కరకగూడెం మండలం (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా)
| కరకగూడెం | |
| — మండలం — | |
| రాష్ట్రం | తెలంగాణ |
|---|---|
| జిల్లా | భద్రాద్రి జిల్లా |
| మండల కేంద్రం | కరకగూడెం |
| గ్రామాలు | 9 |
| ప్రభుత్వం | |
| - మండలాధ్యక్షుడు | |
| వైశాల్యము | |
| - మొత్తం | 223 km² (86.1 sq mi) |
| జనాభా | |
| - మొత్తం | 15,221 |
| - పురుషులు | 7,775 |
| - స్త్రీలు | 7,446. |
| పిన్‌కోడ్ | {{{pincode}}} |
కరకగూడెం మండలం, తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు.[2] దానికి ముందు ఈ మండలం ఖమ్మం జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం భద్రాచలం రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది పాల్వంచ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 9 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవుఇది మండల కేంద్రమైన పినపాక నుండి 13 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన మణుగూరు నుండి 30 కి. మీ. దూరంలోనూ ఉంది.
కొత్త మండల కేంద్రంగా గుర్తింపు.
[మార్చు]లోగడ కారకగూడెం గ్రామం ఖమ్మం జిల్లా, పాల్వంచ రెవెన్యూ డివిజను, పినపాక మండల పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా "కరకగూడెం" గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం రెవెన్యూ డివిజను పరిధిలో 1+8 (తొమ్మిది) గ్రామాలుతో నూతన మండలంగా ప్రకటించి, ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[3]
కరకగూడెం గ్రామానికి కొత్త మండల కేంద్రంగా గుర్తింపు లభించింది
గణాంకాలు
[మార్చు]2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 223 చ.కి.మీ. కాగా, జనాభా 15,221. జనాభాలో పురుషులు 7,775 కాగా, స్త్రీల సంఖ్య 7,446. మండలంలో 3,847 గృహాలున్నాయి.[4]
1. జనసంఖ్య గుణాంకాలు
[మార్చు]| కేటగిరి | మొత్తం | పురుషులు | స్త్రీలు | గమనికలు |
|---|---|---|---|---|
| కుటుంబాల సంఖ్య | [ ] | - | - | - |
| మొత్తం జనసంఖ్య | [ ] | [ ] | [ ] | - |
| వయస్సు విభజన | - | - | - | 0–6, 7–18, 19–60, 60+ |
2. విద్య / విద్యార్హత గుణాంకాలు
[మార్చు]| కేటగిరి | మొత్తం | పురుషులు | స్త్రీలు | గమనికలు |
|---|---|---|---|---|
| సూత్రప్రాయ విద్యార్హత | [ ] | [ ] | [ ] | - |
| ఉన్నత విద్య / డిగ్రీల మోతాదు | [ ] | [ ] | [ ] | - |
| విద్యార్థుల సంఖ్య | [ ] | [ ] | [ ] | అన్ని తరగతులు |
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- అనంతారం పత్తిమల్లూరు
- సమత్ మోతె
- మోతె పత్తిమల్లూరు
- రేగళ్ల
- సమత్ భట్టుపల్లి
- భట్టుపల్లి
- కరకగూడెం
- కల్వలనగరం
- చిర్రమల్ల
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 237 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ 2.0 2.1 "భద్రాద్రి కొత్తగూడెం జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2017-08-01. Retrieved 2019-04-04.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
