వరరామచంద్రపురం మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వరరామచంద్రపురం
—  మండలం  —
తూర్పు గోదావరి పటములో వరరామచంద్రపురం మండలం స్థానం
తూర్పు గోదావరి పటములో వరరామచంద్రపురం మండలం స్థానం
వరరామచంద్రపురం is located in Andhra Pradesh
వరరామచంద్రపురం
వరరామచంద్రపురం
ఆంధ్రప్రదేశ్ పటంలో వరరామచంద్రపురం స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°34′05″N 81°16′56″E / 17.5681638°N 81.2821557°E / 17.5681638; 81.2821557
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండల కేంద్రం వరరామచంద్రపురం
గ్రామాలు 54
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 25,597
 - పురుషులు 12,171
 - స్త్రీలు 13,426
అక్షరాస్యత (2011)
 - మొత్తం 42.41%
 - పురుషులు 53.15%
 - స్త్రీలు 31.64%
పిన్‌కోడ్ 507135


వరరామచంద్రపురం (ఆంగ్లం: Vararamachandrapuram), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలం.

రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం పోలవరం ముంపు మండలాలతో పాటు గ్రామాలను...తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్- లోకి విలీనం చేస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఖమ్మం జిల్లాలోని పోలవరం ముంపు మండలాలను...ఉభయ గోదావరి జిల్లాల్లోకి కలుపుతున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యే ప్రాంతాలను ఏపీలోకి బదలాయించేందుకు పునర్విభజన చట్టంలోని సెక్షన్- 3లో పేర్కొన్నారు. అందుకనుగుణంగా ఖమ్మం జిల్లా పరిధిలోని కుక్కనూరు, వేలేరుపాడు, భద్రాచలం, కూనవరం, చింతరు, వరరామచంద్రాపురం, మండలాలతోపాటు ఆరు గ్రామాలను ఆంధ్రప్రదేశ్-లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్- జిల్లాల ఆవిర్భావ చట్టం ప్రకారం ఆయా గ్రామాలను రాష్ట్రంలో కలుపుకుంటున్నట్లు తగిన ప్రతిపాదనలతో కూడిన ప్రకటనను జూలై 31న గెజిట్-లో ప్రచురించారు.[1]

వరరామచంద్రాపురం మండలానికి తూర్పున పశ్చిమ గోదావరి (పోలవరం మండలం), తూర్పు గోదావరి (రంప చోడవరం మండలం) సరిహద్దుగా ఉన్నాయి. పశ్చిమ సరిహద్దుగా కూనవరం మండలం, ఉత్తర సరిహద్దుగా చింతూరు మండలం, దక్షిణ సరిహద్దుగా వేలేరుపాడు మండలం ఉన్నాయి.గోదావరికి ఉప నది శబరి చింతూరు మండలం మీదుగా ప్రవహించి వరరామచంద్రపురం మండలంలో గోదావరి నదిలో కలుస్తుంది. ఈ మండలం అత్యదిక అటవీ ప్రాంతము టేకు చెట్లుతో వన్య ప్రాణులను కలిగి ఉంది. తూర్పు కనుమలు ఈ మండలంలో పోచవరం, కొల్లూరు సమీప గ్రామంలలో వ్యాపించి ఉన్నాయి.OSM గతిశీల పటము

గణాంకాలు[మార్చు]

మండల జనాభా 2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా- మొత్తం 25,597 - పురుషులు 12,171 - స్త్రీలు 13,426

మండలంలోని రెవిన్యూ గ్రామాలు[మార్చు]

  1. తెలుగు ఎక్స్‌ప్రెస్ నుండి