బూర్గంపాడు మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బూర్గంపహడ్
—  మండలం  —
తెలంగాణ పటంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిల్లా, బూర్గంపహడ్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిల్లా, బూర్గంపహడ్ మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°39′00″N 80°52′00″E / 17.6500°N 80.8667°E / 17.6500; 80.8667
రాష్ట్రం తెలంగాణ
జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
మండల కేంద్రం బూర్గంపాడు
గ్రామాలు 16
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
అక్షరాస్యత (2011)
 - మొత్తం 60.18%
 - పురుషులు 69.64%
 - స్త్రీలు 50.05%
పిన్‌కోడ్ 507114


బూర్గంపాడు మండలం, తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మండలం.[1]

ఇది సమీప పట్టణమైన పాల్వంచ నుండి 10 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఖమ్మం జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం భద్రాచలం రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది పాల్వంచ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 12 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.

ఖమ్మం జిల్లా నుండి భద్రాద్రి జిల్లాకు మార్పు.[మార్చు]

లోగడ ఖమ్మం జిల్లా, పాల్వంచ రెవిన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా బూర్గుంపాడు మండలం (1+11) పన్నెండు గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన భద్రాద్రి (కొత్తగూడెం) జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[3].

ఆంధ్రప్రదేశ్ లో విలీనమైన పోలవరం ముంపు గ్రామాలు[మార్చు]

తెలంగాణ విభజనకు ముందు ఈ మండలంలో 17 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.[4].2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత, పోలవరం ఆర్డినెన్స్ ప్రకారం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలిపింది.అయితే అందులో భాగంగా ఈ మండలంలోని సీతారామనగరం, శ్రీధర (వేలేరు),గుంపెనపల్లి, గణపవరం, ఇబ్రహీంపేట, పెద్ద రావిగూడెం గ్రామాలు ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలో కలిసాయి.[5][6]ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీటిని కుక్కునూరు మండలం లో విలీనం చేసింది.

మండలం లోని పట్టణాలు[మార్చు]

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

 1. ఇరవెండి
 2. మోతె
 3. సారపాక
 4. నాగినేనిప్రోలు
 5. బూర్గంపాడు
 6. సోంపల్లి
 7. పినపాక (పి.యమ్)
 8. ఉప్పుసాక
 9. నకిరపేట
 10. మొరంపల్లి బంజార్
 11. కృష్ణసాగర్

గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు[మార్చు]

 1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 237 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
 2. "భద్రాద్రి కొత్తగూడెం జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
 3. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2017-08-01. Retrieved 2019-04-07.
 4. "Villages and Towns in Burgampahad Mandal of Khammam, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Retrieved 2022-01-10.
 5. "Ordinance on Khammam Villages Deserves to be Scrapped". The New Indian Express. Retrieved 2022-01-11.
 6. https://prsindia.org/files/bills_acts/bills_parliament/2014/AP_Reorganisation_(A)_Bill,_2014_0.pdf

వెలుపలి లంకెలు[మార్చు]