Jump to content

రొడ్డం మండలం

వికీపీడియా నుండి
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 14°06′N 77°26′E / 14.1°N 77.43°E / 14.1; 77.43
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాశ్రీ సత్యసాయి జిల్లా
మండల కేంద్రంరొడ్డం
విస్తీర్ణం
  మొత్తం
359 కి.మీ2 (139 చ. మై)
జనాభా
 (2011)[2]
  మొత్తం
51,168
  జనసాంద్రత140/కి.మీ2 (370/చ. మై.)
జనగణాంకాలు
  లింగ నిష్పత్తి976

రొద్దం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనిశ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన మండలం.

మండల కేంద్రం

[మార్చు]

ఈ మండలానికి కేంద్రం రొడ్డం గ్రామం. ఇది సమీప పట్టణమైన హిందూపురం నుండి 35 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2311 ఇళ్లతో, 10164 జనాభాతో 5505 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 5073, ఆడవారి సంఖ్య 5091. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1418 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 64. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 595339[3].పిన్ కోడ్: 515 123.

చరిత్ర

[మార్చు]

పెనుగొండ నుండి పది మైళ్ళ దూరంలో ఉన్న రొడ్డం గ్రామం జిల్లాలోనే అత్యంత ప్రాచీన గ్రామాలలో ఒకటి. ఇది సా.శ. 4వ శతాబ్దము నుండి 7వ శతాబ్దము మధ్యకాలంలో స్థాపించబడినదని అంచనా. ఇక్కడ పెన్నానది ఒడ్డున స్థానికులు రుద్ర పాదం అని పిలిచే ఒక శిలపైన కట్టిన గుడి ఉంది.[4] పశ్చిమ చాళుక్యుల కాలంలో రొద్ద (రొద్దం) నొళంబవాడికి ప్రాంతీయ రాజధానిగా ఉంది. సా.శ.992లో రెండవ తైలాపుడు చోళ రాజరాజును ఓడించిన తర్వాత రొద్దంలో స్థావరమేర్పరచినట్టు బళ్ళారి జిల్లాలోని కొగలి శాసనాలు తెలుపుతున్నవి. ఆహవమల్ల మొదటి సోమేశ్వరుడు రొద్దం ప్రాంతీయ రాజధానిగా నొళంబవాడిని పాలించినట్టు శాసనాలలో తెలుస్తున్నది.రొద్దం గ్రామానికి పూర్వ నామం రౌద్రపురము అని పేరున్నట్లుగా తెలుస్తుంది.

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. ములకలచెరువు
  2. నరనాగెపల్లె
  3. జక్కలచెరువు
  4. కోగిర
  5. బొక్కసంపల్లె
  6. తురకలపట్నం
  7. ఆర్.లోచర్ల
  8. బూచర్ల
  9. రొడ్డకంపల్లె
  10. రొడ్డం
  11. పెద్దిపల్లె
  12. సానిపల్లె
  13. చోలెమర్రి
  14. నల్లూరు
  15. రెడ్డిపల్లె
  16. దొడగట్ట
  17. చిన్నమంతూరు
  18. పెద్దమంతూరు
  19. చెరుకూరు
  20. కలిపి

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - Anantapur District - 2016" (PDF). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, ANANTAPUR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972975, the original (PDF) నుండి 13 November 2015 న ఆర్కైవు చెయ్యబడింది
  3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  4. Lists of the Antiquarian Remains in the Presidency of Madras, Volume 1