Jump to content

గుండాల మండలం (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా)

అక్షాంశ రేఖాంశాలు: 17°54′30″N 80°30′57″E / 17.9084°N 80.5159°E / 17.9084; 80.5159
వికీపీడియా నుండి
గుండాల
—  మండలం  —
తెలంగాణ పటంలో భద్రాద్రి జిల్లా, గుండాల స్థానాలు
తెలంగాణ పటంలో భద్రాద్రి జిల్లా, గుండాల స్థానాలు
తెలంగాణ పటంలో భద్రాద్రి జిల్లా, గుండాల స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°54′30″N 80°30′57″E / 17.9084°N 80.5159°E / 17.9084; 80.5159
రాష్ట్రం తెలంగాణ
జిల్లా భద్రాద్రి జిల్లా
మండల కేంద్రం గుండాల (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా)
గ్రామాలు 11
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 496 km² (191.5 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 28,125
 - పురుషులు 13,990
 - స్త్రీలు 14,135
అక్షరాస్యత (2011)
 - మొత్తం 43.38%
 - పురుషులు 55.00%
 - స్త్రీలు 31.59%
పిన్‌కోడ్ 507123

గుండాల మండలం, తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకుచెందిన మండలం. [1] ఇది సమీప పట్టణమైన ఎల్లందు నుండి 60 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఖమ్మం జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం కొత్తగూడెం రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 13  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో రెండు నిర్జన గ్రామాలు.మండల కేంద్రం గుండాల.

మండల జనాభా

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త ఖమ్మం​ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం - మొత్తం 28,125 - పురుషులు 13,990 - స్త్రీలు 14,135

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 496 చ.కి.మీ. కాగా, జనాభా 16,272. జనాభాలో పురుషులు 8,409 కాగా, స్త్రీల సంఖ్య 7,863. మండలంలో 4,082 గృహాలున్నాయి.[3]

ఖమ్మం జిల్లా నుండి భద్రాద్రి జిల్లాకు మార్పు

[మార్చు]

2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా గుండాల మండలాన్ని (1+12) 13 గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన భద్రాద్రి జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[4].

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. లింగగూడెం
  2. సాయనపల్లి
  3. చిన్న వెంకటపురం
  4. దామరతోగు
  5. మమకన్ను
  6. ముత్తాపురం
  7. కోనవారిగూడెం
  8. గుండాల
  9. గలబ
  10. సెత్తిపల్లి
  11. కాచనపల్లి

గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు.

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 237 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "భద్రాద్రి కొత్తగూడెం జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
  4. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2017-08-01. Retrieved 2019-03-14.

వెలుపలి లంకెలు

[మార్చు]