Coordinates: 17°32′36″N 80°37′07″E / 17.543360°N 80.618700°E / 17.543360; 80.618700

కొత్తగూడెం మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్తగూడెం
—  మండలం  —
తెలంగాణ పటంలో భద్రాద్రి జిల్లా, కొత్తగూడెం స్థానాలు
తెలంగాణ పటంలో భద్రాద్రి జిల్లా, కొత్తగూడెం స్థానాలు
తెలంగాణ పటంలో భద్రాద్రి జిల్లా, కొత్తగూడెం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°32′36″N 80°37′07″E / 17.543360°N 80.618700°E / 17.543360; 80.618700
రాష్ట్రం తెలంగాణ
జిల్లా భద్రాద్రి జిల్లా
మండల కేంద్రం కొత్తగూడెం (భద్రాద్రి జిల్లా)
గ్రామాలు 2
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 507 km² (195.8 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 1,88,191
 - పురుషులు 93,300
 - స్త్రీలు 94,891
అక్షరాస్యత (2011)
 - మొత్తం 74.63%
 - పురుషులు 74.02%
 - స్త్రీలు 61.27%
పిన్‌కోడ్ {{{pincode}}}


కొత్తగూడెం మండలం, తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఖమ్మం జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం కొత్తగూడెం రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది. ఈ మండలంలో (2 రెండు) రెవెన్యూ గ్రామాలు మాత్రమే ఉన్నాయి. మండలం కోడ్: 04738.[3] ఈ మండలం, ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం, కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గం పరిధిలో భాగంగా ఉంది. మండలం కేంద్రం కొత్తగూడెం.

ఖమ్మం జిల్లా నుండి మార్పు[మార్చు]

లోగడ కొత్తగూడెం మండలం, ఖమ్మం జిల్లా, కొత్తగూడెం రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా కొత్తగూడెం మండలాన్ని, కొత్తగా ఏర్పడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోకి 11.10.2016 నుండి చేర్చి, అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[1]

గణాంకాలు[మార్చు]

2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త ఖమ్మం​ జిల్లా పటంలో మండల స్థానం

2011 జనాభా లెక్కల ప్రకారం కొత్తగూడెం మండలం మొత్తం జనాభా 1,88,191. వీరిలో 93,300 మంది పురుషులు కాగా, 94,891 మంది స్త్రీలు, మొత్తం 48,094 కుటుంబాలు ఉన్నాయి. మండల సగటు లింగ నిష్పత్తి 1,017. మొత్తం జనాభాలో 63.5% మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తుండగా, 36.5% మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో సగటు అక్షరాస్యత రేటు 80.8% కాగా గ్రామీణ ప్రాంతాల్లో 63.8%. అలాగే మండలంలోని పట్టణ ప్రాంతాల్లో లింగ నిష్పత్తి 1,038 కాగా గ్రామీణ ప్రాంతాల్లో 981గా ఉంది.

మండలంలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 17756, ఇది మొత్తం జనాభాలో 9%. 0-6 సంవత్సరాల మధ్య 9059 మంది మగ పిల్లలు, 8697 మంది ఆడ పిల్లలు ఉన్నారు. మండలం బాలల లింగ నిష్పత్తి 960, ఇది కొత్తగూడెం మండల సగటు లింగ నిష్పత్తి (1,017) కంటే తక్కువ.కొత్తగూడెం మండలం మొత్తం అక్షరాస్యత రేటు 74.63%. కొత్తగూడెం మండలంలో పురుషుల అక్షరాస్యత రేటు 74.02%, స్త్రీల అక్షరాస్యత రేటు 61.27%గా ఉంది.[4]

పునర్వ్యవస్థీకరణ తరువాత[మార్చు]

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 16 చ.కి.మీ. కాగా, జనాభా 79,819. జనాభాలో పురుషులు 39,001 కాగా, స్త్రీల సంఖ్య 40,818. మండలంలో 20,156 గృహాలున్నాయి.[5]

మండలం లోని పట్టణాలు[మార్చు]

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. కొత్తగూడెం
  2. రామవరం

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 237  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "భద్రాద్రి కొత్తగూడెం జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-20 suggested (help)
  3. "Kothagudem Mandal Villages, Khammam, Andhra Pradesh @VList.in". vlist.in. Retrieved 2020-06-21.
  4. "Kothagudem Mandal Population, Religion, Caste Khammam district, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2022-07-21. Retrieved 2022-07-21.
  5. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు[మార్చు]