Jump to content

సకిని రామచంద్రయ్య

వికీపీడియా నుండి
సకిని రామచంద్రయ్య
జననం1956
మరణం2024 జూన్ 23
జాతీయత భారతదేశం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
జానపద కళాకారుడు
జీవిత భాగస్వామిబసవమ్మ
పిల్లలువాణి, వసంత, సుమలత, బాబురావు
తల్లిదండ్రులుసకిని ముసలయ్య, గంగమ్మ
సన్మానాలుపద్మశ్రీ[1]

సకిని రామచంద్రయ్య తెలంగాణ రాష్ట్రానికి చెందిన డోలి వాయిద్య జానపద కళాకారుడు. ఆయనకు 2022లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది.[2][3]

కుటుంబ నేపథ్యం

[మార్చు]

సకిని ముసలయ్య-గంగమ్మ దంపతుల కుమారుడైన రామచంద్రయ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కూనవరం గ్రామంలో జన్మించారు.రామచంద్రయ్య తన తాతముత్తాతల నుంచి సంక్రమించిన గిరిజన సంప్రదాయ కళను నేర్చుకుని దానినే జీవనాధారంగా మలుచుకున్నాడు.   బసవమ్మను పెళ్లి చేసుకున్నాడు. వారికి ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నాడు.

న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతులమీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న సకిని రామచంద్రయ్య (28.03.2022)

కళా జీవితం

[మార్చు]

కోయ తెగలోని డోలి ఉపకులానికి చెందిన  రామచంద్రయ్య కోయదొరల ఇలవేల్పు కథకుడుగా ప్రసిద్ధి చెంది తన మాతృభాషలో ఆచార గీతాలు పాడుతూ తమ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ వస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కోయ తెగల వంశ చరిత్రలను పారాయణం చేస్తూ ఉంటారు. ఆయన ప్రదర్శనలు ఇవ్వడానికి ఛత్తీస్‌గఢ్‌‌కు కూడా వెళ్లేవారు.సమక్క సారలమ్మల చరిత్ర తో పాటు

  • గరికామారాజు
  • పగిడిద్దరాజు
  • ఈరామరాజు
  • గాడిరాజ
  • నాగులమ్మ
  • సదలమ్మ
  • బాపనమ్మ
  • ముసలమ్మ, తదితర ఆదివాసీ యోధుల కథలను ఆశువుగా గానం చేయడంలో రామచంద్రయ్య దిట్ట.[4]

మేడారంలో జాతరలో

[మార్చు]

ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతరైన మేడారం సమ్మక్క సారక్క జాతరలో రామచంద్రయ్యకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది.జాతర జరిగే ప్రతీసారి ఆయనకు ప్రత్యేక ఆహ్వానం ఉంటుంది. ఆ వనదేవతలకు ఆయన డోలు వాయిద్యం వాయిస్తూ పూజలు నిర్వహిస్తారు.

అంతరించిపోతున్న కళకు అవార్డు

[మార్చు]

పద్మశ్రీ అవార్డుకు ఎంపిక అవ్వడంపై రామచంద్రయ్య స్పందిస్తూ అంతరించిపోతున్న ఆదివాసీ గిరిజన సంస్కృతి సంప్రదాయ కళకు ఈ అవార్డు దక్కిందన్నారు.ఈ కళను గుర్తించి అవార్డుకు ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. మా ముత్తాత నుంచి మా తాతకు మా తాత నుంచి నా తండ్రి ఆయన నుంచి నాకు ఈ కళ వారసత్వంగా వచ్చిందన్నారు. గిరిజన కళలు సంప్రదాయాలు అంతరించిపోతున్న ఈ రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డోలు వాయిద్యాన్ని కళగా గుర్తించి పద్మశ్రీ పురస్కారాన్ని ఇవ్వడం ఆనందంగా ఉందని తెలిపారు.[5]

ప్రభుత్వ ప్రోత్సాహం

[మార్చు]

2022 సంవత్సరానికి గాను పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన డోలు వాయిద్య కళాకారుడు సకిని రామచంద్రయ్యను ముఖ్యమంత్రి కేసీఆర్ సన్మానించి, ఆయన సొంత జిల్లా కేంద్రం కొత్తగూడెంలో నివాసానికి అనువైన ఇంటి స్థలం, అందులో ఇల్లు నిర్మించుకోవడం కోసం రూ.కోటి రివార్డును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించాడు.[6][7]

మరణం

[మార్చు]

సకిని రామచంద్రయ్య వయస్సు రీత్యా అనారోగ్య సమస్యలతో ఆరోగ్యం క్షీణించడంతో బాధపడుతూ 2024 జూన్ 23న మణుగూరులోని తన స్వగృహంలో మరణించాడు.[8][9]

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (25 January 2022). "'కంచు తాళం.. కంచు మేళం'రామచంద్రయ్యకు పద్మశ్రీ". Archived from the original on 27 January 2022. Retrieved 27 January 2022.
  2. Namasthe Telangana (25 January 2022). "మరో తెలంగాణ జాన‌ప‌ద క‌ళాకారుడు రామ‌చంద్ర‌య్య‌కు అత్యున్నత పద్మశ్రీ పుర‌స్కారం". Archived from the original on 26 January 2022. Retrieved 26 January 2022.
  3. Sakshi (26 January 2022). "మన తెలుగు పద్మాలు". Archived from the original on 26 January 2022. Retrieved 26 January 2022.
  4. Andhrajyothy (26 January 2022). "'కోయ స్వర' రామచంద్రుడికి పద్మశ్రీ". Archived from the original on 26 January 2022. Retrieved 26 January 2022.
  5. "ఆదివాసీ బిడ్డకు పద్మశ్రీ పురస్కారం.. దేశవ్యాప్తంగా మారుమోగుతున్న డోలు వాయిద్యకారుడి పేరు". Samayam Telugu. Retrieved 2022-01-26.
  6. TV5 News (2 February 2022). "పద్మశ్రీ అవార్డు గ్రహీతలకి సీఎం కేసీఆర్ భారీ నజరానా...!" (in ఇంగ్లీష్). Archived from the original on 29 March 2022. Retrieved 29 March 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  7. Mana Telangana (1 February 2022). "పద్మశ్రీ గ్రహీతలకు ఇంటి స్థలం.. కోటి రూపాయలు". Archived from the original on 29 March 2022. Retrieved 29 March 2022.
  8. Eenadu (23 June 2024). "పద్మశ్రీ అవార్డు గ్రహీత రామచంద్రయ్య కన్నుమూత". Archived from the original on 23 June 2024. Retrieved 23 June 2024.
  9. ABP Desham (23 June 2024). "పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిని రామచంద్రయ్య కన్నుమూత, అరుదైన వ్యక్తిగా గుర్తింపు". Archived from the original on 23 June 2024. Retrieved 23 June 2024.