మణుగూరు మండలం
మణుగూరు | |
— మండలం — | |
తెలంగాణ పటంలో భద్రాద్రి జిల్లా, మణుగూరు స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°56′47″N 80°48′44″E / 17.946442°N 80.812126°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | భద్రాద్రి జిల్లా |
మండల కేంద్రం | మణుగూరు |
గ్రామాలు | 9 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 242 km² (93.4 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 72,117 |
- పురుషులు | 35,844 |
- స్త్రీలు | 36,273 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 67.36% |
- పురుషులు | 75.55% |
- స్త్రీలు | 58.91% |
పిన్‌కోడ్ | 507117 |
మణుగూరు మండలం, తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు.[2] ఇందులో 6 గ్రామాలున్నాయి. దానికి ముందు ఈ మండలం ఖమ్మం జిల్లాలో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం భద్రాచలం రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది పాల్వంచ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 10 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.మండల కేంద్రం మణుగూరు
ఖమ్మం జిల్లా నుండి భద్రాద్రి జిల్లాకు మార్పు.
[మార్చు]లోగడ మణుగూరు పట్టణం ఖమ్మంజిల్లా, పాల్వంచ రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా మణుగూరు మండలాన్ని (1+9) పది గ్రామాలతో కొత్తగా ఏర్పడిన భద్రాద్రి (కొత్తగూడెం) జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[1]
గణాంకాలు
[మార్చు]2011 జనాభా లెక్కల ప్రకారం మణుగూరు మండలం మొత్తం జనాభా 72,117. ఇందులో పురుషులు 35,844 కాగా, స్త్రీలు 36,273. మండలంలో మొత్తం 18,689 కుటుంబాలు ఉన్నాయి. మండల సగటు లింగ నిష్పత్తి 1,012. మొత్తం జనాభాలో 44.5% మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తుండగా, 55.5% మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో సగటు అక్షరాస్యత రేటు 73.9% కాగా, గ్రామీణ ప్రాంతాల్లో 72.1%గా ఉంది. అలాగే మండలంలో పట్టణ ప్రాంతాల్లో లింగ నిష్పత్తి 1,014 కాగా, గ్రామీణ ప్రాంతాల్లో 1,010గా ఉంది. మండలంలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 6913, ఇది మొత్తం జనాభాలో 10%గా ఉంది. 0-6 సంవత్సరాల మధ్య వయస్సు గల మగ పిల్లలు 3533, ఆడ పిల్లలు 3380 ఉన్నారు. మండలంలోని బాలల లింగ నిష్పత్తి 957, ఇది మండల సగటు లింగ నిష్పత్తి (1,012) కంటే తక్కువ. మొత్తం అక్షరాస్యత రేటు 72.9%. పురుషుల అక్షరాస్యత రేటు 71.98%, స్త్రీల అక్షరాస్యత రేటు 59.92%.[4]
పునర్వ్యవస్థీకరణ తరువాత
[మార్చు]2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 242 చ.కి.మీ. కాగా, జనాభా 72,117. జనాభాలో పురుషులు 35,844 కాగా, స్త్రీల సంఖ్య 36,273. మండలంలో 18,689 గృహాలున్నాయి.[5]
మండలం లోని చూడదగిన ప్రదేశాలు
[మార్చు]- 13 వ శతాబ్దం నాటి శివాలయం, మణుగూరు
- బొగ్గు గనులు
- అన్నిటికన్నా ముఖ్యమైంది పర్ణశాల: పర్ణశాలకు మణుగూరు నుండి వెళ్ళడంలో ఒక ఆనందం ఉంది. గోదావరి మీదుగా పడవ ప్రయాణం చేయడం వీలవుతుంది. మణుగూరు గ్రామ కేంద్రం నుండి 6 కి.మీ. దూరంలో రాయగూడెం అనే ఊరుంది. అక్కడకు ఆటోలు, బస్సులు వెళతాయి. అక్కడనుండి 1 కి.మీ. లోపు వరకు పడవ ప్రయాణం చేసి పర్ణశాల చేరవచ్చు.
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]గమనిక:నిర్జన గ్రామాలు పరిగణనలోకి తీసుకోలేదు.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2017-08-01. Retrieved 2019-04-04.
- ↑ "భద్రాద్రి కొత్తగూడెం జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
- ↑ "భద్రాద్రి కొత్తగూడెం జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
- ↑ "Manuguru Mandal Population, Religion, Caste Khammam district, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2020-10-25. Retrieved 2022-07-23.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.