తి
పరిపాలనా విభాగాలు
  • రెవిన్యూ విభాగాలు : 4
  • మండలాలు : 32
  • రెవిన్యూ గ్రామాలు : 467
విస్తీర్ణం
 • మొత్తం8,925 km2 (3,446 sq mi)
జనాభా వివరాలు
(2011)
 • మొత్తం18,40,000
భాషలు
 • ఆధికారతెలుగు
కాలమానంUTC+05:30 (IST)
జాలస్థలిhttps://srisathyasai.ap.gov.in/

శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ లో ఒక జిల్లా. జిల్లాల పునర్వ్యవస్థీకరణ భాగంగా 2022లో పాత అనంతపురం జిల్లాలో నుండి ఏర్పడింది. జిల్లా కేంద్రం పుట్టపర్తి.

జిల్లా చరిత్ర[మార్చు]

పుట్టపర్తి అసలు పేరు గొల్లపల్లి. ఆ ప్రాంతమంతా పాము, చీమల పుట్టలు ఎక్కువగా ఉండటంతో. పుట్టపల్లి అని పేరు వచ్చింది. కాలక్రమేణా పుట్టపర్తి అయింది. ఈ జిల్లా చిత్రావతి నది ఒడ్డున ఉంది. 2022 లో అనంతపురం జిల్లాను విభజించి శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పాటు చేశారు.[1]

భౌగోళిక స్వరూపం[మార్చు]

శ్రీ సత్య సాయి జిల్లా (పుట్టపర్తి) 13° -40′ 14°- 6′ ఉత్తర అక్షాంశం 76°-88′ 78°-30′ తూర్పు రేఖాంశం మధ్య ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులో అనంతపురం జిల్లా, తూర్పున వైఎస్ఆర్ జిల్లా & అన్నమయ్య జిల్లాలు , పశ్చిమ నైరుతి సరిహద్దులో కర్ణాటక రాష్ట్రం ఉన్నాయి. జిల్లా విస్తీర్ణం 8,925 కి.మీ.

జనగణన[మార్చు]

జిల్లా పరిధిలో జనాభా మొత్తం 18.4 లక్షలు.[ఆధారం చూపాలి]

పరిపాలనా విభాగాలు[మార్చు]

జిల్లా పరిధిలో 7 శాసనసభ నియోజకవర్గాలు, 4 రెవెన్యూ డివిజన్లు, 32 మండలాలు ఉన్నాయి. జిల్లాలోని ధర్మవరం, కదిరి, పుట్టపర్తి, పెనుగొండ రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. పుట్టపర్తి రెవెన్యూ డివిజను కొత్తగా ఏర్పడింది.[2][3]

రెవిన్యూ డివిజన్లు, మండలాలు[మార్చు]

పట్టణాలు[మార్చు]

రాజకీయ విభాగాలు[మార్చు]

లోకసభ నియోజకవర్గం[మార్చు]

శాసనసభ నియోజకవర్గాలు[మార్చు]

విద్యా సౌకర్యాలు[మార్చు]

పరిశ్రమలు[మార్చు]

  1. ధర్మవరం అతిపెద్ద పట్టు, జౌళి పరిశ్రమల కేంద్రం.
  2. జిల్లాలో గాలులు చాలా వేగంగా వీస్తూ ఉంటాయి. ముఖ్యంగా మే-సెప్టెంబరు కాలంలో గాలుల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కాలాన్ని స్థానికంగా గాలికాలం అని అంటారు. అందుచేత పవన విద్యుత్తు కేంద్రాలు రామగిరి ప్రాంతాలలో విస్తృతంగా ఏర్పాటయ్యాయి.
  3. పారిశ్రామికపరంగా గ్రానైటును శుద్ధి చేయు పరిశ్రమ, సిమెంటు పరిశ్రమ, ఉక్కు కార్మాగారం, బీడీల పరిశ్రమ, మోటారు కారు (కియా)

దర్శనీయ ప్రదేశాలు[మార్చు]

  • ప్రశాంతి నిలయం, పుట్టపర్తి: సత్యసాయి చేత స్థాపించబడిన అనేక సంస్థలు, అత్యాధునిక నైపుణ్యాల ఆసుపత్రి వున్నాయి.
  • శ్రీ శృంగేరి ఆలయం, పుట్టపర్తి: 1.8 ఎకరాల విస్తీర్ణంలో సుందర ప్రకృతి నేపథ్యంలో ఉంది.
  • వీరభద్ర స్వామి దేవాలయం, లేపాక్షి: ఈ ఆలయం విజయనగరాజుల కాలంనాటిది. ప్రసిద్ధ మురల్ చిత్రాలతో చూపరులకు ఆకర్షిస్తూ ఉంటుంది. ఈ ఆలయంలో శివుడు, విష్ణువు, వీరభద్రుడు ప్రధాన దైవాలుగా ఉన్నారు. సుందర శిల్పకళ ఉట్టిపడే చిత్రాలతో అలంకృత స్తంభాల మీద నిలువెత్తు గాయకులు, నృత్యకారిణిల శిల్పాలు అనేక ఆకృతులలో చెక్కబడ్డాయి. ఈ ఆలయంలో దగ్గరలో 15 అడుగులు ఎత్తు, 22 అడుగుల పొడుగున విస్తరించిన నంది శిలావిగ్రహం వుంది.
  • తిమ్మమ్మ మర్రిమాను, కదిరి: 5 ఎకరాలు విస్తీర్ణంలో విస్తరించిన అతి పెద్ద మర్రిచెట్టు. 1989లో అతిపెద్ద వృక్షంగా గిన్నీస్ రికార్డులకు ఎక్కింది.
  • బట్రేపల్లి వాటర్ ఫాల్స్, కదిరి: వర్షాకాలంలో ప్రవహించే జలపాతం
  • శ్రీలక్ష్మీనారాయణాలయం, కదిరి: ఈ ఆలయంలోని విగ్రహం స్వేదజలాలను స్రవిస్తూ ఉండడం ఒక ఆధ్యాత్మిక అద్భుతం.
  • మడకశిర కోట, మడకశిర: పురాతన కోట

జిల్లా ప్రముఖులు[మార్చు]

  • సత్యసాయి బాబా ఆధ్యాత్మికవేత్త.
  • ఫాదర్ ఫెర్రర్. ఆర్డిటి వ్యవస్థాపకుడు. సమాజ సేవకుడు.

చిత్ర మాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

  1. DES 2022, p. 15.
  2. "AP: కొత్త జిల్లాల స్వరూపమిదే.. పెద్ద జిల్లా ఏదంటే?". Sakshi. 2022-04-03. Retrieved 2022-04-03.
  3. 3.0 3.1 3.2 "సరికొత్త అనంత". ఆంధ్రజ్యోతి. 2022-04-04. Retrieved 2022-04-18.

ఆధార గ్రంథాలు[మార్చు]

DES (2022). DISTRICT HAND BOOK OF STATISTICS - Sri Sathya Sai district (PDF).