అల్లూరి సీతారామరాజు జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అల్లూరి సీతారామరాజు జిల్లా
జిల్లా
భూపతిపాలెం జలాశయం, రంపచోడవరం
భూపతిపాలెం జలాశయం, రంపచోడవరం
Location of అల్లూరి సీతారామరాజు జిల్లా
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
పేరు వచ్చినవిధంఅల్లూరి సీతారామరాజు
ప్రధాన కార్యాలయంపాడేరు
విస్తీర్ణం
 • మొత్తం12,251 కి.మీ2 (4,730 చ. మై)
జనాభా వివరాలు
(2011)[1]
 • మొత్తం9,53,960
 • సాంద్రత78/కి.మీ2 (200/చ. మై.)
కాలమానంUTC+05:30 (ఐ ఎస్ డి)
జాలస్థలిallurisitharamaraju.ap.gov.in

అల్లూరి సీతారామ రాజు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ భాగంగా పాత తూర్పు గోదావరి జిల్లా, విశాఖపట్నం జిల్లాల కొంత భాగాలను కలిపి 2022లో కొత్తగా ఏర్పరచిన జిల్లా. .ఈ ప్రాంతం నుండి వచ్చిన భారత స్వాతంత్ర్య ఉద్యమంలో విప్లవకారుడు అల్లూరి సీతారామ రాజు పేరు ఈ జిల్లాకు పెట్టడం జరిగింది. 2022 ఏప్రిల్ 4న ఇరవై ఆరు జిల్లాలలో ఒకటిగా అవతరించింది.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2022 ఏప్రిల్ 3న తుది నోటిఫికేషన్ జారీ చేస్తుంది . జిల్లా పరిపాలనా ప్రధాన కార్యాలయం పాడేరులో ఉంది.[2][3][4]

చరిత్ర[మార్చు]

అల్లూరి సీతారామరాజు జిల్లా ఇది ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ భాగంగా 2022లో కొత్తగా ఏర్పడిన జిల్లా.[5] పాడేరు, అరకులోయ, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాలతో అల్లూరి సీతారామరాజు పేరుతో కొత్త జిల్లా ఏర్పాటు చేశారు.జిల్లా పరిపాలనా ప్రధాన కార్యాలయాలు పాడేరు పట్టణంలో ఉన్నాయి.జిల్లా ప్రధాన కార్యాలయం పాడేరు నుండి రాష్ట్ర రాజధాని అమరావతికి 400 కి.మీ. దూరంలో ఉంది. జిల్లా విస్తీర్ణం 12,251 కి.మీ.ఉంది. జిల్లా పరిధిలో జనాభా మొత్తం 9.54 లక్షలు మంది ఉన్నారు. జిల్లా పరిధిలో 3 శాసనసభ నియోజకవర్గాలు, 2 రెవెన్యూ డివిజన్లు, 22 మండలాలు ఉన్నాయి. జిల్లాలోని 2 రెవెన్యూ డివిజన్లు పాడేరు రెవెన్యూ, రంపచోడవరం రెవెన్యూ డివిజను ఉన్నాయి.[6]

భౌగోళిక స్వరూపం[మార్చు]

ఈ జిల్లా ఒడిశా రాష్ట్ర సరిహద్దుకు దగ్గరగా ఉంది. అరకులోయలో భాగమైన అనంతగిరి, సుంకరిమెట్ట రిజర్వు ఫారెస్ట్‌లో ఈ జిల్లాల్లో ఉన్నాయి.సగటు వర్షపాతం 1,700 మిల్లీమీటర్లు (67 అంగుళాలు), ఇందులో ఎక్కువ భాగం జూన్-అక్టోబరులో కురుస్తుంది. సముద్ర మట్టానికి దాదాపు 1300 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ లోయ 36 కి.మీ.ల మేర విస్తరించి ఉంది.

జనాభా గుణంకాలు[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 953,960 ఉన్నారు. జనాభాలో షెడ్యూల్డ్ కులాలు 2.49% ఉండగా షెడ్యూల్డ్ తెగలు 82.67% ఉన్నారు.ఎక్కువగా కొండ దొర, ఖోండ్, కొండా రెడ్డి, కొండ కాపు, కోయ, వాల్మీకి తెగలు ఉన్నాయి. జనాభాలో 80% పైగా, తెలుగు లేదా ఒడియా విభిన్న మాండలికాలను మాట్లాడతారు.అత్యధికంగా హిందు సంప్రదాయన్ని పాటిస్తారు.

పరిపాలనా విభాగాలు[మార్చు]

జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి, అవి పాడేరు, రంపచోడవరం, ఒక్కొక్కటి సబ్ కలెక్టర్ నేతృత్వంలో.ఈ రెవెన్యూ డివిజన్లు 22 మండలాలుగా విభజించబడ్డాయి.

మండలాలు[మార్చు]

పాడేరు, రంపచోడవరం డివిజన్లలో ఒక్కొక్కటి 11 మండలాలు ఉన్నాయి.ఈ రెండు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 22 మండలాలు క్రింద ఇవ్వబడ్డాయి:

రాజకీయ విభాగాలు[మార్చు]

అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒక పార్లమెంట్ 3 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.[7]

లోకసభ నియోజకవర్గం[మార్చు]

  1. అరుకు (ఎస్.టి.) (పాక్షిక), మిగతా భాగం పార్వతీపురం మన్యం జిల్లా లో వుంది.

శాసనసభ నియోజకవర్గాలు[మార్చు]

  1. పాడేరు (ఎస్.టి.),
  2. రంపచోడవరం (ఎస్.టి.) .

వ్యవసాయం[మార్చు]

జిల్లాలో వ్యవసాయ పరంగా కాఫీ తోటల పెంపకం ఎక్కువగా ఉంటుంది. చింతపల్లి, మినీములూరు, అనంతగిరి ప్రాంతాల్లో సుమారు 5433 ఎకరాల్లో కాఫీ తోటలు ఉన్నాయి. 2012 పశుగణన ప్రకారం పశువులు 5.11 లక్షలు, గొర్రెలు 1.26 లక్షలు, మేకలు 3.18 లక్షలు ఉన్నాయి.జిల్లాలో ఎక్కువగా విస్తీర్ణం ఉంది.ఇక్కడ ఆకురాల్చే అడవులు ఉన్నాయి.ఎక్కువగా గుగ్గిలం, తంగేడు, సిరిమాను, కంబ, యాగీస, నల్లమద్ది, గండ్ర, వేప తదితర వెదురు ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. "Demography Sri Alluri Sitharamaraju District".
  2. Raghavendra, V. (26 January 2022). "With creation of 13 new districts, AP now has 26 districts". The Hindu. ISSN 0971-751X. Archived from the original on 26 January 2022. Retrieved 26 January 2022.
  3. "New districts to come into force on April 4". The Hindu (in ఇంగ్లీష్). 30 March 2022. Retrieved 31 March 2022.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. "కొత్త జిల్లా తాజా స్వరూపం". Eenadu.net. 31 March 2022. Retrieved 31 March 2022.{{cite web}}: CS1 maint: url-status (link)
  5. "AP: కొత్త జిల్లాల స్వరూపమిదే.. పెద్ద జిల్లా ఏదంటే?". Sakshi. 2022-04-03. Retrieved 2022-04-03.
  6. Raju, Ch Maheswara (2022-04-04), తెలుగు: అల్లూరి సీతారామరాజు జిల్లా స్వరూపం2022-04-04 (PDF), retrieved 2022-04-13
  7. "District-wise Assembly-Constituencies". ceoandhra.nic.in.